30, జనవరి 2011, ఆదివారం

అలంకార భూషణం తెలుగు కావ్య చందన వనమ్. - 1


కావ్యానికైనా, కవితకైనా, పాటకైనా, పద్యానికైనా అలంకారం అలంకారాలే. ఈ సొమ్ములతో గూడిన రచనలను స్రావ్యమైన గొంతుతో గానం చేసినప్పుడు వినే మనిషి తనకు తెలియకుండానే లీనమై పరవశించి పోతాడు. మనిషి పుట్టుకతో అలంకారాలు పుట్టినట్టు భాష పుట్టుకతో పాటే ఈ అలంకారాలు పుట్టాయేమో! నిజమైన ఆవేశంతో మాట్లాడే మనిషిని గమనించండి. అతని మాటల్లో ఎన్ని అలంకారాలు దొర్లుతాయో !. వ్యాకరణ శాస్త్రాలు పుట్టి అలంకారాన్ని రకరకాలు గా విభజించి అలంకార శాస్త్రానిగా ప్రాచుర్యం జరిపారు కానీ నిజానికి వ్యాకరణం వల్ల భాషకానీ అలంకారాలు కానీ పుట్టలేదు. బహుశా పద్యం పుట్టిందేమో !. ఏ వ్యాకరణం తెలియని పల్లె వాసీల భాషలో ఎన్నో అలంకారాలు అలవోకగా దొర్లుతుంటాయి.

ఇక మన వాఙ్మయ చరిత్ర చూసినట్లైతే భరతుడు నాట్యశాస్త్రాన్ని యమకమనే శబ్దాలంకారాన్ని, ఉపమ, దీపక, రూపక ములనెడి అర్థాలంకారాలను చెప్పాడని అంటారు. వివిధ వ్యాకరణ శాస్త్రవేత్తలు ఈ అలంకారాలను వివిధరకాలుగా విభజించినట్లు కనిపిస్తుంది.

దండి - 34 అలంకారాలని చెప్పాడు
మమ్మటుడు - 59 అలంకారాలు
విద్యానాథుడు - 66 అలంకారాలు
చన్ద్రాలోక కర్త - 101 అలంకారాలు
కువలయానందము ( అప్పయ్య దీక్షుతులు ) - 124 అలంకారాలు

ఎవరు ఏరకంగా విభజించినా, ముఖ్యముగా ఇవి రెండు రకాలే. ౧) శబ్దాలంకారములు ౨.) అర్థలంకారములు.

ఇంతకీ ఇవి ఎవరికి పనికొస్తాయి? ఏమో !... ఈ మధ్య నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నా పూర్వ గురువు శ్రీ సుబ్బారెడ్డి గారితో ఖాళీ సమయాల్లో జరిగిన చర్చను ఒక క్రమ పద్ధతిలో అక్షరబద్ధం చేసి దాచుకొనే ప్రక్రియ ఇది.

శబ్ద ప్రధానముగా కలవి శబ్దాలంకారములు

అర్థ ప్రధానముగా గలవి అర్థాలంకారములు

ముందుగా కొన్ని శబ్దాలంకారాలను చూద్దాము. ఆ తరువాత ఒక్కో అలంకారాము గురించి బహుళ ఉదాహరణలనూ చూద్దాము. నాకు practice కి పనికి వస్తుంది :)

శబ్దాలంకారములు

౧) అను ప్రాసము
అ) వృత్త్యను ప్రాసము
ఆ) ఛేకాను ప్రాసము
ఇ) లాటాను ప్రాసము
ఈ) అంత్యాను ప్రాసము

౨) యమకము
౩) ముక్తపదగ్రస్తము


అనుప్రాసమంటే ఒక అక్షరం గాని పదము గానీ మళ్ళీ మళ్ళీ రావడం ( ఆవృత్తి ) . ఈ ఆవృత్తి ని మళ్లీ నాలుగు రకాలుగా విభజించారు
అ) వృత్త్యను ప్రాసము
ఆ) ఛేకాను ప్రాసము
ఇ) లాటాను ప్రాసము
ఈ) అంత్యాను ప్రాసము


ఈ రోజు వృత్త్యను ప్రాసను గూర్చి తెలుసుకొని సెలవు తీసుకుందాం.వచ్చేవారం ఛేకానుప్రాసము.


వృత్త్యానుప్రాసము : ఒకటి గాని అంతకంటే ఎక్కువ గానీ హల్లులు తిరిగి తిరిగి ఒక వాక్యంలో వచ్చినట్లైతే ఆ వాక్యానికి వృత్త్యాను ప్రాస వుంది అంటాము.

ఇక్కడ హల్లు ప్రధానమని గుర్తించండి.


ఉదాహరణ
-----------
1) విష్ణు రోచిష్ణు సహిష్ణు కృష్ణు
2) ఆ జెఱ్ఱి మఱ్ఱి తొఱ్ఱలో బిఱ్ఱ బిగిసి ఉన్నది

నా సొంత క్రియేటివిటీ ఉదాహరణలు :)
------------------
3) అమ్మ దీనెమ్మ వెంకట సుబ్బమ్మ
4) అవ్వకు బువ్వ నివ్వవా మువ్వ గోపాలా?



మరి మీవి? పూర్తి వృత్త్యానుప్రాస కవిత కానీ పాట కానీ , పద్యము కానీ మీకు తెలుసా?

28, జనవరి 2011, శుక్రవారం

దేవుడా ఓ నా మంచి దేవుడోయ్...........

దేవుడా ఓ నా మంచి దేవుడోయ్
అడగ కుండానే
కారు పైన స్నో నిచ్చావు
కారు పక్కన స్నో ఇచ్చావు
వెనకిచ్చావు, ముందిచ్చావు
పక్కనిచ్చావు, నా నెత్తినిచ్చావు

పక్కింటోడి షోవెలిచ్చావు ( shovel)
దానికి నల్ల రంగునిచ్చావు
స్నో కి తెల్ల రంగు నిచ్చావు
ఏమీ నీ మాయ ఓ దేవుడా

దేవుడా
నెత్తిమీద జుట్టిచ్చావు
చేతికి గ్లౌజులిచ్చావు
నెత్తికి టోపీనిచ్చావు
కాలికి బూట్లూ ఇచ్చావు
అన్నీ నలుపే కానీ
స్నో మాత్రం తెలుపు..ఎంతన్యాయం !!

చెట్టు కు రంగేసావు
నా కారుకూ రంగేసావు
తుదకు నల్లమట్టికీ రంగేసావు
కానీ ఆ రంగు దులిపేటప్పటికి
నాకు రంగు పడేట్టు చేసావు

ఐనా సరే
నువ్వు తెలుపు
నీ నవ్వు తెలుపు
నీ పథం తెలుపు
నీ గమ్యం తెలుపు.

27, జనవరి 2011, గురువారం

ఈ నాటి జీవితం - మహా ఆనంద దాయకం - మా న్యూజెర్సీ లో



ఈ రోజు న్యూ జెర్సీ లో పడిన స్నో బొమ్మలు.





ఇంటి ముందున్నా ముచ్చటైన మంచు కొమ్మలు



అందాల మేఘమాలా... అంటూ కవితలు వ్రాయాలని వుంది కానీ ఈ స్నో అంతా క్లీన్ చేసుకోని అప్పుడు కాళ్ళు చేతులూ పని చేస్తే కవితలు రాసుకోవచ్చు. ముందాపని మీద వుండండి.


చివరిగా పాల పొంగుల్లో స్నానాలాడుతున్న నా కారు

23, జనవరి 2011, ఆదివారం

నిశీధి వేళల్లో నిశ్శబ్ద తరంగాలు


నింగిని నేలను కలిపే అంబరము నిజమా
నిన్ను నన్నును జతచేసే జీవితము కలదా?

ఆకసాన పుట్టిన రంగుల హరివిల్లు
సూర్యకాంతి లేక మనగలదా
సప్తవర్ణ మిళిత పరిపూర్ణ జీవితము
కనగలనా?నీవులేక మనగలనా?

ధరణితాకగ తరలివచ్చిన కెరటం
ఇలను చేరగ ఎగసి విరిగి
వెనుదిరిగినా ! ఆపునా తనపోరాటం ?
నీకై నా నిరీక్షణ, ఆగునా అంతిమఘడియ వరకు?

తెల్లవారు ఝామున పగిలిన నిశ్శబ్ద తరంగాలు
నీ గుండె చప్పుళ్ళు కూడా నావికాకుండా చేసాయి.
నీ తలపుల ఊహలతో, ఊరేగే నామనోపల్లకి
ఒహోం.. ఒహోం ... శబ్దమే కరువై నిట్టూర్చింది.

13, జనవరి 2011, గురువారం

సంక్రాంతి నవ్వుల పువ్వులు

ఈ మధ్య నాకు వచ్చిన కొన్ని s.m.s లలో బాగా నచ్చినవి. ఆంధ్ర ప్రజానీకాన్ని ఇంతలా నవ్విస్తున్న బాలయ్య గారు ధన్యులు.

NTR : బాబాయ్ చలిగా వుంది చన్నీళ్ళు పోసుకోక
బాలయ్య : తెలుసురా బచ్చా, అందుకే స్వెటర్ వేసుకొని స్నానం చేస్తున్నా
NTR : నువ్వు ఐన్ స్టీన్ వి బాబాయ్

:) :)

టీచర్ : ఒక సంవత్సరానికి 365 రోజులైతే అందులో రాత్రులు ఎన్ని?
బాలయ్య: 10 టీచర్
టీచర్ : ఎలా?
బాలయ్య : శివరాత్రి ఒకటి, తొమ్మిది నవరాత్రులు

:) :):) :)

డాక్టర్ : ప్రమాదం ఎలా జరిగింది?
బాలయ్య: 90 k.m వేగంతో బండి నడుపుతున్నా డాక్టర్. ఉన్నట్టుండి కుక్క అడ్డు వచ్చింది. కంగారులో బ్రేక్ కొట్ట బోయి తొడ కొట్టాను.

:) :):) :):) :)

బాలయ్య బీచ్ లో సూర్యుని వైపు తిరిగి నోరు తెరిచి సూర్యుని చూస్తూ నిలుచున్నాడు
N.T.R : ఏంచేస్తున్నావు బాబాయ్?
బాలయ్య : ఒరేయ్ అబ్బాయ్, డాక్టర్ light food తీసుకోమన్నారురా
N.T.R : నువ్వు కేక బాబాయ్

:) :):) :):) :):) :):) :)

తిరుపతి వెళ్ళే బస్ లో కండెక్టర్
కండెక్టర్ : ఏమైంది బాలయ్యా? సీట్లు ఖాళీ గా వున్నాయి కదా? మీరు బస్సులో ఎందుకు నడుస్తున్నారు?
బాలయ్య : నేను తిరుపతి నడిచి వస్తానని మొక్కుకున్నా

:) :):) :):) :):) :):) :):) :):) :)