26, జులై 2013, శుక్రవారం

ఫేసు బుక్కు తో విడాకులకు ఫైలు చేస్తున్నా :-) వామ్మో ఫేసు బుక్కు - 2

ఫేసు బుక్కు వాడికి నా ఫ్రెండ్స్ లిస్టు చూసి కన్ను కుట్టింది. అప్పుడేమో మరీ ఇంత స్పీడు పనికిరాదు బాబూ అంటే సరేనని ఏదో ఒకటి అర Friends Request పంపుతున్నానా!! తీరా ఈ రోజు ఒక రెండు రోజులదాకా అసలు నువ్వు Requests పంపడానికి వీల్లేదని హుకుంజారీ చేశాడు. సరే ఇంక చేసేపనేముందిగనక మళ్ళీ బ్లాగుల్లోకొచ్చి ఇలా టపా వ్రాసుకుంటున్నాను.

ఫేసుబుక్ ఎకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసానో గుర్తులేదు.అలాగే ఈ ఫేసుబుక్ కి నేను కనీసం మామూలు పంకాను కూడా కాదు. దానికి తోడు మన బ్లాగర్లలో బహుశా ఎవరైనా ఫేసుబుక్ లో పనిచేసేవాళ్ళున్నారేమో, గత నెల వరకూ అప్పుడప్పుడు నా అకౌంట్ నూ వాడేసి కొన్నట్లున్నారు. ఐనా దేనికి security వుంది కనుక. మొన్నటికి మొన్న Apple  సంస్థ గంపగుత్తగా వారి దగ్గర నమోదు చేసుకున్న credit cards లను సైతం ఎవరికో దాసోహం చేసేసింది. ఇక ఫేసు బుక్కు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనం పెట్టుకున్న Privacy settings వాటంతట అవే మాయమైపోతుంటాయి. మాయమైపోవడానికి Software లోపమైనా కావచ్చు లేదా అక్కడ పనిచేసేవారి నిర్వాకమైనా కావచ్చు లేదా అకౌంట్ లోకి వేరే ఎవరైనా చొరబడి కూడా వీటిని మార్చ వచ్చు.

సరే  గత పది రోజులగా haaram ను కొద్దిగా market చేసుకుందామని ఫేసుబుక్కులోకి లాగిన్ అయి రాచకార్యాలను చక్కపెట్టెడం మొదలు పెట్టాను. ఈ పదిరోజుల్లో నేను గమనించిన విషయాలు ఇక్కడ కొన్నింటిని మాత్రమే వ్రాస్తాను.ఈ ఫేసుబుక్కులో నాకు నచ్చిన వ్యాసాలు ఏ ఒక్కశాతమో కనిపించాయి. తాను మెచ్చిందే రంభ అన్నట్లు, నచ్చడమనేది ఆ సమయంలో వారి వారి మానసిక స్థితి బట్టి వుంటుంది కాబట్టి ఎవరిష్టం వారిదనుకోండి. ఇంతకీ మీరు నచ్చే వ్యాసాలు వ్రాశారా అని నన్ను నిలదీయకండి. అక్కడ నా ఏకైక ఎజెండా ప్రచారమే. ఐతే ఈ ఫేసుబుక్కు నిండా నాలాంటి ప్రచారగాళ్ళే అని తెలిసి ఔరా అని ముక్కుమీద వేలేసి గోక్కున్నా :-). ఏదైతేనేమీ ఏ విషయాన్నైనా వేలమందికి క్షణాల్లో చేరేవేసే సాధనం ఈ ఫేసు బుక్కు.

ఇక అక్కడ ఛాట్స్ చూస్తే భలే భలే అనిపిస్తుంది :-)

వున్నట్లుండి "Hi" అని మెసేజ్ వస్తుంది. తిరిగి "Hello" అంటే రిప్లై వుండదు. మరికొంతమందేమో కాసేపు మాట్లాడి ఈ పప్పుసుద్దగాడితో లాభంలేదనుకొని మాయమైపోయే రకాలు. ఇంకొంతమందేమో మరో టైపు... ఐనా ఇలా టై వేస్టు చేసుకొనే బదులు కావాలంటే నేరుగా పార్కులకెళ్ళాలి గానీ ఇలా ఫేసుబుక్కు ల్లో పగలూ రాత్రులు ఒకర్నొకరు గీక్కుంటే ఏమొస్తుంది చెప్పండి :-). అయ్యా/అమ్మా ఇక్కడెవర్నీ విమర్శించడంలేదు...కాకపోతే ఇలా గోక్కోడం బదులు మీకు తెలిసిన వాళ్ళతో ఈ మాత్రం ప్రేమ ఒలకపోస్తే workout అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నానంతే :))

6 కామెంట్‌లు:


  1. నిన్న కారు నలుపు పై ప్రేమ !

    అంత లో నె ఇవ్వాళ విడాకుల దాకా వచ్చేసిందా !

    ఇదే కదా నిజమైన ఫెసుబుక్కు కాలపు ప్రేమాయణం !

    జేకే
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ గారూ, మీరు లేని పోని అర్థాలతో బుఱ్ఱలు గోక్కోకండి. నిన్నటి టపాకు ఈనాటి టపాకు ఎలాంటి సంబంధంలేదు. నిన్నటి టపా అదొక సరదా బొమ్మ పూరణ. అలాగే ఈ రోజు టపా కూడా.

    ఐనా నాతో అలాంటి ఛాట్ చేసే వాళ్ళు బ్లాగర్లు కాదులేండి.అలాగే అబ్బాయిలూ అమ్మాయిల ప్రొఫైల్స్ తో చాలామందే వున్నట్టున్నారు :))

    మరి విడాకులివ్వకు ఏంచేయమంటారండీ. కనీసం పదిరోజులైందో లేదో ఇక నువ్వెరితో కులకడానికి వీల్లేదని హుకుంజారీ చేసి రెండు రోజుల దాకా బ్యాన్ చేస్తేనూ :-)

    రిప్లయితొలగించండి
  3. భాస్కర రామిరెడ్డి గారి ముఖపుస్తకటపా నన్ను టపటపలాడించింది!నిజమే,చొరబాటుదారుల ప్రమాదం మిక్కిలిగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది!ముఖ పుస్తకం సమాచారాన్ని క్షణాలమీద మిత్రులకు చేరవేసే అధునాతన విధానం!మనస్నేహవాంచను తెలియజేస్తే అవతలివాడికి మన పేస్ వేల్యూ నచ్చుతే ఒప్పుకుంటాడు లేకపోతే మానను తోసేసి తప్పుకుంటాడు!బ్లాగు లన్నీ పట్టుపట్టి,పట్టిపట్టిచదివినవాడు వెర్రిబ్లాగులవాడవుతాడు!మన అభిరుచికి అనుగుణమైన మనకు నచ్చిన టపాలు గుప్పెడుకూడా ఉండవు!కాని టపాలు కెలికి చూడడం,కొన్నిటిమీద వ్యాఖ్యలు వదలడం కొద్ది కొద్దిగా అలవాటై ఆనక ఒక పెద్ద పెనువ్యసనమై కూర్చుండే ప్రమాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది!టపాలకంటే, ముఖపుస్తకం కంటే, అచ్చు పుస్తకం ఎంచక్కా బుద్దిగా చదువుకోవడం మంచిదనిపిస్తుంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యప్రకాశ్ గారూ, చొరబాటుదారులేకానీ అక్కడ పనిచేసే వాళ్ళు కాళ్ళూ చేతులు వేసి కెలకడం లేదంటారు.

      ఇక బ్లాగింగా, ఫేసుబుక్కా, అచ్చుపుస్తకమా అంటే, నేను ఏదీకాదు. నేను పుస్తకాలను/వ్యాసాలను ఎప్పుడో ఒకటో అరో తప్పించి పెద్దగా చదివేఅలవాటులేదు.

      "కాని టపాలు కెలికి చూడడం,కొన్నిటిమీద వ్యాఖ్యలు వదలడం కొద్ది కొద్దిగా అలవాటై ఆనక ఒక పెద్ద పెనువ్యసనమై కూర్చుండే ప్రమాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది"

      ఇది పెను సమస్య కాదండి. దీన్ని వళ్ళు బలిసి, మదమెక్కి కెలికడమంటారు. ఇది అలవాటు వారిగా మొదలై సమస్యగామారడంకాదు.

      తొలగించండి
  4. రోడ్లు మానను గమ్యానికి చేరుస్తాయి అజాగ్రతగా ఉంటే ప్రమాదాలతో ప్రాణాలు తీస్తాయి. ప్రమాదాలు జరుగుతాయని రోడ్డు పైకి వెళ్లక పోతే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం . ఫేస్ బుక్ కుడా అంతే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. buddha murali, I don't understand the linking between this comment and my post.

      ఫేస్ బుక్ లో జాగ్రత్తలు తీసుకోవడం దేనికో నాకర్థం కావడం లేదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నాకు మీకామెంటు సరిగా అర్థంకావడం లేదు.

      ఫేస్ బుక్ ని వాడవద్దని కూడా నేనుచెప్పడం లేదు.

      తొలగించండి

Comment Form