హారం యొక్క ఫేస్ బుక్ పేజి ని తెరిచి అర్థ సంవత్సరం దాటిన సందర్భంగా మొన్నొక రోజు login అయ్యాను. మరీ బొత్తిగా సోషల్ సెన్స్ లేదనుకుంటారని ఈ మధ్య గత రెండు రోజులుగా suggest చేసిన పేర్లన్నింటికీ Add friend requests పంపిస్తున్నా. అంతవరకూ బాగానే వుంది. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ నాకీ ఫేస్ బుక్ ని ఎలా వాడాలో తెలిసి చావడం లేదు. నేను add చేసిన ఫ్రెండ్స్ వే కాకుండా ఎవరెవరివో ఏమిటేమిటో అలా వచ్చేస్తున్నాయి. చదివేలోపే ఎక్కడో అడుక్కి వెళ్ళిపోయె. ఇంతా చేసినా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో దరిదాపు నాలుగొందల మంది మాత్రమే. 400 మంది ఫ్రెండ్సా అని అడక్కండి. ఇందులో నాకు ముఖపరిచయమున్న స్నేహితులు ఒక్కరు కూడా వుండి వుండరని నా గట్టి నమ్మకం.
ఇక అందులో వచ్చే మెసేజెస్ చూస్తే..... అసలు జనాలదగ్గర ఎంత ఎనర్జీ వుందో అర్థమవుతుంది. రకరకాల విశ్లేషణలు, సినిమాలు, లవ్వులు, లౌగీతాలు, ఇంగ్లీష్ కాని టెంగ్లీష్, అబ్బో చాలా చాలా చదవ వచ్చు. కానీ అన్ని మెసేజస్ లో కూడా కనిపించే కామనాలిటీ ఒకటుంది. ఎవరో ఏదో రుబ్బురోట్లో యేసి బాగా రుద్ది దానికి కాస్తంత మసాలా కలిపి పొడిపొడి అచ్చరాలతో అలా విదిలించి పొగడేరు కొట్టుకోటానికి అద్దం ముందుకు పొయ్యొచ్చేటప్పటికి లైక్ మీద లైకు..లైకు మీద లైకు ..అబ్బా..ఏమి ఎనర్జీ చదువుతుంటే ఎలర్జీ రావాల్సిందే ..... అదే ఆ రాసేది అమ్మాయైతే చుట్టూరా హచ్ నెట్ వర్కే....
ఎవరైనా నాకు ఈ ఫేస్ బుక్కు ను ఎలా వాడాలో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ..వచ్చే మెసేజీ లను ఎంత సీల్ చేద్దామన్నా లీకైతానే వుండాయి. అసలు నాకో డౌటు, ఇక్కడ అందరూ అందరికీ తెలిసిన వాళ్ళేనా లేకా నాలాగే కనిపిస్తే add చేసుకుంటారా? నేనంటే ఏదో పదిమందికి website link తెలుస్తుందని ఆశ పడ్డాననుకోండి, మరి మిగిలిన వారూ...????

ఏమో భాస్కర్ బాబుగారు....నాకు మీ లాజిక్కులు మాజిక్కులు తెలియవు కానీ....కొన్ని తెలిసిన ఫేస్ లు, మరికొన్ని కలిసిన ఫేసులతో పాటుగా మరెన్నో కలుపుకున్న( Add request ) ఫేస్ లు కనపడ్డాయి అక్కడ :-)ఇంతకీ చెప్పలేదు కదండి......నేనూ ఉన్నాను ఆ ఫేస్ బుక్ లో (నాకు మీరు తెలిసి నేను మీకు తెలియనట్లుగా)
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమీరేదో హైటెక్కు ఐటీ మానవులు అనుకుంటిని ఫేస్ బుక్కు ఎట్లా ఉపయోగించండం తెలీదంటే ఐటీ మానవుల బుర్ర తేజస్సు గురించి ఆలోచించాల్సి వస్తోంది
జేకే
జిలేబి
పద్మార్పిత గారూ నా ఫేసు మీకు తెలుసా!!! కలిసిన ఫేసు కాదా? ఇంతకీ మీరక్కడ ఏపేరుతో వున్నారో ఇప్పుడు నన్ను 400+ పేర్లల్లో వెతుక్కోమంటారా :-) అంత ఓపికలు లేవు కానీ వీరీ వీరి గుమ్మడిపండు వీరీపేరేమీ అనకుండా ఎవరో చెప్పేసేయ్యండి. ఐతే మీరు ఫేస్ బుక్ లో మాంచి Experts అనుకోవచ్చా?
రిప్లయితొలగించండిపేరు చెప్పాక అమ్మాయి కదా అందుకే అంతా హచ్ నెక్ట్ వర్క్ అనకండి.....అయినా అప్పుడెప్పుడో నాపేరు భలే బాగుంది అని పొగిడిన ఆ పేరే నా ఫేస్ బుక్ పేరు మరచిపోతే ఈ పిక్ చూసైనా గుర్తుపట్టండి :-( Padma Arpita :-)
తొలగించండిపద్మార్పిత గారూ మీ పేరు మర్చిపోవడమా :-). ఏం లేదండీ అక్కడ ఏదైనా వేరే పేరుతో వున్నారేమోనని ఆసక్తితో అడిగానంతే.
తొలగించండిమీరు మరీనండీ జిలేబి గారూ, మనకు తెలిసిన లోకంలోనే బోలెడంత విజ్ఞానం. దానిమీద కట్టిన పెద్దపెద్దమేడలు. మరిప్పుడు ఒక మనిషి తనజీవితకాలంలో ఎన్ని మిద్దెలెక్కగలడంటారు? ఎక్కి ఎక్కి హైటెక్కి ఆడనుంచి పడటం తప్పించి ఎప్పుడైనా శిఖరాగ్రాన్ని చేరుకోగలమంటారా?
రిప్లయితొలగించండినేను కూడా ఈ ఫేస్‌బుక్, టిట్టర్‌లకు దూరంగానే ఉన్నాను. వేటిలోనూ అక్కౌంట్ లేదు నాకు. అన్నట్లు గూగుల్+కు కూడా దూరంగానే ఉన్నాను.
రిప్లయితొలగించండిఎందుకో ఇవి వాడాలంటే నాకు చాలా బెరుకు. బహుశ్ః సోషల్ మీడియాసైట్లు దుర్వినియోగం అవుతున్నాయన్న వార్తలు తరచూ వినవస్తూండటం కారణం కావచ్చును.
ఎవరైనా వీటిని గురించి ఒక మంఛి టపా పెడితే సాహసిస్తానేమో అది చదివి.
శ్యామలీయం గారూ నాకు ఈ సోషల్ నెట్వర్క్ ఒక్కోదానిలో రెండ్రెండు ఐడీలున్నాయండి. ఒకటి పూర్తిగా వ్యక్తిగతమైనది మరొకటి ఈ వెబ్ సైట్ కోసం. అంతే గాకుండా నేను చేరని వాటిల్లో కూడా ఎవరెవరో నన్ను చేర్చేసారు :-). వీటి మీద బెరుకు అక్కర్లేదండి. కాకపోతే ఇన్నింటిలో మన వ్యాపకాలు చెయ్యడానికి సమయమెక్కడ? నాలాంటి వాళ్ళు అమాస పున్నమిలకు లాగిన్ అవుతుంటారు. కానీ ఇక్కడ updates చూస్తుంటే మీరు వాళ్ళ energy కి నిజంగానే మెచ్చుకుంటారు.
తొలగించండిహమ్మయ్య కష్టపడి చమటలు చిందించి ఫేస్ బుక్ లో పంచశత స్నేహితులను సంపాదించాను. ఇప్పటికే ఫేస్ బుక్ వాడు వార్నింగులిస్తున్నాడు. మరీ అంత స్పీడు పనికిరాదని. కాబట్టి మళ్ళీ కొద్ది నెలలు గప్ చిప్.
రిప్లయితొలగించండి