ఒక చిన్న ఖద్దరు సంచీలో పుస్తకాలను, మూడరల టిపిన్ కేరేజీలో సంగటి, పెరుగు, పచ్చడి కుక్కి ఎడమభుజానికి సంచీ, కుడి చేతీలో కేరేజీ పట్టుకోని ఒకటిన్నర మైలు నడిచినాక సవాసగాళ్ళమందరమూ వాగొడ్డున కూర్చోని తెచ్చుకున్న సంగటిలో సగం లాగించేసి అరిగేదాకా నాటకాల్లో పద్యాలను దీర్ఘాలను తీస్తూ మిగిలిన సగ దూరాన్ని నడిచేసి హైస్కూల్ చేరేవాళ్ళము. ఇలా ఆటపాటలతో కాలం దొర్లిపోతుండగా నేను పదో తరగతి కొచ్చాను. ఇప్పటిపిల్లలకు పదో తరగతంటే పెద్దలేకలేదోమో కానీ మారోజుల్లో మా ఊర్లలో పదోతరగతి పాసయ్యాడంటే వాడు పెద్దహీరో. ఆ హీరోకి వచ్చే గుర్తింపు ముందు ఏ సినిమా హీరోకూడా పనికిరాడు మరి. అదిగో అలాంటి పదోతరగతిని నేనూ చదవాల్సి వచ్చింది.
ఆటపాటలతోనడిచిన బాల్యాం.ఒక్కసారిగా హైస్కూల్ లో పదవతరగతి అనేటప్పటికి తెచ్చిపెట్టుకున్న పెద్దరికం. అలా పదవతరగతి వార్షిక పరిక్షలు మరో నెలన్నరలోపుకి వచ్చేసాయి. ఈత రాని వాడిని ఒక్కసారిగా నడి సముద్రంలోకి తీసుకువెళ్ళి నెట్టివేస్తే ఎలా వుంటుందో అలాగయ్యింది నా పరిస్థితి. దానికి తోడు పదవతరగతి పరీక్షలను మా బడ్లో వ్రాయటానికి వీల్లేదు. వెలిగండ్ల చెప్పుకోవడానికి మండల కేంద్రమే కానీ పరీక్షల నిర్వహణా సెంటర్ కాదు. ఊరి పొలిమేరల్లోనున్న పోలేరమ్మకు చుట్టుప్రక్కల గ్రామాల వారందరూ మ్రొక్కు కున్నారు. ఏమని? తల్లీ మా స్కూల్ పిల్లలకు కనిగిరి గర్ల్స్ హైస్కూల్ సెంటర్ మాత్రం రాకుండా చూడమ్మా అని. అదేంటి ఆ మ్రొక్కు అని ఆశ్చర్యపోకండి. అప్పట్లో కనిగిరి గర్ల్స్ హైస్కూల్ సెంటర్ అంటే ఆ తాలూకా మొత్తానికి ఒణుకు. కారణం చాలా స్ట్రిక్ట్ సెంటర్ అనీ, కాపీలు కొట్టడానికి అస్సలు వీలుకాదనీ, ఈ సెంటర్ లో పరీక్షలు వ్రాసిన వాళ్ళలో పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవాళ్ళు చాలా తక్కువనీ ... ఇలా చాలా చెడ్డ ( మంచి? ) పేరే వుంది. దానికి తగ్గట్టుగా అక్కడ పరీక్ష వ్రాసిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతమూ అలాగే వుండేది. అంటే వ్రాసిన వాళ్ళలో ఏ పది శాతమో పాస్ అయ్యేవాళ్ళు.
అదుగో అలాంటి పరిస్థితుల మధ్య చదవాల్సి వచ్చింది. ఇక్కడ కొద్దిగా సొంత డబ్బా.... నాకు కలల్లో అప్పుడప్పుడూ జరగబోయే విషయాలు అస్పష్టంగా కనిపిస్తుంటాయి. మీకు అతిశయోక్తిగానో లేక నమ్మశక్యంగానో లేకపోవచ్చు కానీ ఇది నిజం. అందులో అతి ముఖ్యంగా ఏవైనా కొట్లాటలు, మృత్యువు లతోపాటు Question papers కూడా చాలా అస్పష్టంగా కనిపిస్తాయి. అవి ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు కానీ నాకు కలవొచ్చిన ఓ పది పది హేను రోజుల లోపు జరిగిపోతాయి. వాటిని ఆపే శక్తీ కానీ, నష్టం జరగకుండా తప్పించడంకానీ వీలుకాదు. అది ప్రకృతి ధర్మం. భగవంతుని శాసనం. చూస్తూ వుండిపోవాల్సిందే!!
అలా Girls high school లో పరీక్షను వ్రాసిన విద్యార్థులలో మా బడినుంచి నేనొక్కడిని పాస్ అయ్యాను. మా చెల్లిని పోగొట్టుకున్నాక ఇక మృత్యువు కలలోకి వచ్చిందంటే ఆరోజు నుంచి ఎవరి దగ్గరనుంచి ఫోను వస్తుందో నని ఎదురు చూడడం అలవాటయిపోయింది. ఇలాగే కొట్లాటల మూలంగా కొద్దిరోజులు కోర్టుల చుట్టూరూ తిరగడమూ అలవాటయిపోయింది.
అదిసరే నయ్యా ఇప్పుడు ఈ సుత్తి ఎందుకంటే .... వస్తున్నా వస్తున్నా .....
మొన్నకరోజు ఇలాగే ఒక Accident కలలోకి వచ్చింది. నిన్న నా కళ్ళముందే నట్ట నడిరోడ్డులో అమెరికాలో రోడ్డుకి కంకర వేసే లారీ బోల్తా కొట్టింది. అదృష్టము కొద్దీ ప్రక్క లేన్ లో ఏ కారూ లేదు కానీ వుండి వుంటే నుజ్జునుజ్జై పోయుండేది. ఆ లారి వెనుక ఒక కారు, ఆ కారు వెనుక నాకారు. లారీ డ్రైవర్ కు కాళ్ళు వత్తుకుపోయి బాగా దెబ్బలు తగిలాయి. బహుశా ఇది నాకొచ్చిన కల పరిణామమేమో అనుకొని నిన్నంతా అలా అలా ఆఫీస్ లో కాలం వెళ్ళబుచ్చి ఆ విషయాన్ని అక్కడతో వదిలేశాను...... కానీ ఇక్కడ నేనో విషయం మర్చి పోయాను...
ఈ రోజు ప్రొద్దునే ఆఫీసుకు బయలు దేరి కేరీ బ్యాగ్ ను కార్ లో పెడుతుంటే అకాలమైన తుమ్ములు వచ్చాయి. మనసులో కాసేపు ఆగి వెళదామనుకోని కూడా ఛ..ఇంతా చదువుకొని ఇలాంటి చచ్చు పుచ్చు మూఢనమ్మకాలను నమ్మడమేమిటిని కారు పార్కింగ్ లాట్ నుంచి బయటకు తీసి ఓ రెండొందల మీటర్లు పోనిచ్చానేమో.... ఉన్నట్లుండి ధడ్ మన్న సౌండ్.... ఫలితం... ఇది....
అదృష్టం కొద్దీ ఎవ్వరికీ దెబ్బలు తగలలేదు. collision ఐన తరువాత చైనీస్ లేడీ దిగి సారీ చెప్పి నాలుగు నెలల పాపను తీసుకొని ఇంటికెళ్ళిపోయింది. నేను విషయాన్ని నా ఆఫీసువారికి తెలియచేసి పోలీసులొచ్చేదాకా నేనూ ఆమె భర్తా కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళం చేరాము.
ఇంతకీ ఇందుకు ముందు పేరాలో "...... కానీ ఇక్కడ నేనో విషయం మర్చి పోయాను....." అని వ్రాశాను కదా!! ఆ మర్చిపోయింది ఏమిటంటే నాకొచ్చే కలల సన్నివేశాల్లో జరగబోయే వ్యక్తులు నేను కానీ నాకు తెలిసిన వ్యక్తులు కానీ తప్పక అయి వుంటారు.... ఆ లారీ డ్రైవర్ నాకు తెలియదు. ఇంతటితో ఈ కల ప్రభావం ఐపోయినట్లేనా? ఏమో అది తెలిస్తే మనం మనుషులమెందుకవుతాము.... ఇలాంటివి నమ్మాలా లేదా యాదృచ్చికమనుకోవాలా???

Thank god!అయిపోయిందనే అనుకోండి. యాదృచ్ఛికం కాదండీ మీ సిక్స్ట్ సెన్స్ అలా కలల రూపంలో మిమ్మల్ని ఎలర్ట్ చేస్తుందన్నమాట.
రిప్లయితొలగించండితృష్ణగారూ, అది sixth sense లేదా మరొకటోకానీ, అలా జరుగుతుంటాయి. పూర్వ కవులు వాళ్ళ కావ్యాల్లో దుస్స్వప్నాలంటే ఏంటో అనుకొనే వాడిని కానీ అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే మరి. Yes, we are all thankfull to god. ప్రత్యేకించి నాలుగు నెలల పసి కందు క్షేమంగా వున్నందకు.
తొలగించండిఅయ్యో!యాధ్రుచ్చికమో కాదో, ఇంతకుముందు కూడా కొన్ని నిజమైనాయి కదా? చెడు సంఘటనలకు జాగర్తగా ఉండటమే. నయం ఎవరికీ దెబ్బలు తగల్లేదు...
రిప్లయితొలగించండిసునీత గారూ, అంటే నమ్మలేని వారికి ఇలాంటి సన్నివేశాలు యాదృచ్చికంగానో లేదా మూడనమ్మకాలు గానో అనిపిస్తాయి. కొన్ని నిజం కాదండి, ఇలాంటి కలలస్తే అన్నీ నిజాలే అయ్యాయి.అదే విశేషమిక్కడ.
తొలగించండిరెండు వైపులా ఎవ్వరికీ దెబ్బలు తగలలేదు.
నమ్మకపోవటానికి, మీదగ్గర కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి కదా ? జాగ్రత్తలు వహించటం మేలే కదా .
రిప్లయితొలగించండిదుర్గేశ్వరగారూ, ఇలాంటివి జరుగుతాయని ముందే సూచాయగా తెలిసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం సహజమే కానీ... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగబోయే కార్యాలను ఆపలేమన్నది స్వానుభవం. so Just go with the wind and face it.
తొలగించండియాదృచ్చికంగా ఈ టపాకొచ్చిన వ్యాఖ్యాతలు ముగ్గురితో నాకు మూడు రకాల అనుభవాలు. ఇదేకదా దైవ నిర్ణయం :)
రిప్లయితొలగించండిThanks for adding my blog in blogvedika.
రిప్లయితొలగించండిAll the best Ahmed Chowdary.