స్టేట్ ఎప్పుడు విడిపోతుందో ఏమన్నా న్యూస్ వ్రాశారేమో నని ఈ రోజు దక్కన్ క్రానికల్ పత్రిక చదువుతుంటే Business & Technology విభాగంలో ఒక కారు బొమ్మ కనిపించింది. ఓ ఇదేదో బాగుందని దానిక్రింద నూస్ చదివాను. నమ్మలేక మళ్ళీ చదివాను. వూహూ, నాకళ్ళు ఏమన్నా మోసం చేస్తున్నాయేమోనని మళ్ళీ మళ్ళీ చదివి నిర్థారించుకొన వలసి వచ్చింది. కాసేపు అనవసరంగా అమెరికాకు వచ్చేశాము అనిపించినా మరుక్షణమే..."ఆ... ఇక్కడకు రాకపోతే ఈ మాత్రం బ్రతుకు కూడా అక్కడ మనలాంటోళ్ళకు ఎక్కడదొరుకుతుందని" సమాధానపెట్టుకున్నాను. నిజమే..ఇవన్నీ వుద్యోగాలు చేసుకుంటూ నీతీ నిజాయితీగా అక్కడెప్పుడు కొనాలి? అంటే అన్నామనుకుంటాము కానీ ఈ కారు కొనాలంటే ఇండియా లో వాడెలాంటి వాడయి వుండాలి?
విషయమేమిటంటే "ఆడి" క్రొత్త మోడల్ RS 5 ను మార్కెట్లో విడుదల చేసింది. ముంబాయి లో దాని షోరూమ్ ధర అక్షరాల తొంభై ఐదులక్షల ఇరవై ఎనిమిది వేలే నట... అంటే మన చేతికి అందేటప్పటికి కోటి పది లక్షల రూపాయల పైమాటే . ఇప్పుడు చెప్పండి ఈ కారు ఇండియాలో ఎవరు కొనగలరు :-)
http://www.deccanchronicle.com/130702/news-businesstech/article/audi-rolls-out-rs-5-coupe-hike-prices-2-3-cent-soon
అదే మోడల్ అమెరికాలో RS 5 Coupe వెల $68,900. అంటే ఇప్పటి ప్రకారం డాలర్లలోకి మారిస్తే నలభై ఒక్క లక్ష పదివేల రూపాయలు ( డాలరుకు అరవై రూపాయలు వేసుకున్నా సరే )... ఎక్కడి కోటి ఎక్కడి నలభైఒక్కలక్ష?
సరే!! ప్రజలదో, ప్రక్కనోడి రక్తాన్నో లేదా ప్రజల అమాయకత్త్వాన్నో ధారలుగా పోయించి ఆ కోటి పెట్టి కారు కొన్నామనుకో.... మొదటి రోజు ప్రక్కసీట్లో కత్తిలాంటి ఫిగర్ ను కూర్చో పెట్టుకొని రోడ్డుమీదకు వెళతామో.... ఏ ఆటో వాడో వచ్చి కారుకు పచ్చరంగు గీతలు పులిమేసి చక్కా వెళ్ళిపోతాడు. ప్చ్.... అసలు ఇండియా రోడ్లకు ఇంతటి ఖరీదైన కార్లు అవసరమా? అన్నట్లు ఇక్కడ నలభై లక్షల కారు అక్కడ కోటి రూపాయలంటే ఇదంతా గవర్నమెంట్ కు ఆదాయమే..ఓమ్మో ఓమ్మో ఎంత ఆదాయము, ఏమి సంగతీ....ఎన్నెన్ని పనులు చెయ్యొచ్చు?
ఐనా ఇదంతా చూస్తుంటే పేద దేశం ఇండియా కాదు ...అమెరికానే...కాదంటారా? డబ్బు సంపాయించే నేర్పు కలవాళ్ళకు ఇండియా స్వర్గ ధామం..అది చేతకాని నాలాంటోళ్ళకు అమెరికానే గతి.

ఇండియాలో నల్లధనం అవినీతికొమ్ములు మొలిచి రాజకీయ నాయకుల రూపంలో విశృంఖల విహారం చేస్తుంటే *ఆడి'కార్ల సమూహాన్ని తమ గరాజ్ లో పొందుపరచుకోగలరు!ప్రజాస్వామ్యానికి మనం తగమేమోనని నాకు అనుమానం వేదిస్తున్నది!
రిప్లయితొలగించండి