పాత సినిమా సీతామహాలక్ష్మి సినిమాలో చంద్రమోహన్ చెప్పినట్లు "భావ గీతాలను" బావగీతాలు అన్నా సరైనదే. ఈ గీతాలు బావలు పాడవచ్చు లేదా బావలమీద పాడవచ్చు. ఈ భావగీతాల అందమే వేరు. ఓ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరితోనైనా ప్రేమలో పడితే వాళ్ళు సంచరించే లోకమే వేరు. ఆ లోకంలో వాళ్ళ వాళ్ళ భావాలన్నీ బావ/మరదుల చుట్టూరా తిరుగుతూ వుంటాయి. అసలు బావా మరదళ్ళ సరసాలే వేరు. ఇప్పుడు బావా లేడు, మరదలు లేదు..ఆ స్థానంలో వున్నది జీన్సుపాంటే కాబట్టి బావ ఏమంటాడో మరదలు తెలియదు. మరదలు సమాధానమూ బావకు తెలియదు.
ఇద్దో అచ్చం అలాంటిదే కాకపోతే ఇది పద్యరూపంలో. ఇంతకు ముందు టపాలో ప్రభాత వర్ణనంలో తిక్కన ద్రౌపది ఆక్రోషాన్ని ఓ సరస్సుకు అన్వయించి ఆ కొలనులో అప్పుడే విచ్చిన తామర పూల పరిమళం అక్కడనుండి ఎలా వెలువడుతుందో చెప్పాడు కదా. ఇప్పుడు ఈ పద్యంలో స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి.
నిజానికి సైరంధ్రి, కీచకునికి కనిపించిన తీరిది. కావ్యంలో కీచకుడైనా, సైరంధ్రైనా తిక్కన గారే కాబట్టి ద్రౌపది ని తిక్కన ఎలా ఊహించాడో చూడండి. అసలు అమ్మాయిని వర్ణించమంటే ఏవో పూలు, చంద్రుడు, సంపెంగ మొక్కలు ఇలా ఏవో ఏవో చెప్పాలని ఆలోచన వస్తుంది కానీ, పూలు తెచ్చి సాదుపట్టడం, చందమామను క్రిందకు దించి చంద్రునిలో నున్న మచ్చను తేర్చడం, నల్లని నారుపోసి ఆ నారు తో స్త్రీ జుట్టును పోల్చడం... ఎవరికి వస్తాయండీ ఇలాంటి ఆలోచనలు?
ఇక పద్యము.
నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి, యచ్చునఁ బెట్టినట్లంద మొంది
చక్రవాకంబుల చందంబు గొని వచ్చి, కుప్పలు సేసినట్లొప్పు మెఱసి
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా,గునకుఁ దెచ్చినయట్లు గొమరుమిగిలి
యళికులంబులకప్పు గలయంతయును దెచ్చి, నారు వోసిన భంగి నవక మెక్కి
యంఘ్రితలములుఁ గుచములు నాననంబుఁ
గచభరంబును నిట్లున్నరుచిరమూర్తి
యనుపమానభోగములకు నాస్పదంబు
కాదె యీత్రిప్పు లేటికిఁ గమలవదన
కొన్ని పదాలకు అర్థాలు :
నెత్తమ్మిరేకులు = తామర రేకులు
అచ్చున బెట్టు = అచ్చు పోయు
అళి= తుమ్మెద
అళి కులంబుల కప్పు = తుమ్మెదల నలుపు
నవకము = మృదుత్వము
అంఘ్రి= కాలు; అంఘ్రి తలములు = కాళ్ళు
కందువ = నల్ల మచ్చ
కొమరు=మనోహరము,మనోజ్ఞము,చక్కనిది
కుచములు = చన్నులు
ఆననము = మొఖము
కచము = తల వెండ్రుకలు; కచభరము = తల వెండ్రుకల బారువ
ఆస్పదము = చోటు
కమలవదన = కమలము వంటి మొగము కలది.
మామూలుగా ఈ కాలంలో అమ్మాయి వర్ణన చెప్పేటప్పుడు నేను విన్నంత వరకూ, చూసినంతవరకూ పై భాగాల నుంచి క్రిందిభాగాలకు వస్తారు. కానీ తిక్కన కాళ్ళనుంచి మొదలు పెట్టి జుట్టు దాకా వెళ్ళాడు. సీస పద్యంలో వర్ణనలు చేసి ఆ క్రిందనుండే ఎత్తుగీతిలో ఏ వరుసలో ఆ వర్ణనలు చేసాడో చెప్పాడు. అలా చెప్పి, ఇంతటి అందగత్తెలు వున్నదే భోగాలు అనుభవించటంకోసమంటూ ఓ బో త్రిప్పుకుంటున్నావే అని ఓ చమత్కారాన్ని విసిరాడు. ఆ తరువాత ద్రౌపదికి మండిందనుకోండి అది వేరే విషయం. ఇక సీస పద్య పాదాల్లోకి వస్తే
నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి, యచ్చునఁ బెట్టినట్లంద మొంది -- యంఘ్రితలములు
అంఘ్రితలములు అంటే కాళ్ళు. ఈ ద్రౌపది కాళ్ళు ఎలా వున్నాయయ్యా అంటే తామర పూరేకుల నుంచి ఆ పూల పైపొరను విడిగా తెచ్చి అచ్చులు పోస్తే ( పాదము రూపంలో అచ్చుపోయటం) ఎలా వుంటుందో అలా వున్నాయట. అంటే తామరపూలు లేత ఎరుపురంగులో వుంటాయి. అలాగే అసలు ఏపూవైనా చాలా మెత్తగా వుంటుంది.తామర పూల మెత్తదనం ఎక్కడ వుంటుంది? ఆ పూల పై పొరల్లో వుంటుంది. అలాగే దాని రంగు లేత ఎరుపురంగు. అంటే ఆ మెత్తటి లేత ఎరుపురంగు ను విడదీసి తెచ్చి కాళ్ళ రూపంలో అచ్చుపోస్తే ఎలా వుంటుందో అలా వున్నాయట ద్రౌపది కాళ్ళు.
ఇక రెండవపాదం
చక్రవాకంబుల చందంబు గొని వచ్చి, కుప్పలు సేసినట్లొప్పు మెఱసి -- కుచములు
ఇక ద్రౌపది స్థనములు ఎలా వున్నాయంటే చక్రవాక పక్షుల అందాన్ని తెచ్చి కుప్పలుగా పోస్తే ఎలా వుంటుందో అలా వున్నాయట. చక్రవాక పక్షుల ఉబ్బెత్తుగా అర్థచంద్రాకార ఆకారంలో వుంటాయి. అలాంటి చక్రవాకపక్షుల అందాన్ని తెచ్చి రెండుచోట్ల కుప్పలుగా పోస్తే ఎలా వుంటాయో అలా వున్నాయట.
మూడవపాదం
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా,గునకుఁ దెచ్చినయట్లు గొమరుమిగిలి - ఆననము
ఇది చూడండి. ఎంతటి భావుకత కలవారైనా పడిపోవాల్సిందే... అమ్మాయి మోము ను మామూలుగా పూర్ణ చంద్ర బింబంతో పోలుస్తారు. ఎందుకంటే పౌర్ణమి నాటి చంద్రబింబం రంగు వేరు.దాని రూపు వేరు. ఆ కాంతి వేరు కాబట్టి. కానీ తిక్కన ఏమి చేసాడో చూడండి. ఆ చంద్రకాంతిని క్రిందకు తీసుకొచ్చేసాడు. కానీ ఓ సందేహం కూడా వచ్చేసింది. చంద్రుడిలో మచ్చ వుంటుంది కదా మరి మచ్చ వున్న చంద్రుని నుంచి వచ్చే కాంతి కూడా మచ్చగలదియై వుంటుంది కదా? అందుకని ఈ మచ్చను వేరు చేయడానికి ఆ కాంతిని తేర్పార పట్టాడు. తేర్పారపట్టడం అంటే విభజించటం. మీరు ఎప్పుడైనా రైతులు కల్లం చేసేటప్పుడు చూసివుంటే ధాన్యాన్ని పొట్టునుంచి వాళ్ళు ఎలా వేరుచేస్తారో చూసే వుంటారు. అలా, ఇక్కడ చంద్రకాంతిని చాటలతో అలా జాలువార్చి ఆ మచ్చను వేరుచేసి చూస్తే ఎలా వుంటుందో అంతకన్నా సుందరంగా మనోజ్ఞంగా వుందట ద్రౌపది మోము. ఏమి వర్ణన!!!
ఇక నాలుగోపాదం
యళికులంబులకప్పు గలయంతయును దెచ్చి, నారు వోసిన భంగి నవక మెక్కి - కచభరంబు
ఇక్కడ ద్రౌపది జుట్టును నారుకయ్యలోని నారుతో పోలుస్తున్నాడు చూడండి. ఇదేమి వర్ణనండీ అని అనుమానం రావచ్చు.అంత సుందరి జుట్టును ఏ నల్ల త్రాచుతోనో పోల్చకుండా అని అనుమానం రావచ్చు. కానీ ద్రౌపది వస్త్రాపహరణమైనప్పుడు ఓ పంతం పట్టింది గుర్తుందా? తనని జుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చిన దుశ్శాశనుడి రక్తాన్ని నాజుట్టుకు పూసుకొనే దాకా ఈ జుట్టును జడవేసుకోను పొమ్మని!! అదుగో అందుకే కాబోలు తిక్కన గారు నారు కయ్యను ఎంచుకున్నారు. మరి నారు కయ్యలో మొక్కలు ఆకుపచ్చగా వుంటాయి కదా. జుట్టేమో నలుపు రంగు కదా? అందుకని ఏమి చేశాడంటే తుమ్మెదల కులము యొక్క నల్ల రంగును తీసుకొచ్చి నారుపోస్తే ఆ నారు నుంచి పెరిగే మొక్కలు నల్లగానే వుంటాయి కదా? ఆ నారు కయ్యలో నారు మొలచి కొంచెంపెద్దదయ్యాక మీరెప్పుడైనా ఆ మొక్కల స్పర్శను ఆస్వాదిస్తే ఆ మెత్తదనం తెలుస్తుంది. ఆ నారు కూడా గాలి వీచినప్పుడు అటూ ఇటూ వూగుతూ చూడ్డానికి ఆహ్లాదంగా కూడా వుంటుంది. మరి ద్రౌపది జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకొని వుంటుంది కదా. ఆ జుట్టు అదుగో ఆ పైన నారు కయ్యలో నారు ఎలా వుందో అలా వుందట. అంటే అంత మృదువుగా అలా గాలికి ఊగుతూ వుందని అర్థము.
ఇలా వర్ణించి ఊరుకుంటే వాడు కీచకుడెందుకవుతాడు. అంతా చెప్పి చివరిగా ఏమంటున్నాడో చూడండి. ఇంత అందగత్తె లుండేది అనుభవించడానికని నీకు తెలియడంటే త్ర్రిప్పులాడీ అంటాడు. ఇలా అంటే ఏ అమ్మాయైనా ఊరుకుంటుందటండీ :-).

భావగీతమంటే బావగీతమే అంటూ భాస్కరరామిరెడ్డి గారు బహుచక్కగా తేర్పారపట్టారు!ద్రౌపది ఆననము నవకంగా కవి వర్ణించిన వైనాన్ని తేటతెల్లం చేశారు!
రిప్లయితొలగించండిsurya prakash apkari గారూ,మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి