9, ఏప్రిల్ 2009, గురువారం

వెన్నెల రాత్రి ........మదిలో కల.






వెన్నెల రాత్రి
మదిలో కల.

సముద్రుని పాదాల చెంత
దేవత అడుగుల వెంట
మదిలో మెదిలిన
గత ఙ్ఞాపకాలు.

ప్రతి కదలికలో
రెండు అడుగులు
ఒకటి నాది
ఒకటి నీది.

చివరి మలుపు మజిలీలో
ఙ్ఞాపకాల అడుగులు చూశా


తరచి తరచి చూసినా
వలచి వలచి వెదికినా
కనులు మూసి కదలినా
కనిపించిన దొకటే.

జీవిత గమన నాటకంలో
విషాద భరిత భూతంలో
తోడు లేని కాలంలో
రెండు లేవు, ఒకటే అడుగు.

"కవిత" నడిగా
నా దేవత నడిగా
కరుణించిన నీవు
కదల లేదు నాతో

కష్ట కాల సమయంలో
ఒంటరి జీవన గమనంలో
నా ఆడుగుల ముందు
నీ అడుగులు ఏవని?

దేవత చెప్పింది.......

ఓ నా చిట్టి బంగారూ
నా బాహు బంధనలలో
నిశ్చింతగా నువ్వు
ఆదమరచి వున్నావు.

కష్టాల కడలిలో
ఒంటరి గమనంలో
నువ్వు చూసిన ఆడుగు
నీదికాదు అది, నాది.

2 కామెంట్‌లు:

  1. ...."తరచి తరచి చూసినా
    వలచి వలచి వెదికినా
    కనులు మూసి కదలినా
    కనిపించిన దొకటే." ...
    చాలా బాగుంది అండి.
    మీరు అక్కడుంచిన ఫొటో భలే ఉంది భాస్కర్ గారు.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణ గారు, వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఫొటో గూగిల్ వారి ప్రసాదం. ( కొద్ది మార్పులతో )

    రిప్లయితొలగించండి

Comment Form