23, ఏప్రిల్ 2009, గురువారం

మనిషి - మనసుప్రకృతి నడకన ప్రభవించిన మనిషి
జగతి భ్రమణ ప్రతిరూపం మనిషి

మాటకు పాటకు ప్రతిరూపం మనసు
పెదవి దాటే ప్రతి నాదం మనసు.
మదిన మెదిలే ప్రతి కదలిక మనసు
మూగ సైగలకు ప్రభూతం మనసు
హృదయ చెలముల ప్రతినాదం మనసు
ప్రతిమ ప్రతి కదలిక ప్రతిరూపం మనసు

ప్రభాత శాంతికి ప్రతిరూపం
మధ్యాహ్న భ్రాంతికి మలిరూపం
సంధ్యాకాల నిమీలిత రూపం
నిశి రాత్రిన కామానికి రూపం

పండువెన్నెల పులకింతలు
ఆషాఢమేఘ శోకధారలు
ఊహల పల్లకిలో పెళ్ళికూతురు
మరీచికల వీక్షణ పడిగాపులు.

పెదవులపై పండిన నవ్వులు
గుండెలు నిండా రహస్యాలు
జీవన పోరాట నృత్యాలు
అచలనమై సాగుతున్న జీవితాలు.

యాతనలో, వేతనలో
దారి తప్పిన కానలలో
జీవం లేని జనారణ్యంలో
మనిషికి మనసే తోడు.

14 వ్యాఖ్యలు:

 1. యాతనలో, వేతనలో
  దారి తప్పిన కానలలో
  జీవం లేని జనారణ్యంలో
  మనిషికి మనసే తోడు.
  Its touching.....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @పద్మార్పిత
  మీకు హృదయానికి హత్తుకొన్నందుకు నా కవిత ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని వుంటుంది. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అన్నయ్యా
  పొద్దున్నే గుండె గూటిని ఇలా పట్టుకు కదపటం దేనికి?
  కవిత్వం రాయటం ఒక వ్యసనం
  మంచి కవిత్వం రాయటం ఒక వరం.
  భా.రా.రె ఇప్పటినుండి ఇక సు.భా.రా.రె. అ.క.అ సుకవి భా.రా.రె అని
  నీకివిగో వీరతాళ్ళు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సోదరా భాస్కరరామరాజు,
  నేనిది యాదృచ్చికంగా రాసుకున్నా గుండె గూడు నిజంగానే కదిలింది మరొక సుకవికి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నీడలతోబుట్టువు నీవు చీకటికి భయపడకు ఓ మనిషీ
  మేడలలో జీవితాన్నూహి౦చి నోరూరనియ్యకు ఓ మనిషీ
  ఆరడుగుల నేల తప్ప నిజము లేదని తెలిసిన నాడు
  ఏమైపోతాడు నీలోని ఆ మనిషీ?
  వైరాగ్య౦ తప్పా ఒప్పా అని నీ మనసే చెప్పగలదు
  అడిగిచూడు ఓ మనసున్న మనిషీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఆనంద్ గారు,
  నా కవిత మీకు నచ్చి ఆలోచింప చేసింది అంటున్నారు. ఇంతకంటే ఒక కవిత కి కావాల్సింది ఏముంది?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మంచి కవిత.
  అర్ధగాంభీర్యం చాలా బాగుంది.
  ఒకటి రెండుచోట్ల విక్షనరీ చూడవలసివచ్చింది. :-) థాంక్యూ వెరీమచ్.
  మీ వొకాబ్యులరీ కి అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. బాబా గారు, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు పంటికింద గట్టిగా తగిలిన పదాలు దయచేసి చెప్తారా ? ఈ సారి అలాంటివి వాడనని చెప్పలేను కానీ, ముందు ముందు టపాలలో అలాంటివాటికి అర్థాలు కూడా ఇక్కడే చెప్పడానికి ప్రయత్నిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ప్రభూతము ను ఒక భావానికి "నాంది", "మొదలు" గా వాడాను. ప్రభృతులు,ప్రభువు,ప్రభవ మొదలైనవి సాధారణ పదాలే అని ఒక చిన్న ప్రయోగము.

  "మూగ సైగలకు ప్రభూతం మనసు" -- మనకు మనిషిలో కనిపించే ఏటువంటి మూగ సైగలకైనా మొదట బీజం పడేది మనసులోనే కదా !!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. హమ్మయ్యా, నాకు నా మనసే తోడు అనే మరొకరువున్నారు. నేను ఒంటరిని కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఓ.. మీకు తోడుగా నా మనసూ వుందండి.. చుట్టూ ఎంతమందిన్నా, చాలా సార్లు నాకు, నాకు మాత్రమే కనిపించే మనసే తోడైన అనుభవం చాలాసార్లు అయ్యింది.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form