11, ఏప్రిల్ 2009, శనివారం

ఇదీ సామాజిక న్యాయం లెక్క !!

మనవి : ఇది నేను ఏ కులాన్ని తక్కువ చేసో లేక ఎక్కువ చేసో చూపాలని నా వుద్దేశ్యం కాదని గమనించ గలరు.
ఇదీ సామాజిక న్యాయం లెక్క !!

ఈ మధ్య రాజకీయ పార్టీలకతీతంగా అన్నీ వార్తా పత్రికలలో కనిపించే పదం " సామాజిక న్యాయం ". దీనికర్థం ఏమైవుంటుందా అని వార్తాపత్రికలు తిరగేస్తుంటే, "ఏది నిజం" అని ఒకరంటే "పెన్ కౌంటర్" అని మరొకరంటారు. "ఎలక్షన్" అని ఒకరంటే "పాంచజన్యం" అని మరొకరంటారు. ఇంతా చదువుతుంటే పచ్చగడ్డి లేకుండానే భగ్గుమని మండే ఈ పత్రికలలో కూడా ఒక సారూప్యత వుందండోయ్ !!! అదే "సామాజిక న్యాయం". వాడు వాడాడు కదా నేనెందుకు వాడాలని కాకుండా అందరూ ఒకే పదాన్ని వాడి నాకు కొంత శ్రమ తగ్గించారు.

ఇంతకీ సామాజిక న్యాయానికి అర్థం ఏమిటొ ఎంత వెదికినా కనిపించలా.... అర్థం తెలియకపోతే మరి వార్త ఎలా అర్థం అవుతుంది? అందుకని నాకు నేనే ఓహో ఇదేనేమో అనిపించింది ఇక్కడ రాస్తున్నా... మీ దృష్టిలో వేరే అర్థం వుండవచ్చు.

ఇంతకీ నాకర్థం అయ్యిందేమంటే ... పార్టీ పెట్టాలన్నా, పెట్టి నెగ్గాలన్నా,నెగ్గి తినాలన్నా, తిని భరించాలన్నా సమైక్యాధ్రప్రదేశ్ లో ముందు జనాభాని కుల ప్రాతిపదికగా ఈ రకంగా విడగొట్టాలి. ( all percentages are close to reality as per reliable sources on the internet )


Reddy : 6.8 %
kamma : 4.8 %
velama : 3.0 %
komati : 2.7 %
kshtriya : 1.2 %
brahmana : 2.5 %

kaapu : 15.2 % ***** (దిలీప్ గారి వ్యాఖ్య ప్రకారం ఈ శాతం తూర్పు కాపులు, కళింగ, ఓసి కాపులు, రెడ్లు (తెలంగాణా రెడ్లతో కలిపి)).

golla : 6.3 %
telaga : 5.2 %
chakali : 4.2 %
mutarasi : 3.3 %
balija : 3.0 %
padmasali : 2.9 %
kummari : 2.1 %
devangana : 2.1 %
goundla : 2.0 %
vaddera : 1.9 %
mangali : 1.3 %
kuruma : 0.9 %
munnuru kapu : 0.8 %
boya : 0.7 %
besta : 0.7 %
uppara : 0.4 %
gavara : 0.4 %
jangama : 0.4 %
others : 2.9 %mala/other S.C : 9.2 %
madiga : 6.8 %muslims and
christians : 7.0 %
ఇప్పుడు ఈ లిష్టు ముందుపెట్టుకుంటే మా percentage ఇంత కాబట్టి మాకిన్ని సీట్లు దక్కాలి. మా కులం percentage ఇది కాబట్టి మాకు ఈ నిష్పత్తి లో సీట్లు కేటాయించాలి. మా జనాభా ఎక్కువ కాబట్టి రాజ్యం మేమే పరిపాలించాలి. ఇదీ నా కర్థమయిన సామాజిక న్యాయం. విభేదించేవారు వారి నిర్వచనాన్ని తెలుపవచ్చు.

సామాజిక న్యాయ రాజ్యం రావాలి. మంచిదే !!! ఇక్కడ F.C లెవరు ? B.C లెవరు ? S.C/S.T లెవరు ? ఈ విభజన ఏమైనా ఒక సైద్దాంతిక ప్రాతిపదికిన జరిగిందా ? మొన్న మొన్నటి దాక F.C లగా చలామణి అయిన కొన్ని కాపు కులాలు ఒక్క దెబ్బతో పాలకుల సౌకర్యార్థం వచ్చి B.C లలో చేరారు? B.C లుగా మారి వారు బాపుకున్నది ఏమిటి ? ఎన్ని ప్రభుత్యోగాలు సంపాయించారు? పాలకులకవసరమైతే రేపు రెడ్డి/కమ్మ/బ్రాహ్మణ లను బి.సి. లిష్టులలో చేర్చరని నమ్మకముందా? అప్పుడు అందరూ బి.సి లే కాబట్టి అప్పుడు ఏ సామాజిక న్యాయం పాటించాలి? అసలు సామాజిక న్యాయ రాజ్యం అంటే ఏ కుల M.L.A గారు ఆ కులాన్ని బాగు పరచాలా? ఇలా అయితే percentage తక్కువగా వున్న కులస్ఠులారా మీరు ఇప్పటికిప్పుడే ఒకరికి వంద మందిని కని మీ జనాభాని పెంచుకోండి. లేకపొతే ఈ రాజకీయ వాతావరణంలో సమర్థనాయకత్వానికి నూకలు చెల్లి సామాజిక న్యాయ రాజ్యాలు వస్తాయి కాబట్టి మీ కులానికి పుట్టగతులుండవు.

నాయకత్వ లక్షణాలు కలిగిన ఏ కుల భారత పౌరుడైనా ఇంత కుళ్ళిన రాజకీయాల్లో కూడా తనదైన రీతిలో ఒక్కో మెట్టు ఎక్కి అందలం అందుకున్నవాళ్ళే. అవి లేని వారు రాజ కుమారులైనా రాజు పేరు చెప్పుకొని బతికినవాళ్ళే. రాజ్యమేలడానికి ప్రాతిపదిక కులం కాదు, అన్నమో రామచంద్రా అని ఏడ్చే పేదలకి నాలుగు మెతుకులు పండించే మార్గం చూపించాలి . దాహమన్న వాడికి గుక్కెడు శుభ్రమైన నీళ్ళు ఇవ్వగలగాలి. మెరుగైన, సంస్కారవంతమైన జీవితానికి విద్యను ప్రసాదించాలి. జీవన ప్రమాణాలు పెంచాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పథకాలు అమలు పరచాలి. ఇవే కాని, నా కుల శాతం ఇది, నాకిన్ని సీట్లు అంటే F.C లందరూ B.C జాబితాలోనో లేక S.C/S.T జాబితాల్లోనో చేరినా ఆశ్చ్రర్య పోనక్కరలేదు.ఆలోచించండి.

54 వ్యాఖ్యలు:

 1. కాపులను ఇంకా బి.సిలలో చేర్చలేదనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అఙ్ఞాత గారు, 2007 లో అనుకుంటా దీనిమీద చాలా చర్చ అయింది. కొన్ని ప్రాంతాల కాపు కులస్థులు B.C లలో చేరినట్టు గుర్తు.మీకేమైనా కచ్చిత సమాచారముంటే తెలియచేయగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రతి ఎన్నికలోనూ మన నాయకులకి ఓ కొత్త పదం కావాలి.. హైటెక్, హరితాంధ్ర లాగా ఈ సామాజిక న్యాయం కూడా ఓ స్లోగన్ అంతే.. ఎన్నికలవ్వనీయండి.. ఈ పదం మళ్ళీ వినిపిస్తుందేమో చూద్దాం..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కులాల్లేని సమసమాజం మంచిదే.కానీ భారత దేశంలో కులవ్యవస్థ ఓ వాస్తవం. అందులో బతికిన వాళ్లకే.. వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుస్తుంది. ఎంతగా వివక్షకు గురవుతాడో తెలుస్తుంది.కాబట్టి ఇవి అప్పడే పోయే రుగ్మతలు కావు. అంతవరకు ఏ కుల పౌరుడైనా .. లాంటి గొప్ప మాటలు మనం మాట్లాడుకోవడం అనవసరం

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వెన్నెల రాజ్యం గారు,
  >> అందులో బతికిన వాళ్లకే.. వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుస్తుంది. ఎంతగా వివక్షకు గురవుతాడో తెలుస్తుంది.

  మరి ఇప్పటి నాయకు లెవరు అందులోనుంచి వచ్చారు ? బడుగు వర్గాల పై చూపే వివక్షను తుడిచిపెట్టడానికి? మీ మాటప్రకారం కుల వారీ రాజకీయాలకు ప్రత్యక్షంగా తెరలేస్తే చిన్న చిన్న కులాలు త్వరలోనే కనుమరుగై పోతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మురళి గారు, మీరన్నట్టు ఇది ఎలక్షన్స్ వరకే అయితే అందరికీ మంచిదే. కానీ ఇప్పటి దాకా గుస గుస లు గా మాత్రమే వున్నవి బహిరంగంగా మా కులపోడు కానోడు నా గడప తొక్కొద్దు అని బహిరంగంగా రాజకీయనాయకులు మాట్లాడితే ఇంక గ్రామల్లో రచ్చబండ దగ్గర రచ్చ రచ్చే !!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Castism is the ground reality in India as some other blogger said, there is huge discremination of lower castes in 70% of of telangana especially in North Telangana and North Andhra. It is very natural that if you belong to lower caste and belong to above regions you will definitely know the pain of descrimination, these people will be treated as 3rd grade citizens irrespective of education. Myself is a good example, Iam a BE graduate and belong to padmasali community and from North Telangana, my father took me to MLA for recommendation for a trainee for project work in Hyderabad, he made us to sit on the floor in front of his sofa, my father had no problem sitting there but I felt sad and uncomfortable. I made it to USA my self but the discremination is still there whenever I go back to village.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Kapus are not BCs,
  there are 2 types
  Kapus OC/FC - 15%
  Other Kapus (munoor, thoorpu etc ) BCs - 12%.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. భాస్కర్ రామిరెడ్డి గారు.
  మీరు చాలా పొరపాటు పడుతున్నారు. చాలా మంది నాయకులు అందులోంచి వచ్చారు. పోరాడుతున్నారు. రకరకాల ఉద్యమాలుచేస్తున్నారు.ఇంకా వస్తారు కూడా. దీన్ని ఎవరూ ఆపలేరుకూడా. ఎందుకంటే మార్పును కొంత కాలం అపగలరు. ఎల్లకాలం అంటే కుదరదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @Anonymous,

  I understand the situation in villages. When I was a child, I literally questioned my self so many times. My close friend (mala community) father behaves different than his child. We used to ask him to sit on chair, he denied. We used to ask him to drink water in a glass. He holds two hands together as a cup. There are many situations here and there across A.P in any village.

  Do you think this kind of society sickness can be eradicated overnight? Is this the same situation in current generation? Who made sincere attempts to eradicate such crooked impurity?

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @అజ్ఞాత గారు, సవరణకు ధన్యవాదాలు..

  @వెన్నెల రాజ్యం గారు,
  నేను రాసింది కూడా అదే ! కడుపు మండినప్పుడు ఆ మంటలోనుండి సరైన నాయకుడు పుడతాడు.వీడి ఎదుగుదలను ఏ కులమూ అడ్డుకోలేదు,

  నాయకత్వ లక్షణాలు వున్న వాడికి కులమెందుకు? ఈ సామాజిక న్యాయాలెందుకు?

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నాయకత్వ లక్షణాలు వున్న వాడికి కులమెందుకు? ఈ సామాజిక న్యాయాలెందుకు?

  GOOD POST భాస్కర రామి రెడ్డి!


  The reason for change is
  అర్హత లేనివారు కూడా మా తాత ప్రజానాయకుడు, మా నాన్న ప్రజానాయకుడు, మా అన్నయ్య ప్రజానాయకుడు కాబట్టి నేను కూడా ప్రజానాయకుడునే అంటూ మొదలయ్యారు. అలా మొదలయిన కుటుంబ వారసత్వం, ఈ నియోజిక వర్గం ఈ కులం వారే నిలబడాలి అనే ధోరణి బాగా వంట బట్టేసింది. కుటుంబ వారసత్వం కాస్తా కుల వారసత్వంగా మారింది. అలా వచ్చిన వారసులు సొంత అనే వాళ్ళకు మాత్రమే దోచిపెట్టడం వలన మన రాజకీయాలలో కులం పాత్ర ఎక్కువై పోయింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @శరత్ : Thanks

  @a2Zdreams : అందుకే 100 మంది ప్రజల్లో 51 మంది మంచి కోరే వారిని కుల ప్రాతిపదికకు అతీతంగా ఎన్నుకుందాం అని ఈ పోష్ట్

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @భాస్కర రామిరెడ్డి గారు

  మనకి ఇంటెర్నెట్లో లభ్యమయ్యే డాక్యుమెంట్ కె శ్రీనివాసులు గారు రూపొందించింది. అందులో ఆయన 1921 లో మద్రాసు ప్రెసిడెన్సీ, నిజాము ప్రభుత్వం కింద ఉన్న తెలంగాణాల్లో జరిపిన వాటిని కలిపి ఒకచోట పొందుపరిచారు.

  1921 సెన్సస్ ప్రకారం కాపులు 15.2 శాతం అని ఉంటుంది. ఆ వర్గీకరణ రెడ్లని కాపులగా పరిగణించి తీసుకున్నది. ఇప్పటికీ రెడ్ల కులధృవీకరణ పత్రాల్లో చాలా మంది కాపు గానే రాసుకుంటారు. ఇప్పటికీ తెలంగాణ, రాయలసీమల్లో కాపులు గానే గుర్తిస్తారు.

  ఇకపోతే ఆ 15.2 శాతంలో కాపులుగా పిలవబడే అందరూ ఉన్నారు. తూర్పు కాపులు, కళింగ, ఓసి కాపులు, రెడ్లు (తెలంగాణా రెడ్లతో కలిపి). వాళ్ళంతా కలిపి 15.2% అని గుర్తించాలి.

  1921 తరవాత కులపరమైన సెన్సస్ రాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఇకపోతే, ఆంధ్రప్రదేష్లో కేవలం రెడ్ల జనాభా మాత్రమే తీసుకుంటే అది 6.8% ఉంటుంది అని అదే డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @ భాస్కర రామి రెడ్డి గారు

  మీరన్నట్టు నాయకత్వ లక్షణాలే ఒక అభ్యర్ధి గెలుపోటములని అత్యధికంగా శాసించేవి. చాలా తక్కువ మంది అభ్యర్ధులు మాత్రమే పూర్తిగా తమ కులం ఓట్ల మీద ఆధారపడతారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. దిలీప్ గారు, మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. అలాగే సవరణ కు ధన్యవాదాలు. పోష్ట్ లో మీ వ్యాఖ్యను చేర్చడమైనది.

  నా చిన్నప్పుడు మా వూర్లో కూడా చాకలి వారి నో, మంగలి వారి నో, మాల వారి నో కూడా ఎవరైనా అడిగేటప్పుడు " మీ కాపు ఎవరు " అని అడగడం నాకు స్పష్టంగా గుర్తు వుంది. ఇక్కడ కాపు కులంగా కాక " వారి పనితనాన్ని, వారి కులవృత్తిని పోషించే వారిగా కనిపిస్తుంది. "

  ప్రత్యుత్తరంతొలగించు
 18. The situation is same in current generation may be 1 or 2 percent less, this discremination can not be eradicated in overnight and will not be eradicated in future. By providing good education, water, different programs may help little bit but it will not help to eradicate descrimination. As I said I had good education, living good life but still treated as 3rd grade citizen by Doralu, it is not question of FC/BC, it is a question of UpperCaste/lower caste, even if u make Reddy/Kamma as BC they still be treated as Upper Caste that is the difference Iam talking about. All this descrimination is just bcz of power and the power is only with some doralu, that is why our people supported Naxals but as the time went Naxals fight became polluted with injection of some selfish guys into the movement. Recently some so-called upper caste educated parties are coming up with good education, good health, good water etc... but are not talking about equal power and equal justice, I feel this is kind of conspiracy for deviating the concept of power sharing and equal justice.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. భాస్కర రామి రెడ్డి గారు, చాలా బాగా చెప్పారండి...సామాజిక న్యాయం అంటే కుల ప్రాతిపదికన సీట్ లు కేటాయించడం అని నమ్మే దుర్భాగ్య స్థితిలో పార్టీలు వున్నాయి

  ప్రత్యుత్తరంతొలగించు
 20. నరెంద్ర గారు,
  అన్ని పార్టీల పంథా అదే ఇప్పుడు, చదువుకున్న వారన్నా అలోచించి నిర్ణయాలు తీసుకుని తమకు నచ్చిన వాడిని గెలిపించుకొంటే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. Anonymous gaaru,

  Power and justice can not be granted by some upper castes to lower castes. If some one feels that they are not getting equal power and equal justice, they need to come into social politics, fight for social justice, fight for their share of power, but I don’t think caste based politics ( so called “samajika nyayam” ) changes the down trodden people lives.

  As you said, you felt so humiliated ( but not your father ) when some “Dora” makes you to sit on the floor in front of his sofa. Yes, you were able to think the discrimination because you are educated. That is the reason if we want to change the lives, education is so important. All I can say is “let us have faith in our selves “and education is the foremost criteria to point out such incidents. Without education we can not even think of questioning such indecent behavior.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. Babu Rami reddy garu, anubavistey telustudni aa pain emito, I just gave one example that is just tip of the ice berg, Iam not saying education is waste, education and knowledge makes u to understand the situation and think differently, what Iam saying is education is not alone sufficient, we need to have guts and oppurtunity to fight these Doras, now we have triangular fight in our place, 2 from upper caste regular guys, 1 from down trodden section but he is well educated, most of the villagers decided to vote for this educated guy bcz he is also one of the suffferer along with us and we never expected that we get this chance and frankly we are not sure whether this guy wins or not but we got the oppurtunity and hoping for good, thats all we all can do now. As u raised, yes we are all involved actively in social politicis now and working for this guy and fighting for the good, do not think it is caste based politics, it is a fight between Dora and Slave not between different castes.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. I know caste based system is not good for one and all but my Sincere question to you all and do not take it personally, till date only 2 castes ruled and ruined the state and divided the people based on caste, looted all lower caste people irrespective of educated or not. Why are u people now talking about caste based politics, where are u all these days when these 2 upper castes ruined the state and livelihood of poor based on caste, why did not u guys questioned all these days.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. Anonymous gaaru, please do not take it as personal; I just cited the example from your comment.

  Regarding getting opportunity…

  I appreciate it if the party selects the candidate to fight against social injustice without considering his caste and the number of voters in that caste. Let’s hope for good.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @Sekhar,
  I think you are not getting my point. I am asking people, being an educated community, think and select the right person irrespective of the caste. You take any news paper/any channel “samajika nyayam [ kula praatipadika ] ” is a buzz word now, which deviates prime purpose of “living together” .

  ప్రత్యుత్తరంతొలగించు
 26. అయ్యోరూ బాస్కర గోరు, మా కులపోడుకి గుద్దొద్దన్నారు, బానేవుంది. మీది ఏ పార్టీ అంట?

  ప్రత్యుత్తరంతొలగించు
 27. People like you live in fools paradise, realize the reality. How can you seperate caste and politics.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @pavan, మీ కులపోడినే బాగా గుద్దండి.. కాదనడానికి నేనెవరు ? మీదే పార్టి అన్నారు.. నాకు ఇప్పుడు అంత అదృష్టము లేదులెండి.. ప్రవాసం లో వున్నానని ఓటు పీకేశారు.

  @అజ్ఞాత, the seperation is in your hands.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. కులం అనేది రాజకీయాల్లో, ఎన్నికల్లో ఇంత ప్రముఖ పాత్ర వహిస్తుందని, అది రాను రాను బలపడుతుందని మన పాత తరాల వారు ఊహించి ఉండరు. ఈ కులం వాళ్ళకి ఇన్ని సీట్లు ఇవ్వాలి, వీరి ప్రాతినిధ్యం ఇంత ఉండాలి, "మా కులం వాడికే మా వోట్లు" ఇలాంటి భావాలు ఏ ఎన్నికల నుంచీ బలపడ్డాయంటారు? ఎందుకంటే నా చిన్నప్పుడు 1982 ఎన్నికల ముందు ఇలాంటి పరిస్థితి లేదని పెద్దవాళ్ళు అనుకుంటుంటే వింటూ ఉంటాను అప్పుడప్పుడూ! ప్రస్తుతానికి మా నియోజక వర్గంలో నిలబడ్డ అభ్యర్థి ది మా కులం కాదు. అసలు మా కులం వాళ్ళు కులానికి అగ్రవర్ణమైనా రాజకీయాల్లో ప్రాతిధ్యం విషయానికొస్తే ప్చ్..లాభం లేదు! మరి నేను ఓటెయ్యాలా వద్దా?

  ప్రత్యుత్తరంతొలగించు
 30. జనం కులం, మతం లాంటి వాటి కంటే డబ్బుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మా జిల్లాలో కోమటోళ్ళు, కరణపోళ్ళు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఇక రిజర్వేషన్లు ఉన్నా లేనట్టే.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. సుజాత గారు, నేను మా కులం వాళ్ళకైనా వోట్ వెయ్యను. మా బంధువు ఒకతను రెండు సార్లు MLAగా గెలిచాడు కానీ అతను తన సొంత ఊరికి రోడ్డు బాగు చెయ్యించలేదు. MLA అయిన తరువాత కారు కొనుక్కునాడు, మేడ కట్టుకున్నాడు. 2004లో అతను ఓడిపోయి ఒక మహిళా అభ్యర్థి గెలిచింది. ఆమె స్థానికురాలు కాదు. ఆమె ఒరిస్సాలో పుట్టి పెళ్ళి చేసుకుని ఆంధ్రాకి వచ్చింది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె కాలంలోనే ఆ నియోజక వర్గంలో కొద్దిగా అభివృద్ధి జరిగింది. కులం పేరు చెప్పుకుని వోట్లు వెయ్యించుకునేవాడెవడూ అభివృద్ధి చెయ్యడు, చేసినా జరిగేది కొద్దిపాటి అభివృద్ధే.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. సుజాత గారు, మీరు చూడలేదేమో, మీ కులం వాళ్ళు ఎప్పుడో,ఎక్కడో తెలుగుదేశం కి వేయమని పిలుపునిచ్చారు. just kidding :)

  అవునండి,కులవృత్తుల ద్వారా వారికి జీవన భృతి దొరుకుతుందని పూర్వం ఒక మంచి ఆశయంతో తయారైన ఈ కులాలు ఇలా తయారయ్యాయి.గ్లోబల్ ప్రపంచంలో కులవృత్తులైతే మృగ్యమైనాయి కానీ కులాలు మాత్రం నరనరానా పాతుకు పోయాయి.

  1982/83 తరువాత బహుశా బీజం పడిందేమో.. ఈ మాటంటే తెలుగుదేశం వాళ్ళు రయ్యి మని మీదకు వస్తారేమో ? 1982 లో సరిగా చెడ్డీలు కూడా తొడుక్కొవడం రాని వయసులో మావూరికి వచ్చిన లారీ ఎక్కి " జై తెలుగుదేశం " అన్న మా లాంటి వాళ్ళందరూ తరువాత ఎలక్షన్ లో కాంగ్రెస్ జెండా పుచ్చుకున్నాము ( అప్పటికి గూడా వోటు లేదనుకోండి ).

  ప్రత్యుత్తరంతొలగించు
 33. మార్తాండ గారు, రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు ప్రతిపాదించినప్పుడు కూడా ఆయన దృష్టిలో సామాజికన్యాయం ఇది కాదనుకుంటా.చెప్పాలంటే చాల వున్నాయి. 1983 కి ముందు ఎన్ని ప్రాధమిక పాఠశాలలున్నయి.. ఆ తరువాత కొత్తగా ఎన్ని పెట్టారు.తరువాతి కాలంలో ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల స్థానంలో కార్పోరేట్ కాలేజిలు అవతరించాయి.అలాగే R.M.P వ్యవస్థ స్థానంలో కార్పోరట్ ఆసుపత్రులు వెలశాయి.ఆనాడు సామాజికన్యాయం అంటే నిమ్న కులాలవారికి మెరుగైన విద్య ను ప్రసాదించి అగ్ర కులాల వారి సహపంక్తి లో కూర్చోపెట్టాలని వారి వుద్దేశ్యం. దీనికి ఇందిరాగాంధి చేసిన కృషిని ఎవరైనా తప్పు పట్టగలరా?

  అలాగే మీరు నమ్మిన కమ్మ్యూనిజం నుంచే నేను కాంగ్రెస్ అవతారమెత్తాను. కమ్మ్యూనిజ సిద్ధాంతాలు పుస్తకాలలో చదువుకోవడానికి బాగుంటాయి కానీ నిజ జీవితంలో ఓటమి పాలైనాయి.ఇప్పటికి కూడా అంతో ఇంతో ఆ భావజాలం వున్నోళ్ళు కాంగ్రెస్ లోనే ఎక్కువ అనుకుంటా ( మిగిలిన పాఋటీలతో పోలిస్తే )

  ప్రత్యుత్తరంతొలగించు
 34. Very nice discussion. Chiranjeevi & Dasari can not claim to be "Kapu" leaders.In Kaapu's there are so many differences. For your info, there is clear demarcation as per the regions. Godavari districts have two types-telagas, kapus; Rayalaseema has, balija naidu, balija, setti balaja, gajula balija; Vizag upwards-telaga, toorpu kapus, Krishna has Naidus, Kapus. Telangana is different. Until 20 years ago marriages were not arranged beyond each region. It is samething in kamma community.
  Unfortunately India evolved from a feudalistic set up. we are only 60 years away from autocratic setup.(ie ruling ourselves after 1947). These caste equations would have gone. But for politics. I have never experienced discrimination as I never believed in caste.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. మనూళ్ల వైపు కాపు అనగా, రెడ్డి అనుకునేరు. కాపు అనగా అదొక వృత్తి. కాపు అనగా కాపుకాయువాడు. ఆ కాపు పోస్టు ఇంతక ముందు రెడ్లు చేసేవారు ఎక్కువగా. ప్రతీ ఊళ్లో పెద కాపు చిన కాపు ఉంటారు.

  సామాజిక న్యాయం అనగా, ప్రతీకులపోడికి టిక్కెట్టిచ్చి, చూసావా అందరూ సమానమే టిక్కెట్ల లెక్కప్రకారం అనుట.

  నిజమైన అర్ధాలు తెల్సుకుంటే .. బాసు నిజమైన అర్ధాలు ఎక్కడ ఉన్నాయి నాయన ఎప్పుడో ట్యాంపరు చేసవతల నూకితే.

  నువ్వు SCనా కాదా, కాదు?? పక్కకుపో
  Note : SC = Same Cast.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. మా ఊర్లో మాత్రం కాపులంటే దొంగల్ని పట్టుకునేవాళ్లూ, టికెట్లిచ్చేవాళ్లూ ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 37. అజ్ఞాత గారు,Thank you for providing information on different sects

  >> Unfortunately India evolved from a feudalistic set up. we are only 60 years away from autocratic setup.(ie ruling ourselves after 1947). These caste equations would have gone.


  yes, hope for the good.

  ప్రత్యుత్తరంతొలగించు
 38. భాస్కర్ రామరాజు , భలే గుర్తు చేశారు,పెద కాపు చిన కాపు :)
  >>"నిజమైన అర్ధాలు తెల్సుకుంటే .. బాసు నిజమైన అర్ధాలు ఎక్కడ ఉన్నాయి నాయన ఎప్పుడో ట్యాంపరు చేసవతల నూకితే"

  బాగుంది మీ సంభాషణ. ఇంకోటి "SC= same caste" ఇది మీ ప్రయోగమా లేక ఎప్పటినుంచో వున్నదా?


  అబ్రకదబ్ర గారు ఇంతకి మీదేవూరు? :)

  >>"మా ఊర్లో మాత్రం కాపులంటే దొంగల్ని పట్టుకునేవాళ్లూ" ఇది అర్థం అయ్యింది కాని

  "టికెట్లిచ్చేవాళ్లూ" ఇది అర్థమవటం లేదు.. కొంచెం టార్చ్ లైట్ వేస్తారా :) ?

  ప్రత్యుత్తరంతొలగించు
 39. మా ఊరు: కండలరాయుడేలు రాష్ట్రం ఉత్తరభాగమందలి ఇసుకలోయలో గల సూర్యాపేట నామధేయమ్ముగల పట్టణము. ఆంగ్లములోనికనువదించుకొనుడు.

  టికెట్టు = ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందులకు కాపువాడు కడు ప్రేమగా మన చేతికిచ్చు కాగితమ్ముక్క.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. అబ్రకదబ్ర గారు, మీరు జనాలని ఇలా తెలుగులో బాధించడం ఎప్పటినుంచి నేర్చుకొన్నారు ?

  By the way there is a good memo/article in NY times on loksatta (like parties)

  http://www.nytimes.com/2009/04/13/world/asia/13india.html?_r=1&scp=1&sq=loksatta&st=cse

  ప్రత్యుత్తరంతొలగించు
 41. GOOD POST

  jai prajarajyam
  jai telugudesam
  jai congress
  jai loksatta

  this is the order

  ప్రత్యుత్తరంతొలగించు
 42. Dear Chicago అజ్ఞాత ,
  Looks like your loyality is unlimited, here is my guess

  1) Congress
  2) TDP and its allies
  3) Prajarajyam
  4) Loksatta

  I do want to see some participation of loksatta in upcoming assenbly, but except JP , there are no strong political leaders. Loksatta needs some more time to build its cader at field level.

  ప్రత్యుత్తరంతొలగించు
 43. ఎస్.సి అనేది నేను మొట్టమొదట 1987 లో విన్నా.
  సరే ఇంతకీ జనాలు సానా మంది జె.పి జె.పి అని దేనికి కలవరిస్తున్నరో తెల్సునా? బాబుకి వోటెయ్యకపొయ్యినా పర్లేదు, వై.యస్.ఆర్ కి, పెజారాజ్జానికీ ఎయ్యొద్దు, కానీ జే.పికి ఎయ్యండి.
  నీకు అర్ధం అయ్యిందనే అనుకున్టన్నా. అర్ధం కాక పోతే ఓ పాలి బుర్ర గోక్కో.
  గదీ సంగతీ ఈ దినం. ఇట్ల ముగిస్తున్నం.

  ప్రత్యుత్తరంతొలగించు
 44. నాకో దరమ సందేసం, చివరాకరి అజ్నాత చిక్కాకులం (అ.క.అ షికాగో) అని ఎలా సెప్పావు? ఎటా రహస్యం కూసిన్త ఇవరిన్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 45. భాస్కర్,
  రెండు మూడు బ్లాగులు చదివాక బుర్ర గోక్కోకుండానే అర్థంఅయ్యింది.

  ఇంక మీ ప్రశ్నకు నా సమాధానం


  అదేందబ్బయ్యా Albany( workplace) అబ్బయ్యా నువ్వు గూడా, మనము ఇట్టాటి పెస్నెలు అడగ్గూడదూ , నేను చెప్పగూడదూ..

  నీకు తెలియని విద్యా ఇది?

  అసలు విషయం చాలావుంది.

  మొదటి అజ్ఞాత : హైదరాబాద్, ఆయన పేరు చెపితే బాగుండదు కనక వూరిపేరుతో సరిపెట్టు కుందాము.

  రెండొ అజ్ఞాత ( ఇంగ్లీష్ ) ఉరఫ్ ......: Oregon ( USA )

  ఇంకో అజ్ఞాత: From Australia

  చివరి అజ్ఞాత మాత్రమే from chicago.

  ఇట్టాంటివి ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు నేర్చుకోలెదా ఏంది? ఓ గంట గూగిల్ మీద కూకో, websphere దున్నేవాడికి నికిదేమి లెక్క.

  ప్రత్యుత్తరంతొలగించు
 46. అలా నవ్వేస్తే మేమేమనుకోవాలి అద్యచ్చా, ఈ నవ్వు రాజశేఖరునిదనుకోవాలా లేక చంద్రబాబు గారి దనుకోవాలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 47. ఛిఛీ..పొయ్యి పొయ్యి చంద్రబాబు నవ్వుతో పోల్చుతావేంటి సోదరా...అది వంకర నవ్వు. ఆ నవ్వులో, "గొఱ్ఱెలారా!! మీకు తెలియకుండా మీ *కాయల్ని కోసేసి మీకే అమ్ముతున్నా" అనే అర్ధం ఉంటుంది. ఇక రాజశేఖరం బాబయ్య గారి నవ్వు, "అసెచాల్లే ఊర్కో!! గంమ్మునుండు, లేక తోక కోస్తా" అన్నట్టు ఉంటుంది. సిరంజీవి, కేసిఆర్ తొట్టిగ్యాంగ్..
  మన నవ్వు, నకెరికల్లుకానుకొని ఉన్న రైట్ కెనాల్లో డాయర్ ఏస్కుని మండుటెండలో మిట్టమద్దేనం దూకితే కలిగే ఆనందంలోంచి వచ్చిన చిరునవ్వు లాంటిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 48. నవ్వుకు అర్థాలు బాగా చెప్పారు. వీటన్నిటికంటే నాకు నీనవ్వు నచ్చింది సోదరా !

  ప్రత్యుత్తరంతొలగించు
 49. ధన్యవాదాలు కానీ, నువ్వెప్పుడైనా అలా చేసావా అనేది పెస్న. మండుటెండలో మిట్టమద్దేనం చెరువులోనో లేక ఓ వాగులోనో దూకావా?

  ప్రత్యుత్తరంతొలగించు
 50. నాలుగో తరగతి అయ్యి ఎండాకాలం.. బఱ్ఱెల తోలుకోని పొయ్యి వాటి తోకబట్టుకోని మా ఊరి వాగులో ఈత సుమారుగా నేర్చుకొన్న..ఇంకేముంది మనకు పూర్తి ఈత వచ్చిందిని ఊర్లో వున్న బావులన్నింటి లోతులు రోజూ కొలవడమూ మా అయ్య రోజూ బడితపూజ చెయ్యటం.. ఎందుకులే సోదరా ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ మా ఊరు పోయినా బావులు లేవు ( ఎండి పోయినవి), వాగు కాస్తా పిల్ల కాలువలా తయారయ్యింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 51. ఈ ఎదవ రాజకీయ నావికులని తోలుకెల్లి ఆ నీళ్లు లేనిబాయిల్లొకి దూకించాల. పేపరు నాకొడుకుల్ని ఆ కలవల్లో తోలించాల. దెబ్బకి శనొదులుద్ది. ఈళ్ళేమ్మ సోంబేరినాకొడుకులు. ఇయ్యాల పేపర్లో పొద్దస్తమానం ఈనాడోడు ఆడి ప్రెండ్సు తెలుగుదేశం భజన, సాక్షి కాంగ్రేసు భజన. థూ ఈళ్ళేమ్మ.

  ప్రత్యుత్తరంతొలగించు
 52. *** మన నవ్వు, నకెరికల్లుకానుకొని ఉన్న రైట్ కెనాల్లో డాయర్ ఏస్కుని మండుటెండలో మిట్టమద్దేనం దూకితే కలిగే ఆనందంలోంచి వచ్చిన చిరునవ్వు లాంటిది. *** hahaha.. very very nice..

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form