కళ్ళు తెరచి చూస్తే కలలలోకం కరువయ్యిందా
కళ్ళుమూసుకుంటే జనజీవనం వెక్కిరించిందా
నిద్దురోని రాతిరి తెల్లవార్లు తరచి అడిగిందా
వల్లకాని ఎర్రకలువ ఏరులై పారిందా
సన్నజాజి పక్కఅంత ఎండిపోయిందా
మల్లెపూల వాసనంత వెక్కిరించిందా
పరువాల పట్టెమంచం పగలబడి నవ్విందా
నలగని తనువంత చిక్కబడి చిన్నబోయిందా
ప్రేమించిన జాలిగుండె నేలకొరిగిందా
విలపించిన నాతిగుండె బేల అయ్యిందా
రాగాలు జాలువార్చే జలతారు పూబోణిరా!
నల్లనయ్య గీతికల గిరిగీసి కూర్చేటి ఉమాదేవిరా!
నేనే నా నేనే నా (ఎగురుకుంటూ వచ్చా..)...
రిప్లయితొలగించండినన్నే నా నన్నే నా ( కళ్ళార్పుతూ చూస్తున్నా)...
బలేగుందే బలేగుందే... (అరమండి లో నడుమున చేతులతో అచ్చెరువైపోతున్నా) ...
చూసేరా చూసేరా (అందరిని కేకలెడుతున్నా)
అయ్యో నేను కాదా? ( బుగ్గన చెయ్యెట్టుకుని విచారిస్తున్నా)
భా.రా.రే నీ సంగతి చెపుతానుండు ( మీ అవిడకు చెప్పేలే పులిహోరే పులిహోరే) .. ;-)
అయ్యో భావనా మీరుకాదని నేచెప్పానా చెప్పండి? :)
రిప్లయితొలగించండిజాలికనుల జాలువారు వూసులు
రిప్లయితొలగించండిజాజిపూల మసకబారు బాసలు
జావళీలు కరువయిన పదాలు
జాగారాలు నెలవయిన కనులు
ఎవరికి తెలియని వెతలివి. మనస్విని భావనాతరంగాలివి. కలత కన్న నెలత కలం రువ్విన రాగాలా మరి?
అబ్బ! ఎంత బాగా చెప్పారు భావన(ఉమా)గురించి, క్రిష్ణ గీతం గురించి. చాలా చాలా బాగుంది.
రిప్లయితొలగించండిభ.రా.రే:
రిప్లయితొలగించండికళ్ళు తెరిచి చూస్తే కరిగిన కల వెక్కిరిస్తుంది
కలత పడిన మనసేమో కన్ను ని మూత పడ నివ్వదు.
రాతిరేమో అతని జాదను తెల్లవార్లు తరచి అడిగితే ఎర్ర కాలువలేమో కళ్ళ పూయక ఏమవుతాయి చెప్పండి..
వాడిన జాజులో మరి వంత పాడె మల్లెలో విరహ తాపం పెంచితే..
వొరిగిన స్వీయ మది ఖండిత అవ్వాలనుకుంటే మదిలోపలి వలపు తలపు స్వాధీన పతిక ను చేస్తోంది..
ఎంతకు రాని చెలుని జాడ కొరకై అభిసారికనైతే జాలువారే రాగమొక సావేరి కాదా..
ఉషా: జాజి పూల మసక బారు బాసలు నీకు తెలియకేమి నేస్తం..
రిప్లయితొలగించండివెలిసిన కరుకు గుండెల కన్నయ్య ను వేడే నీ వేదనా గళం రువ్విన రాగాల తళుకుల సోకులు..
కరకు గుండె కాదది నా జగన్మోహనుడు మహిమాన్వితుడని మురిసి చెప్పే నీ పదముల జావళీలు మాకెరుకేలే.. ;-)
విప్రలబ్ధవో వాసవకజ్జికవో ఏ క్షణానికి నీ గుండే పలికే రాగమేదో ఎరుగని
మనస్వినా ఈ భావనాంతరంగం..
నువ్వన్నట్లు ఇద్దరం మరి ఒక తాను ముక్కలమే కదా..
భా.రా.రె. ఎక్కడో తొండి జరిగిందబ్బాయ్. నాది మొదటి వ్యాఖ్యా కావలసింది [నేను వ్రాయటం మొదలు పెట్టినప్పటి మాట] మూడుగా ఎలా జరిగిపోయిందిట? ఇది అంతర్గత కలహమా? విదేశీహస్త కుట్రా? :)
రిప్లయితొలగించండిభావనా, నా నాడి బాగా పట్టేసావే. నా కన్ను, మాట తప్ప నా కన్న పైన ఇంకేమీ పడనీయను. అవునూ, అష్ట నాయికల్లో ఇంకొందరిని వదిలేసావేమి, చుట్టబెట్టేయకపోయావా..."కలహాంతరిక" నా వంతు. "ప్రోషితపథిక" - ఊ సరే అదీ నా పాత్రే. "విరహొత్కంఠిత" మాత్రం నీకొదిలేస్తున్నాను. " అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట..." http://maruvam.blogspot.com/2009/01/blog-post_22.html చదువు ఓ సారి. "ఆత్రేయ" గారి కలం విదిల్చిన ఆణిముత్యం వ్యాఖ్యల్లో దాక్కునివుంది [బోనస్ ;) ]. కొన్ని వేలసార్లు వాటిల్లో జీవించానేమో ఈ ఎనిమిదీ నాకు కొట్టిన పిండే :)
పెయింటింగ్ అదిరింది.....
రిప్లయితొలగించండికవిత బాగుంది.....
నేనేనా నే నేనానా అంటే
రిప్లయితొలగించండినువ్వేలే నువ్వేలే అని చెప్పాలా?
జీవితపు కవిత బాగోలేకపోవటమేమిటండీ! చిక్కుముళ్ళ మనల్ని బంధించేదే కదా జీవితం? కరిగిన కలలను తనివితీరా గుండెల్లో దాచుకోవాలన్నా, మదిలో రగిలే ఆలోచనలను ఖండించాలన్నా, కన్నీటి గోదారి సావేరి రాగం పాడాలన్నా ఒక్క పరాధీన ప్రేమ మూర్తి వల్లే అవుతుంది.
ఇక ఇంత భారీ డవిలాగులొద్దుకానీ :) మీకు పులిహోర కలిపితే మా ఆవిడకు చెప్తారా? ఇదెక్కడి న్యాయమండీ. మీతో పచ్చి. :)
ఉషా..
రిప్లయితొలగించండిజాలి్కనులు
జాజిపూవులు
జావళీలు
జాగారాలు ఇవి మాత్రమే చదువుకోండి. ఇందులో వెతలెక్కడ.. అంతా ఎవరికోసమే ఎదురుచూస్తున్నట్టుగా లేదూ :)
ఇకపోతే..తొండి నేను చేసానా? మీరే అంతా కలిసి తొండాట ఆదుతున్నారు. ఇందులో మా "హస్తం" ఏమీ లేదండోయ్. ఇక మిగతా వ్యాఖ్య మీరు భావన చూసుకోండి కానీ.. ఆ అష్ట నాయికలలో కొందరు నాయికీమణులంటే మాకు చాలా భయం సుమా :)
పద్మార్పిత గారూ,
రిప్లయితొలగించండిపైంటింగ్ అదిరిందా? మనిషి గుండె కరిగిందా?
అసలు విషయం, ఈ కవితలో మీ కవితా పోకడలు కనిపించాయి చూసారా? :)
సునీత గారూ, క్రిష్ణ గీతం జీవన గీతం అయితే చదవడానికి ఎంత బాగుంటుందో కదా? కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిబాగుందండీ....బొమ్మ ఇంకా ...ఆ ఎదురుచూపులు ఇంకా ....
రిప్లయితొలగించండిభ, రా.రే గారు మీ పేరు బాగుందండి
రిప్లయితొలగించండికవిత బాగుండి ,మంచి పద కూర్పులు
మీకు సాహిత్యం మీద మంచి పట్టున్నట్టుంది.
www.tholiadugu.blogspot.com
భా.రా.రే: చాలా చాలా ధన్య వాదాలు అంత చక్కని కవిత రాసినందుకు నా భావన ల కృష్ణ గీతాల బిర బిరల మీద. అష్ట నాయికల లో కొందరంటే భయమన్నా కొందరిని చూడాటమే భాగ్యమన్నా అన్ని రసాలు తప్పవు కదా జీవితం లో.
రిప్లయితొలగించండిఉష: నా వల్ల కవితలు రాయటం కుదరదు కాని ఒక్కొక్క వుత్తరం లో ఒక్కో భావాన్ని ఒక్కో నాయికాతత్వాన్ని చూపిస్తూ రాయగలనేమో చూడాలి.
చాలా బాగుంది భరారె గారు.
రిప్లయితొలగించండిచిన్నీ గారేరబ్బా అనుకుంటున్నా.. స్నేహితుల తో కేరింతలు కొట్టి వచ్చారన్నమాట.
రిప్లయితొలగించండికార్తీక్ గారూ ధన్యవాదాలండీ. సాహిత్యం మీద నాకు పట్టా? మీ కవితలు చదివాను. బాగున్నాయి
భావన గారూ, దీనికి అర్హురాలు మీరే.. మీ టపా చదివాక నాకు కలిగిన భావాలివి.కాబట్టి క్రెడిట్ గోస్ టు యు.
వేణూ గారూ, ధన్యవాదాలండీ.