30, నవంబర్ 2009, సోమవారం

అడ్డామీద కూలీలు





కళ్ళు తెరిస్తే ఇంటినిండా కళేబరాలు
కాలు కదపకుంటే గాలిలో ప్రాణాలు
కళ్ళు మూయాలంటే మాయని మమతలు
కాలు కదపాలంటే వెన్నులో భయం.

బండల పిండి చేసి
ఎముకల కుళ్ళపెట్టాలా!
మనసు చంపుకొని
గుండెను పిండి చేయాలా!

ఆరడుగుల మనిషికి
అరడుగు గొయ్యి తవ్వాలా?
కొవ్వెక్కిన ప్రజాపతినిధికి
జేజేలు కొట్టాలా?

అడ్డామీద అడ్డంగా నిలబడి
ముందున్న ’మనిషిని’ వెనక్కి నెట్టి
వెనక నక్కిన ’నక్కను’ డొక్కలో పొడిసి
ఈరోజుకు రోజుకూలీ సంపాదించాను
జనారణ్యంలో విజేతగ నిలిచాను.

కూటికి చచ్చే దరిద్రులు
సోమరిపోతుల్లా వున్నారు!
బ్రతకడానికి చేతకాని
చచ్చుదద్దమ్మలా వున్నారు!
చేతకాక నింపాదిగా
సమాజం మీద పడి ఏడుస్తున్నారు!

19 కామెంట్‌లు:

  1. భాస్కర్ గారు కవితలంటే భయపడి పారిపోయే నేను మీ ఈ పోస్టు చూసి చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట "వావ్"

    రిప్లయితొలగించండి
  2. భాస్కర్ గారూ, సమాజం గురించి ఒక కూలిని అడ్డుగా పెట్టుకొని ఎంత చిక్కని కవిత ను చెప్పారు. శ్రావ్య మాటే నాదీనూ...... వావ్..

    రిప్లయితొలగించండి
  3. హాజరు వేయండి. ఇది ఏనాటి గాథ, ముగింపు లేని కన్నిటి చరిత.

    రిప్లయితొలగించండి
  4. శ్రావ్య గారూ, అయితే ఇప్పటిదాకా పారిపోతున్నారా ? ఇకనుంచి పారిపోకుండా ఉండేట్టు జాగ్రత్త పడతానులెండి.:)
    కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    విమల మేడం మీకుకూడా అంతగా నచ్చిందా?

    ఉష హాజరు వేసేసాను.కామెంటినందుకు థ్యాంక్స్.

    మధురవాణీ గారూ కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

    పద్మార్పితా మీకు కూడా

    విజయమోహన్ గారూ, నిజమెప్పుడూ అంతే కదండీ.. ఆరోజు విజేత అప్పటిదాకా తన స్థితిని మరచి లోకులను దద్దమ్మలనే అనుకుంటాడు కదా.

    రిప్లయితొలగించండి
  5. సామాన్యుడి గుండె కోత, దిగువ తరగతి కూలి వాడూ
    ప్రతి క్షణం ఆపని పోరాటం తప్పదు కదా బతుకు బాట లో ముందుకు వెళ్ళ టానికి. బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. భాస్కర్ గారు సమాజం గురించి చాలా బాగా స్పందించారు .........

    "కూటికి చచ్చే దరిద్రులు
    సోమరిపోతుల్లా వున్నారు!
    బ్రతకడానికి చేతకాని
    చచ్చుదద్దమ్మలా వున్నారు!
    చేతకాక నింపాదిగా
    సమాజం మీద పడి ఏడుస్తున్నారు! "

    దీనిపై వరకు కవిత బాగుంది....
    ఈ ఆరు లైన్లు కచ్చితంగా పచ్చి తప్పు అని నే బావిస్తున్నాను....

    ఒక సారి మీరూ చూడండి.. మీరు చెప్పాలనుకున్న బావం ఒకటి... పదాలు వినిపించే బావం వేరొకటి.....
    దయచేసి దీనిబావం చెప్పండి ... మీకు తప్పే అనిపిస్తే సరిచేయండి ....
    ధన్య వాదాలు .........

    WWW.THOLIADUGU.BLOGSPOT.COM

    రిప్లయితొలగించండి
  7. హ హ హా , అవునా కార్తీక్, పోనీ లెండి. :) మరో రెండు మూడు సార్లు చదివి చూడండి.ఒక చిన్న ఉదాహరణ
    మీరు, మీ ప్రక్కనింటి అబ్బాయి ఇద్దరూ ఒకే కాలేజిలో చదివి ఒకేసారి ఉద్యోగ ప్రయత్నాలు మెదలెట్టారు.ఆ ప్రయత్నంలో మీరు విజేత అయ్యారు.మీ ప్రక్కనింటబ్బాయి మాత్రం అలాగే మరో ఏడాది వుద్యోగం లేక తిరుగుతున్నాడనుకో. అప్పుడు మీకు ప్రక్కింటబ్బాయి ఎలా కనిపిస్తాడు?

    రిప్లయితొలగించండి
  8. భాస్కర్ గారు మీరు మరోలా అనుకోవద్దు . నే వాదోపవాదాలకు దిగడం లేదు...
    నే చేసినా కామెంట్ ని మీరు స్పోర్టివ్ గా తీసుకుంటే బాగుండేది ఇలా హేళనగా కాకుండా....
    నే అడిగిన ఆ ఆరు లైన్ల
    బావం నాకు చెప్తారా ?
    ఎందుకంటే మీరు చెప్పిన ఉదాహరణలోనే ఆ పక్కింటి వ్యక్తికి ఉద్యోగం రాకపోవడానికి చాలా కారణాలున్డచ్చు.... అంత మాత్రాన అతను సోమరిపోతు కాదు కదా!

    కూటికి చచ్చే దరిద్రులు
    సోమరిపోతుల్లా వున్నారు!
    బ్రతకడానికి చేతకాని
    చచ్చుదద్దమ్మలా వున్నారు!
    చేతకాక నింపాదిగా
    సమాజం మీద పడి ఏడుస్తున్నారు!

    దీనిలోని ప్రతి వాక్యం పేద వర్గాన్ని కించపరిచేలా ఉంది ....

    ఈ తరహ వాక్యాలు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు అయితే సరిపోతాయి కాని భారతదేశానికి కాదు.....
    పని దొరకకచేయని వాడికి, పని ఉండి చేయని వాడికి చాల తేడా ఉంది ... ఆలోచించండి ...

    బ్రతకడం చేత కాకా పోవడానికి.. బ్రతుకు దెరువు లేక పోవడానికి కూడా చాలా తేడా ఉండి.... నింపాదిగా ఆలోచించండి ...


    www.tholiadugu.blogspot.com

    రిప్లయితొలగించండి
  9. కార్తీక్ మీరు పొరబడ్డారు.నాకు మిమ్మల్ని హేళన చేసే వుద్దేశ్యంతో వ్రాసిన కామెంట్ కాదది. ఉదాహరణ సులభంగా అర్థంకావడానికి మిమ్మల్ని, మీప్రక్క ఇంటివాళ్ళని తీసుకున్నాను అంతే.

    ఇక అడిగారు కాబట్టి విపులంగా చెప్తాను. ఈ కవిత అప్పటిదాకా సమాజం అంటే భయంతో ఏపనీ దొరక్క కృషించి పోయిన వ్యక్తి ఒఅని దొరకగానే పదిమందితో పంచుకొనే మాటలు. విజేతకు సహజంగా తన విజయాన్ని పది మందికి చెప్పి గొప్పవ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన, ఆకాంక్ష, అత్యుత్సాహం మెండుగా వుంటాయి. అందుకని ఇద్దరు వ్యక్తులు ( విజేతలు ) కలిసినప్పుడు మూడోవ్యక్తి గురించి మాట్లాడుకుంటూ తను పడిన కష్టాలను తను నడిచిన మార్గాన్ని హైలైట్ చేస్తూ ఎదుట వ్యక్తిని హేళనా మిళిత మాటలతో చిన్నచూపు చూస్తారు. ఒకవేళ మీకిది అనుభవం కాకపోతే నేను చూసిన సమాజం వేరు, మీరు చూసిన సమాజం వేరు.

    రిప్లయితొలగించండి
  10. సో వాళ్ళమధ్య సంభాషణ

    "వాడా, వాడికి నేనెన్నిసార్లు చెప్పానో వింటే కదా? సమాజమన్నాక నానా రకాల వ్యక్తులు. చూసీ చూడనట్టు పోవాలికానీ ఇలా మొండికేస్తే ఎలా? "

    "వాడికి నేను చెప్పిచూసాను. ఆ మీడియేటర్ కి పదో పరకో డబ్బులిచ్చి పని చేపించుకోరా అని. మూర్ఖుడు లాగున్నాడు. నేను చూడు ఎంత సులభంగా పని చేపించుకొన్నానో"

    " వాడికి తినడానికి తిండి లేకపోయినా పొగురు మాత్రం తగ్గలేదు. నాలాగా రేయింబవళ్ళు కష్టపడి పని చేయకపోతే ప్రమోషన్ ఎలా వస్తుంది?"

    "వాడుత్త వేష్ట్ గాడు. ఎవరిదగ్గర ఎలామాట్లాడాలో ఎన్నిసార్లు చెప్పి చూసినా నేనింతే ముక్కుసూటిగా మాట్లాడుతా నంటే ఎలా కుదురుతుంది?"

    " పక్కింటి పంకజాన్ని చూడు, నా మాట వినబట్టి రాణిలాగా బతుకుతుంది (ఏంచేసైనా)"

    ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. మీకు ఆ ఆరులైన్ల భావం అర్థమైంది అనుకుంటున్నా.. ఇంకా కావాలంటే అడగండి ఆనందంగా మాట్లాడుకుందాము.

    రిప్లయితొలగించండి
  11. ఇక మీ వ్యాఖ్యలో మిగిలినవి

    >>ఈ తరహ వాక్యాలు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు అయితే సరిపోతాయి కాని భారతదేశానికి కాదు.....
    మీరు చాలా పొరబడ్డారు. ఇవి భారతదేశానికి బాగా వర్తిస్తాయి. ఎందుకంటే ఇద్దరు విజేతలకు తక్కువ స్థాయి ( డబ్బులో ) లో నున్న వ్యక్తిని చూస్తే చిన్నచూపు చాలా ఎక్కువ. అమెరికాలో వీళ్ళు ఏపని చేసినా చాలా మటుకు చిత్తసుద్ధితో చేస్తారు.అలాగే ప్యూన్ కదా అన్న చిన్నచూపుతో చూసే వ్యక్తులు నాకింత వరకు కనిపించలేదు. బ్రిటన్ తో నాకు అనుబంధం చాలా తక్కువ.

    >>పని దొరకకచేయని వాడికి, పని ఉండి చేయని వాడికి చాల తేడా ఉంది ... ఆలోచించండి ...
    బ్రతకడం చేత కాకా పోవడానికి.. బ్రతుకు దెరువు లేక పోవడానికి కూడా చాలా తేడా ఉండి.... నింపాదిగా ఆలోచించండి ...

    ఈ వాక్యాలతో నేనేమీ విబేధించటం లేదు. కానీ నాకవితను మీరే వీటికి అనువదించుకుంటున్నారేమో చూడండి. పైన చెప్పినట్టు మనిషి విజేతగా మారిన తరువాత తను చేసిన తప్పుడు పనులను కూడా మంచి పనులుగా చిత్రీకరిస్తూ తనను తాను ఉన్నతుడుగా చూపించుకోవడానికి వేసుకున్న ముసుగు వ్యక్తి మాటలవి.

    ఇక చివరిగా,మీకు నేను వేరే బ్లాగుల్లో వ్రాసే వ్యాఖ్యలు చూసి హేళన చేస్తున్నాని అభిప్రాయం ఏర్పరచుకోకండి. ఆ వ్యాఖ్యలు వారితో నాకున్న చనువు లేదా ఆత్మీయత లేదా వ్యక్తిగత స్నేహం ద్వారా వ్రాసేవి. అవి చూసి పొరబడకండి :)

    రిప్లయితొలగించండి
  12. వ్యాఖ్య పెద్దది కావడంతో ౩ గా విడగొట్టాల్సివచ్చింది. కలిపి చదువుకోండి.

    రిప్లయితొలగించండి
  13. భాస్కర్ గారు తోటి వారితో మిత్రులతో మీ చనువు నాకు అర్థం అయ్యింది.... నేను హేళన అన్నది ఆ ఉదాహరణ చెప్పినండుకుకాడు.. మీరు ఒక చిరునవ్వుతో చెప్పుంటే నే అలా అనేవాన్ని కను కాని మీరు హ హ హ హ అని టైపు చేసారు కదా !

    ఏదేమైనా మీరు చెప్పిన బావం నాకు అర్థం అయ్యింది కాని నే చెప్పేదేమిటంటే ఆ చివరి లైన్స్ మీరు చెప్పినట్టు ఆ బావం పలికిన్చడం లేదు..

    "కూటికి చచ్చే దరిద్రులు
    సోమరిపోతుల్లా వున్నారు"!
    =
    "కూటికి చచ్చే దరిద్రులు,ఆత్మాభిమానం చంపుకోలేక ,
    సోమరిపోతుల్లా వున్నారు"!
    అని మీ మనసులొఅనుకున్తున్నరు కాని ఇక్కడ మీరు రాసినది ఆ భావం పలికిన్చడంలేదు... ... అక్కడ ఉన్న సబ్జెక్టు ఈ మాటలు చెప్తున్నట్టు కూడా అనిపించడంలేదు,... ఇది భాస్కర్ గారే చెప్తున్నారు అన్నట్టుంది ....

    ఏదేమైనా మీరు ఒక మంచి విషయంపై స్పందించారు ధన్యవాదాలు... :)

    రిప్లయితొలగించండి
  14. కార్తీక్ ముందుగా ఓ వంద స్మైలీస్ :). ఈసారి నో :-) అంటే హ హహా కాదన్న మాట. :)

    ఇక పోతే
    "కూటికి చచ్చే దరిద్రులు
    సోమరిపోతుల్లా వున్నారు"

    కవిత మొత్తంగా చదివినప్పుడు పైవాక్యాలు మీకు ఎలా అర్థమైందో మీ మాటల్లో వ్రాస్తే వినాలని కోరిక. కారణం ఈ సారి కవిత వ్రాసేటప్పుడు పాఠకులను దృష్టిలో పెట్టుకొని వ్రాయడానికి వీలుగా వుంటదనే వుద్దేశ్యమే సుమా.

    రిప్లయితొలగించండి

Comment Form