16, నవంబర్ 2009, సోమవారం

తెలుగు సంధులు రామ+ఆంజనేయులు=రామాంజనేయులు


రామ+ఆంజనేయులు=రామాంజనేయులు



హారంలో మరో చిన్ని అడుగు. ప్రయోగాత్మకంగా సంధుల ఆల్ఫావెర్షన్ విడుదల.

ముందుమాట



అయ్యవార్ల కి, అమ్మవార్లకి ప్రస్తుతానికి ఇదో సరదా పేజీ :) ఇక్కడ మీకు తీరిక వున్న సమయాల్లో ఆడుకోవడానికి సంధి ప్రయోగాన్ని, ప్రయోగంగా నే మొదలుపెట్టాము. ప్రస్తుతానికి ఇది ఇంకా కళ్ళు కూడా తెరిచి లోకాన్ని చూడలేని చిన్నారి రూపమే. ఈ పాప బోర్లపడడానికే ఇంకా చాలా సమయం పట్టవచ్చు. ఇక దోగాడి, తప్పటడుగులు వేసి నడచి, పరుగెత్తాలంటే చాలా చాలా చాలా సమయం పడుతుంది. అప్పటి దాకా ఈ బుల్లి పాపతో ఆడుకొనండి.

ఇక్కడ ప్రస్తుతానికి ఈ క్రింది సంధులను గుర్తించడం జరుగుతుంది.


తెలుగు సంధులు


అకార సంధి

ఉకార సంధి


సంస్కృత సంధులు



సవర్ణదీర్ఘ సంధి

గుణ సంధి

వృద్ధి సంధి

యణాదేశ సంధి




ఇక మీరనుకున్న రెండు పదాలను విడివిడిగాకానీ + గుర్తునుపయోగించికానీ తెలుగు లో టైపుచేసి ఛాలెంజ్ అనే బటన్ ను నొక్కండి. ఈ ఉపకరణి తనకు తోచింది చెప్తుంది. ఎలాగంటే మనము తెలుగయ్యవారు ప్రశ్నఅడిగితే చెప్పినట్టు ;౦).

సరైనదయితే మరో సారి ఛాలెంజ్ చేయండి.
తప్పయితే నెత్తిమీద ఓ మొట్టికాయ వేసి సరైన సంధి పదాన్ని, సంధిని తెలుపండి.


ఉదాహరణగా హారం టెక్ష్ట్ బాక్స్ ఈ క్రింద ఇచ్చిన ఏరూపాన్నైనా స్వీకరిస్తుంది.


రామ ఆంజనేయులు

రామ+ఆంజనేయులు


ఇక మిగిలిన సంధి సూత్రాలను తెలియచేసి ఈ ప్రయత్నానికి సహాయము చేయగోరువారు సంధి నియమాలతో పాటి కొన్ని ఉదాహరణలను, సంధిపదాల ప్రత్యేక లక్షణాలతో హారం వారికి ఇ-మెయిల్ చేస్తే మిక్కిలి సంతోషిస్తాము.
మా ఇ-మెయిల్
support@haaram.com




సంధి రూపం మీకు తప్పుగా తోచినట్లైతే దయచేసి సరైన పదాన్ని హారం వారికి తెలిపి సహకరించి, తెలుగు భాషా వ్యాప్తికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తూ

మీ హారం.

43 కామెంట్‌లు:

  1. మీ ఆశయం ఈ చిరు ప్రయత్నం స్థాయి నుండి బృహత్పథకం గా రూపుచెందాలని ఆకాంక్షిస్తూ.. మీ నేస్తం.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది+ఈ సంధుల+ఆట
    నచ్చినది+ఈ మ+ఈ ముందు+మాట

    రిప్లయితొలగించండి
  3. ఈ ప్రయత్నం ఉన్నతి+ఉన్నత=ఉన్నతోన్నత
    శిఖరము+అగ్రము=శిఖరాగ్రము లను చేరాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  4. @RK : మొత్తానికి ముందొక "అ" చేర్చి కామెంట్ ను సంధి అప్లికేషన్ లాగా అర్థం కాకుండా చేసావు. ఇంతకీ అమంచి నా లేక మంచి నా?

    *******************
    @కవిలాకల గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీబ్లాగు చూసాను బాగుంది. వీలుచూసుకొని అన్నీ చదవాలి అనిపించింది. చదువుతాను
    *******************
    ఉష నుంచి మరువంఉష గా రూపాంతరం చెంది తన కోరిక వెలిబుచ్చిన నేస్తానికి ధన్యవాదాలు
    *******************
    వెన్నెలా, మరీ ఇన్ని + లను తట్టుకోలేదండీ , ఇంకా చిన్న పాపే అది.

    *******************

    పద్మార్పిత ఉన్నతి+ఉన్నత=ఉన్నతోన్నత అని ఉపకరణిలో తప్పును తెలియచేసినందుకు కృతజ్ఞతలు. ఇక శిఖరము+అగ్రము=శిఖరాగ్రము? ఇది ఏసంధి?



    మొదటి బగ్ గా యణాదేశ సంధిలో ఏత్వము,ఓత్వము లోపం కనిపించింది. సరిచేస్తాను. అలాగే ఉకార సంధి అన్నిసార్లూ పనిచేస్తున్నట్టు అనిపించటంలేదు.

    రిప్లయితొలగించండి
  5. హిహి.. టైపాటు

    మంచి ప్రయత్నం! :)

    రిప్లయితొలగించండి
  6. ఇంతకూ మీ అప్లికేషన్ ప్రజాస్వామికమా కాదా?

    ప్రజాస్వామికం అయితే క్రింది సంధిని గుర్తు పట్టాలి.

    "అధిక+అరి = అధికారి" (అరి=శత్రువు) ;)

    రిప్లయితొలగించండి
  7. hi hi hI RK,మా అప్లికేషన్ ఇప్పుడేమీ మాట్లాడలేదు. ఆరోతరగతి పిల్లాడిలా ఏది తోస్తే అది చెప్తుందన్నమాట. మీ అందరూ అడిగిన ప్రశ్నలు వినీ వినీ ఆ తరువాత కొద్ది కొద్దిగా నేర్చుకుంటుంది. కాకపోతే పాఠకులు పదాలతో పాటి సరైన పదం సంధి కూడా సుచిస్తే బ్రహ్మాండం.

    అవును ఆర్క్ మనలో మనమాట, ఇంతకీ ఇది సంధేనా? మా అప్లికేషనేమో సవర్ణదీర్ఘసంధి అనిచెప్తుంది. నాకేమో సంధుల్లో నిబంధనలు తెలియవు. ఇప్పుడెలా మరీ. ఎవరైనా ఒక పెద్ద తెలుగయ్యవారు కావాలే :)

    రిప్లయితొలగించండి
  8. కాదండీ, సంధి కాదు. ఇలాంటి కొన్ని పదాలను (సూత్రం ప్రకారం విడదీయగలిగినా, విడదీయకూడని, తీస్తే అర్థం లేని పదాలను) గుర్తించి వాటిని exceptions గా మార్క్ చెయ్యాలనుకుంటా :)

    తాడేపల్లి గారు సహాయం చేయలరు.

    రిప్లయితొలగించండి
  9. ఓ ఇంకేం అయితే, ఎక్కడో ఒక చోట సంధుల సూత్రాలను ఇలాంటి వికృత పదాలను ;) ( I hate these words. They are enm's to my app )సమకూర్చుకుందాం మరి. మీరే ఓ చిన్న గ్రూప్ తయారు చేయకూడదా?

    రిప్లయితొలగించండి
  10. రూటు మార్చారు, బాట వదిలారు ఆ వారా పాత మిత్రులకి కూడా సెలవిప్పించారేమోనని మళ్ళీ నా బ్లాగుతో సహా నా పేరు పరిచయం చేసుకున్నాను ఆచార్యా భా.రా.రె.

    ఇందులో సంధులు సమాసాలు లేవు సుమీ! ;)

    రిప్లయితొలగించండి
  11. ఏమిటో ఈ సంధుల గోల .... నలభై ఏళ్ళుగా పిల్లలకు సంధులు నేర్పుతున్న నాకు ఇదంతా అయోమయంగా ఉంది.
    ఉన్నతి + ఉన్నత = ఉన్నత్యున్నత - అని యణాదేశసంధి అవుతుంది కదా ... అతి + ఉత్సాహం = అత్యుత్సాహం లాగా.
    శిఖరము + అగ్రము = శిఖరమగ్రము అని ఉకారసంధి అవుతుంది కాని శిఖరాగ్రము ఎలా అవుతుంది? ( శిఖర + అగ్రము = శిఖరాగ్రము - సవర్ణదీర్ఘసంధి )
    అధికారము గలవాడు అధికారి. అయినా చమత్కారంగా అధిక + అరి అని సవర్ణదీర్ఘసంధి చేయడం బాగుంది.
    మొత్తానికి 'కావ్సెప్ట్' అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  12. కంది శంకరయ్య గారూ, సరైన సమయానికి వ్యాఖ్యవ్రాసి గురువెప్పుడూ శిష్యుల పక్షపాతే అని నిరూపించుకున్నారు. ఇక మీరన్న సంధులు సూత్రప్రకారం అప్లికేషన్ అయితే యణాదేశసంధి అని చెప్తుంది. కానీ ఇందులో నాకు పరిజ్ఞానం తక్కువ.సంధిచేయకూడని పదాలను గుర్తించడం, సరైన సంధి అవునా కాదా అని చెప్పేంత శక్తి నాకు లేదు. కావున మీలాంటి వారే సహాయ పడగలరు. ఎప్పుడో 10 వతరగతిలో చదువుకున్న సంధులను గుర్తుకు తెచ్చుకోవాలన్నా గుర్తురావటంలేదు.

    ఈ అప్లికేషన్ ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి మీ లాంటి పండితులకు చాలా అయోమయంగానూ, అగమ్యగోచరంగానూ కనిపించడం సహజం. ప్రస్తుతానికిది మీ విద్యార్థికి మొదట ఎలా సంధిప్రయోగాలను నేర్పిస్తారో అలాంటి స్థితిలోనే వుంది. కానీ పెద్దలు సహాయసహకారాలందిస్తే తప్పకుండా ఒక మంచి ఉపకరణిగా తీర్చిదిద్దగలను. మీ అభిప్రాయం కొరకు వేచి చూస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  13. యణాదేశ సంధిలో నున్న బగ్ ను సరిచేయబడింది. ఇంకెక్కడన్నా తన్నుతుందేమో తెలియదు :)

    రిప్లయితొలగించండి
  14. ద్విరుక్త టకార సంధి;
    కరు చిరు కడు నిడు నడు సబ్ధలకు ర, డ ల అచ్చు పరంబైనప్పుడు ద్విరుక్త టకారంబగు..
    వుదాహరణలు గుర్తు కు రావాటం లేదు మాస్టారు.. చూసి చెపుతాను.
    అవును సమాసాలు ఏవి? అలంకారాలేవి.. మీ చిన్ని పాప బోర్లా పడే లోపు అలంకారాలు చేయించరూ..

    రిప్లయితొలగించండి
  15. భావన గారూ,
    మీరిచ్చిన ద్విరుక్తటకార సంధి సూత్రంలో కొన్ని లోపాలున్నాయి.
    కుఱు చిఱు కడు నడు నిడు శబ్దంబుల ఱడల కచ్చు పరంబగునపుడు ద్విరుక్తటకారంబగు.
    ఉదాహరణలు -
    కుఱు + ఉసురు = కుట్టుసురు
    చిఱు + ఎలుక = చిట్టెలుక
    కడు + ఎదుట = కట్టెదుట
    నడు + ఇల్లు = నట్టిల్లు
    నిడు + ఊరుపు = నిట్టూరుపు.

    రిప్లయితొలగించండి
  16. ఇంకొంచం తీరిగ్గా కామెంటుతాను.

    రిప్లయితొలగించండి
  17. ఉషా గారూ రూటుమార్చాను కానీ పాతమిత్రులని కాదండీ. మీ పరిచయ ప్రవచనాలకు నా సమాధానం చదివారు కదా :)

    భావన మేడం గారూ ధన్యవాదాలండీ :)

    కంది శంకరయ్య గారూ, మీ సవరణ అమూల్యమైనది. ఈ వారాంతానికి ద్విరుక్తటకార సంధిని చేరుస్తాను.

    సునీత గారూ త్వరగా తీరికచేసుకోండి మరి

    రిప్లయితొలగించండి
  18. చాలా చక్కటి ప్రయత్నం. అభినందనలు.
    సంస్కృత సంధుల పేరులను చక్కగా తెలుగులో చూపిస్తోంది.
    తెలుగు సంధులను మటుకు ఆంగ్లములో చూపిస్తోంది. సరిచేయగలరు.
    ఉదా:
    మేన+అల్లుడు
    మేనల్లుడు.....akaarasandhi
    మనము+ఉంటిమి
    మనముంటిమి.....ukaarasandhi

    రిప్లయితొలగించండి
  19. కంది శంకరయ్యగారూ,
    భావన గారూ ద్విరుక్తటకార సంధిని చేర్చాను.

    ఫణి గారూ మీ సూచనకు ధన్యవాదాలు. మార్చాను చూడండి.

    రిప్లయితొలగించండి
  20. ఈ applicationకి ఏది తెలుగు పదమో. ఏది సంస్కృత పదమో గుర్తించటం కష్టమేమో. ఉదాహరణకు..
    కాదు + అండి = కాదండి (ఉకార సంధి) కావలె.
    కాని ఈ tool "కాద్వండి--యణాదేశ సంధి" అని చూపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  21. అంతట + అమరెను = అంతటమరెను ( అకార సంధి)
    కాని ఈ tool "అంతటామరెను--సవర్ణదీర్ఘ్హ సంధి" చూపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  22. సత్యనారాయణ గారు, తప్పు చూపినందుకు ధన్యవాదాలు. ఇలాంటిసందర్భాలలో అకార సంధిని ఏఏ పదముల మధ్య వాడవచ్చో ఏదైనా పట్టికను ఇవ్వగలరా? అంతట అనేపదానికి ఎక్కడ సంధిజరిగినా తెలుగు సంధి అవుతుందా? మీసమాధానానికి ముందుగా కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  23. గురువు గారు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏది తెలుగు పదమో. ఏది సంస్కృత పదమో గుర్తించటం కష్టమేమో!

    నేను ప్రయత్నించిన కొన్ని సంస్కృత సంధులు చక్కగా చెప్పింది.
    తెలుగు పదాలుతో కొంత ఇబ్బంది పడుతోంది.
    వాడు + కొట్టె ---- > వాడొట్టె.....ఉకార సంధి అని అంటోంది.
    కాని అది వాడుకొట్టె లేదా వాడుగొట్టె ... ఇంకా పెట్టని గసడదవాదేశ సంధి అవ్వాలి
    అలాగే, ఏమి+ఏమి ----> ఏమ మి--యణాదేశ సంధి అని అంటోంది.
    అది ఏమేమి అవ్వాలి. ....తెలుగు సంధి, కాని ఏదో కొంచెం అనుమానంగా ఉంది.

    ఏదిఏమైనా నాకు ఈ అప్లికేషనుతో ఆడుకోవడం భలే సరదాగా ఉంది.
    ఇంతకీ applicationను తెలుగులో ఏమంటారో..

    రిప్లయితొలగించండి
  24. ఫణిగారూ :)
    అన్ని సంధులు పూర్తిఅయ్యేదాకా ఇలాంటి తిప్పలు తప్పవు ;). ఇది ఓరకమైన State machine workflow లా పనిచేస్తుంది. మధ్యలో సంధుల రూల్స్ లేక ఏదో తనకు తోచింది చెప్పి మొట్టికాయల మీద మొట్టికాయలు తింటుంది. చిన్నప్పుడు నేను సంధులు నేర్చుక్న్నట్లు :).

    అన్నీ సంధుల రూల్స్ వచ్చాక ఈ తప్పులు తగ్గుతాయి. కానీ పూర్తి సరైన సమాచారానికి పదములు తెలుగుపదాలా లేక సంస్కృత పదాలా అని కచ్చితంగా తెలియాలి. అవి ఎలాతెలుసుకోవాలో తెలియటం లేదు. వాటితోపాటి మిగిలిన వ్యాకరణం కూడా ముఖ్యము.అబ్బో ఎందుకులే....

    మీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలకు ( తప్పులు ఎత్తిచూపడం చాలా ముఖ్యం కదా) హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక Application ను "అప్లికేషన్" అంటారు. ;)

    రిప్లయితొలగించండి
  25. టుగాగమ సంధిని చేర్చడమైనది.( కర్మధారయ పదములలో "ఉ"త్తునకు అచ్చు చేరి "టు"గాగమంబగు )

    ఫణిగారూ, ఏమి+ఏమి = ఏమేమి ఇకార సంధి అవుతుందేమో, నాకు తెలియదుకానీ..సూత్రప్రకారం ఇది ఇకారసంధిచేర్చినప్పుడు అందులో కనిపించేటట్టుంది.

    రిప్లయితొలగించండి
  26. మీ అప్లికేషను బాగుందండి!

    ఇప్పుడు ప్రధాన సమస్య తెలుగు సంస్కృత పదాల తేడా గుర్తించడమే అనుకుంటాను.

    ఇది కాక టుగాగమసంధి ఉకారసంధి మధ్య తేడా ఎలా గుర్తిస్తున్నారు? నేను మదము+ఏనుగు అని ఇస్తే మదమేనుగు అని ఉకారసంధి చేసింది. ఇక్కడ టుగాగమం వచ్చి మదపుటేనుగు అవ్వాలి. ఇది గుర్తించడం అంత సులువు కాదనుకుంటాను. ఇచ్చినది కర్మధారయ సమాసం అని గుర్తించాలి!

    కాస్త సులువుగా గుర్తించే సంధులు ముందు పెట్టండి. త్రికసంధి సులువే - ఆ,ఈ,ఏ లకి అసంయుక్త హల్లు పరమైతే దానికి ద్విత్వం వస్తుంది.
    అనునాసిక సంధి - వర్గాక్షరముల పొల్లుకు న, మలు పరమయినప్పుడు, వర్గాక్షరానికి బదులు ఆ వర్గ అనునాసికం వస్తుంది. (వాక్+మయము = వాఙ్మయము, తత్+మయము = తన్మయము...)

    తెలుగు సంస్కృత పదాలని గుర్తించడానికి నాకు కనిపిస్తున్న ఒక సాధనం ఆన్ లైను బ్రౌణ్యాన్ని ఉపయోగించడం. మీరెలాగూ javascript కాక, సర్వరులో ప్రొగ్రాము రాసినట్టున్నారు కాబట్టి, దాని ద్వారా ఈ సైటుకి సరైన search urlతో request పంపి, వచ్చిన ఫలితాన్ని parse చెయ్యగలిస్తే, అందులో మనం వెతికిన పదం తెలుగా సంస్కృతమా అన్న సమాచారం ఉంటుంది. ఇది ఎంతవరకూ వీలవుతుందో ప్రయత్నిస్తే కాని తెలియదు!

    రిప్లయితొలగించండి
  27. వామ్మో !నా పదోతరగతి తెలుగు క్లాసు లోకి వచ్చినట్లుంది
    నేనుండను బాబోయ్ పారిపోతున్న ..క్లాసు అయ్యాక వస్తా -:)

    రిప్లయితొలగించండి
  28. భా.రా.రె గారూ

    ఏమి+ఏమి = ఏమేమి
    ఏ సంధి అనేది నాకు మూడిట మధ్య అనుమానం వచ్చింది. ఇంక లాభం లేదని గూగులమ్మను అడిగితే వికీ వారు ఆమ్రేడిత సంధి అని అన్నారు అని చెప్పింది. "అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు"
    ఏమో మరి నాకు అర్ధం కావటం లేదు.

    మీరు అన్నట్లు అన్ని సంధుల నియమాలు చేర్చే వరకు వేచి చూడాలి. ఆప్పటికీ పదం యొక్క భాష నిర్ధారణకు నిఘంటువు సహాయం అవసరమైతే, ఒక పదం యొక్క అనేక రూపాలను గుర్తించకలదా అనేది మరో ప్రశ్న!

    మర్చిపోయాను, application ను ఆంధ్రికరించినందుకు మీకు అనేక ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  29. భాస్కర రామి రెడ్డి గారు,
    ఇది ఏవో కొన్ని పదాల పట్టికతో తీరే సమస్య కాదు. కామేశ్వరరావు గారు చెప్పినట్టు, ఖచ్చితముగా నిఘంటువు సహాయము కోరవలసిందే.

    రిప్లయితొలగించండి
  30. @కామేశ్వరరావు గారు, మీ సూచనకు ధన్యవాదాలు. ఆన్ లైన్ బ్రౌణ్యాన్ని ఇప్పుడే చూసానండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. తెలుగు అంతా (including junk html ) తో కలిపినా ఓ 15MB లు కూడా రాలేదండి. ఒక్కసారిగా ఇంతేనా తెలుగు అనిపించింది కూడా :)
    కానీ అది చూసి కొంచెం నిరాశ కూడా కలిగింది. పదాలకు ఏదో మొక్కుబడిగా n /snkt/tel / వ్రాసారు కానీ, సంధి ప్రయోగానికి పెద్దగా పనికి వచ్చేట్టులేదు.

    నాకైతే విశేషణాలు కానీ విశేషాలు కానీ గుర్తించినట్టు కనిపించలేదు. ఇంకా తత్భవమా, దేశ్యమా ఇలాంటి వివరాలేవీలేవు. ఒక పెద్ద యూనివర్శిటి మరొక ఆర్గనైజేషన్ కలిసి ఒక ఇద్దరు వ్యక్తులు విడివిడిగా చేయగలిగింది చేసినట్టు అనిపించింది. తక్కువచేసి చెప్పటం కాదు కానీ ఒక పూర్తిస్థాయి వర్డ్ నెట్ లాంటిదయితే బాగుండేది.అయినా పరవాలేదు. వున్నవాటిలో అత్యుత్తమమైనదని చెప్పుకోవచ్చు.

    ఇక టుగాగమ సంధి ప్రయోగం: ఇది నాకు ఎప్పటినుంచో ప్రశ్న. మదపు+ఏనుగు = మదపుటేనుగు అవుతుందా లేక మదము+ఏనుగు=మదపుటేనుగు అవుతుందా?

    రిప్లయితొలగించండి
  31. @చిన్నీ మిమ్మల్ని పారిపోకుండా నేనడ్డుకొని మీకు సంధులు, సమాసాలు వచ్చేదాకా తెలుగు అయ్యవారి చేత చెప్పిస్తాగా :)

    @ఫణిగారూ... పదాలన్నీ తెలిసినా అంత వీజీ కాదు కదా :). కానీ నాప్రయోగానికి అసలు సంధిపేరు అక్కరలేదు. పదము ఫార్మ్ అయితే చాలు. కానీ పనిలో పనిగా సంధిని కూడా తగిలించి ఇరుక్కుంటున్నట్టుంది .అయినా ఇబ్బంది లేదులేండి సిస్ట్తమ్ ని ట్రైన్ చేసి , చేసి, చే..........సీ.. ఎప్పటికైనా 99.999% చేరకపోతానా.

    @సత్యనారాయణ గారూ మీ సూచనకి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  32. బ్రౌణ్యం సమగ్రమైనది కాదు కాని ఒక ఎనభై ఎనభై అయిదు శాతం వరకూ పనిచేస్తుందని నా అనుభవం. సంధులకి తత్సమ, తద్భవ, దేశ్య విభజన అవసరం లేదనుకుంటాను. తెలుగా (తద్భవ, దేశ్యాలు), సంస్కృతమా (తత్సమం) అన్న విభజన చాలు. అయినా ఈ విభాగం కూడా బ్రౌణ్యంలో ఉంది. తత్సమాలని "Skt." అని, తద్భవాలని "from Skt." అని, దేశ్యాలని "Tel." అని గుర్తించారు. అలాగే నామవాచకాలని "n.", సర్వనామాలని "pron.", విశేషణాలని "adj.", క్రియలని "v.", క్రియావిశేషణాలని "adv." అని గుర్తించారు.

    మదపుటేనుగ విషయానికి వస్తే ఇక్కడ నిజానికి రెండు సంధులు జరుగుతున్నాయి. ఒకటి పుంప్వాదేశ సంధి, మరొకటి టుగాగమ సంధి. కర్మధారయము మీది "ము"వర్ణానికి "పు", "ంపు"లగు అన్న సూత్రం ప్రకారం ఇక్కడ "ము"కారం పోయి "పు" వచ్చింది. అలాగే అచ్చు పరమైనది కాబట్టి "టు" వచ్చింది.

    సులువుగా గుర్తించ గలిగే సంధులలో మరి రెండు జస్త్వ, శ్చుత్వ సంధులు.

    రిప్లయితొలగించండి
  33. మంచి ప్రయత్నం.

    రామ+ఆలయము

    సంధి చేసిన తరువాత పదం. రామాలయము--సవర్ణదీర్ఘ్హ సంధి

    రిప్లయితొలగించండి
  34. కామేశ్వర రావు గారూ, మీ సలహా కు ధన్యవాదాలు. ముందు సంధి రూల్స్ అన్నీ అయిన తరువాత నిఘంటువు సహాయం చూద్దామండి. ప్రస్తుతానికి ఋ,ౠ,ఖ,ఘ,ఙ,ఛ,ఝ,ఞ,ఠ,ఢ,థ,ఫ,భ,శ,ష అక్షరములతో కూడినవి ( వాని గుణింతములతో సహా) సంస్కృత పదములుగా గుర్తిస్తున్నాను. తప్పుఅయినా కావచ్చు కానీ మొదలంటూ ఏదో ఒకటి అని ఇలా లాగించేస్తున్నాను :).

    ఇకపోతే వృద్ధి సంధి సూత్రము వ్రాయగలరా ఎవరైనా? దశ+ఋణము=దశార్ణము, ప్ర+ఊఢ=ప్రౌఢ ఇవి వృద్ధి సంధులౌతాయా?

    అనునాసిక/జస్త్వ సంధులను కలిపాను.

    సూర్యుడు గారూ ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  35. అలాక్కానీయండి :-) ద్విత్వాలు కాని సంయుక్తాక్షరాలు వచ్చినా అవి సంస్కృత పదాలే అవుతాయి. సులువే అయితే అది కూడా చేర్చుకోండి.

    జస్త్వసంధిలో చిన్న తప్పు ఉంది. రెండో పదం మొదటి అక్షరం వర్గ తృతీయ, చతుర్థ అక్షరాలు కాని, హ,య,వ,రలు కాని, అచ్చులు కాని పరమైతేనే ఈ సంధి సూత్రం వర్తిస్తుంది. మిగతా ఏ అక్షరాలు పరమైనా ఈ సూత్రం వర్తించదు. మీరీ నియమాన్ని పరీక్షిస్తున్నట్టు లేదు. ఉదాహరణకి ఈ క్రింది సందర్భాలలో జస్త్వసంధి రాదు:

    చిత్+నీరేజ
    శరత్+చంద్ర
    మహత్+శక్తి
    వాక్+శక్తి
    బృహత్+కార్యము

    వృద్ధిసంధి సరిగానే ఉన్నట్టుందే, మళ్ళీ అనుమానం ఎందుకు వచ్చింది? అకారానికి ఏ, ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ, ఔలు పరమైనప్పుడు ఔకారము వస్తుంది (ఇది కూడా సంస్కృత సంధే). "ప్రౌఢ" పదంలో వృద్ధి సంధి జరగలేదు. ఈ పదం వ్యుత్త్పత్తి గురించి ఆసక్తికరమైన ఊహలున్నాయి.

    రిప్లయితొలగించండి
  36. కామేశ్వర రావు గారూ, మీ ప్రోత్సాహానికి, మీ విలువైన సలహాలకు నిజంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇవి మనసులోని మాటలు.

    ఇక జస్త్వ సంధి విషయానికి వస్తే నాకు ఆ సూత్రము సరిగా అర్థము కాక వచ్చిన తిప్పలవి. కాబట్టి మరోమారు ఈ ప్రశ్న.

    చిత్+నీరేజ ను తీసుకుంటే
    ౧) రెండవపదము అచ్చుతోనైనా మొదలవ్వాలి
    ౨) లేదా హ,య,వ,ర లతోనైనా మొదలవ్వాలి
    ౩) లేదా పైన చిత్ అనేది త వర్గమునకు సంబంధించినది కాబట్టి ద,ధ లతో మొదలవ్వాలి (త వర్గ మూడు,నాలుగు అక్షరాలు )

    అని అనుకోవాలా లేక రెండవపదము, క,చ,ట,త,ప వర్గములలోని మూడు నాలుగు అక్షరాలైన గ,ఘ,జ,ఝ,డ,ఢ,ద,ధ,బ,భ లలో ఏది వున్నా సంధి జరుగుతుందా?

    ఉదాహరణకు రాట్+గణము= రాడ్గణము అనడం తప్పు అవుతుందా ( ట వర్గములో గ లేదు కాబట్టి ).


    వృద్ధి సంధి సూత్రము సరిగానేవుంది కానీ పైన చెప్పైన దశ+ఋణము=దశార్ణము వృద్ధిసంధి అని చదివాను. అందుకు ఈ తికమక.

    >>ద్విత్వాలు కాని సంయుక్తాక్షరాలు వచ్చినా అవి సంస్కృత పదాలే అవుతాయి. సులువే అయితే అది కూడా చేర్చుకోండి

    తప్పకుండా. కోడ్ రిఫాక్టరింగ్ పనిలో వున్నాను :) పనిలోపనిగా ఈ నెలాఖరుకు కలుపుతాను.

    రిప్లయితొలగించండి
  37. జస్త్వ సంధికి రెండవ పదం మొదట్లో అదే (మొదటి పదం చివరి పొల్లు తాలూకు) వర్గానికి చెందిన అక్షరాలే ఉండనక్కర లేదు. ఏ వర్గానికి చెందిన మూడు నాలుగు అక్షరాలైనా ఉండవచ్చు.

    రాట్+గణము = రాడ్గణము - జస్త్వ సంధి అవుతుంది.

    దశార్ణము = దశ+అర్ణము - సవర్ణదీర్ఘ సంధి
    మహ+ఋషి = మహర్షి - ఇది గుణసంధి("అ"కారానికి "ఋ" పరమైనప్పుడు "ర" వస్తుంది)

    తెలుగు పదాలు గుర్తించడానికి మరొక క్రైటీరియా, "ఎ", "ఒ" (హ్రస్వాలు) అచ్చులతో మొదలైన ఏ పదమైనా తెలుగు పదమే (సంస్కృతం కాదు).

    రిప్లయితొలగించండి
  38. విసర్గ సంధిలోని ఈ క్రిందనున్న రెండు సూత్రాల బేధాన్ని ఎవరైనా వివరించగలరా? హ్రస్వాక్షరము అంటే ఏమిటి? ఒకటి పునర్దర్శనము మరొకటి మనోరధము ఎలా అవుతున్నాయి? పునః , మనః ల మధ్య తేడా ఏమిటి?

    1) విసర్గాంత శబ్దములకు అచ్చులును,వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములును, హ, య, వ, ర లును పరమైనచో ఆ విసర్గలకు రేఫమాదేశమగును
    పునః+దర్శనము = పునర్దర్శనము

    2) హ్రస్వాక్షరము మీద విసర్గమునకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములును, హ, య, వ, ర లును పరమైనచో ముందున్న హ్రస్వ అ కారమునకు ఓ కార మాదేశమగును

    మనః+రధము= మనోరధము

    రిప్లయితొలగించండి

Comment Form