5, మార్చి 2012, సోమవారం

పైశాచికానందం....

అప్పుడే పుట్టిన
అమాయక దేహాల
విందులు కుడిచే
    నక్కల్లారా
    పందుల్లారా


వొంకల వెంట
పెంటను తింటూ
విందనుకొనే
    నక్కల్లారా
    పందుల్లారా

నీతిని జాతిని
మనిషి నమ్మకాన్ని
పైశాచికానందం కోసం
అమ్ముకొని
డొంకల వెంట తిరిగే
    కుక్కల్లారా
    పురుగుల్లారా

పాపం పుణ్యం
మనిషీ మమతా
కనపడలేదా
కళ్ళున గుడ్లగూబల్లారా?

చచ్చాక శవాలపై
కాకులైనా వాలుతాయా?
అవికూడా ఉమ్మేసి
చక్కా వెళ్ళిపోతాయా?

5 కామెంట్‌లు:

  1. ఎవరి మీదనండి మీ ఆక్రోశం...ఆవేదన....!!!

    రిప్లయితొలగించండి
  2. శ్రీశ్రీ జూ గారూ... మీరింత సీరియస్సా!

    రిప్లయితొలగించండి
  3. అయ్యో ఫణీంద్రా జూ... ఇదేమి సీరియస్సండి. మీరు మరీనూ.

    రిప్లయితొలగించండి
  4. మాంఛి కపితావేశం కనబర్చారు. ఇలానే ముందుకెళ్ళండి చెప్తాను.

    రిప్లయితొలగించండి
  5. LOL.... ఇదే గొట్టం దైర్నమంటే... ముందు ఎదుటికొచ్చి మాట్లాడటం నేర్చుకో.. తరువాత ఘీంకరిద్దువు.

    రిప్లయితొలగించండి

Comment Form