ఈరోజు ఒక పుస్తకం చదువుతుంటే అందులో వివిధజాతుల వారి మధ్య జన్మించిన వారికి పూర్వకాలంలో ఏ ఏ పేర్లు పెట్టారో కనిపించింది. ఇది మనుధర్మశాస్త్రం లోనిది. ఉత్తమ జాతి వారి మధ్య పుట్టినవారికి సహజంగానే మంచి మంచి అర్థము వచ్చే పేర్లు పెట్టారు. ఇందులో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. మనం పురాణాలు వ్రాసిన మన కిష్టమైనదే వ్రాస్తాం కాబట్టి ఆ ప్రస్థాపన ఇక్కడ అప్రస్తుతం. కానీ ఇక్కడ గమనించదగినది ఆనాటి వర్ణవ్యవస్థలో ఒక కావ్యంలో ఇవి చోటు చేసుకున్నాయంటే చాలా ఎక్కువ మొత్తంలోనే ఇలాంటి వివాహాలు లేదా ఇలాంటి సంసారాలు లేదా ఎవరెవరి కోరిక మీర సంభోగ కార్యం జరిగాక ఎవరిదారిన వారు పోయాకనైనా ఇలాపుట్టిన సంతానం గణనీయంగానే వుందనే చెప్పాలి. మన మహాభారతమంతా ఇదే తంతు కదా!
ఇక విషయానికొస్తే
౧) బ్రాహ్మణుడు+ వైశ్య స్త్రీ వల్ల పుట్టిన సంతానాన్ని అంబష్ఠులు అన్నారు
౨) బ్రాహ్మణుడు + శూద్ర స్త్రీ వల్ల నైతే నిషాదులు, పారశవులు
౩) క్షత్రియుడు + శూద్రస్త్రీ = ఉగ్రులు
౪) క్షత్రియుడు+బ్రాహ్మణ స్త్రీ = సూతులు
౫) వైశ్యుడు+ బ్రాహ్మణ స్త్రీ = వైదేహులు
౬) వైశ్యుడు+క్షత్రియ స్త్రీ= మాగధులు
౭) శూద్రుడు+బ్రాహ్మణ స్త్రీ= చండాలుడు
౮) శూద్రుడు+ క్షత్రియ స్త్రీ = క్షత్తలు
౯) శూద్రుడు+ వైశ్యస్త్రీ = అయోగవులు
౧౦) బ్రాహ్మణుడు+ ఉగ్రకన్య= ఆవృతులు
౧౧) బ్రాహ్మణుడు + అంబష్ఠకన్య = అభీరులు
౧౨)బ్రాహ్మణుడు+అయోగవకన్య=ధిగ్వణులు
౧౩) నిషాదుడు+ శూద్రస్త్రీ = వుల్కనులు
౧౪) శూద్రుడు + నిషాదకన్య = కుక్కటకులు
౧౫) క్షత్త+ ఉగ్రకన్య= శ్వపాకులు
౧౬) వైదేహుడు+ అంబష్ఠకన్య= వేణులు
౧౭) ఉపనయనం లేని బ్రాహ్మణుడు+ సవర్ణజాతి కన్య = భూర్జకంటకుడు, అవంతుడు,అవాటుడు,ధానుడు, వుష్ఫదుడు, శైఖుడు
౧౮) ఉపనయనం లేని క్షత్రియుడు+ సవర్ణజాతి స్త్రీ = ఝల్లుడు, మల్లుడు, నిచ్ఛివుడు,నటుడు,కరణుడు,ఖనుడు,ద్రవిడుడు
౧౯) ఉపనయనం లేని వైశ్యుడు + సవర్ణజాతి స్త్రీ = సుధన్వాచార్యుడు, కారుషుడు, విజన్ముడు, మైత్రుడు, సాత్వతుడు.
అవండి ఆనాడు కొత్తగా లోకంలోకి ప్రవేశించే బిడ్డల పరిస్థితి విశేషాలు.ఇప్పటికీ పెద్ద తేడా ఏమిలేదు కానీ ఆ వివక్ష చాలా వరకూ తగ్గిందనే చెప్పాలి.
మొత్తానికి మన పూర్వులు మంచి రసికులే. పై పేర్లని దృష్టిలో వుంచుకొని మహాభారతాన్ని చదువుతుంటే బోలెడు విశేషాలు అవగతమవుతాయి. ముఖ్యంగా భారతంలో వచ్చే పాత్రల పేర్ల వంశ చరిత్ర ఇట్టే తెలిసిపోతుంది. మగధ, వైదేహ దేశాల పేర్ల చరిత్ర కూడా తెలుస్తుంది. అంతే కాకుండా కొన్ని వృత్తుల పేర్లు కూడా.
ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను.
రిప్లయితొలగించండిపురాణాలలోని వాస్తవాలు ఎంతో తెలియదు కానీ దేవతల రాజు ఇంద్రుడి పూర్తి కాలం పని ఇదే కదండీ . అనుమానం ఎందుకు. అతని కున్న శాపం గురించి మీకు తెలుసు అనుకుంటాను
రిప్లయితొలగించండిరాహుల్.. thank you
రిప్లయితొలగించండిbuddha murali, కల్పితాలు లేకపోలేదు కానీ, పురాణాలు చాలా వరకు మనదేశ చరిత్రను ప్రతిబింబింస్తాయి. అంగ్లేయుల విద్యను మనము నేర్చుకొనేదాకా మనకు చరిత్రను కథలలో చెప్పుకోవడమే అలవాటు. ఇక ఇంద్రుడి గూర్చి చెప్పాలంటే, ఇంద్రుడు విధే అది. దేవతలనే సెక్ట్ ను కాపాడటం. అదేకాకుండా ఇంద్రునికి యుద్ధ సామాగ్రి ఎలా తయారు చెయ్యాలో లాంటి విద్యలు కూడా బాగా తెలుసు. ఒక వేళ ఎవరైనా తమను మించి పోతున్నారని అనిపిస్తే వాళ్ళ విద్యాభ్యాస ఏకాగ్రత ( తపస్సు ) నుంచి మరల్చ డానికి రంభ, ఊర్వసి, మేనకలను చాలా సార్లే ప్రయోగించాడు కదా.
రిప్లయితొలగించండిమొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే పురాణాలలో కల్పితాలున్నా మన చరిత్ర అందులోనే నిక్షిప్తమయి వుంది.
పురాణాలలో కల్పితాలు అని మనకు అనిపించవచ్చేమోకాని, ఆరోజుల్లో అవి నిజంగా జరిగిఉండకుడదని ఎలా చెప్పగలం? ఇక ఇందృడు అనేది ఒక పదవి, ముఖ్యమంత్రి పదవిలాగా. ఆ పదవి అధిష్టించిన వారిని ఇందృడు అని పిలుస్తారు. మీకు వీలైతే యస్.యల్. భైరప్ప మహాభారతాన్ని నవలగా రాసిన "పర్వ" పుస్తకం చదవండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి.
రిప్లయితొలగించండి