మన భారతదేశంలో ఆంగ్లేయుల పాలనకు ముందు కాలమానాన్ని లెక్కించటానికి "శకము" లను వాడేవారు. ఇప్పటికీ మన కేలండర్లలో క్రీస్తు శకముతో పాటి శాలివాహన శకమూ కనిపిస్తుంది. కానీ వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు కాలమానముండేది. మరీ పూర్వకాలమైతే యుగాలుగా వర్ణించారు. పరిశోధకులు ఈ యుగ పరిమితిలను ఈ రకంగా లెక్కవేసారట
కలియుగము = 4,32,000 సంవత్సరాలు
ద్వాపరయుగము = 8,64,000 సంవత్సరాలు
త్రేతాయుగము = 12,96,000 సంవత్సరాలు
కృతయుగము : 17,28,000 సంవత్సరాలు
ఇప్పుడు నడుస్తున్నది కలియుగమని ఈ యుగప్రారంభము క్రీ.పూ 3,102 వ సంవత్సరము ప్రాంతంలో ప్రారంభమైనట్లు చరిత్ర పరిశోధకులు నిర్ణయించారు. ఇదే లెక్క ఆర్యభట్టు, వరాహమిహురుడు కూడా పాటించారట.
సప్తర్షి కాల నిర్ణయమని మరొకటి వుంది. ఈ సప్తర్షిమండలము 100 సంవత్సరములకు ఒకసారి 27 నక్షత్ర మండలములలో ఒక్కొక్కనక్షత్ర కూటమికి మార్పుచెందుతుంది. భారత యుద్ధానంతరము ధర్మరాజు పట్టాభిషిక్తుడైనప్పుడు సప్తర్షి మండలము "మఖ" నక్షత్రమందు 75 సంవత్సరాలుగా వుండెను. ఈ విషయము కల్హణుడు రాజతరంగిణిలో వ్రాసాడట.
మరోకాలమానము బార్హస్పత్యమానము . ఇది చాలా పురాతనమైనదని వారన్ అనే ఆంగ్లేయుడు పరిశోధన చేసి చెప్పాడు. బృహస్పతి గ్రహము, మన సౌరవ్యవస్థలో వున్న గ్రహాలన్నింటికంటే పెద్దది. ఇది తనచుట్టూ తాను సంవత్సరమునకు ఐదు సార్లు తిరుగుతుంది. సూర్యునిచుట్టూ తిరగడానికి 11.86 సంవత్సరాలు పడుతుంది. సుమారుగా 12 సంవత్సరాల లెక్క తీసుకుంటే ఇది సూర్యునిచుట్టూ ఒక్కసారి రిరిగేటప్పటికి తనచుట్టూ తాను 60 సార్లు తిరుగుతుంది. ఒక్కొక్కసారికి ఒక సంవత్సరనామమిచ్చి ఈ 60 సంవత్సరాలను ఒక శకముగా మనవారు భావించారు. ఇవే ప్రభవ,విభవ అనే సంవత్సరాలు. ఈ మానము టిబెట్టు, చైనాలలో కూడా వాడుకలో వున్నది.
అంటే మన ఒక్క సంవత్సరానికి బార్హస్పత్యమానపు లెక్క ప్రకారము 5 సంవత్సరాలు కదా ! ఇలాంటి కాల పరిమాణాలేమైనా త్రేతాయుగ కాలంలో వుండేవేమో. అలాంటి కాల మానంలో ప్రజలు వేల సంవత్సరాలు బ్రతికేవారేమో. బార్హస్పతమాన లెక్కప్రకారం మన 100 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి 500 సంవత్సరాలు బ్రతికినట్టే కదా !
ఇక గౌతమబుద్ధిని, జైన దేవుని నిర్యాణము తరువాత ఆయామతస్థులు దానిని ప్రాతిపదికగా చేసుకొని లెక్కించటం పాటించారు.
ఉజ్జయిని నేలిన విక్రమాదిత్య మహారాజు తాను శకులను యుద్ధమున ఓడించి, భారత దేశమునుండి పారదోలిన సమయమే శక ప్రారంభముగా స్వీకరించారు. ఇది క్రీపూ 57. దీనినే విక్రమ శకముగా చారిత్రకులు పరిగణిస్తున్నారు.
ఇక కేరళ రాష్ట్రంలో పరశురామ కాలమానమని ఒకటుంది.
శాలివాహన నిర్యాణంతరము ప్రారంభమైనది శాలివాహన శకము. ఇది క్రీ.శ 78 వ సంవత్సరము. దీనినే సరిదిద్ది స్వాతంత్యం వచ్చిన తరువాత మన భారతదేశంలో శాసన పూర్వకంగా స్వీకరించాము.
ఏమైనా, ఆంగ్లేయ పాలన వల్ల, వారి సౌకర్యార్థము చేసికొన్నా, ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఒక ఉమ్మడి భాష, ఉమ్మడి కాలమానము లభించాయి. వివిధ దేశాల పౌరుల మధ్య భాషా సమస్య తీరినట్టే ఈ కాల మానానికి ఒక స్టాండర్డైజేషన్ వచ్చింది.
రిఫరెన్సు : విజ్ఞానదీపిక పుస్తకం.
"నాసా" జుపీటర్ వివరాలను ఇలా చెప్తుంది. కానీ ఈ బృహస్పతి Rotation period లెక్కించడం మిగిలిన గ్రహాలతో పోలిస్తే గణించడం కష్టమైనపని. మిగిలిన లోపలి సౌరమండల గ్రహాల ( inner terrestrial planets) మాదిరికాక ఈ బృహస్పతి గ్రహానికి దీని గమన వేగాన్ని ట్రాక్ చెయ్యడానికి ఉపరితలమంటూ ఏదీలేదు. ఇది ఒక పేద్దద్దద్ద...................................... హైడ్రోజన్ బంతి
Mass (kg) 1.90 x 1027
Diameter (km) 142,800
Mean density (kg/m3) 1314
Escape velocity (m/s) 59500
Average distance from Sun 5.203 AU (778,412,020 km)
Rotation period (length of day in Earth days) 0.41 (9.8 Earth hours)
Revolution period (length of year in Earth years) 11.86
Obliquity (tilt of axis degrees) 3.08
Orbit inclination (degrees) 1.3
Orbit eccentricity (deviation from circular) 0.048
Mean surface temperature (K) 120 (cloud tops)
Visual geometric albedo (reflectivity) 0.44
Atmospheric components 90% hydrogen,
10% helium,
.07% methane
Rings Faint ring.
Infrared spectra imply dark rock fragments.
శ్రీ భాస్కరరామి రెడ్డి గారికి
రిప్లయితొలగించండిశ్రీరామనవమి శుభాకాంక్షలతో...........
జగదభిరాముడు శ్రీరాముడే !
SRRao గారూ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సీతా రాములు ప్రశాంత జీవనాన్ని ప్రసాదించాలని, కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండికాలమానాల గురించి బాగా వర్ణించారు.కాని మహాభారత కాలం గురించి కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం 1000 b.c అంటారు నిజమేనా !కలియుగం భారతం తరువాత మొదలౌతుంది కదా!మరి మీరు చెప్పిన ప్రకారం భారతం 3102 b.c మొదలయినది అనుకోవాలి .దీని మీద మీ వివరణ చెప్పగలరా!
రిప్లయితొలగించండిమహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నదానికి ఎవరికి తోచిన రీతిగా వారు చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సహజంగా ఎవరు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు బలపరచుకొనే వాదనలే ఎక్కువగా వుంటాయి కాబట్టి, pick your best century from the following links
రిప్లయితొలగించండిhttp://en.wikipedia.org/wiki/Mahabharata
http://www.hindunet.org/hindu_history/ancient/mahabharat/mahab_vartak.html