21, మార్చి 2012, బుధవారం
ఎవరికోసమే ఓ మోహశీల కదిలి వచ్చితివీ నిశీధి దారులలోన
ఎవరికోసమే ఓ మోహశీల కదిలి వచ్చితివీ నిశీధి దారులలోన
కాలి యందెలు ఘల్లు ఘల్లుమన నిశ్శబ్ద హృదయ గేహమ్ములోనికి
నిలిచి నిలిచి ఆలకించవె ప్రతిధ్వనుల సవ్వడిన్
తెల్లవారులు తెలియరాని హృదయ తంత్రుల యలికిడిన్
గూడు కట్టిన ఊహలేవో మంచు తెమ్మరలై కురిసినవి
కాలి యడుగులు కందకుండ పుడమిపైన నీ దారుల
నీవు నడచెడి బాటలెల్ల మనసు విడిచిన పుష్ప పరాగమ్ములె
మదిన తలచిన కమ్ముకొను వాడిపోని స్నేహ సుగంధమ్ములె
సందె వేళల పూలరేకులు వేడిగాలికి రాలుతుండగ
కష్టపడ్డ మనసుకెల్ల వసంత గానమె నెమ్మలము
చాలు చాలు యా గులాబి ముళ్ళ కానుకలెల్ల
పూలదండలు కట్టి కట్టుము నోరులేని శిలకును
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
భాస్కర రామి రెడ్డి గారు.. చాలా అద్భుతమైన కవిత్వం ..
రిప్లయితొలగించండి"చాలు చాలు యా గులాబి ముళ్ళ కానుకలెల్ల
పూలదండలు కట్టి కట్టుము నోరులేని శిలకును"
చాలా బాగుందండీ!
కవిత బాగుంది గురు గారు.....మీరెలా ఉన్నారో???
రిప్లయితొలగించండివనజ గారూ, అంత అద్భుతమేమీ కాదు. కానీ నచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరాఫ్సన్ థ్యాంక్స్. మి టూ గుడ్.
ఎవ్వతెవే నీవు అని ప్రవరాఖ్యుడు వరూధిని ని అడిగినట్లుంది మీ కవిత :-)
రిప్లయితొలగించండిబాగుంది .
చిన్ని,అవును ఇంతకి ఎక్కడ నా వరూధిని :-)
రిప్లయితొలగించండినచ్చినందుకు ధన్యవాదాలు