జానడంత లేవు నీకు సెక్సుపుస్తకాలెందుకు?
నేను కాదు నా తమ్ముడు చదివేటందుకు
మన ప్రేమ స్థిరంగా ఉండాలంటే మార్గమేమిటి ప్రియా?
పెళ్ళిమాని ఎల్లకాలం యిలాగే వుండాలి చెలియా
ఎవరయ్యా ఆ లారీక్రిందపడ్డ వ్యక్తి?
"రోడ్డు ప్రమాదాలు - జాగ్రత్తలు" గ్రంధం వ్రాసిన వ్యక్తి
కొత్తకథ వ్రాసుకొచ్చాను చదువుతావా డైరక్టరూ?
తీసేది తెలుగు సినిమా కథెందుకు కవిగారూ!
పదేళ్ళుగా అమ్మాయి వయసు పదహారే అంటున్నారు?
ఒకేమాటపై నిలబడమని వకీలు సలహా యిచ్చారు
ఆడది గడపదాటితే అనర్థమంటారెందుకని?
ఇల్లేకాదు వీధికూడా రణరంగమౌతుందని.
డా|| ఉండేల మాలకొండారెడ్డి గూర్చి బ్లాగులోకంలో ఎక్కువమందికి తెలిసి వుండకపోవచ్చు కానీ, CBIT లో చదివిన విద్యార్థులకు తప్పక తెలిసే వుండవచ్చు. మరి నువ్వు CBIT లో చదివలేదు కదా నీకెలా తెలుసని గొప్ప గొప్ప ప్రశ్నలను అడగమాకండి. వీరిది మా ఊరుకు దగ్గర. అలాగే ఈ కాలేజీలొ నాకు తెలిసిన కొద్ది మంది ప్రొఫెసర్లూ వున్నారు. పైన పేర్కొన్న చమక్కులు ఆయన వ్రాసిన ఒడిసెల రాళ్ళు పుస్తకం నుంచి
మాలకొండారెడ్డి వ్రాసిన మిగిలిన గ్రంధాలెలావున్నా హైస్కూలు,కాలేజీ విద్యార్థిగా వీరు వ్రాసిన నేతాజీ, వివేకానందుడు పద్య గ్రంధాలను వీలైతే తప్పక చదువ వలసిన పుస్తకాలు. వాటిపై విమర్శవ్రాసే స్థాయి నాకు లేదు కానీ యుక్తవయస్కునిగా వున్నప్పుడు వ్యక్తి యొక్క తెలివి తారాస్థాయిలో వుంటుంది కాబట్టి ఈ పద్య కావ్యాలలోనూ వారి ప్రతిభ ధారాశుద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
వీరు వ్రాసిందే మరొక్కటి..జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
రాళ్ళుతిని ఆరగించుకొనే నాడు తినడానికి రాళ్ళు లేవు
పళ్ళెంనిండా రాళ్ళున్ననాడు తినడానికి పళ్ళు లేవు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form