కాలంతో పాటు మనిషి జీవనం, జీవించడానికి చేయవలసిన వృత్తులూ మారుతూ వస్తుంటాయి. ఈరోజు మనం చేసే ఉద్యోగాలకు రేపు ప్రాధాన్యత వుండకపోవచ్చు. అలాగే ఆనాడు వాళ్ళు చేపట్టిన ఉద్యోగాలకూ ఈరోజు పెద్దగా ప్రాముఖ్యత లేదు. రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా తగిన పరివారం మందీ మార్బలం లేకుంటే ఆరాజ్యం విచ్ఛిన్నం కాక తప్పదు. పరిపాలన సజావుగా సాగాలంటే మంత్రాంగం, దానికి తగ్గ యంత్రాంగం తప్పనిసరి.
కాకతీయులు,రెడ్లు,విజయనగర రాజులకాలంలో అధికారాలు,అధికారులు ఏఏపేర్లతో పిలువబడ్డారో ఆరోజులలో వెలువరించిన శాశనాలద్వారా, సాహిత్యము ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో అధికారులను 72 విధాలైన వైవిధ్యాలతో కూడిన వారుగా విభజించారు. బహుశా ఇప్పటిలాగా ఆరోజుల్లో UPSC లేకున్నా అంతకంటే మేలైన తరహాలో ఈ పదవుల అధికారులను ఎన్నుకొనేవారనుకుంటాను. కారణం వీళ్ళు ఆయా వృత్తిబాధ్యతలను నిర్వర్తించండంలో నిష్ణాతులైతే తప్ప రాజ్యం పటిష్టంగా వుండే అవకాశం లేదు. ఈ 72 విధాలైన అధికారులపై ఓ పెద్దాయన వుండేవాడు.అతనిని బాహత్తర నియోగాధిపతిగా వ్యవహరించేవారు.
72 నియోగాలనూ, వారి వారి అధికారాలనూ ఈ క్రింద పేర్కొనబడడం జరిగింది. నియోగము అంటే ఆజ్ఞ లేదా ఆజ్ఞాపించిన పని, పరిజనము మొదలైన అర్థాలున్నాయి. నియోగి అనగా నియోగించెడి అధికారము కలవాడు - ఒక తెగ బ్రాహ్మణుడు. ఈ నియోగి పదాన్ని చూస్తే అప్పటికి మనదేశంలో వర్ణ వ్యవస్థ వుండేదేమో కానీ కుల వ్యవస్థ వున్నట్లు కనిపించదు. కుల వ్యవస్థ ఇప్పటిలా కాక వృత్తిపరమైనదని తెలుస్తుంది. అప్పట్లో ఈ పనులను చేసే వారిని లేదా వారిపై అధికారిని నియోగి అనిపిలిచేవారనుకుంటాను. వీళ్ళే తదనంతరకాలంలో రకరకాలుగా విడిపడి కులాలుగా మార్పు చెంది వుండవచ్చు.
మూలం : రాయలసీమ తెలుగుశాశనాలు - సాంస్కృతిక అధ్యయనం ( డా. యం. ఆదినారాయణ శాస్త్రి )
చాలా మంచి సమాచారము సేకరించారు. మీ బ్లాగులో వ్యాఖ్యలు రాయకపోయినా, క్రమంతప్పక చదువుతూంటాను.
రిప్లయితొలగించండిSriRam
Thanks for giving unknown information.
రిప్లయితొలగించండి72 విధాలైన అధికారులపై ఓ పెద్దాయన - అనేక కొత్త విశేషాలను తెలిపారు.
రిప్లయితొలగించండిథాంక్యూ.
; ------ బాహత్తర నియోగాధిపతి - [బృహత్తర - ?] -