ఇన్ని తిన్నాక తృప్తిగా కాసేపు అలా సోఫాలో కూర్చుంటే ఎదురుగా కంప్యూటర్ మీద శశాంక విజయం పుస్తకం రా..రామ్మని పిలిచింది. ఇంకనేం పుస్తకాన్ని తెరిచి ఓ పేజీ తిరగేయగానే ఈ పద్యం....
అంతే నాలో కళాకారుడు రెక్కలు విచ్చుకొన్నాడు :-). నా బాధ పడలేక ఇంట్లో వాళ్ళు చెవులు మూసుకొని పారిపోతున్నా వినిపించుకోకుండా తిన్నది అరిగేదాకా పొట్టకూ, కంఠానికి ఏదో ఇలా వ్యాయామం :))
మరో మాట మొత్తానికి కుస్తీ పట్టీ పట్టీ..పట్టీ.... ఈ రోజు ఆడియో ఫైల్స్ ను బ్లాగర్లోకి ఎలా అప్లోడ్ చెయ్యాలో నేర్చుకున్నాను :-)
ఏలా లతా జాల డోలా సమాలోల బాలామణీ గాన భాసురములు
థీ రానిల వ్రాత ధారా చల చ్చూత దూరాపతద్ర జోధూసరములు
మోదావ హానంగ వేదాభ రవ భృంగ ఖేదావహ జ్జాతి కేసరములు
నాళీక దృక్కాంత పాళీన వైకాంత కేళీపరన్యూత కేసరములు
కనదగె నకుంఠ కలకంఠ కంఠ నాద
పటు భ టాహ్వాన కుపిత బిభ్య త్ప్రపంచ
పంచ సాయక మద హస్తి పైసరములు
మీసరమ్ములు, మధుమాస వాసరములు.
Beautiful voice sir
రిప్లయితొలగించండిKeeep it up
Thanks for the compliment minabe.
రిప్లయితొలగించండి