ఫేసు బుక్కు వాడికి నా ఫ్రెండ్స్ లిస్టు చూసి కన్ను కుట్టింది. అప్పుడేమో మరీ ఇంత స్పీడు పనికిరాదు బాబూ అంటే సరేనని ఏదో ఒకటి అర Friends Request పంపుతున్నానా!! తీరా ఈ రోజు ఒక రెండు రోజులదాకా అసలు నువ్వు Requests పంపడానికి వీల్లేదని హుకుంజారీ చేశాడు. సరే ఇంక చేసేపనేముందిగనక మళ్ళీ బ్లాగుల్లోకొచ్చి ఇలా టపా వ్రాసుకుంటున్నాను.
ఫేసుబుక్ ఎకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసానో గుర్తులేదు.అలాగే ఈ ఫేసుబుక్ కి నేను కనీసం మామూలు పంకాను కూడా కాదు. దానికి తోడు మన బ్లాగర్లలో బహుశా ఎవరైనా ఫేసుబుక్ లో పనిచేసేవాళ్ళున్నారేమో, గత నెల వరకూ అప్పుడప్పుడు నా అకౌంట్ నూ వాడేసి కొన్నట్లున్నారు. ఐనా దేనికి security వుంది కనుక. మొన్నటికి మొన్న Apple సంస్థ గంపగుత్తగా వారి దగ్గర నమోదు చేసుకున్న credit cards లను సైతం ఎవరికో దాసోహం చేసేసింది. ఇక ఫేసు బుక్కు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనం పెట్టుకున్న Privacy settings వాటంతట అవే మాయమైపోతుంటాయి. మాయమైపోవడానికి Software లోపమైనా కావచ్చు లేదా అక్కడ పనిచేసేవారి నిర్వాకమైనా కావచ్చు లేదా అకౌంట్ లోకి వేరే ఎవరైనా చొరబడి కూడా వీటిని మార్చ వచ్చు.
సరే గత పది రోజులగా haaram ను కొద్దిగా market చేసుకుందామని ఫేసుబుక్కులోకి లాగిన్ అయి రాచకార్యాలను చక్కపెట్టెడం మొదలు పెట్టాను. ఈ పదిరోజుల్లో నేను గమనించిన విషయాలు ఇక్కడ కొన్నింటిని మాత్రమే వ్రాస్తాను.ఈ ఫేసుబుక్కులో నాకు నచ్చిన వ్యాసాలు ఏ ఒక్కశాతమో కనిపించాయి. తాను మెచ్చిందే రంభ అన్నట్లు, నచ్చడమనేది ఆ సమయంలో వారి వారి మానసిక స్థితి బట్టి వుంటుంది కాబట్టి ఎవరిష్టం వారిదనుకోండి. ఇంతకీ మీరు నచ్చే వ్యాసాలు వ్రాశారా అని నన్ను నిలదీయకండి. అక్కడ నా ఏకైక ఎజెండా ప్రచారమే. ఐతే ఈ ఫేసుబుక్కు నిండా నాలాంటి ప్రచారగాళ్ళే అని తెలిసి ఔరా అని ముక్కుమీద వేలేసి గోక్కున్నా :-). ఏదైతేనేమీ ఏ విషయాన్నైనా వేలమందికి క్షణాల్లో చేరేవేసే సాధనం ఈ ఫేసు బుక్కు.
ఇక అక్కడ ఛాట్స్ చూస్తే భలే భలే అనిపిస్తుంది :-)
వున్నట్లుండి "Hi" అని మెసేజ్ వస్తుంది. తిరిగి "Hello" అంటే రిప్లై వుండదు. మరికొంతమందేమో కాసేపు మాట్లాడి ఈ పప్పుసుద్దగాడితో లాభంలేదనుకొని మాయమైపోయే రకాలు. ఇంకొంతమందేమో మరో టైపు... ఐనా ఇలా టై వేస్టు చేసుకొనే బదులు కావాలంటే నేరుగా పార్కులకెళ్ళాలి గానీ ఇలా ఫేసుబుక్కు ల్లో పగలూ రాత్రులు ఒకర్నొకరు గీక్కుంటే ఏమొస్తుంది చెప్పండి :-). అయ్యా/అమ్మా ఇక్కడెవర్నీ విమర్శించడంలేదు...కాకపోతే ఇలా గోక్కోడం బదులు మీకు తెలిసిన వాళ్ళతో ఈ మాత్రం ప్రేమ ఒలకపోస్తే workout అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నానంతే :))