22, డిసెంబర్ 2017, శుక్రవారం

పిచ్చాపాటి కబుర్లు కొన్ని.....

ఈ రోజుతో కవిత్రయ మహాభారతం టి.టి.డి వారు ప్రచురించిన పదిహేను పుస్తకాలలో మొదటి పుస్తకం చదవడం పూర్తయింది.అంటే ఆదిపర్వములోని మొదటి నాలుగు ఆశ్వాసాలను ప్రతిపదార్థంతో సహా చదివాను. మొదలు పెట్టి నప్పుడు ఇలాంటి తెలుగు చదివి దశాబ్దాలు దాటింది కాబట్టి వాక్యం చదవడానికి కూడా నోరు తిరగని పరిస్థితి. కూడబలుక్కొని చదవగా చదవగా అలావాటై నాల్గవ ఆశ్వాసానికొచ్చేటప్పటికి ప్రతిపదార్థం, తాత్పర్యం చూడకుండానే పద్యము చదివి షుమారు అర్థాన్ని గ్రహించ గలుగుతున్నాను :) ..శభాసో :)))

పద్యం ప్రతిపదార్థం తో చదవడం మూలంగా చదవడమాలస్యమైనా ఇలా ఒక కావ్యాన్ని / ఇతిహాసాన్ని పూర్తిగా చదవగల్గితే చాలామటుకు అర్థాలు తెలిసి వేరే కావ్యాలు చదవడం కూడా కొంత సులభమవుతుందనుకొంటాను. కానీ నాకు మొదటి సంపుటం దరిదాపు 450 పేజీలు చదవడానికి నెల రోజులు పట్టింది. అదీ గత పదిరోజులుగా సెలవులో వుండటం మూలానా రోజుకు సరాసరి మూడు నాలుగు గంటలు కేటాయించడం మూలానా తృతీయ,చతుర్థాశ్వాశాలు పదిరోజుల్లో పూర్తయ్యాయి కానీ మొదటి రెండు ఆశ్వాసాలు పూర్తి చెయ్యడానికి ఇరవై రోజులు పట్టింది.

చదువుతూ పద్యరసాన్ని గ్రోలుతూ నన్నయ్య కాలంనాటి తెలుగును రుచి చూస్తూ నాటి భాషావిభక్తులను పరికించుతూ మొత్తంగా భారతకథనాస్వాదిస్తూ ప్రయాణం సాగుతుంది. చదివేటప్పుడు ముందు ప్రతి ఆశ్వాసానికి నాదైన వివరణ వ్రాయాలనుకున్నాను కానీ దానికి సమయమెక్కువపడుతుండటం ఒక కారణమైతే మరో కారణం ప్రతి కథనూ విశ్లేషించాలంటే మరో మహాభారతమవుతుంది కదా :))

ఐనా అప్పుడప్పుడు కొన్ని విశేషాలను నోట్ చేసుకుంటూ వున్నాను. అందులో కొన్ని ఇక్కడ.

కుల పర్వతాలు ఏడు. అవి ౧) మహేంద్రం ౨) మలయం ౩)సహ్యం ౪)శుక్తిమంతం ౫)గంధమాదనం ౬) వింధ్యం ౭) పారియాత్రం

అష్ట సిద్ధులు ఎనిమిది అవి ౧) అణిమ  ౨) మహిమ ౩) గరిమ ౪) లఘిమ ౫) ప్రాప్తి ౬) ప్రాకామ్యం ౭) ఈశిత్వం  ౬) వశిత్వం

వేదాంగాలు ఆరు ౧) శిక్ష ౨) వ్యాకరణం ౩) ఛందస్సు ౪) నిరుక్తం ౫) జ్యోతిషం ౫) కల్పం

వ్యసనాలు ఏడు ౧) వెలది ౨) జూదం ౩) పానం ౪) వేట ౫) వాక్పారుష్యం ౬) దండపారుష్యం  ౭) సొమ్ము అనవసరంగా వ్యయం చేయటం

ఋత్విజులు పదహారు మంది  ౧) బ్రహ్మ ౨) ఉద్గాత ౩)హోత ౪) ప్రతిప్రస్థాత ౫) పోత ౬) ప్రతిహర్త ౭) అచ్చావాకుడు ౮) నేష్ట ౯) అగ్నీధ్రుడు ౧౦) సుబ్రహ్మణ్యుడు ౧౧) గ్రావస్తుతుడు ౧౨) ఉన్నేత ౧౩) అధ్వరుడు ౧౪) బ్రాహ్మణాచ్చంసి ౧౫) ప్రస్తోత ౧౬) మైత్రావరుణుడు

పంచాగ్నులు  దక్షిణాగ్ని, గార్హపత్యము , ఆహవనీయము, సభ్యము, అవసథ్యము అను నయిదు అగ్నులు

ఉంటానేం... కవిత్రయ భారతం నన్ను పిలుస్తుందక్కడ :)

12 కామెంట్‌లు:

  1. రెడ్డన్నా! బైబిలు సదువన్నా!!బాపనోళ్ళలో కలిబోకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత! బైబులు చదివి
      సుజ్ఞానము పెంచుకొనగ సుస్థిరత గనన్
      విజ్ఞానము పడయుదు తొలు
      తాజ్ఞానాంబుధి మదాంధ్ర ధారల నెలమిన్

      తొలగించండి
    2. అజ్ఞాత! బైబులు చదివి
      సుజ్ఞానము పెంచుకొనగ సుస్థిరత గనన్
      విజ్ఞానము పడయుదు మది
      సుజ్ఞానాంబుధి మదాంధ్ర సుధల నెలమితోన్

      తొలగించండి



  2. పిచ్చాపాటి కబురులివి
    కచ్చా నోట్సులను చేర్చి కట్టితిని టపా!
    బుజ్జబ్బాయీ బైబిలు
    సొచ్చెము చదువుమయ రెడ్డి సొగసుల్లబ్బున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత! బైబులు చదివి
      సుజ్ఞానము పెంచుకొనగ సుస్థిరత గనన్
      విజ్ఞానము పడయుదు తొలు
      తా జ్ఞానాంబుధి మదాంధ్ర ధారల నెలమిన్

      తొలగించండి
    2. అజ్ఞాత! బైబులు చదివి
      సుజ్ఞానము పెంచుకొనగ సుస్థిరత గనన్
      విజ్ఞానము పడయుదు మది
      సుజ్ఞానాంబుధి మదాంధ్ర సుధల నెలమితోన్

      తొలగించండి
    3. ఎనలేని భారతమునకు
      దినదినము టపానుకట్టు తీరిక గానన్
      మనమును రంజిల చదువుతు
      ననన్య సామాన్యసుధల త్రాగుచు నుంటిన్

      తొలగించండి
  3. హరిబబు సురనెనీ గడి పోగరో చూడుడి.గీడు ఏలే వాగిండే.గీడు బాపనోల్ల బానిసకొడుకు.మ జగన్నాను తిట్టుండు.గీడి తాట తీఎడం స్తాటూ.
    "కందము లంటు జనాలను
    చిందర జేసెడి జిలేబి జిమ్మడ!ఏలా
    బొందలు?ముసలిది మొగుడి ప
    సందును జూడక తిరుగుడు సంతలు ఏలో!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అగ్నాత అన్నీ మూసుకొని పోరా. జిలేబి కి లేని జిల నీకెందుకురా

      తొలగించండి
    2. హన్నన్నా!ఈ ఆజ్ఞాత ఈ మధ్యనే నాతో పగలగొట్టించుకుని "నాకు పగిలినట్టే ఈ హరిబాబుకీ పగలాలి... " అని పిల్లి శాపాలు పెడుతున్న మా ఫ్రెండు కామసూత్రచోరుడు కాదు గదా!

      తొలగించండి

Comment Form