8, మార్చి 2010, సోమవారం

బ్లాగుల్లో సిల్లీ బిల్లీ గొడవలు

ఈ మధ్య బ్లాగుల్లో జరుగుతున్న చాలా సిల్లీ బిల్లీ గొడవలకు కారణం మనిషిలో వుండే అనాగరిక లక్షణాలు, నన్ను మించిన తోపులు ఈ బ్లాగుప్రపంచంలో పుట్టడు, పుట్టబోడు అనే ఒక మానసిక స్థాయికి చేరిన అనాగరిక చేష్టల ప్రవృత్తి ముఖ్యకారణం. దానికి తోడు మనిషిలో వుండే అతి సహజాతి సహజమైన ఉత్సాహం కూడా కలిసి ఈ విషయాలకు ఎక్కడలేని ప్రాముఖ్యత నిస్తాము. చాలా సందర్భాలలో ఇంటర్నెట్ వాడకం పైకి ఎంత గుంభనంగా కనిపిస్తుందో ఎంత రంగులలోకాన్ని చూపిస్తుందో చూసి మురిసి ముచ్చట పడిపోతుంటాము. ఇంకా చాలామంది మాదగ్గర ఐ.పి లున్నాయి ఇట్టే మీరెవరో చెప్పేస్తామని డప్పులు వాయించేస్తూంటారు కూడా. గత ఒకటిన్నర సంవత్స్రరంగా బ్లాగులను చూస్తూ చదువుతూ అంతో ఇంతో కొంచెం తెలుగు బ్లాగుల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకున్నవాడిగా నాకు తెలిసిన అజ్ఙానాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను. ఇందులో మీకు రాబోవుకాలంలో నా తీరిక బట్టి ఈ క్రింది విషయాలను పరిచయం చేస్తాను. వీటిని జాగ్రత్త గా ఫాలో అయిపోండి. మరో ముఖ్య విషయం కూడా తెలిసీ తెలియకుండా ఇక్కడ వ్రాసేవి మనసహ బ్లాగర్లమీద ప్రయత్నించకండి. మీరు ఏవైనా ప్రాక్టికల్స్ చేయాలనుకుంటే ఒక కంప్యూటర్ని కేవలం ఈ ప్రాక్టికల్స్ కోసమే వుపయోగించుకోండి.ఆ కంప్యూటర్ని ఇక దేనికీ వాడకండి. కారణం మీ మీ ఐడెంటిటి చాలా ఈజీగా ఇతరులకు చేరిపోతుంది.

గత సంవత్స్రరమున్నర గా నేను చూసిన బ్లాగు గలాటాలు. ఈ క్రిందవి కాకుండా ఇంకా నాకు తెలియకుండా చాలానే జరిగి ఉండవచ్చు. ఈ పట్టిక లో వున్నవారు ఎవరికైనా అభ్యంతరమైతే దయచేసి తెలుపండి. తొలగిస్తాను. ఇక ప్రతి సందర్భంలో ఆ మనల్ని కాదు కదా అన్నది నాకెందుకులే అని కళ్ళుమూసుకొని పోయేవాళ్ళే ఎక్కువ, మరీ మన పవిత్ర భారతదేశంలో ఇది నూటికి నూరు పాళ్ళు.

1) అరుణ గారిది
2)శోధన సుధాకర్
3)కాగడా
4)ప్రమాదవనం
5)సైన్యం
6)ప్రవీణ్ వర్సెస్ భరద్వాజ్
7)ఈ మట్ట
8)మహేష్ వర్సెస్ ఎ గ్రూప్
9)ధూమ్ మచారా
10) కాగడా మొగుడు
11)యాత్ర
12)ప్రవీణ్ వర్సెస్ ప్రపీసస
13) భారారె వర్సెస్ తొలిఅడుగు కార్తీక్

ఇక్కడ ఎవరు ఎవరో ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకొని ప్రక్కవాడి చెవులు ముక్కులు కొరికేయవచ్చు. ఇంతకీ ఇక్కడ నేను చెప్పచ్చేదేమిటంటే ఇన్ని గొడవలు జరిగినా ఒక్క అరుణ గారు తప్ప మిగిలిన వారెవరూ బ్లాగులు మూసిన వారు లేరు. ఎటొచ్చి ఎవరిదారిలో వారు ప్రయాణం నిరంతరాయంగా చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ టపా దేనికోసం? పైవాళ్ళలాగే నాకూ జిల.కాకపోతే నాజిల అదోటైపు జిల. ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని కాకుండా మిమ్మల్ని అవతలవ్యక్తి బాదించినపుడు పుణ్యభారతదేశంలో పుట్టిన పౌరులుగా చూస్తూ గుడ్లమ్మటి నీరు నింపుకొని మీ మీ పంచెలో లేదా చీర చెంగులతోనో కళ్ళు తుడుచుకోకుండా సామరస్యంగా చెప్పి చూడండి. వినని సందర్భాలలో మనసు ప్రశాంతత కావాలనుకొన్న వారు బ్లాగులు మూసేసి హ్యాపీగా మరోబ్లాగు మొదలెట్టుకోండి. ;)లేదా నాలాగా తిరగగబడండి ;). తిరగబడితే వచ్చేది ఏమిటంటారా? ఏముంది మహా అయితే అటుప్రక్క కొందరు ఇటుప్రక్క కొందరూ చేరి కొద్ది రోజులు కొట్టు కుంటారు. ఆ తరువాత అంతా మామూలే.ఎవరిపనుల్లో వాళ్ళు తీరికలేకుండా మునిగి పోతారు. తిరగబడకపోయినా వచ్చేది ఏమీ లేదనుకోండి.

సరే ఇక నాసోదాపి అసలు విషయానికొస్తే దీనికి ముందు నా మిత్రుడు పంపిన ఒక మైల్ ను ఒక టపాగా పెట్టాను. దానికి సీక్వెల్ ఈ టపా ఇంకా రాబోవు టపాలు. ఇందులో నేను వ్రాయబోయేవి కేవలం మన బ్లాగర్లు ఇంటెర్నెట్ లో బ్రౌస్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారనే కానీ సహ బ్లాగర్ల వ్యక్తిగత వివరాలను హేక్ చేయమని కాదు. ఇక్కడ వ్రాయబోయేవి నాకు తెలిసిన 1% అజ్ఞానము మాత్రమే. వారానికొకటో లేక అరో వంతున ఈ క్రింది విషయాలను చర్చించుకుందాము. ఇవి చాలా బ్రెడ్త్ అండ్ విడ్త్ గల సబ్జెక్ట్స్ కాబట్టి అన్నీ కూలంకుషంగా చర్చించే అవకాశం లేకపోవచ్చు. పాఠకులు వారి వారి అభిరుచిని పట్టి స్వయంగా నేర్చుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి హాని చేసే జ్ఙానసముపార్జన రాకున్నా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

1) How to analyze webserver logs
2) How to use proxies and hide your identity
3) what is a session and cookie
4) How to detect your IP if you are using an anonymous proxy server?
5) How to hijack remote user sessions
6) How to use the hijacked sessions
7) SQL injection attacks
7) DoS attacks.

More..if I can!

ఇక కామెంట్లు మాత్రం గుండె ధైర్యం కలవారు మాత్రమే మీ అసలు ఐడెంటిలతో వ్రాయమని మనవి.లేదా గోతికాడ నక్క మిమ్మల్నీ కరవవచ్చు ;)

22 కామెంట్‌లు:

  1. I condemn this kind of Anti-Anonymous tactics.

    రిప్లయితొలగించండి
  2. 12)ప్రవీణ్ వర్సెస్ ప్రపీసస
    ప్రపీసస అనేది ఏదో గొడవ వల్ల మొదలు కాలేదు.. ఏదో కామెడీగా మొదలైంది.. కామెడీగానే సాగుతుంది..

    మీకు నేను చెప్పింది ఇంకా అర్థం కాకుంటే చెహోవ్ రష్యన్ లో రాసిన కథలు తెలుగులో చదవండి.. తెలుగు సాహిత్యం ఒరిస్సాలో ఉంది కానీ ఒరియా సాహిత్యం తెలుగులో లేదు.. మా వీధిలో ఉన్న 55 ఏళ్ళ విధవను పెళ్ళి చేసుకోవడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే _______

    and the fun goes on!

    రిప్లయితొలగించండి
  3. ఇవంతా సరే ముందు మీ బావ నాదెండ్ల బ్లాగెందుకు మూశాడో కనుక్కోండి..

    రిప్లయితొలగించండి
  4. S, yes I do.This is not intended to hijack privacy of good anonymous bloggers.


    S గారూ అండ్ కార్తీక్, ఇక్కడ బహుశా ప్రపీసస గొడవల్లో మొదులవలేదని నాకూ తెలుసు. పైన చెప్పిన వాటన్నింటి కారణాలు వ్రాయాలంటే మా బావమాత్రమే ఆ పని చేయగలడు. ఇక మీకేమి అభ్యంతరం లేదన్నారు కాబట్టి నెంబరు ౧౨ వుంచేస్తున్నాను. నాదెండ్ల బ్లాగు మూసినట్లు నాకు తెలియదే!. ఇప్పుడు నాదెండ్ల గారు ఏమైనా సమాధానం చెప్తారేమో చూద్దాము

    రిప్లయితొలగించండి
  5. ఆ మధ్య నాకు ఎవడో ఫోన్ చేసి తన పేరు నాదెండ్ల గణేష్, గుంటూరు అని చెప్పాడు. నాకు అనుమానం వచ్చి ఫోన్ పెట్టేశాను. ప్రపీసస బ్లాగ్ ని ఎప్పుడో నవంబర్ లో చూశాను. అది చూడడం టైమ్ వేస్ట్. అందుకే ఆ తరువాత అది చూడలేదు. ఒక పోస్ట్ కి వంద లేదా వెయ్యి కామెంట్లు వ్రాసినంత మాత్రాన చదివినవాడు ఏదో కదులుతాడనుకోవడం భ్రమ.

    రిప్లయితొలగించండి
  6. ప్రవీణ్, నేను ముందు చెప్పినట్టుగానే ఎవరూ ఎవర్నీ మార్చలేరు. పై లిస్టులో నీకు అభ్యంతరాలేమైనా వుంటే చెప్పు తీసివేస్తాను.

    రిప్లయితొలగించండి
  7. "This is not intended to hijack privacy of good anonymous bloggers."

    How do you know whether he is good or bad unless you allow him to comment(freely) without google or someother ID?
    Many bloggers blocked Anonymous visitors from commenting. It is against democratic norms of freedom of speach!
    Many bloggers here ALWAYS want to listen 'GOOD' comments only. ;) Telangana bloggers challenge critics to come only to OU campus and dare to talk and no where else! Who is going to pay TA/DA for that?! :P

    as a right step, you allow Anonymous commentors in your blog. You may remove (filthy comments but not criticism).

    రిప్లయితొలగించండి
  8. S, I Luv your humour, which I haven’t seen from you in recent times. So, you want me to allow anonymous to comment freely filthy language and the delete later ;) what kind of democracy is this? Why can’t people freely criticize with their ID’s like you ;)

    I know your intention and can not allow anonymous comments here as the main goal of this post is not to jeopardize anonymous ppl. I just want to touch the tip of iceburg and alert ppl. nothing more.

    రిప్లయితొలగించండి
  9. S గారు..
    మీకు ఇంకొ విషయం చేబుతా :-) ఈ మద్య నాకు గుండె దైర్యం పెరిగి , మానసిక స్తైర్యం తగ్గి, పెద్దగ పని పాటా లేక .. మన ప్రవీణ్ బ్లాగు లొ వరసగా రెండు రోజులు కామెంట్లు రాసాను.. మనోడు నేను రాసిన కామెంట్ ఒకటి డిలీట్ చేసి నేను వాడిని వెధవ అని తిట్టానని అరోపణ చేసాడు... (నిజంగా వడు సుద్ద వెధవ నాకు అని పించినా వాడి బ్లాగు లొ ఎదుకు రాస్తాను ) .. నేను అసలు నిజం గా రాసానా అని కూడా గుర్తులేదు .. ఒకవెళ ఆ పదం వాడినా వ్యాక్యంలొ వెరే విధంగా అర్దం వస్తుందా లేక వాడిని తిట్టినట్ట అన్నది వాడి కొడి బుర్రకి అర్ధం కాదు అని తెలుసు. వాడు మత్రం నా కామెంటెస్ డిలిట్ చేసి నెను వడినెది అనరాని మాటలు అన్నానని సీన్ క్రియేట్ చేస్తున్నాడు..
    "You may remove filthy comments" అని మీరు రాసారు కానీ.. వీడిలాంటొళ్ళు ప్రతీది డిలీట్ చేసి అన్ని filthy అనగలరు.

    కామెడి ఎమిటంటే.. ఎప్పుడు నువ్వు అనే మనిషి సడన్ గా ఈ అరోపణలు చేసినప్పుడు మాత్రం మీరు అని సంబొదించాడు...

    రిప్లయితొలగించండి
  10. భరారే v/s తొలిఅడుగు కార్తీక్ గొడవ లిస్టు లో లేనట్టుందే .... అప్పుడు కాత్రీక్ మీద ఒక ఫేక్ ఐడి తో ఒక తోపు దాడి కూడా చేశాడు ... రచనా శైలి ఎవరిదో నేను ప్రత్యేకంగా చేపనవసరం లేదు అనుకుంటా

    రిప్లయితొలగించండి
  11. ప్రవీణ్,
    >>ఆ మధ్య నాకు ఎవడో ఫోన్ చేసి తన పేరు నాదెండ్ల గణేష్, గుంటూరు అని చెప్పాడు. నాకు అనుమానం వచ్చి ఫోన్ పెట్టేశాను.


    నాదెండ్ల జూనియర్ డాక్టర్ లండన్ అని చెప్పి ఉంటే ఏం మాట్లాడేవాడివి? చిన్న డౌట్

    రిప్లయితొలగించండి
  12. శ్రీనివాస్, ఓ బాగా గుర్తుచేసావు.గడిచిపోయి చాలా కాలమైంది కదా, నాకసలే మతిమరుపు. ఇప్పుడు మార్చాను చూడండి. మీకు అలా రచనా శైలిని విశ్లేషించే ఆ విద్య తెలిస్తే నలుగురికీ నేర్పవచ్చు కదా. ఇంతకీ తొలిఅడుగు కార్తీక్ ఎవరు? ఆ ఫేక్ ఎవరు? అదే రచనా శైలిని ఉపయోగించి విశ్లేషించి చెప్పండి. నలుగురూ వింటారు. అలాగే మీ విద్యను పైనున్న అందరికీ వర్తించి ఎవరు ఎవరో రీసెర్చ్ చేసి చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా.బ్లాగర్లు కూడా ఎవరు ఏమిటో అనే సస్పెన్స్ తట్టుకోలేక చచ్చిపోతున్నారు.

    రిప్లయితొలగించండి
  13. నేను చెప్పనక్కర లేదు అన్నాను గాని నాకు తెలుసు అన్నానా చెప్పండి .... అసలే చిన్న వాడిని నాకేం తెలీదు

    రిప్లయితొలగించండి
  14. మంచుపల్లకి,

    అదే నేనంటున్నా .. 'ఐడి తో కామెంట్ చేసినా, అది డిలీఎట్ చేసి బూతు అని ప్రత్యారోపణ ' చేసే వారున్నారు. మరి ఐడి మిమ్మల్ని దోషి గా నిలపెట్టింది ( కాకున్నా ).

    భాస్కర్ గారు,
    నేనన్నది, అనామకుడి కామెంట్లలో మరీ అసభ్యమైన తిట్లు వుంటే , వాటిని ప్రచురించకుండా ఆపేయమని.

    రిప్లయితొలగించండి
  15. ఐన పైన చెప్పిన గొడవల్లో చాలా వరకు మలక్ ఇన్వాల్వ్ అయినవే ఉన్నాయి .... మలక్పేట్ ని ఇరికించడానికి ఏమన్నా రాశారా ... అయన అసలే రౌడీ.

    రిప్లయితొలగించండి
  16. S, Manchu pallaki, Srinivas,
    మీ ప్రతి వ్యాఖ్యకు సమాధానమిచ్చేంత సమయం దొరకక పోవచ్చు.ధన్యవాదాలు.




    శ్రీనివాస్, ఎవరెవరో నిర్ణయించే టపా కాదండీ.అయినా ఎవరెవరో తెలిసింది అనుకోండి. ఏంచేస్తాము? అవునా అని బుగ్గలు ఒత్తుకోవడం తప్పించి?

    మీరు టపాను మరొకసారి సరిగా చదవండి. ఇక్కడ నేను వ్రాయదలచుకున్నది పైన చెప్పిన టెక్నాలజీల గురించి. మీకు ఇవన్నీ తెలిసి వుంటే ఓకె. లేకుంటే జాగ్రత్తగా ఫాలో అయిపోండి.

    రిప్లయితొలగించండి
  17. లిస్టులో నా పేరు లేదు. ఇప్పుడు నేను సంతోష పడాలా లేక విచార పడాలా?

    రిప్లయితొలగించండి
  18. లిస్టులో నా పేరు లేదు. ఇప్పుడు నేను సంతోష పడాలా లేక విచార పడాలా?

    రిప్లయితొలగించండి
  19. @Malakpet Rowdy

    :-)

    @శరత్ 'కాలమ్'

    మీగొడవేంటో చెపితే అదికూడా పెట్టాస్తా.

    రిప్లయితొలగించండి
  20. మీతోనే నా గొడవ. నా పేరు లిస్టులో లేదని!

    రిప్లయితొలగించండి
  21. శరత్, నాతోనా గొడవ లేక మీ బాయ్యతోనా ;)

    అబ్బా, ఈ కామెంట్స్ కు సమాధానాలివ్వడము చాలా పని గా వుంది. మళ్ళీ కామెంట్స్కు సెలవు ప్రకటించాల్సి వస్తుందేమో.

    రిప్లయితొలగించండి

Comment Form