భా.రా.గారు, ఈ రోజే వీలుచిక్కి అన్ని కవితలూ చదివాను. అద్భుతంగా వున్నాయి.అంతకన్నా వాటికి జతపరిచిన చిత్రాలు ఇంకా బావున్నాయి.కాకపోతే,వేకువ వెలుగులు-9లో,కాస్త దీర్ఘాల సంగతి చూడాలి.ఎవరు రాసారు దాన్ని? మీ బ్లాగు లోని కవితల వల్ల అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను. మళ్ళీ,మళ్ళీ చదువుకోవాలి సెలవు మరి. అనూ
భాస్కరరామిరెడ్డి గారు - కవిత్వం మీద మీరు చూపించే మక్కువ నేను చాలాసార్లు గమనించాను. అలానే, మీరు వ్రాసిన చాలా రచనలు చదివాను. చాలా సార్లు చెబుదామనుకున్నా, తటపటాయించాను. ఇక ఆగలేక ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. నొప్పించినట్లు ఉంటే, ఈ వ్యాఖ్యను తీసేయండి.
కవిత్వంలో వ్యర్ధ పదాలతో కవి మిత్రులు చేసే విన్యాసాలను, అక్కిరాజు ఉమాకాంత దీక్షితులవారు "కవిత్వంలో వాచాలత" గా అభివర్ణించారు. అనవసరమైన పదం ఒక్కటి కూడా లేకుండా వ్రాయగలిగినప్పుడే కవిత్వంలో గాఢత వస్తుంది, పరిపూర్ణత కూడా కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ కవిత చూస్తే, శుభోదయానికి - శుభశుభోదయానికి తేడా ఏమిటి? చెంగల్వ పూదండల మణిహారాలా? అంటే, చెంగల్వ పూదండలతో చేసిన మణిహారాలా! మేలుకొలుపు గీతాల్లో మొగ్గతొడిగే మమతానురాగాలా? అంటే ఏమిటి? మేలుకొలుపు గీతాల్లోనే మొగ్గతొడుగుతాయా మమతానురాగాలు? అంతరంగ ఆంతర్యం అంటే ఏమిటి అర్ధం? ఆంతర్యం అంటే సరిపోదా?
అనూ గారూ, ఈ చిట్టి కవితలు ( అసలు కవితలేనా?? ) రైలు కవితలండి. ప్రొద్దున ప్రయాణంలో ఏదితోస్తే అది టెంగ్లీష్ లో వ్రాసుకొని బ్లాగులో పెట్టడమేకానీ బాగుందా, లేదా తప్పులున్నాయా అని చూసుకొని పెట్టినవి కాదు. అయినా మీ సూచన అభిలషణీయం. ఇకనుంచి దీర్ఘాలు, వత్తులు జాగ్రత్త తీసుకుంటాను
చిన్నీ ఆ రోజు ఆఫీసు కు వెళ్ళగానే చాలా పని వున్నది. బొమ్మ వెతకటానికి టైం లేదు.
సాయి కిరణ్ గారూ, విమర్శ్య వ్రాయటానికి తటపటాయింపు దేనికండి? ఇవి కవితలు అని చెప్పేకన్నా, ప్రొద్దున శుభోదయపు మైల్స్ అని చెప్పుకుంటే మేలు. ఇక నావరకు మనసు ఆహ్లాదాన్ని కలిగించేది ఏదైనా ఆస్వాదిస్తాను. అందులో పదాలు పునరావృత్తమయ్యాయా ఈ పదము అవసరమా ఇక్కడ అనే సంశయాలు రావు. మీరు చెప్పిన అభిప్రాయము అక్కిరాజు ఉమాకాంత దీక్షితులవారిది అంటున్నారు కాబట్టి వారికి అవి నచ్చకపోయి వ్రాసి వుండవచ్చు.కానీ నాకలాంటి పట్టింపులు లేవు.చదివిన తరువాత నా మనసుకు హాయినిస్తే చాలు. ఆ రకంగా చూస్తే మన పద్యకవితల్లో చాలా చాలా వ్యర్థపదాలు కనిపించినట్లు అనిపిస్తాయి. అలా అని పద్యకవితలు వృధాఅనలేము కదా.
ఇక్కడ ఒక శుభము అంటే మంగళ కరమైన రోజుగా రెండో శుభాన్ని మంచి పదానికి పర్యాయ పదంగా వ్రాసుకున్నాను. ఇక రెండోది "చెంగల్వ, పూదండల, మణి హారాలు" అలాగే అంతరంగం వేరుగా ,ఆంతర్యం వేరుగా వాడాను. అంతరంగం
మనిషి అంతరంగమంటే మనిషిహృదయమనే అర్థంలో ఆంతర్యం అంటే అందులో జనించే అభిప్రాయంగా ను వాడాను.
సాయి కిరణ్ గారూ నాకు తెలిసిన తెలుగు చాలా తక్కువ.అలాగే కవిత్వాన్ని సాధన చేసి నలుగురిని మెప్పించాలన్నంత సమయం కూడా దొరకడం కనాకష్టము.మీ ఆత్మీయ విమర్శకు ధన్యవాదాలు.
భా.రా.గారు, ఈ రోజే వీలుచిక్కి అన్ని కవితలూ చదివాను. అద్భుతంగా వున్నాయి.అంతకన్నా వాటికి జతపరిచిన చిత్రాలు ఇంకా బావున్నాయి.కాకపోతే,వేకువ వెలుగులు-9లో,కాస్త దీర్ఘాల సంగతి చూడాలి.ఎవరు రాసారు దాన్ని? మీ బ్లాగు లోని కవితల వల్ల అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను.
రిప్లయితొలగించండిమళ్ళీ,మళ్ళీ చదువుకోవాలి సెలవు మరి.
అనూ
చిత్రాలు లేకపోవడం లోటు కొట్టొచ్చినట్లుంది.మీ కవిత కు మెరుపులవేగా-:)
రిప్లయితొలగించండిమాక్కూడాన మణిహారాలు !....
భాస్కరరామిరెడ్డి గారు - కవిత్వం మీద మీరు చూపించే మక్కువ నేను చాలాసార్లు గమనించాను. అలానే, మీరు వ్రాసిన చాలా రచనలు చదివాను. చాలా సార్లు చెబుదామనుకున్నా, తటపటాయించాను. ఇక ఆగలేక ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. నొప్పించినట్లు ఉంటే, ఈ వ్యాఖ్యను తీసేయండి.
రిప్లయితొలగించండికవిత్వంలో వ్యర్ధ పదాలతో కవి మిత్రులు చేసే విన్యాసాలను, అక్కిరాజు ఉమాకాంత దీక్షితులవారు "కవిత్వంలో వాచాలత" గా అభివర్ణించారు. అనవసరమైన పదం ఒక్కటి కూడా లేకుండా వ్రాయగలిగినప్పుడే కవిత్వంలో గాఢత వస్తుంది, పరిపూర్ణత కూడా కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ కవిత చూస్తే, శుభోదయానికి - శుభశుభోదయానికి తేడా ఏమిటి?
చెంగల్వ పూదండల మణిహారాలా? అంటే, చెంగల్వ పూదండలతో చేసిన మణిహారాలా!
మేలుకొలుపు గీతాల్లో మొగ్గతొడిగే మమతానురాగాలా? అంటే ఏమిటి? మేలుకొలుపు గీతాల్లోనే మొగ్గతొడుగుతాయా మమతానురాగాలు?
అంతరంగ ఆంతర్యం అంటే ఏమిటి అర్ధం? ఆంతర్యం అంటే సరిపోదా?
కుక్కపిల్లా ,అగ్గిపుల్లా ,సబ్బుబిళ్ళా
రిప్లయితొలగించండిహీనంగా చూడకు దేన్నీ !
కవితా మయమేనోయ్ అన్నీ !
రొట్టెముక్కా ,అరటితొక్కా,బల్లచెక్కా
నీ వేపే చూస్తూ ఉంటాయ్ !
తమ లోతు కనుక్కోమంటాయ్
తలుపుగొళ్ళెం ,హారతి పళ్ళెం ,గుర్రపు కళ్ళెం
కాదేది కవిత కనర్హం !..
ఉండాలోయ్ కవితావేశం !......
కానీవోయ్ రస నిర్దేశం !
దొరకదటోయ్ శోభాలేశం !
కళ్ళంటూ ఉంటె చూసి
వాక్కుంటే వ్రాసి !
ప్రపంచమొక పద్మవ్యూహం !
కవిత్వమొక తీరని దాహం !
అనూ గారూ, ఈ చిట్టి కవితలు ( అసలు కవితలేనా?? ) రైలు కవితలండి. ప్రొద్దున ప్రయాణంలో ఏదితోస్తే అది టెంగ్లీష్ లో వ్రాసుకొని బ్లాగులో పెట్టడమేకానీ బాగుందా, లేదా తప్పులున్నాయా అని చూసుకొని పెట్టినవి కాదు. అయినా మీ సూచన అభిలషణీయం. ఇకనుంచి దీర్ఘాలు, వత్తులు జాగ్రత్త తీసుకుంటాను
రిప్లయితొలగించండిచిన్నీ ఆ రోజు ఆఫీసు కు వెళ్ళగానే చాలా పని వున్నది. బొమ్మ వెతకటానికి టైం లేదు.
సాయి కిరణ్ గారూ, విమర్శ్య వ్రాయటానికి తటపటాయింపు దేనికండి? ఇవి కవితలు అని చెప్పేకన్నా, ప్రొద్దున శుభోదయపు మైల్స్ అని చెప్పుకుంటే మేలు. ఇక నావరకు మనసు ఆహ్లాదాన్ని కలిగించేది ఏదైనా ఆస్వాదిస్తాను. అందులో పదాలు పునరావృత్తమయ్యాయా ఈ పదము అవసరమా ఇక్కడ అనే సంశయాలు రావు. మీరు చెప్పిన అభిప్రాయము అక్కిరాజు ఉమాకాంత దీక్షితులవారిది అంటున్నారు కాబట్టి వారికి అవి నచ్చకపోయి వ్రాసి వుండవచ్చు.కానీ నాకలాంటి పట్టింపులు లేవు.చదివిన తరువాత నా మనసుకు హాయినిస్తే చాలు. ఆ రకంగా చూస్తే మన పద్యకవితల్లో చాలా చాలా వ్యర్థపదాలు కనిపించినట్లు అనిపిస్తాయి. అలా అని పద్యకవితలు వృధాఅనలేము కదా.
రిప్లయితొలగించండిఇక్కడ ఒక శుభము అంటే మంగళ కరమైన రోజుగా రెండో శుభాన్ని మంచి పదానికి పర్యాయ పదంగా వ్రాసుకున్నాను. ఇక రెండోది "చెంగల్వ, పూదండల, మణి హారాలు"
అలాగే అంతరంగం వేరుగా ,ఆంతర్యం వేరుగా వాడాను. అంతరంగం
మనిషి అంతరంగమంటే మనిషిహృదయమనే అర్థంలో ఆంతర్యం అంటే అందులో జనించే అభిప్రాయంగా ను వాడాను.
సాయి కిరణ్ గారూ నాకు తెలిసిన తెలుగు చాలా తక్కువ.అలాగే కవిత్వాన్ని సాధన చేసి నలుగురిని మెప్పించాలన్నంత సమయం కూడా దొరకడం కనాకష్టము.మీ ఆత్మీయ విమర్శకు ధన్యవాదాలు.
చిన్నీ నావరకూ కవిత ఐనా కథ అయినా పాఠకుని అనుభూతిమీద ఆధారపడి వుంటుంది. పాఠకులు పండితులే కానక్కరలేదు. సామాన్య మానవుని పరవశింపచేసే ప్రతీదీ కవిత్వమే.
రిప్లయితొలగించండి