3, మార్చి 2010, బుధవారం

వేకువ వెలుగులు - 1





వాన చినుకు చిరు జల్లై

లోక మంతా ముసురు గప్పి

ముడుచు కున్న పూబాలల

రెక్కల విప్పార్చి

ముత్యపు రుద్రాక్షలు రచించి

మేలుకొలుపుల సన్నాయి స్వాగతగీతమాలా స్వరార్చనలతో

మనిషి మది గదిలో మమతల చినుకులు కురిపించి

నడిచి వచ్చింది మరో ఉదయం.

4 కామెంట్‌లు:

  1. అధ్బుతంగా వుందిగా మీ ఉదయం !

    రిప్లయితొలగించండి
  2. ఈ వేకువ వెలుగులు ఎడతెరపి లేకుండా మమతల మేల్కొల్పులు కావాలని ఆశిస్తూ....

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞానులం అయ్యోరు, "ముత్యపు రుద్రాక్షలు రచించి" అనగా అర్థం వివరించగలరు. కాసింతా కామాలు పెడితే అవి అన్నీ కలిపి నాలుగు పనులని విశదమయ్యేది ఎల్లవారలకీను.

    ఏమి ఇవాళ మీ తూర్పు రాష్ట్రాల్లో వానా పడిందా? మాకింకా మంచే కరగలేదు, మీకు పూబాలలు రెక్కలు విప్పాయా?

    బయట వాన చాలకనా మళ్ళీ మదిలోనూ వానలు, వరదలూను... వసంతకేళీ అయితే అదిపోలేగానీ... ;)

    రిప్లయితొలగించండి
  4. @చిన్నీ, ధన్యవాదాలండి.


    @పద్మార్పితా, అంతా పద్మనాభుని దయ. మీ కోరికతో అలాగే అనేస్తాను :)

    @ఉషా, సెల్ప్ మేడ్ అజ్ఙాని :)

    "ముత్యపు రుద్రాక్షలు రచించి" అంటే, మాకు ఆరోజు అప్పుడే చిన్నగా మొదలైన వర్షకారణంగా పువ్వులపైన తెల్లని హిమ బిందువులు రుద్రాక్షల ఆకారంలో పూరేక్కల పైన అలా నిలిచి పోయాయి. అదన్నమాట.

    బయటవాన కురిస్తేనే కదా మదిలో వానలూ, వరదలూ వసంతకేళీ లూనూ

    రిప్లయితొలగించండి

Comment Form