10, మార్చి 2010, బుధవారం

వేకువ వెలుగులు - 8 By భావన


వేదాల విన్నపాలు ప్రచండ భాస్కరుని మది దోచగా
సప్తాశ్వాల మీద పరుగు పరుగున ప్రయాణ మయ్యేడనుకుంటా...

రధపు జేగంటల మోత... ఆకశాన చిరు వెలుగుల తునకలు
చెల్లా చెదురు గా మబ్బు మొలకలయ్యాయి..
వాయు వేగాన రావాలనేమో...
గాలి దేవుని తోడు తీసుకుని, చిరు తెమ్మేరలను మాత్రం
మనకు బహుమానమిచ్చాడు....

నేనోస్తున్నానో అని వసంతం పచ్చదనాన్ని చిలక ముక్కు ఎరుపుదనాన్ని
చెదురు మదురు గా విసిరేసింది తన ఆనవాలు గా.....
నవ్వుతున్న కన్నె మదిన వెలిగిన కోటి ఆశల మెరుపల్లె వెలుగుతున్న
సూరీడుకు శుభారంభం........

ఆ తలపులను మదిన దాచుకున్న మిత్రులందరికీ

శుభ దిన మవ్వాలని కోరుకుంటూ ఇంకో రోజు లోకి పయనం..

2 కామెంట్‌లు:

  1. నిజ్జంగా బాగుంది భావన... ++ భా.రా.రె. :) కాసింత దిష్టిచుక్క పెట్టనీవే..

    వెలుగుల్లో కరిగి, వెన్నెలల్లో తడిసిన కాలం
    వేదనల్లో మునిగి శోధనలో వేగిన శోకం
    వేకువల్లో హృదయగానం, వేయిగొంతుల నాదస్వరం

    అంతేలేని ఈ జీవితాన ఆగని ఉదయాలు, ఆరని నెగళ్ళు...

    తెల్లారిందిగా.. లేవండిక, నవ్వు రంగు అద్దుకుని రంగవల్లిగా మొహం మెరిపించండి.. ముందుపలుకు అక్కరలేని మాటలువొలికించండి.

    రిప్లయితొలగించండి
  2. తడిసి కరిగినా, వేగి వేసారినా, వేకువ వెల్లువల మలుపుల రాకాసి వుందని భయపెట్టినా, ఆనక కన్న కన్ను భాగ్యామార కన్నయ్యను వరించినా ముసిరిన చీకటి మెరవకా తప్పదు మెరిసిన వెలుగు మలగక తప్పదు.. నువ్వన్నట్లు రంగ వల్లులే వంటి మలుపులై పలుకు లేని పాదానికి పలవరింతల పువ్వులద్దుదాములే ఉష.

    రిప్లయితొలగించండి

Comment Form