16, మార్చి 2010, మంగళవారం
ఉగాదీ నీ గమ్యమేది?
కోనల్లో చిరుగాలి ఎలుగెత్తి పిలచింది
కోకిలమ్మ గళమెత్తి పాటల్నిపాడింది
ఉయ్య్యాలలూగంగ నల్లేటి దారుల్లో
వయ్యారి నడకల్తో వేంచేయు ఉగాదీ
అందంద తిరగాడి గిరగిరా తిరిగి
ఆరు పదులకొక్కమారు కనిపించు ఉగాదీ
తోపులోని లేత మామిళ్ళు పాలు కార్చంగ
వీధిలోని అరుగులన్ని వేపతివాచీలవ్వంగ
ఊరూరు తలలూపి పంచాంగమాలకింపంగ
వచ్చి ఇంటిముందువాలితివా ఓ వికృతీ
క్షేమంగ పలకరించి ఆతిధ్యమిస్తావు
ప్రేమంత రంగరించి రుచులన్ని చూపుతావు
ఆదమరచి నిద్దురోయి కాలాన కలిసిపోక
సార్థక నామధేయితవై సత్ చరితవై
కాపాడవమ్మ వికృత రూపులనుంచి
వికృత రూపితవై విరాట్ మూర్తివై.
ఉగాది శుభాకాంక్షలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండి"తోపులోని లేత మామిళ్ళు పాలు కార్చంగ
వీధిలోని అరుగులన్ని వేపతివాచీలవ్వంగ"
భా.రా.రె. ఉగాది పండుగ వాతావరణం చక్కగా చెప్పారు.
భా రా రే గారు
రిప్లయితొలగించండిమీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిP.S. : మీ కవిత చాలా బాగుంది!
మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!
రిప్లయితొలగించండిమీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి"వీధిలోని అరుగులన్ని వేపతివాచీలవ్వంగ"
రిప్లయితొలగించండిబాగుందండీ . మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .
మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిఉగాది శూభాకాంక్షలు భా.రా.రె.
రిప్లయితొలగించండి"సార్థక నామధేయితవై సత్ చరితవై
కాపాడవమ్మ వికృత రూపులనుంచి
వికృత రూపితవై విరాట్ మూర్తివై." :-)
బాగుంది ఆఖరి చరణం లోని చమత్కారం.
మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిఉష,
రిప్లయితొలగించండిమంచుపల్లకి,
చంద్రమ్మ,
ధరణీరాయ్ చౌదరీ,
మధురవాణీ,
చిన్నీ,
విజయమోహన్,
మాలాకుమార్,
భావన,
పద్మార్పితా
మీకు ఉగాది శుభాకాంక్షలతో పాటి శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా. లేటయిందని కినుకు పడకండి. డబల్ శుభాకాంక్షలు అందుకోండి.