3, డిసెంబర్ 2011, శనివారం

సంక్రాంతి కి విడుదల కాబోతున్న హారం పత్రికా ప్రతికై రచయితలకాహ్వానం. ఇరవై వేల పైన బహుమతులు

సంక్రాంతి కి విడుదల కాబోతున్న హారం పత్రికా ప్రతికై రచయితలకాహ్వానం. ఇరవై వేల పైన బహుమతులు

సాహితీవేత్తలకు,పరిశోధనా ప్రియులకు,సాహిత్యాభిలాషులకు,హారం పాఠకులకు ముందుగా నమస్కారములు. ఈ చిన్న వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యము అంతర్జాలంలో హారం ద్వారా తెలుగులో ఒక పత్రికను తీసుకువస్తే బాగుంటుందన్న ఆలోచనే. ఇది ఒక్కపత్రికే కావచ్చు లేదా ఆ సంచికకు వచ్చే ఆదరణను బట్టి తెలుగువారికి ముఖ్యమైన పండగలప్పుడు ఓ సంచికనో తీసుకు వచ్చే ఆలోచన. కాబట్టి ఇది పండగలకు మాత్రమే వచ్చే పత్రికే. అంటే వార,పక్ష,మాస,త్రైమాసిక పత్రికల విభాగంలోకి రాదు.

హారం ఆవిర్భావం 2009 సంక్రాంతి రోజు. ఈ పుణ్యకాలాన్ని పురష్కరించుకొనే ఈ పత్రికా ప్రతిని కూడా ఈ సంక్రాంతి పర్వదినాలలోనే వెలువరించాలని కోరిక. అప్పుడప్పుడు మాత్రమే వచ్చే పత్రిక కాబట్టి ఇందులో దరిదాపు పదిహేను విభాగాలాకు పోటీలు బహుమతులను ఇవ్వాలనుకుంటున్నాను. గొప్ప గొప్ప బహుమతులు లేకున్నా ప్రధమ,ద్వితీయ బహుమతులుగా మంచి మంచి పుస్తకములను కానీ డబ్బురూపంగా కానీ ఇవ్వడం జరుగుతుంది.

అన్ని రచనలు డిసెంబరు 31 2011 లోగా పంపాలి.

కొన్ని సూచనలు
-------------
౧) ఆయా ప్రశ్నల కిచ్చిన నిడివిని బట్టి మీ పేజీలు A4 సైజులో ,తెలుగు ఫాంటు 12 పరిమాణముతో యూనికోడ్ లో వుండాలి.

౨) రచయిత భావాలు స్వతంత్రమైనవై, పరిశీలించిన గ్రంధములను, వాటి రచయితలను తప్పని సరిగా పేర్కొనాలి.

౩) రచయిత పంపే వ్యాసపు ప్రచురణ హక్కులు హారానికి ఇవ్వాలి. అంటే హారంలో ప్రచురించడానికి మంచివాటిని ఆంగ్లానువాదము చేసి ప్రచురించడానికీ సర్వ హక్కులను హారముకు ఇవ్వవలసి వుంటుంది.

౪) ఇవి ఇంతకు మునుపు ఎక్కడా ప్రచురించనివై వుండాలి.


ఇక అంశాలు
-----------

1) ఆంధ్ర మహాభారత,భాగవతముల నాధారంగా చేసుకొని ఇతివృత్తపు కాలము నాటి సామాజిక, సాంఘిక, కుటుంబ అంశములను విస్తృతంగ పరిశోధనా వ్యాసంగా వ్రాయాలి. ఈ వ్యాసం వ్రాసేటప్పుడు ఈ క్రింది నియమాలు తప్పక దృష్టిలో వుంచుకోవాలి.

ఈ పరిశోధనా వ్యాసంలో సాధ్యమైనంత వరకూ భారతములోని అన్ని పర్వాలనూ, భాగవతములోని అన్ని స్కందములను స్పృశిస్తూ సాగాలి. సాంఘిక,సామాజిక,కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించని పర్వములను కానీ, స్కందములను గానీ వదిలివేయవచ్చు.

అవసరమైనచోట మూల పద్యములనుదహరిస్తూ,వానికి తాత్పర్యములను చెప్తూ, ఆ పద్యములను ఆధారంగా రచయిత ఆనాటి పరిస్థితులను విస్తృతంగా పదవతరగతి విద్యార్థికి అర్థమగు వచనములో వివరించగలగాలి. వ్యాసము తప్పని సరిగా తెలుగులోనే వుండాలి.

2) బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దడంలో భారతదేశములోని మతముల పాత్ర పదిపేజీలకు మించకుండా వ్రాయాలి.

3) పదవ శతాబ్దానికి ముందు పల్లెజీవనాన్ని ప్రతిబింబిస్తూ మనుషుల ఆత్మీయానురాగాలతో పాటు ద్వేషభావాన్ని అంతర్లీనంగా చూపిస్తూ,ఆనాటి పల్లె భాషను ఊహించి, ఓ పదిపేజీల ( సుమారుగా ) చక్కని కథానిక వ్రాయాలి.

4) మారుతున్న సమాజములో పిల్లల మనస్తత్వాలలో వస్తున్న మార్పులు, వారిని పెంచడములో తల్లి తండ్రుల పాత్ర పై వ్యాసాన్ని వ్రాయాలి. మీ వ్యాసంలో 8 నుంచి 18 సంవత్సరాల పిల్లల మనస్తత్వాలను విశదీకరిస్తూ వారిపై చుట్టూవున్న సమాజం, కుటుంబము ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ఉదాహరణలతో వివరిస్తూ వారి పెంపకములో వచ్చే సమస్యలను సామరస్యంగా ఎలా పరిష్కరించాలో వ్రాయాలి. ఎన్ని పేజీలుండాలన్నది రచయిత ఇష్టము.

5) మహాత్మాగాంధీ హత్యానంతర భారతదేశములో వచ్చిన అన్ని రకముల మార్పులను ( మంచినీ, చెడునూ ) సోదాహరణంగా ఇరవై, ఇరవైదు పేజీలకు మించకుండా వ్రాయాలి. ఈ ప్రశ్నకు inspiration, India after gandhi By Ramachandra guha చదవడము ద్వారా వచ్చింది.

6) కులవృత్తులు కార్పొరేట్ వృత్తులుగా మారుతున్న ఈ తరుణంలో కులవృత్తులపై కథానిక లేదా చిన్న నవల. నిడివి రచయిత ఇష్టం.

7) భారతరాజ్య వ్యవస్థలో బఫూన్ల పాత్ర. హాస్య / వ్యంగ్య ప్రధానమైన రచన. ఈ రచనలో అందరూ భాగస్వాములే. అంటే మీ రచనల్లో ఛీఫ్ పౌరుని దగ్గరనుండి, చీపురు పౌరుని దాకా ఒక్కొక్కరిగానైనా లేదా మూకుమ్మడిగా నైనా భారతదేశాన్ని నడపవచ్చు!!! రచనల్లో దూషణకు చోటులేదు.

8) ఆంధ్రా అమ్మాయి, తెలంగాణా అబ్బాయిల అమెరికా జీవితం పై ఓ మంచి కథ. మధ్యమధ్యల్లో కవిత/పద్యము కూడా, ఓపికకొద్ది అప్పుడప్పుడు అగచాట్లూ,చీవాట్లూ వేసుకోవచ్చు :))

9) శైవ/వైష్ణవ మతఘర్షణల తీవ్రతను, దానినుంచి దైవమొక్కడే అన్నదిశగా ప్రయాణించిన మన సమాజ చరిత్రకు కుంచెద్వారా రంగులద్దండి. ఈ చిత్రలేఖనానికి భావం ప్రధానం. వాటర్/ఆయిల్/పెన్సిల్ ఏ పద్ధతినైనా ఉపయోగించవచ్చు.

10) రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచపటంపై భారతదేశం. ఈ అంశపై పద్య / గేయ కవిత.

11) సంక్రాంతి ప్రాశస్త్యాన్ని, దాని చరిత్రను, పల్లె ప్రాంత పండుగ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు ఓ రచన.
ఇది పద్యగద్యమైనా కావచ్చు లేదా పాట యైనా కావచ్చు. హరికథ, బుఱ్ఱకథ, లేక రూపకమైనా కావచ్చు. రచనా ప్రక్రియ యేదైనా సరే పైన చెప్పిన విషయము రస ప్రధానమై సంతోష వాతావరణములో సాగాలి. వేరే గ్రంధములనుండి పద్యములనుదహరించినప్పుడు అవి తప్పక తాత్పర్యసహితమై వుండాలి. సినిమాలనుండి పాటలను తీసుకొన్నా ఆ పాటలోను ముఖ్యమైన సొగసులన్నీ చెప్పాలి. నిడివి కనీసం ఐదు పేజీలైనా వుండాలి.

12) శృంగారము, ఉత్కంఠత మేళవిస్తూ శ్రీకృష్ణదేవరాయలకాలపు RAW and PIA :-) వ్యవహారములపై ఓ నాటిక/నవల.

13) "Life starts from the dark and ends in dark" ( a quotation from BLACK movie) . దీన్ని ఆధారంగా తీసుకొని భారతీయ తత్వశాస్త్రాన్ని మేళవించి ఓ పది నిమిషాల వీడియో సినిమా.

14) మీకు నచ్చిన రచన ఏదైనా పంపవచ్చు. రచన మీ స్వంత రచనయైవుండాలి. మాకు నచ్చిన రచనకు బహుమతి


15) ఇది కొద్దిగా మా భుజాలను మేమే చరుచుకోవడానికి ఎన్నుకొన్న ప్రశ్న. అదీ సంగీత ప్రధానమైనది. ప్రశ్న ఏమిటంటే హారం,హారం పత్రిక పై ఓ పాటను రచించి స్వరపరచి గానం చేసి ఆడియో పంపాలన్న మాట :))


. ఏఏ అంశానికి ఎంత బహుమతో ఈ క్రింద చూడవచ్చు.ఇది రచనల ప్రోత్సాహానికి మాత్రమే అని గమనించగలరు.మీరచనలకు ఈ చిన్నచిన్న బహుమతులు ఏమాత్రమూ కొలమానము కాదు. ఇక దీనిపై ఏవైనా విరాళాలు వచ్చినా ఆ విరాళాన్ని మొత్తాన్నీ పైనున్న బహుమతుల కు కలుపుతాను. అంటే మీరిచ్చే విరాళాలు ఏ అంశానికివ్వ దలచుకున్నారో కూడా చెప్తే ఆ అంశానికి ప్రధమ, ద్వితీయ బహుమతులలో కలుపుతాను.

28 కామెంట్‌లు:

  1. భాస్కర రెడ్డి గారు,

    మంచి ప్రయత్నము. చిన్న పిల్లలకు కూడా ఏమైనా ఇందులో అవకాశము కల్పించి వుండిన రాబోవు తరము వారలకు స్ఫూర్తి గా ఉండు నేమో ?

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. Zilebi గారూ, ధన్యవాదాలు. ఇక చిన్నపిల్లల కేటగిరీకి బడ్జెట్ లేదు. ఈ సారి సంక్రాంతికి ట్రై చేస్తాను.

    రిప్లయితొలగించండి
  3. మీ ప్రయత్నం ప్రశంసనీయం డియర్ భాస్కర రామిరెడ్డి గారు. అభినందనలు.....నూతక్కి రాఘవేంద్ర రావు (కనకాంబరం)

    రిప్లయితొలగించండి
  4. హబ్బ! ఎన్నిరోజులకు కనిపించారు నూతక్కి గారూ!!. ఏమైనారు ఇన్నినాళ్ళు?

    ధన్యవాదాలు మాత్రమేనే? కలంపట్టరా?

    రిప్లయితొలగించండి
  5. భాస్కర రామి రెడ్డి గారూ......ఇది మంచి ప్రయత్నం... బహుధా అభినందనీయం.... రచయితల నుంచి కూడా మంచి ప్రమాణాలున్న రచనలు వస్తాయని ఆశించవచ్చు. కొంత మంది రచయితలకు తెలుగు టైపింగ్ ఇబ్బంది అవుతుందేమో...రాత ప్రతులు కూడా స్వీకరిస్తే బాగుంటుంది కదా....లేదా డిటిపి అయినా.... తర్వాత బాగున్న వాటికి యూనికోడ్ రూపం కల్పించవచ్చు.... ఏమంటారు?....

    రిప్లయితొలగించండి
  6. తమిరి గారూ, రచనలు బాగుంటే అలాగే చేద్దాము. యూనీకోడ్ లో ఎలా టైపు చెయ్యాలో తెలియని వారు, కంప్యూటర్ విజ్జానం పెద్దగా తెలియని వారు వారికి నచ్చిన రీతిలో రచనలను పంపవచ్చు.

    మీ సూచనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. పోటీ ఆలోచన బాగుంది. కాకపోతే రెండు సమస్యలు - 31 డిసెంబరు మరీ తక్కువ సమయం. సరే సంక్రాంతికి ప్రచురించాలి కాబట్టి తప్పదు. ముందే ప్రకటించి వుండాల్సింది.
    ఇక రెండొవది అసలు సమస్య - స్థూల కథ, పాత్రలు, భాష తో సహా అన్నీ మీరే చెప్పేస్తే ఇక మేం రాసేదేముంది. అంతా రాసి వెనక్కి తిరిగి చూస్తే మొత్తం మీరే కనిపిస్తున్నారు..!! :)

    రిప్లయితొలగించండి
  8. అరిపిరాల గారు,

    అది భారారె హృదయ స్పందన. మీ చిరు సవ్వడి అని చెప్పండి!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  9. ఇలాంటి పోటీలు నిర్వహించాలన్న యోచన రావడం గ్రేట్

    రిప్లయితొలగించండి
  10. హహ సత్యప్రసాద్ గారూ, అలాగైతే " ఈ కథ అచ్చంగా నా కథే " అని మీకనిపించేదాకా మళ్ళీ మళ్ళీ వ్రాయండి :)). రచన చేస్తుంన్నందుకు ధన్యవాదాలండి.

    ఇకపోతే,అసలు పత్రిక ఆలోచనే యాదృచ్చికం. కాబట్టి రచయితలకు ముందుగా అంశాలను ఇవ్వలేకపోయాను. ఇక మీరు చెప్పిన అసలు సమస్య........
    ప్రశ్న 1,3,12 తప్పించి మిగిలిన అన్నింటికి భాషపై రచయితకు పూర్తి స్వాతంత్ర్యమే వుందనిపిస్తుంది. ఈ మూడింటిలో కూడా మూడవ ప్రశ్నైతే అసలు ఆ రోజుల్లో వాడుక భాష ఎలా వుండేదన్నది ఎక్కడా ప్రామాణికాలు లేవు. అదికూడా పూర్తిగా రచయిత ఊహాగానమే. పల్లెటూరి యాసకు దగ్గరగా ఆ శతాబ్దిలో ఈ పదాలు వాడి వుండవచ్చన్న ఊహే కదా అది. ఇది వ్యాసం కాదు కాబట్టి ఈ రచన కూడా దేనికీ ప్రామాణికము కాబోదు. అందుకే ఇది కథ అయింది.

    ఇక 12 వ అంశం ఐతే మనకు ప్రంబంధాల పుస్తకాలు విరివిగా లభిస్తున్నాయి కాబట్టి దీనికి గ్రాంధిక భాషను ఊహించవచ్చేమో. కానీ ఇది కూడా వ్యాసం కాదు.

    మిగిలిన వాటిలో, కథాంశం మరియు కొన్ని చోట్ల కథ నవల/నవలిక/కథానికా లేక కథా అని తప్పించి, పాత్రలను నేనెక్కడా ప్రస్థావించినట్టులేదు కదా?. ఈ మాత్రమన్నా ప్రశ్నలు లేకపోతే question paper మరీ white paper లా వుంటుందేమో కదా. అంటే రచయితలే ప్రశ్నలు వ్రాసుకుంటారు కదా ;-). ఇలాంటి వాటికోసం ఉద్దేశింప బడ్డది 14 వ ప్రశ్న.

    రిప్లయితొలగించండి
  11. హహ జిలేబి గారూ, నిజంగా అది నా హృదయ స్పందనే :) ఇంతకీ మీరు చిరు సవ్వడి వ్రాస్తున్నారా లేదా!!

    రిప్లయితొలగించండి
  12. K.N. Murthy గారూ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. 2,6,13 are really awesome !!

    Very good chance for young Talents

    Very nice

    Hearty appreciations to "Haaram Team"

    Thanks
    :)

    ?!

    రిప్లయితొలగించండి
  14. ఈ భాస్కరుడు అందరిని నిద్ర లేపి, రాయండి రాయండి అంటారు గాని, అంత పెద్ద పోస్టులో , అన్ని వివరణలు , టాపిక్కులు వున్నాయి గాని,ఎప్పటి లోపల పంపించాలని ఉంది కాని ఎక్కడి కి ఎ అడ్రస్ కి లేక ఎ ఈమైలు కి పంపించాలి లాంటి మాటే రాయనంటారు. ! నేనూ గమనిస్తూనే వస్తున్నా, మొదటి మారు స్వామి వారు ఈ బృహత్కార్యం మొదలు పెట్టినప్పటి నించి, కాని ఇంత దాకా దాని 'పత్తా' అస్సలు లేదు ! భాస్కారా , మీ ఇంటి అడ్రస్ ఏమి ? ఎక్కడికి పోస్టు చేయ్యవలె ఈ సంక్రాంతి క్రాంతు లని , చిరు సవ్వడులని ?

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  15. Zilebi gaaru :)

    భలే పట్టేసారండి. అసలు మొదటి టపా వ్రాసినరోజు మైల్ ఐడి ఇద్దామనుకున్నాను కానీ ఆ సంగతి మర్చే పొయ్యాను. ఈ సమాచారం తో పోస్టు రేపు మళ్ళీ ప్రచురిస్తాను. పంపాల్సిన ఇ-మైల్ ఐడి : admin@haaram.com

    ఇంటి అడ్రెసు ఊరికే ఇస్తారా :) ఏమన్నా స్వీట్లూ, గీట్లూ పంపిస్తానంటే చెప్పండి ఇప్పుడే ఇచ్చేస్తా :)

    రిప్లయితొలగించండి
  16. రామిరెడ్డి గారు, మీరు ఓ ఫొటోగ్రఫీ పత్రిక కూడా పెట్టొచ్చు కదా. నేను ఈ నెలలో మళ్ళీ బస్తర్ అడవులకి వెళ్తున్నాను, ఫొటోలు తియ్యడానికి.

    రిప్లయితొలగించండి
  17. సరే , ఇంటి అడ్రస్ పంపించండి, స్వీట్లూ, హాట్లూ, మీ కు సంక్రాంతి కి అందేటట్టు చూస్తాను !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  18. >> ఇంటి అడ్రస్ పంపించండి....

    ఎక్కడికి పంపించాలో చెప్పనేలేదు. ఎలా ఇప్పుడు? :)

    రిప్లయితొలగించండి
  19. విమానంలో స్వీట్లు, హాట్లు వెళ్తాయా? ఎందుకంటే రామిరెడ్డి గారు ఉండేది న్యూజెర్సీలో.

    రిప్లయితొలగించండి
  20. భారారె గారు,

    జగమెరిగిన జిలేబి పత్తా హారం అధినేతలకు తెలియదు అనడం నమ్మజాలని విషయం అని సవినయ పూర్వకముగా తెలియ జేసుకుంటున్నాను ఆర్యా

    @ప్రవీణ్ శర్మ గారు,

    భలే వారండీ మీరు, విమానం లో మనుషులే వెళ్తున్నప్పుడు స్వీట్లు హాట్లు వెళ్ళాక పోతాయా ? మా శరవణ భవన్ వారు ఇడ్లీ లనే ఇండియా లో తయారు చేసి అమరికగా అమెరికా కి ఎక్స్పోర్ట్ చేస్తూన్టేనూ - కాదూ, కుదరదూ విమానం లో కుదర్దనుకుంటే మీ తెలుగువెబ్మీడియా ద్వారా పంపించేస్తా !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  21. విమానంలో బాక్టీరియా కాంటెంట్ అనుమతించరు కదా, అందుకే. విచిత్రమేమిటంటే విమానాలలో ఫంగస్ పట్టే అవకాశం ఉన్న బీర్ సెర్వ్ చెయ్యడం.

    రిప్లయితొలగించండి
  22. ఈ పోస్ట్ ఇప్పుడే చూసాను.
    మంచి ప్రయత్నం అండీ.
    Wish you all the best.

    రిప్లయితొలగించండి
  23. ప్రవీణ్ , నువ్వేమో గానీ, నేనైతే విమానాల్లో బీర్ సర్వ్ చెయ్యకపోతే అసలెక్కనే ఎక్కను :)


    శైల బాల గారూ, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. అయ్యా మీ ప్రకటన ఇప్పుడే చూసాను.మరి ఇప్పుడు పంపవచ్చునా తెలుపగలరునాఫోన్.9441149608గుడిసేవ విష్ణుప్రసాద్

    రిప్లయితొలగించండి

Comment Form