ఈ రోజు ప్రతిభ, భారతి పత్రికలలో 1940 వ ప్రాంతంలో శబ్దరత్నాకరము, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువలపై చెలరేగిన వ్యాసాలను సంకలనం చేసి ఒకదగ్గర చేర్చే ప్రయత్నం చేస్తుంటే అన్యాపదేశంగా ఈ వ్యాసం భారతి , 1936 ఫిబ్రవరి పత్రికలో దర్శనమిచ్చింది. ఈ విద్య శాస్త్రీయమా కాదా అన్నదాన్ని ప్రక్కనుంచితే నా చిన్నతనంలో ఈ చేయి చూడడమనే విద్యను చాలా మంది నమ్మేవాళ్ళు. ఇప్పటి "గ్రహం- అనుగ్రహం" లాగా.
ఇక విషయానికొస్తే శ్రీ భాస్కర చేతానంద స్వాముల వారు మీ పట్టణమునకు విచ్చేసి మీమీ సమస్యలను తీర్చడానికి సంసిద్ధులవడం మీ పురము, పురప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతము. మీ సమస్యలెటువంటివైనా, మీ చేయి చూడడం ద్వారా మీకు శాంతి పరిష్కారమును సూచించ గలరు. ప్రవేశ రుసుము కేవలము ఒక్క డాలరు మాత్రమే !!!
ముందుగా ఇక్కడ ఇచ్చిన వ్యాసాన్ని చదివి, మీమీ చేతుల పై ప్రయోగాలు చేసి, అశాంతి కలిగినచో శ్రీ భాస్కర చేతానంద స్వాముల వారిని సంప్రదించవచ్చు. ఇది ఇక్కడ ప్రచురించడంలో ఎటువంటి వ్యంగ్యము లేదని గమనించ గలరు. ఎందుకంటే ఇది చదివక ముందు కూడా నా చేయిని నేనే అప్పుడప్పుడు చూసుకొనేవాడిని మరి :))
credits : press academy of Andhra pradesh.
రాబోయే రోజుల్లో ఇప్పుడు మనకున్న నిఘంటువులపై రేగిన దూమారం కూడా ఇక్కడే ఇలాగే చదువుకోండి.
ఒక వ్యాఖ్యలో ఏమిటి స్వామీ అని సంబోధించానని శ్రీ భాస్కర చేతానంద స్వాముల అవతారం ఎత్తారనమాట ;)
రిప్లయితొలగించండిమంచి సమాచారం చూసి నేర్చుకుని సందేహాలుంటే మిమ్మల్ని కలవడానికి రావడానికి ఫ్లైటు టిక్కెట్లు, దారిచార్జీలు అమాంబాపతు అన్నీ మీరు పెట్టుకుంటే తప్పకుండా ఒక్క డాలరు కట్టి ప్రవేశము పొందటానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు! ;)
రసజ్న గారి కామెంటు కే నా ఓటు .....మీరు అన్ని సమకూరిస్తే నిజంగా అదృష్టం పట్టినట్లే కదా గురుగారు ....రసజ్ఞ గారు రాలేరేమో గాని తాడు బొంగరం లేని వాడిని ...చటుక్కున వాలిపోతా ..హ హ హ
రిప్లయితొలగించండిథ్యాంక్యూ రసజ్ఞ
రిప్లయితొలగించండిఅండ్
రాఫ్సన్
సో, ఇప్పుడు నా కర్థమవుతోందీ, భారారె, భారతదేశ యాత్రకి ఇది తోలి మెట్టు. భాస్కర చేతానంద గురు మహారాజ్ కీ జేయ్! వారు ఇప్పుడు రాబోవు భారత దేశాంతర యాత్రలో ముఖ్య భాగంగా దేశం మొత్తం మీద 'చేతానందస్వామీ ' వారి రూపం లో దర్శనమివ్వ బోతున్నారని !
రిప్లయితొలగించండిచీర్స్
జిలేబి
జిలేబి గారూ :-)
రిప్లయితొలగించండిరసజ్ఞేమో అమాంబాపతు,టికెట్టు ఇస్తేగాని సందేహాలకు సమాధానలు వినదంట. పోనీండి, మీరన్నా, అలా ఫాలో అయిపోండి :)
భాస్కర చేతానంద స్వాముల వారు బహు కాలముగా కనిపించుట లేదు. భారద్దేశం వచ్చేసారా ?
రిప్లయితొలగించండిచీర్స్
జిలేబి.