ఈరోజు ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైటు నుంచి దిగుమతి చేసుకున్న "భారతి" అనే మాసపత్రిక లోని వ్యాసములను చదువుతుంటే అందులో ఒక బొమ్మ నా చూపును వెంటనే ఆకర్షించింది. దాని గురించిన వివరమిది.
ఆ బొమ్మ ఇది.
ఇంతకీ ఈ బొమ్మనెందుకు వేసారో తెలుసా? ఈ పత్రిక కోసం "నక్షత్ర దర్శనము" గూర్చి వ్యాసం వ్రాయమన్నారట. దానికి రచయిత పంపిన స్పందన అట ఇది :-)
ఇక పోతే ఈ "భారతి" మాస పత్రికల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉత్తమ ప్రమాణాలతో అలరారిన ఈ పత్రికలో పరిశోధనాత్మక వ్యాసాలు కోకొల్లలు. ఆసక్తి గలవారు ఈ పత్రికలను ఇక్కడ నుంచి దిగుమతి చేసుకొనవచ్చు. అన్నట్టు పైన బొమ్మ 1930 వ సంవత్సరం ( ప్రమోదూత సంవత్సరం ) ఆగష్టు నెల సంచికలోనిది. ఈ పత్ర్రిక 1924 వ సంవత్సరంలో మొదలై 1960 వ సంవత్సరం దాకా నడిచినట్టుంది. కానీ ఈ వెబ్ సైట్ లో ఉన్న పత్రికలలో కొన్ని పాత సంచికలనే వేరే నెల సంచికలుగా ప్రచురించారు. బహుశా డబ్బు కోసం స్కాన్ చేసిన వాళ్ళ చేతివాటమేమో ఇది.
http://www.pressacademyarchives.ap.nic.in
అది ఓల్డు పధ్ధతి. ఇప్పట్లో అడిగితె అందులో వున్న
రిప్లయితొలగించండిబొమ్మలు తిరగబడి ఉండును. బులుసు గారి మాటల్లో చెప్పాలంటే, భార్యామణి దుడ్డుకర్రతో ఒక్కటి ఇచ్చి వుండును. ! నక్షత్రములేమి భూనభోనాంతరాలు కనిపించి వుండును !
చీర్స్
జిలేబి.
నక్షత్రా దర్శనం ....వా !!! క్యా బాత్ హాయ్.....
రిప్లయితొలగించండిఎంత సున్నిత హాస్యము ఉంది ఈ బొమ్మ లో ...ఏదేమైనా ఈ ఆడ లేడీస్ కి నక్షత్ర దర్సనానికి ఏదో అవినాభావ సంబంధం ఉందేమో కదా.....:):)
శ్రేయోభిలాషి
RAAFSUN
link bookmark చేసుకున్నాను ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిజిలేబీ గారూ, పాపం మీ ఆయన :-)
రిప్లయితొలగించండిఅవును బులుసుగారెమయ్యారు అసలెక్కడా కనిపించడం లేదు?
రాఫ్సన్, అవును చూసిన వెంటనే నేను lol. ఆడ లేడీస్ కేమో గానీ, ఇప్పుడు మాత్రం మగవారికి చుక్కలను చూపిస్తున్నారు :)
రసజ్ఞ, అందులో చాలా మంచి పత్రికలున్నాయి, వీలు చూసుకొని ఓసారి లుక్కేయండి.
I 2 agree with జిలేబీ గారూ...:)
రిప్లయితొలగించండివీరి ప్రయత్నము మేచ్చుకోదగ్గదే. కాని ఒక వెబ్సైటు ఎలా ఉండకూడదో వీరి సైటు చూస్తె తెలిసి పోతుంది. ఇంత user unfriendly navigation నేను మరే సైటు లోను చూసినట్టు లేదు. వీళ్ళకి ఉన్న interest తో బాటు తమ వెబ్సైటు కొంత బెటరు గా పెట్టుకుంటే బాగుండును !
రిప్లయితొలగించండిhttp://www.pressacademyarchives.ap.nic.in
చీర్స్
జిలేబి.
పద్మార్పితా, అంతేనండీ ఎన్నైనా మీరు మీరు ఒకటేనండి. పాత కాపు అనే ఫీలింగ్ కూడా లేదు :))
రిప్లయితొలగించండిజిలేబి గారూ, అవును, ఆ సైట్ వాళ్ళు అలా తయారు చేయడంలో ఉద్దేశ్యము అర్థము కావడంలేదు. అంత మంచి మంచి పత్రికలున్నప్పుడు ఇంకా బాగా చేసి అసలు ఎంతలా ప్రచారం చేయాలి? అయినా గవర్నమెంటు పని ఆ మాత్రమైనా చేసారంటే గొప్పే. కానీ నిజానికి అన్ని పత్రికలను స్కాన్ చేసి పెట్టినందుకు నిజంగా వారిని వారికృషిని అభినందించాల్సిందే. ఇక నావిగేషన్ దేముందండి. ఓ ప్రోగ్రాం రాసుకోని ఏంచక్కా అన్నీ మీఇంట్లోనే చదువుకోండి :)
@భారారె,
రిప్లయితొలగించండిప్రెస్ అకాడమీ వారి కృషి కి నా అభినందనలు.
వారి గవర్నమెంటు ఆఫీసు పనితనానికి నా చీవాట్లు !
ఈ సైటు కనబెట్టిన మీ జాదూగర్ కి నా చప్పట్లు.
ఒక నాలుగు యుగాలు కుస్తీ పడి మొత్తం మీద చాలా కాలం కితం పబ్లిష్ ఐన నా కథానిక ఆంధ్రపత్రిక నించి సంగ్రహించి దానిని చదివి మురిసి పోయాను ! నా దగ్గర దాని కాపీ లేదు ఇప్పటిదాకా ! సో మీకు నెనర్లు సైటు ప్రచారము చేసినందులకు !
చీర్స్
జిలేబి.
adhyaksha, nenu eekeebhavenchadam ledu
రిప్లయితొలగించండి@అజ్ఞాత,
రిప్లయితొలగించండిదేని గురించి అండి? బొమ్మలో కనిపిస్తున్న అంశపైనా లేక, ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబడిందనా?