తెలుగు పాఠకలోకానికి ఇప్పటికే హారం నుంచి ఒక పత్రిక తీసుకురావడానికి సన్నద్ధాలు జరుగుతున్న విషయం తెలిసే వుంటుంది
. ఈ సందర్భంగా ఇక్కడ కొన్ని వివరాలను అందించ దలచాను.
౧) మీ రచన మీ స్వంతముదై , ఇంతవరకూ ఎక్కడా ప్రచురించనిదై వుండాలి.( మీ మీ బ్లాగులలో కూడా )
౨) రచనలు పంపవలసిన చిరునామా admin@haaram.com.
౩) రచనలను డిసెంబరు 31, 2011 వరకూ స్వీకరించడము జరుగుతుంది.
ఇక ప్రశ్నలను ఇంతవరకూ చూడని వారు ఈ క్రింది లింకులో చూడగలరు.
పత్రికకు ఎన్నుకున్న అంశాలు - ప్రశ్నలు
>>౧) మీ రచన మీ స్వంతముదై , ఇంతవరకూ ఎక్కడా ప్రచురించనిదై వుండాలి.( మీ మీ బ్లాగులలో కూడా )
రిప్లయితొలగించండిచాలా సంక్లిష్టమైన కండిషన్ పెట్టారండి! .( మీ మీ బ్లాగులలో కూడా )
http://kothavakaya.blogspot.com/2011/12/3.html
రిప్లయితొలగించండిee blaagu oe saari chooDanDi bhaa.raa.re.
జిలేబి గరూ,
రిప్లయితొలగించండిజిలేబి గరూ,
సంక్లిష్టమా? ఎందుకనండి? బ్లాగుల్లో ఇప్పటికే వున్న పోస్టులను తిరిగి పత్రికొకటి పెట్టి అందులో ప్రచురించడములో పెద్ద ఉపయోగమేముంటుంది?
సునీతా, కొన్ని పోష్టులను చదివాను. ఇదే మొదటి సారి అనుకుంటా ఈ బ్లాగును నేను చూడడం. చాలా చక్కగా వ్రాస్తున్నారు. వివరాలేమైనా తెలుసా మీకు?
రామిరెడ్డిగారూ, నాకైతే బ్లోగేదీ లేదు కానీ,నా ఆంగ్ల వార్తాపత్రికల ప్రచురణలని ఇక్కడ పెట్టవచ్చా?
రిప్లయితొలగించండిక్రిష్ణవేణి
కృష్ణవేణి గారూ, తెలుగులోకి అనువదించి పత్రికాధిపతులనుంచి (మీరే ఐతే ఇబ్బందేలేదు) ఎటువంటి కాపీరైట్ నియమోల్లంఘన లేకుండా చూసుకొని ఏ అంశానికి రచనను పంపుతున్నారో తెలియచేస్తూ admin@haaram.com కు మైల్ చేయండి.
రిప్లయితొలగించండిరామిరెడ్డిగారూ, అది నాకు సమ్మతమే. కానీ నా పేరు అక్కడ లేకుండా ఒట్టి కంటెంట్ మాత్రం పోస్ట్ చేసే అవకాశం ఉందంటే తప్పక పంపుతాను.నాకూ అది సంతోషమే. లింక్స్ ఇవ్వకపోతే సమస్యా? ఇప్పటికే నేను నిజంగా ఉన్నానా లేక నకిలీ మనిషినా అన్న సందేహాలు చాలా పుడుతున్నాయి ఇక్కడ.ఇక నా పేరిట ఉన్న ఆర్టికల్స్ కనుక ఎవరైనా చూస్తే ఇంక నా పని అంతే. వాటి మీద దుమారం తప్పులు,ఒప్పులు,విమర్శలు నేను భరించలేను. అది నా ఉద్యోగం కనుక. ఆంధ్రదేశంలో పుట్టడం అయితే పుట్టేను తప్పితే దురదృష్టవశాత్తూ ఎప్పుడూ అక్కడ పెరగలేదు కనుక ఈ మధ్యకాలంలో తెలుగుతో అనుబంధం పెరిగింది. As one grows older, the person tries to look and desaperately wants to stick to the one's origins he/she belongs to. The 1st time I ever entered some group here in the Telugu world, I received such a shock of life which I would never ever forget in a hurry.
రిప్లయితొలగించండిThat had been a great lesson to me and since then I am a little wary.
కృష్ణవేణి గారూ,మీకు నచ్చిన కలంపేరుతో మీరు వ్రాయవచ్చు. ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలఎత్తనంతవరకూ హారం మీ ఐడెంటిటీను ఎక్కడా బయటపెట్టదని చెప్పగలను.
రిప్లయితొలగించండిలింకులు అక్కరలేదు కానీ మీ రచనకు స్ఫూర్తినిచ్చిన గ్రంధాలను, వారి పేర్లను మన వ్యాసాల్లో మననం చేసుకోవడం మనధర్మం. కాదంటారా?
అంటే రామిరెడ్డిగారూ, నేను రాసే కలం పేరుతో నేను రాయక్కరలేదన్నమాటేగా!అయితే నాకభ్యంతరం లేనే లేదు అదే కనుక నిజమైతే!వేల గొద్దీ ఉన్నాయి నేను రాసినవి.
రిప్లయితొలగించండిబైద వే నేను రాసేవి press covarages,ప్రెస్ ఈవెంట్స్ movie/theater/అర్ట్ ఇవెంట్స్ /బుక్ రెవ్యూస్ మాత్రమే. రాజకీయాలు కావు.
కాకపోతే once bitten twice shy నాకే వర్తిస్తుంది, ఒకసారి ఒక మహిళా గుంపులో అనవసంగా దూరి వాటి రాజకీయాలేమిటో తెలియక కష్టాలు కొని తెచ్చుకున్నాను కనుక.అందుకే సందేహపడుతుండాలి కొంచం.సరే ఇదీ ప్రయత్నించి చూస్తాను.ఏమవుతుదో ఏమో దేవునికెరుక.
కృష్ణవేణి గారూ :))
రిప్లయితొలగించండిమీరు ఈ కాలం విలేఖరుల మాదిరి చెప్పింది మార్చి భలే రాస్తారండి.మీ వ్యాఖ్య గందరగోళంగా వుండటంతో మళ్ళీ ఓ సారి చెప్తాను :)
నేను చెప్పింది, రచనలు మీ స్వంతమువై, మీ పేరు చెప్పడానికి ఇష్టపడకపోతే మీ పేరు బదులు మీకు నచ్చిన కలంపేరు పెట్టమని. అంతే కానీ వేరే వాళ్ళ రచనల్ని ఎత్తేసి మీ కలం పేరు పెట్టమని కాదు. కలం పేరు పెట్టినంత మాత్రాన ఆ రచన మీది కాకపోదూ. అంతే కానీ కలంపేరు పెట్టారని అది వేరే వాళ్ళ రచన అవ్వదు. మీరు చెప్పినట్టే గందరగోళంగా చెప్పా కదా :)))
>>>వేరే వాళ్ళ రచనల్ని ఎత్తేసి మీ కలం పేరు పెట్టమని కాదు<<<
రిప్లయితొలగించండిఅలాంటి పన్లు ఎందుకు చేస్తానండీ? నేను రాసినవాటినే ఇక్కడ పెడతాను కానీ?
సరే లెండి. కొంత తీరిక దొరికినప్పుడల్లా వాటిని అనవదించడం ప్రారంభిస్తాను.
అవును సుమండోయ్ మీ వ్యాఖ్య నిజంగానే గందరగోళంగా ఉంది. ముందు గమనించలేదు.
రిప్లయితొలగించండినా రచనలూ నా స్వంతమే. ఇంకెవరూ రాసినవి నేను రాసేనని చెపుకునే అలవాటు నాకు ఇంకా అబ్బలేదు. నేను రాసిన ఉద్దేశ్యం నేను రాసే పేరు ఎవరికీ తెలియకూడదన్నదే. కాకపోతే అనువదించేటందుకు నా బద్ధకం అడ్డొస్తుందేమో మరి!