పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగం - ఆ తరువాత నా పద్యం
"మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంపై కూడా మహిళల్లో తీవ్రమైన బాధ వ్యక్తం అయింది. కిష్టపాడు నుంచి వచ్చిన కల్లె సుబ్బమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. మద్యానికి బానిసైన భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆమెను చూసుకోడానికి కూడా ఎవరూ లేరు. ‘‘నాకు బతకాలని లేదన్నా..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమె పరిస్థితిని చూశాక నాకు తీవ్ర ఆవేదన కలిగింది. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయమంటే ప్రజల రక్త, మాంసాలతో వ్యాపారం చెయ్యడమే. మద్యపానం వల్ల నాశనమవుతున్న జీవితాలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. బతుకులను బుగ్గిపాలు చేసి, మహిళల కంట నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవరికీ మేలు జరగదు సరికదా, అన్ని విధాలా సమాజాన్ని నష్టపరుస్తుంది. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నదేమో కానీ, ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు. ‘‘రేపటి మన ప్రజా ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తుంది, నీ కష్టాన్ని తీరుస్తుందమ్మా..’’ అని సుబ్బమ్మకు భరోసా ఇచ్చాను. మద్య నిషేధం చారిత్రక అవసరం"
ఆ|| మధ్య తరగతి ధన మానముల హరించి
రక్త మాంసములతొ రాష్ట్ర బొక్క
సమ్ము నింపి యేమి సాధింప ఁజూతురో
ఆంధ్ర పాలకులు స్మశాన స్థలిన

పాదయాత్ర డైరీ - పద్యపాదాల నర్తించిన ఆటవెలది - భళీ!
రిప్లయితొలగించండిలలితగారూ పద్యము నచ్చి మీచేత భళీ అనిపించుకొన్నందుకు సంతోషం. వ్యాఖ్యకు ధన్యవాదాలు :)
తొలగించండి
రిప్లయితొలగించండిఓరోరీ చంద్రన్నా !
పారించావయ్య మద్య పానమును జిలే
బీ రంగురంగులన్ వ్యా
పారమ్ములతో ప్రజలకు బాధే బాధా !
జిలేబి
జిలేబి గారూ మీ వ్యాఖ్యకు కూడా ధన్యవాదాలు :)
తొలగించండి