ముందుగా పాదయాత్ర డైరీ లో కొంత భాగము ఆపై నా పద్యము
"జనం బాధలు తీర్చిన వాడు భగవంతునితో సమానం. ఈ రోజు అనంతపురానికి చెందిన రమేష్, పద్మ అనే బ్రాహ్మణ దంపతులు కలిశారు. వాళ్లు కేవలం నాన్నగారి వల్లే ఈ రోజు సంతోషంగా ఉన్నామని చెప్పారు. రమేష్‌గారు అనంతపురం డెయిరీలో పనిచేసి, 2014లో పదవీవిరమణ చేశారు. అనంతపురం డెయిరీని మూసివేయాలని చంద్రబాబునాయుడుగారు ప్రయత్నిం చారని, కానీ అదృష్టవశాత్తు నాన్నగారు 2004లో గెలవడం వల్లనే తమ డెయిరీ మూతపడకుండా ఆగిం దని, దాంతో పిల్లలను చదివించుకుని, వారికి పెళ్లిళ్లు చేసి, పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవించ గలుగుతున్నామని.. ఇదంతా నాన్నగారి చలవేనని వాళ్లు చెప్పడంతో నా హృదయం సంతోషంతో బరువెక్కింది. కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉండటం కన్నా అదృష్టం ఏముంటుంది? అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. ఈ అదృష్టమే ప్రజల పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. గతంలో చేసినట్లుగానే చంద్రబాబునాయుడుగారు అనంతపు రం డెయిరీతో సహా రాష్ట్రంలోని పలు సహకార డెయిరీలను మూసివేయించడానికి ప్రయత్నిస్తున్నా రు. దీంతో వేలాది మంది డెయిరీ ఉద్యోగులు, వారి కుటుంబాలు, ఈ డెయిరీలపై ఆధార పడి ఉన్న లక్షలాది మంది పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ రోజు పాదయాత్ర సాగిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సుమారు 60 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. నాన్నగారు ఎమ్మిగనూరు చేనేత సొసైటీకి ఉన్న మూడున్నర కోట్ల రూపాయల రుణాన్ని రద్దుచేశారు. ఆయన హయాంలో ఎమ్మిగనూరులో అపెరల్ పార్క్, చేనేత క్లస్టర్ల కోసం 97 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఆయనే గనుక ఉండిఉంటే ఈ పాటికి అవి పూర్తయి ఉండేవి. దాని అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది.. దాదాపు 6,000 మందికి ఉపాధి దొరికేది.. నేతన్నల జీవితాలు బాగుపడేవి. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతన్నల మీద వరాల వర్షం కురిపించారు. జిల్లాకో చేనేత క్లస్టరు, లక్ష రూపాయల వడ్డీ లేని రుణం, సబ్సిడీపై ముడిసరుకు పంపిణీ, ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి లక్షన్నర రూపాయలతో వర్క్ షెడ్డుతో కూడిన పక్కా ఇల్లు.. ఇలా ఆయన అరచేతిలో స్వర్గం చూపించారు. తీరా గెలిచాక వీళ్లెవరో కూడా ఆయనకు గుర్తులేరు. ఎమ్మిగనూరు చేనేత సొసైటీకి గతంలో రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలుండేవి. అవన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. ఆ బ్రాంచీలను తెరిపించే ప్రయత్నం చేస్తాను.
ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు.. రెంటికీ కటకటే. తుంగభద్ర లోలెవల్ కెనాల్ నుంచి నీటి లభ్యత తక్కువ అవుతున్న తరుణంలో రాజశేఖరరెడ్డిగారు దార్శనికతతో ఎల్‌ఎల్‌సీ ఆయకట్టును స్థిరీకరించడంలో భాగంగా పులికనుమ ప్రాజెక్టు చేపట్టారు. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పదిశాతం పనులు పూర్తి చెయ్యడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ పనులుæ పూర్తయితే ఇక్కడ 26 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాన్నగారు ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ఇలాంటి ప్రాజెక్టులన్ని ంటినీ మన ప్రజాప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందిస్తాము. "
సీ|| సహకార డైరీల సాకి యుద్యోగుల కడగండ్లు కడగంట కడిగి వేసి
చేనేత నేతన్న చితికిపోకుండగన్ చేయూత నిచ్చె నా శివుడు మెచ్చ
నీటి కటకట కన్నీటి రైతులగని కట్టె సుజలముల కాన కట్ట
వరములిచ్చి ప్రజల బాధలు తీర్చ నవతరించె నాంధ్ర యవనిక పైన
ఆ.వె|| అట్టి రాజ శేఖ రాధిపు తండ్రియై
చనుట నాదు పూర్వ జన్మ ఫలము
కాదె? వాడ వాడ గనుచుంటి నపరిమి
తాదరణను, జన్మ ధన్య మయ్యె

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form