30, నవంబర్ 2017, గురువారం

జగన్ ఇరవై ఒకటవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ఈ రోజు పాదయాత్ర డైరీ నుంచి కొంత భాగము ... ఆపైన నా పద్యము

"ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర బి.అగ్రహారం దాటాక 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేను ఇక్కడ వేప, కానుగ మొక్కలు నాటాను. ఈ ప్రయాణంలో నాకు శ్రమ గానీ, దూరం గానీ తెలియడం లేదు. ప్రజల్లో ఉండి, వారితో నేరుగా మాట్లాడుతూ.. వారి సమస్యలను తెలుసుకోవడం ఒక అపూర్వమైన అనుభవం. నాన్నగారు ప్రజల నుంచి ఏ డిమాండూ లేకుండానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దానికి ప్రధాన కారణం 2003 పాదయాత్ర సమయంలో ప్రజల కష్టనష్టాలను ఆయన పూర్తిగా అర్థం చేసుకోవడమే. వారికున్న సమస్యలు తీరాలంటే ఏం చెయ్యాలో కూడా ఆయనకి బాగా అర్థమైంది. బహుశా ప్రజాజీవితంలో ఉండే ప్రతి నాయకుడు చెయ్యాల్సిన పని ఇది. ఈ ప్రత్యక్ష అనుభవానికి ప్రత్యామ్నాయం ఉండదు."

ఆ.వె|| పాద యాత్ర చేయ ఫలమేమి యన్న ప్ర
జలగచాట్లు చూసి సరిగ పథక
ములను దిద్ద వచ్చు మూల సమస్యల
పార ద్రోల వచ్చు నాంధ్ర స్థలిన

1 కామెంట్‌:



  1. పాదయాత్రల చేయుచుంటిని పల్సుగాంచి జిలేబులన్
    వీధులెల్లన పంచిబెట్టుచు వేగిరమ్ముగ నేనిటన్
    పేదవాళ్ళకు నాన్నగారటు పెన్నిధుల్ సమ గూర్చిరే !
    మీదయన్ ప్రభుతన్ చలాకియు మీరగానటు చేసెదన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి

Comment Form