24, నవంబర్ 2017, శుక్రవారం

జగన్ పదహారవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యము

ముందుగా జగన్ డైరీలోనుంచి కొంత భాగము

"పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభం అయిన ప్పుడు అశేష జనవాహిని నాతో కలిసి అడుగులు వేసింది. సమస్యల్ని నివేదించింది.   మధ్యాహ్నం పాదయాత్రలో ఉండగా విజయవాడలో రైతులు ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి హతాశుడిని అయ్యాను. నేరుగా వారితో ఫోన్‌లో మాట్లాడాను. మన ప్రభుత్వం వచ్చిన తక్షణం రైతులకు సహాయం అందిస్తుం దని, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపవద్దని వారికి విజ్ఞప్తి చేశాను.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ క్రిమిసంహారక మందులు.. ఇలా ప్రతి అవి నీతిలోనూ, ప్రతి అక్రమంలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండటం, వారికి ముఖ్యనేత అండదండలు పుష్కలంగా ఉండటంతో, రైతులలో ఆత్మ విశ్వాసం మరింత సన్నగిల్లుతోంది. ఆత్మ హత్యల వైపు వారిని ప్రేరేపిస్తోంది. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని మార్చాలి. రైతన్నను మారాజులా చూసు కోవాలి"


కం|| సకల జనావళి క్షుద్బా
ధ కరుణ దీర్చు మనరైతు దారిగనకనే
డు కొలిమిన కాలి నిర్జీ
వ కనులలమటించు చుండె వాని/భరత పొలములన్

2 కామెంట్‌లు:



  1. రైతుల ప్రాణములకు విలు
    వే తగ్గె! మన ప్రభుత యిక వేగము గా యు
    ర్రూతల వచ్చును! జనులా
    రా! తండ్రి వలె తలగాచు రాజుని నేనౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారూ, మీ పద్యం డైరీ లో వున్న భావాన్ని ఎక్కువగా ఒడిసిపట్టింది. బాగుంది.

    రిప్లయితొలగించండి

Comment Form