28, అక్టోబర్ 2011, శుక్రవారం

దమ్ముమీద దమ్ము... రింగురింగుల పొగ....

నాయనా ఈ ధూమపానమనేది ఒక జిల లాంటిదన్నమాట. ఒకసారి తగులుకుంటే అంత త్వరగా పోదు. కాబట్టి దీనికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ నేను వ్రాసేవన్నీ అక్కడ ఇక్కడ ఏరుకొచ్చి వ్రాసినవే కాబట్టి వీటికి ప్రూఫ్ లు కావాలంటే ఒక పదిమంది స్మోకర్లు 20 నుండి 60 ఏండ్ల మద్యవాళ్ళను ఒక దగ్గర కూర్చో పెట్టి వాళ్ళ అభిప్రాయాలను కనుక్కోండి. ఇందులో 99% నిజమయ్యే అవకాశాలుంటాయి. కానీ చాలా వరకు ఇప్పటి తరం వాళ్ళు ఎందుకనో తమజబ్బులను బయటకు చెప్పుకోవటంలేదు.కారణాలేమో??? చెప్పుకోవడం వల్ల ఏమైనా నష్టాలో ఏమో తెలియదు కానీ కనీసం మీమీ వివరాలు డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడన్నా చాలా చాలా స్పష్టంగా వివరంగా చెప్పడం అలవాతు చేసుకోండి. ఎందుకంటే వైద్యశాస్త్రంలో వైద్యునికి అతి కష్టమైన పని మనకు ఏ జబ్బుందో కనిపెట్టడమేనట. దానికి మీ వంతు సహాయం లేకపోతే డాక్టర్లు కిడ్నీ బదులు గుండెకాపరేషన్ చేసి " ఎవ్విరిథింగ్ ఈజ్ ఆల్రైట్" అని చెప్పిన నాలుగోరోజుకే వేరే ఏమైనా జరగొచ్చు.

ఇకపోతే మన శరీరంలో ఈ సిగిరెట్టు నోట్లో పెట్టి గుప్పు గుప్పు మని పొగబండి లెక్కన పొగను వదిలేమా.... రింగురింగుల తిరుగుతూ మొదట్లో బాగానే ఉంటుంది. కానీ ఆ ధూమపానమే backpain మరియు నరముల సంబంధించిన వ్యాధులకు మూలమని తెలుసా? ఒకవేళ మీకు ఈ జబ్బులు ఇప్పటికే వుండి ఇప్పటికీ ధూమపానం చేస్తున్నట్లైతే తక్షణం మానడం మంచిది. కారణం ఈ పొగవల్ల కణజాల క్షీణత మరింత ఎక్కువౌతుంది.ఎలాగా???

ఎలాగంటే మన రక్తనాళాల్లో వుండే అంతర్గత పొర ఈ ధూమపానంలో వుండే విషపదార్థాలవల్ల నాశనమైపోవడం మొదలౌతుంది. ఈ పొగత్రాగడంవల్ల ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలో కలిసిన విషపదార్థాలు మన గుండెకు, మెడ,వెన్నుముకల డిస్కులకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న చిన్న రక్తనాళాల లోపలి పొరలపై రసాయన చర్య జరిపి ఆ పొరను నాశనం చేస్తాయి. దీని మీద పూర్తి వివరాలు కావలసిన వారు " endothelial cells nitric oxide and nicotine" అని గూగుల్ లో సెర్చ్ చేయవచ్చు. ఇక్కడ మనము గుర్తుంచుకోవాలసింది, ఈ సిగిరెట్లలో నికోటిన్ ఒక్కటే కాదు దానితో కలిసి దరిదాపు ఐదొందల కెమికల్స్ ను మండించి, మండించగా వచ్చిన vapour ను మనం డైరక్ట్ గా మన శరీరంలో ఊపిరితిత్తుల ద్వారా ప్రవేశ పెడుతున్నాము. ఇక్కడ మనకొక అనుమానం రావచ్చు. మనము పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి కదా వెళ్ళేది. రక్తాన్ని సరఫరా చేసేది గుండె కదా? మరప్పుడు ఈ రక్తానికి ఊపిరితిత్తులకు గల సంబంధమేమిటని. అది నేను టైపు చేయడం కంటే ఈ క్రింది వీడియో చూడండి. బాగా అర్థమవుతుంది.

ఈ క్రింది వీడియో మన ఊపిరితిత్తుల గురించి వివరిస్తుంది.


ఇప్పుడు గుండె, ఊపిరితిత్తుల 3D వీడియో చూడండి. అంటే మన గుండె ఎక్కడ వుంటుందో గుండెచుట్టూరా ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో తెలుస్తుంది.



ఇప్పుడు మనగుండె, ఊపిరితిత్తులు కలిసి మనశరీరానికి రక్తసరఫరాను ఎలా చేస్తాయో ఈ వీడియోలో చూడండి. అలాగే రక్తంలో ఆక్సిజన్ కలిసినప్పుడు రక్తము రంగు ఎర్రగా ఎలా మారుతుందో చూడండి. కానీ మనం దమ్మేసి రక్తానికి ఆక్సిజన్ తోపాటు నికోటిన్ తో కూడిన కార్బన్ మోనాక్సైడ్ ను కూడా అందిస్తున్నామే :((



సశేషం..

7 కామెంట్‌లు:

  1. ఇకపోతే మన శరీరంలో మనమే పోయాక ఇంకా మన శరీరం ఏంటి మాష్టారు?(ఏదో సరదాకి)
    మంచి సేకరణ దీని గురించి కూడా ఎంతో చెప్పాలని ఉంది కాని మీ పాఠం అంతా అయ్యాక చర్చించుకుందాం!

    రిప్లయితొలగించండి
  2. @రసజ్ఞ ..... హహ్హ పోతే మంచిదేనండి..కానీ ఈ వ్యసనం వల్ల పొయ్యేముందు అనుభవిస్తారు చూడండి. అదే నరకం :-)


    >> దీని గురించి కూడా ఎంతో చెప్పాలని ఉంది కాని మీ పాఠం అంతా అయ్యాక చర్చించుకుందాం!

    అవునా..ఐతే నా పాఠం ఐపోయింది :))
    ఇక మీరు వ్రాయండి. మేమందరమూ బుద్ధిగా చదివి పెడతాము

    రిప్లయితొలగించండి
  3. ఏంటండి......ఇవన్నీ మా శ్రీవారిలాంటి వాళ్ళని ఉద్దరించడానికే???:-)

    రిప్లయితొలగించండి
  4. అయ్యబాబోయ్ మళ్ళీ మొదలు మాస్టారు గారి పాఠాలు ? ఆల్రెడీ అయిపోయిన్దనుకున్నాను.

    టపా కన్నా ఆ ఫోటో లు చూస్తేనే నాకేదో మరీ భయం పుట్టుకొస్తుంది.

    దీపావళీ ఆలస్య శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. @సృజన...దగ్గరుండి చదివించి చూడండి. వెంటనే మరొక సిగిరెట్ వెలిగించకపోతే చూడండి. :-)

    @Zilebi ..అలాఐతే మీరు చదవకండి. యాంక్సైటీ వస్తే మళ్ళీ లేనిపోని తలనొప్పులు

    రిప్లయితొలగించండి

Comment Form