10, అక్టోబర్ 2011, సోమవారం
ఆడాళ్లూ అరిచి గీపెట్టి మీ ఆయన చేత సిగిరెట్టు/చుట్ట/బీడి/పైపు మాన్పించలేరు ....
అప్పుడప్పుడు ఆడోళ్ళు అనుకుంటారంట చెప్పినమాట వినని మొగుడొచ్చాడు అంతా నారాత అని. ఇందులో నిజమెంతో నాకైతే తెలియదు కానీ సిగిరెట్ తాగే మొగుడు దొరికితే మాత్రం ఇల్లుపీకి పందిరేసే పెళ్ళాలు మాత్రం బోలెడంతమంది ఉంటారులే. స్వానుభవం మరి. కానీ ఇక్కడ ఒక మాట చెపుతాను వినుకోండి. మీరు సిగిరెట్ మానమని ఎంతగోలచేసి ఇంట్లో రచ్చ రచ్చ చేసినా మీ ఆయన ఆ ఊదుకడ్డి తాగడము మాత్రం మానడు కాక మానడు. నిజం చెప్పాలంటే ఛీ ఇంట్లో దీనిగోల భరించలేకపోతున్నా అని చెప్పి ఏంచక్కా రుసరుస బయటికి పోయి ఒకటికి రెండు తాగి కాసేపయ్యాక ఇంటికొచ్చి ముసుగు తన్నేస్తాడు. నిజమా కాదా? మీరే చెప్పండి?
అసలు ఈ కాలం ఆడవారికి మగవాళ్ళని మడిచి ఎలా తమకొంగుముడిలో కట్టేసుకోవాలో తెలిసినట్టు లేదు. అందుకే విడాకుల సంఖ్య కూడా పెరుగుతుందేమో. దీనికి ఒకటే సూత్రం ఎలాంటి సందర్భాలలోను మగవాడికున్న అహాన్ని కించపరిచే రీతిలో మాట్లాడకూడదు. ఈ ఒక్కసూత్రం గుర్తుంచుకుంటే చాలు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు. " ఏం ఆడాళ్ళుకు మాకు మాత్రం అహం ఉండదా " అని ఎదురు తిరిగితే సమాధానం చెప్పడం కష్టం కానీ.. మగవాడి అహం హర్ట్ అయితే ప్రమాదమే. బహుశా తరతరాలనుంచి జన్యుపరంగా కలిగిన మార్పేమో !!!
నేను ఓకానొక రోజు, ఇలాగే ఇంట్లో నుండి తప్పించుకొని ఇంటికి కూతవేటు దూరంలో వున్న Barnes & Nobels పుస్తకాల కొట్టులో కూర్చొని Image processing మీద వచ్చిన సరిక్రొత్త విధానాలను చదువుతూ ఎప్పటిలాగే ఒక గంట గడవగానే వెనుకనుంచి ఏదో తరుమకొస్తున్నట్టు ఓ Tall కాఫీ కొనుక్కొని బయటకెళ్ళి ఓ సిగిరెట్ వెలిగించి విలాసంగా తాగి వెనిక్కి వస్తూ "Quit smoking in 24 hrs" అనే పుస్తకాన్ని చూసి పడి పడి నవ్వుకున్నాను. మానవ దుర్బలత్వాన్ని cash చేసుకోవడంలో ఈ తెల్లవాళ్ళు మరీ ఘటికులు మరి :-)
ఇంతకీ విషయమేమిటంటే ఈ ధూమపానాన్ని మీ మొగుడి చేత మాన్పించాలని మీరు ప్రయత్నం చేసారా? చేస్తున్నారా? చేయబోతున్నారా? ఊహూ... అలాంటి ప్రయత్నాలకు స్వస్తి చెప్పండి. మీరు కాదు కదా, స్వయంగా ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చి చెప్పినా ఈ ధూమపానం మానరు కాక మానరు. కారణం ఇక సిగిరెట్ త్రాగకూడదు అని తనంతట తానే స్వయంగా బయటనుండి ఎటువంటి ప్రేరణలు లేకుండా అనుకోవాలి.
ఊరికే అనుకోవడం కాదు చాలా తీవ్రంగా మనసా వాచా కర్మణా ఒక అంతర్గత విప్లవంలా మీలో కలగాలి. ఆ విప్లవ స్ఫూరి జారిపోకుండా కనీసం నలభైరోజులుండాలి. నలభైరోజులని ఎందుకంటున్నానంటే ఏ వ్యసనమైనా మనిషినుండి దూరం కావడానికి నలభైరోజులు పడుతుందని మన పెద్దలు చెప్పిన బంగారంలాంటి సూత్రం. అందుకేనేమో పెద్దలమాట చద్దిమూటంటారు. అంతేనా..ఈనాటి శబరిమలై భక్తులకు విధించే గడువుకూడా నలభైరోజులే అనుకుంటాను. దీని వెనుకున్న ప్రధాన సాంకేతిక ఉద్దేశ్యం ఇలాంటి వ్యసనానికి బానిసైన వారు కనీసం బయటపడతారనేమో... కానీ బయటపడాలంటే మాలేసుకొని ముక్కుమూసుకోని నలభై ఒకటోరోజు దమ్ము వెలిగిస్తే అదేదో ఎవరికోసమో చేసినట్టేకానీ మీకు మీరు మనస్పూర్తిగా అంగీకరించి సాధన చేయలదనే అనుకోవాలి.
కానీ ఇంతటి మానసిక పరిపక్వత, అందులో నుండే జనించే అనుభవసారం ఊరికే పుస్తకాలు చదవడం మూలానో లేదా ఎవరో చెప్పటం మూలానో రాదు. ఇది అనుభవంతో మాత్రమే సాధ్యం. అంటే ఈ సిగిరెట్ త్రాగడం మూలంగా మన జీవితంలో మానసికంగా, సాంఘికంగా , శరీరంలో కలిగే మార్పులు. ఇవి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా వుంటాయి. అప్పుడే మొదలు పెట్టినవారికి పొడిదగ్గు,ప్రొద్దుట బ్రష్ చేసి గల్ల ఊసినప్పుడు అందులో పడే సిగిరెట్ నుసి. ఇలాంటివన్నమాట. ఆ స్టేజి దాటిన వారు ఎలాంటి మార్పులు ఎదుర్కొంటారో రాబోయే టపాల్లో చూద్దాము.
కాబట్టి సిగిరెట్ మానేయాలనుకొనేరోజు మీచేతులోనే వుంది. మరో విధంగా చెప్పాలంటే ఆరోజు ఏరోజో మీకు తప్పకుండా తెలుస్తుంది. కారణం అంతకు ముందు చాలా రోజులనుండే మానేయాలని ప్రయత్నాలు చేస్తునే ఉంటారు,కానీ ఎప్పటికప్పుడు ఆప్రయత్నాన్ని అటకెక్కిస్తుంటారు.కాబట్టి శ్రీమతులూ, సిగిరెట్ మానేయమని ఇంట్లో గొడవచేసి రచ్చ రచ్చ చెయ్యకుండా...ఈ పాడు వ్యసనం అనే పరివర్తన వచ్చే దిశగా కృషిచేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వాలి సినిమా లో వీరోయిన్ కోరిక సూచి , మనిలా౦టోల్లు సాన మ౦ది ఉ౦డారే అనుకున్నా. అదురుట్టం దేవుడు మొర ఇన్నాడు :)
రిప్లయితొలగించండిఓలమ్మొ ఓలమ్మో ఈ మౌలమ్మకెసుమంటి అదురుట్టం పట్టేసింది. నీ పెనిమిటి నీమాటినేసిండయితె :-)
రిప్లయితొలగించండిR, I see your point,but I think this post is not a right platform to discuss on those issues. Thank you for your comment.
రిప్లయితొలగించండిఅరిచి గీ పెట్టడం ఏమిటి, ఇంకేమి చేసినా మానిపించలేం! మానాలనే పురుగు వాళ్ళ బుర్రలో పుడితే తప్ప!
రిప్లయితొలగించండిమా నాన్న గారు చెప్పారు "చిన్నప్పుడు తాను సిగరెట్లు తాగేవాణ్ణనీ, తరువాత మానేశాననీ". మా పెదనాన్న గారు (నాన్న గారి అన్నయ్య) మాత్రం ముసలి వయసులోనూ సిగరెట్లు తాగేవారు.
రిప్లయితొలగించండిwrite next post. నేను quit చెయాలి ఎలాగొ తెలీడం లేదు
రిప్లయితొలగించండిmaree chodyam andi
రిప్లయితొలగించండిbheshugga cigeratte tagesukuntoo undaka ilaa mano visleshanalu etc enduku? meeru cigratte maaneste emi vyatyasaam? o padellu itu atu ante. Daani kosam endukinta tantaa? Buddhi gaa cigarettu jummani laginchaka itlaanti chachhu bucchu vedantam enduko artham kaadu
cheers
zilebi
http://www.varudhini.tk
అజ్ఞాత(లూ ) :-) ఇదన్నేలం.....
రిప్లయితొలగించండిఅజ్ఞాత జిలేబీకెందుకో కోపమొచ్చినట్టుందే :-)
సుజాత గారూ.. చాలా మంచి పాఠము కదా !
రిప్లయితొలగించండిప్రవీణ్.... Thanks for your comment.
రిప్లయితొలగించండిహయ్యో, నా మాటినాల్సిన పనే౦ లేదు బాబయ్యా. ఏదేమైనా అదురుట్టమే :)
రిప్లయితొలగించండి@Mauli , పోనీలెండి..ఏదేమైనా మానేసారు కదా.. శుభమస్తు
రిప్లయితొలగించండిI smoked for 24 years(started at age 8),but i could quit,long story,I am clean for the last 2 months 20 days..will send my experience.
రిప్లయితొలగించండిఅజ్ఞాత, Share your experiences... may be there is one out there who may get inspire and quit smoking.
రిప్లయితొలగించండిbut would you please send the blog to everyone on your list?
రిప్లయితొలగించండిIts high time we act with reason..and stop the ignorance which is effecting common people...
Thanks,
R
@R, I can mail it to few people.
రిప్లయితొలగించండి