16, అక్టోబర్ 2011, ఆదివారం

పొగతాగే వాళ్ళలో తరచూ కనిపించే జబ్బు సైన సైటిస్ ( తలనొప్పి లాంటిది ) లేదా తీవ్రమైన జలుబు.... కారణమేంటి?

మనము నిన్న కొన్ని బొమ్మలను చూసాము కదా. ఇప్పుడు మన ఉచ్ఛాశ్వ, నిశ్వాస వ్యవస్థను గురించి, మనకున్న ధూమపానం మూలంగా ఈ వాయునాళ మార్గంలో ఉన్న వివిధ ప్రదేశాలను ఏరకంగా చెడగొడుతుందో చూద్దాము.

మనము పీల్చినగాలి ఈ వాయునాళాల గుండా ప్రవహించేటప్పుడు ముందుగా ముక్కుపుటాలలో ప్రవేసించినప్పుడు ముక్కులోనున్న వెంట్రుకలు, ఈగలు, దోమలు మొదలైన వాటిని ఈ వాయునాళం ద్వారా లోనికి ప్రవేసించకుండా ఆపుతాయి. ఆ తరువాత ఈ గాలి ఈ వాయునాళంలో వున్న సిలియా ( మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపించే వెంట్రుకల ఆకారంలో వున్న పదార్థము ) ఒక క్రమపద్ధతిలో కదలడంద్వారా, ఈ సిలియాపైన జిగట గా వున్న శ్లేష్మము (mucus) గాలిలో లేదా సిగిరెట్ పొగలో నున్న మనిషి కంటికి కనిపించని దుమ్ము,ధూళి, సిగిరెట్ పొగలో నున్న ఇతర particles ను పట్టేసి చీమిడి రూపంలో ముక్కుద్వారా కానీ లేదా మనము గుటక వేసినప్పుడు జీర్ణాశయము లోనికో పంపించివేస్తుంది. అంటే మనము మనము పీల్చేగాలి ఎంత కలుషితమైతే అంత బాగా మనకు జలుబు చేసి ముక్కులవెంట గోదావరీ నదిని పారిస్తుంది. లేదా ముసీ నదిలాగా నీళ్ళులేక గడ్డకట్టి మనము ఎంతచీదినా పచ్చటి రంగులో ముసీనదంత కంపు కొడుతూ బయటకు వస్తుంది. అంటే ఇదంతా మనము పీల్చిన గాలిలో ఉన్న రకరకాల కెమికల్స్ లేదా దుమ్ము ధూళి.

నిన్నటి బొమ్మను తిరిగి ఇక్కడ పాఠకుల సౌకర్యంకోసం ఉంచుతున్నాను.





ఇక్కడ trachea అనేది వాయునాళం. మనకు మాట,పాట రావడానికి ప్రధాన కారణమైన స్వరపేటిక ( Vocalcords ) దగ్గర మొదలై ప్రధానమైన బ్రోంకై (bronchi) దాకా ఉంటుంది ( అంటే రమారమి ఊపిరితిత్తుల దాకా అనుకోండి ) . అంటే వీటిమధ్యనున్న గొట్టానికి ఆ పేరు పెట్టామన్నమాట. cilia, mucus లు ఎలా ఉంటాయో ఈ క్రింది బొమ్మలో చూడవచ్చు. ఇవి మైక్రోస్కోప్ లో చూస్తేనే కనిపిస్తాయి సుమా!!!




ఇప్పుడు చెప్పిందంతా బాగా అర్థము కావడానికి ఈ వీడియోను ఒక లుక్కేయండి.





మరి ఈ సైనస్ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఆలస్యం చెయ్యకుండా ముందు మన అందమైన మొఖం బొమ్మ చూసేయ్యండి.




చూసారా? అక్కడ పింక్ రంగులో కనిపిస్తున్నాయే....అవి మన పుఱ్ఱెలో ముక్కు చుట్టూరూ ఉన్న ఖాళీ ప్రదేశాలు. వాటికి కూడా రకరకాల పేర్లు పెట్టారు. మనకవన్నీ అవసరంలేదు కానీ అసలు ఈ సైనస్ ఎందుకొస్తుంది అనేది కదా మన ప్రధాన సమస్య. క్లుప్తంగా చెప్పాలంటే పుఱ్ఱెలో మనం చెప్పుకున్న ఆ ఖాళీ ప్రదేసాల్లో మనం పీల్చినగాలి తాలుకూ సూక్ష్మమైన particles వెళ్ళి చేరతాయి. ఇక్కడ కూడా పైన మనం చెప్పుకున్న cilia, mucus లు ఎప్పటికప్పుడు వీటిని బయటికి నెట్టేస్తుంటాయి. బయటికి నెట్టడమంటే చీమిడి ద్వారా వచ్చేస్తుంది. మరి సిరెట్లు తాగేవాళ్ళలో ఎందుకు ఈ సమస్య ఎక్కువ ఉంటుందో వేరే చెప్పాలా? తాగేదే అసలు సిసలైన పొగ. అందులోనూ 500 రకాలు కలిసిన కెమికల్స్. అంతేనా దానికీ కోపమొచ్చి "బాసూ నేను పని చెయ్యను నీ దిక్కున్న చోట చెప్పుకోమ్మని మొరాఇస్తుంది" . మనము ఇలాంటి నొప్పులను పెద్దగా పట్టించుకోము గదా మళ్ళీ ఓ దమ్మేస్తాము కదా :-) అప్పుడేమౌద్ది?

ఈ పొగవల్ల ఈ కెమికల్స్ వల్ల సిలియా కదలడం మానేస్తుంది. ఇది కదలకపోతే దానిపైనున్న మ్యూకస్ కదలదు. మ్యూకస్ కదల్లేదంటే ఆ శ్లేష్మము ఆ పుఱ్ఱెలో నున్న ఖాళీ ప్రదేశంలో తిష్టేసుకోని కూర్చుంటుంది. అంటే ముక్కుద్వారా బయటకు రాదు. అలా శుభ్రంగా డిపాజిట్ అయ్యి అయ్యి అసలు బయటకొచ్చే మార్గాన్నే మూసేస్తుంది. అందువలన ఈ సైనస్ వచ్చినవారికి పుఱ్ఱెలోని ఆ ఖాళీ ప్రదేసాలు ముట్టుకుంటే " స్వర్గం ఎక్కడున్నది స్వర్గం ఎక్కడున్నది ......" అనే పాట బదులు " నరకం ఇక్కడున్నది నరకం ఇక్కడున్నది " అని మాత్రమే గుర్తొస్తుంటుంది. ఆలశ్యం చెయ్యకుండా ఈ వీడియో చూసెయ్యండి. బాగా అర్థమవుతుంది.


8 కామెంట్‌లు:

  1. ayyaa avasaramu ayinavadu doctor daggara vaidyaniki potadu. blogerlaku ee sutti avasarama

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటి వ్యాసాలు ఎంతో ఉపయోగకరమైనవి. మంచి విషయాలకు తగిన ప్రోత్సాహం రావటం మొదట్లో కష్టమే.
    ఈ బుక్ గా ఎంతో వివరంగా ఉంటున్నాయి మీ వ్యాసాలు. చాలా పరిశోధన చేసినట్టున్నారు. ఇంత ఓపిగ్గా రాస్తున్నందుకు మీకు అభినందనలండి.

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత చెప్పారు(16 అక్టోబర్ 2011 12:27 సా )
    బాబు మంచి విషయాన్ని ఇంత వివరంగా ఒపికగా రాస్తుంటె "రౌడీ" వేషాలెందుకండి. చదివెవాళ్ళు చదువుతారు కదా.

    రామిరెడ్డిగారు బాగారాస్తున్నారు సార్ అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. మందాకిని గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి. నేనిది వ్రాయడానికి మూలకారణం , పొగత్రాగే వాళ్ళలో చాలా మందికి ( నాతో సహా ) ఇది మన శరీరంలో కలిగించే దుష్ప్రభావాలు తెలియవు. కానీ తెలుసనే ఫీలింగ్ లో ఉంటారు.

    రిప్లయితొలగించండి
  5. @seenu, I have seen many such comments and this is just one of them. Here there is no Roudy vEShaalu. it is just a opinion from a reader.

    Thank you for your comment and support.

    రిప్లయితొలగించండి
  6. థాంక్స్.ఈ టపాలు నిజంగా ఎంత మంది పొగ త్రాగేవాళ్ళు చదువుతారో గానీ మాలాంటి మనిపించాలని చూసే వాళ్ళం తప్పక చదువుతాము. నేను మా టీం లోని చిన్న కుర్రాళ్ళకి బాగా ఈవిషయమై నీతి బోధలు చేస్తూంటాను.(ఇంట్లో ఎలాగూ వినరుకదా) చాటుకి తిట్టుకున్నా కనీసం నా గోల పడలేక కొన్ని సిగరెట్లు అయినా మానుతారు. డైరెక్ట్ గా కంపు కొడుతోందని, రోగం వచ్చి చస్తారని, అప్పుడే చచ్చేకాడికి మీ వాళ్ళు ఇంత కాలం ఇంత డబ్బు దేనికి ఖర్చు పెట్టినట్టు అనీ ఇలా చండాలంగా కానీ ఏదో కొద్ది ఉపయోగం మాత్రమే. అదీ నా బీ పీ తగ్గించుకోవడానికే. కలిసి వచ్చిన విషయం ఏంటంటే, నన్ను ఎక్కువసేపు లంచ్ కి పంపించి నా పనిని వాళ్ళు పంచుకుంటునారు.

    రిప్లయితొలగించండి
  7. తొలకరి గారూ :-)... నిజమే ఇంట్లో వాళ్ళు వినరు కానీ, బయట వాళ్ళకు చెప్పినప్పుడు ఏమీ అనలేక మీరు చూసినప్పుడన్నా తాగడం మానేస్త్రారు :-)

    రిప్లయితొలగించండి

Comment Form