26, అక్టోబర్ 2011, బుధవారం

సాఫ్ట్వేర్ గాడి బ్రతుకింతేలే... ఇంతేలే..ఇంతేలే

జీవితమింతేలే....ఈ జీవితమింతేలే............
సాఫ్ట్వేర్ గాడి బ్రతుకింతేలే... ఇంతేలే..ఇంతేలే

మీటింగంటడు.... మాటీమంటడు మెత్తమెత్తగ మొత్తుతాడే
సూపర్ టీమంటడు భుజాల్తడ్తడు గాలికొట్టి నా మనసే బెలూన్ చేస్తాడే
వార్నీ నీశక్తి నీకు తెలియదంటాడే..... నీముందు నేనెంతంటాడే....

ఉబ్బిపోయి రూటుతప్పిపోయి రింగరింగైపోయి
ఓ యస్ అనేస్తానే... చేసేస్తననేస్తానే......

క్షణమెంబడి క్షణం ..నిమిషమెంట నిమిషం గంటమ్మడి గంట
గడిచి పోయి రెండు మూడు గంటలౌతుందా......
అప్పుడు పుడ్తుందండి వాడి బుఱ్ఱలో గుబులు

నాలుగోగంట.....

డెస్క్ దగ్గరకొస్తడే.. హి హి హి అంటాడే
హే హే.. హౌఆర్వ్యుయ్ డూయింగంటాడే...
భుజం తడ్తడు, తొంగిచూస్తడు,కాలుకాలిన పిల్లల్లె తిరిగుతాడే
వాడు మందేసిన కోతల్లె తిరుగుతాడే...
అంతేనా...కంప్యూటర్లో వేలెట్టికెలుకి
అయిందాలేదా? అంటు ఆరాలే తీస్తడే...

నెత్తినోరు కొట్టుకున్న డెడ్లైనంటడు క్లైంట్ మాటండడు...
నామాటే వేదవాక్కంటాడే.. వాడిశార్థమంటడు
తుదకు నువ్వేకదా ఒప్పుకున్నావంటడు
ఇదెంతపనంటడు ...ఏమన్నా చెప్తే...రికార్డింగేస్తడే

(ఇక్కడ ఫ్లాష్బ్యాక్ అన్నమాట..)

నాచిన్నప్పుడు.... గాడాంధకరమైన ఓ అమావాస్యరాత్రి...
గుడ్లగూబలు కూడా భయపడేంత దట్టమైన కోడారణ్యం ( కోడ్ + అరణ్యం )
చిలకలు,గోరింకలు...కాకులు, గద్దలు
కోకిలలు, గుడ్లగూబలు
ఎన్నని చెప్పేది ఓ డెవలపరో..నీకెన్నని చెప్పేది ఓ డెవలపరో
కోతులు, కొండముచ్చులు
ఎద్దులు, ఏనుగులు,భల్లూకాలు...
ఎన్నని చెప్పేది ఓ డెవలపరో..నీకెన్నని చెప్పేది ఓ డెవలపరో...

ఆ రకంగా ఆ నిశీధిరాత్రుల్లో కాఫీ కూడా తాక్కుండా లైనెంట లైను కోడ్ వ్రాసానా
తెల్లారింది..ఆహా..పొద్దెక్కింది.. పక్షులన్నీ ఆఫీస్ చేరాయి
మేనేజరొచ్చి ప్రాజెక్ట్ కేన్సిలైందన్నడ్రో ఓ డెవలపర్
ఏమి చెప్పేదీ..నాబాధెవ్వడికి చెప్పేది...
నేపడ్డ కష్టమ్ముందు నీదెంతన్నాడే.... నీదెంతన్నాడే


ఏదోలా పగలనకరాత్రనక చేసేస్తానా....

బగ్గంటడు, కోడ్చెత్తంటడు ( కోడ్+చెత్తంటడు ),లీకంటడు,లాకులంటడు
అదంటడిదంటడు ఢాం డిస్కంటడు...
అన్నీ అని...తుదకు
మాటెయ్యరో ఓ డెవలపరో..ఈ చిల్లికోడ్ కుండకు మాటెయ్యరో ఓ డెవలపరో...
మాటెయ్యరో ఓ డెవలపరో..ఈ చిల్లికోడ్ కుండకు మాటెయ్యరో ఓ డెవలపరో...

ఓ శుభముహూర్తాన రిలీజౌద్దా...

హా..వచ్చాడే....వీడి మొగుడొచ్చాడే.....
నాసామిరంగా..వచ్చాడే..వీడి మొగుడొచ్చాడే.....
వచ్చి...

మేనేజరో ఓ ఆఫ్సోర్ మేనజరో
నేనండిగిందేంటి నువ్విచ్చిందేంటి
నేను తెలుపురంగడిగితే నువ్వు నలుపిస్తావా... ఓకే
నేను తొండమడిగితే నువ్వు ముక్కిస్తావా..ఓకే
ఐనా నేనేనుగునడిగితే నువ్వెలుక పిల్లనిస్తావా?
ఏమన్నా అర్థాముందా మేనజరో ఓ ఓ ఆఫ్సోర్ మేనజరో....?
కేన్సిల్..కేన్సిల్ ..కేన్సిల్...

డెవలపర్ బ్రతుకు సుఖాంతం ... మేనజర్ ఎలుక కుడితిలో పడింది.


సమాప్తం :-)

11 కామెంట్‌లు:

  1. హహహ పాఠంతో వస్తారని చూస్తుంటే పాటతో వచ్చారా? బాగుంది మీ బాధా పాట! అన్నట్టు కళ్ళు త్రాగిన కోతి అంటారు కదా? కళ్ళు మరీ పాత కాలమని మందని (మందు + అని) వ్రాశారా? ఇంత బాధలో కూడా గుండెలో బరువుని దాచుకుని మాకు హాస్యాన్ని పంచిన మీకు దీపావళి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. మన్నించాలి అచ్చు తప్పు కళ్ళు కాదు కల్లు

    రిప్లయితొలగించండి
  3. హహ్హ రసజ్ఞ.. ఇవి ఇప్పటి అనుభవాలు కాదండి. చాలా పాతవి.ఒకప్పుడు ఇండియాలో ఒక నికృష్టపు కంపెనీలో పనిచేసేటప్పటివి. ఈ రోజు ట్రైన్ లో వస్తుంటే పాపం ఒక ఆఫ్షోర్ మేనజర్ ఇండియాలో వాళ్ళ కోడింగ్ పిల్లకాయలతో మాట్లాడుతుంటే అప్పటి నా జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అదన్నమాట విషయం. ఇప్పుడు నాకు ఆఫ్సోర్ లేదు...ఆఫీస్ లో కూడా ఏకోనారాయణ..పని ఉన్నా ఇలాంటి తలనొప్పులు ఉండవు.

    కళ్ళు=కల్లు అని మీరు సవరించకపోయినా అర్థమైందిలెండి :-)

    రిప్లయితొలగించండి
  4. రసజ్ఞ గారూ ఇందాక కోడ్ రాసే తొందర్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం మరిచాను కదా !!!.. మీక్కూడా ఓ నాలుగు కాకరొత్తులు, ఎనిమిది చిచ్చుబుడ్లు, పన్నెండు లక్ష్మీబాంబుల దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. హహహ ధన్యవాదాలు!ఏంటండీ మరీ ఇంత పొదుపుగా ఇచ్చారు? ఇంకొంచెం ఎక్కువ ఇస్తే ఎక్కువ టపాసులు కాలుస్తాను కదా!

    రిప్లయితొలగించండి
  6. అదేమరి రమ్మాన్నారు తిమ్మన్నబంతికి..... అన్నీ మీకిచ్చేస్తే మాక్కావద్దా. ఈ సారికంతే :-)

    రిప్లయితొలగించండి
  7. హమ్మయ్య బతికే ఉన్నారన్న మాట!

    ఇన్ని రోజులు గాప్ వచ్చె కొద్దికి సందేహం వచ్చింది. ఆ సిగరెట్ల మాష్టారు ఏమయ్యారబ్బా అని !

    దీపావళీయం - శుభాకాంక్షలతో !

    రిప్లయితొలగించండి
  8. :-)


    చాలా బాగుందండీ....

    మీకు పాతే అయినా ఇప్పటికీ ఇవే పరిస్థితులు సాఫ్టువేరులో......

    దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  9. ఏందమ్మో జిలేబీ అప్పుడే పంపించేద్దామనే. :-) అవున్లే సిగిరెట్లు తాగి తాగి ఎక్కడ ఖళ్ ఖళ్ మని తిరుగుతుండాడో అని గుర్తు చేసుకున్నారన్నమాట..ధన్యవాదలు.
    మీకు కూడా రసగుల్లాలు, జిలేబీలు, కారప్పూసలూ అన్నీ కలిపి దీపావళి శుభాకాంక్షలు.

    Maddy ... కదా... ఇప్పుడు కూడా ఏమిటండీ...ఎప్పటికీ అంతే అనాలి :-).మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  10. సునీత, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. పండగ బాగా చేసుకున్నరా?

    రిప్లయితొలగించండి

Comment Form