12, అక్టోబర్ 2011, బుధవారం

సరదా సరదా సిగిరేట్.. గుండెల్లో ఒకటే మంట. అబ్బా...సినిమా కానొస్తుంది కదా.

అప్పుడే సిగిరెట్టు మీద టపా వ్రాసి ఒకరోజు గడిచిపోయింది. ఈ రోజు ఈ ధూమపానం వల్ల కలిగే మరికొన్ని రోగాల గురించి తెలుసుకొనేముందు, ఎవరికైనా ఈ వ్యసనాన్ని మానాలి అనుకొనేవారికి కొన్ని సలహాలు. నా అనుభవం ప్రకారం సిగిరెట్ తాగేవాళ్ళు " ఇప్పుడు సిగిరెట తాగకపోతే బ్రతకలేను" అనుకొనేవాళ్ళ శాతం చాలా చాలా తక్కువ. చాలా సందర్భాలలో ఈ క్రింది సమయాల్లో సిగిరెట్ వెలిగిస్తారు. ఇక్కడ నేను ఈ ధూమపానాన్ని ఇంట్లోనే దుకాణం పెట్టిన వారి గురించి చెప్పడంలేదు. వారి అలవాట్లు ఎలా వుంటాయో నాకు తెలియదు. ఎప్పుడూ దగ్గరుండి గమనించలేదు కూడా. ఈ క్రిందవి ఇంట్లో కాకుండా బయట ధూమపానం చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి.

౧) ప్రొద్దున ఆఫీస్ కు వెళ్ళే ముందు లేదా వెళ్ళగానే ఒక గంటలోపు : ఈ సిగిరెట్ మానడం నిజంగా చాలా కష్టం. ఇది లేకపోతే ఆరోజు నికోటిన్ కోటా మనకు అందనట్టే. నా వరకు ఇది చాలాకాలం ఒక ప్రదేశంతో పెనవేసుకుపోయింది.. అంటే రైల్వే స్టేషన్ దగ్గర కఫే లో ఓ కాఫీ, ఓ మార్ల్ బొరొ సిగిరెట్. చాలా సార్లు మిగిలిన సమయాల్లో తాగే సిగిరెట్ అతి సులభంగా మానేసే వాడిని కానీ దీన్ని మానడానికి మానబోయే చివరి నెలలో రోజుకో/ రెండురోజులకో ఒక సిగిరెట్ పేకెట్ ( ఇప్పుడు ఇక్కడ తొమ్మిది డాలర్లు మరి ) పడేసిన రోజులున్నాయి. అంటే సిగిరెట్ పేకెట్ లో 20 సిగిరెట్లుంటే కేవలం ఒకటో రెండో తాగి దరిదాపు ఓ 15 సిగిరెట్ డబ్బాలు పడేసుంటాను.

౨) ఇక ఆఫీస్ లో అడుగు పెట్టబోయేముందు : అంటే అప్పటికి మొదటి సిగిరెట్ తాగి గంటన్నర అయి ఉంటుంది. ఈ సిగిరెట్ Train దిగాక ఆఫీస్ కు నడుస్తూ తాగేదన్నమాట. ఇది నిజానికి అసలు అవసరపడేది కాదు. కానీ అలా నడిచేటప్పుడు అలా వెలిగించి నడిస్తే ఏదో వెలితి తీరినట్టు ఉండేది.

౩) భోజనము చేయక ముందో, చేసిన తరువాత కానీ : చాలా మందికి భోజనానంతరం సిగిరెట్ తాగే అలవాటుంటుంది. కానీ నాకెందుకో అలా అలవాటు అవ్వలేదు. భోజనానికి ఒక అరగంట ముందు తాగితే తరువాత సిగిరెట్ భోజనమయ్యాక రెండు గంటల తరువాత కానీ అవసరమయ్యేది కాదు.

ఇప్పటికి మూడయ్యాయి కదా... ఇక మధ్యాహ్నం నుంచి ఇంటికొచ్చేలోపు మరో నాలుగయ్యేవి

౪) సుమారు 3 PM - 4 PM మధ్యలో

౫) ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ కి నడిచేటప్పుడు

౬) పాత్ ట్రైన్ మారి వేరే ట్రైన్ ఎక్కేటప్పుడు. ( ఇప్పుడు అనుకుంటే నిజంగా నవ్వు వస్తుంది. ఇక్కడ సిగిరెట్ తాగడం కోసం ఈ రెండు ట్రైన్స్ మధ్య కనీసం ౨౦ నిమిషాల వ్యవధి ఉండేట్టుగా చూసుకోని ఆఫీస్ లో బయలు దేరేవాడిని )

౭) ట్రైన్ దిగి కార్ పార్కింగ్ లాట్ దాకా నడిచేటప్పుడు

౮) ఇంటికొచ్చాక పడుకొనేముందు. ( ఇది ఆప్షనల్ అన్నమాట. ఇంటో వాళ్ళ కళ్ళుగప్పి బయటకు వెళ్ళ గలిగితే సరే లేకపోతే ఆరోజుకు లేనట్టే :-) )


స్మోక్ చెయ్యని వారికివి చాలా సిల్లీగా కనిపించవచ్చు గానీ, నిజానికి స్మోకర్స్ అలవాటు దరిదాపు ఇలాగే వుంటుంది. మానేయలనుకున్న తరువాత పైన నేనెప్పుడెప్పుడు స్మోక్ చేస్తున్నానో చూస్తే, రోజుమొత్తంలో నాకు step 1 and step 5 సిగిరెట్లు తప్ప మిగిలినవి అసలు అవసరం లేదని పించేది. అంటే నేను నికోటిన్ కంటే కూడా, ఈ location based habit కి బాగా అలవాటు పడ్డాననిపించింది.

సరే మానేయలనుకునేవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయించుకోవాలి కాబట్టి ఇక్కడ నేను సలహాలు ఏమీ ఇవ్వకుండా నేరుగా మరో సబ్జెక్ట్ లోకి దూకేస్తాను.


ఇప్పుడు ఒక సాంగ్ అన్నమాట

చేతిలో ముచ్చటైన సిగిరెట్
ఎర్రెర్రగా వెలిగిపోతుంది
అప్పుడప్పుడు నేనున్నానంటూ
గాఢమైన పొగను వెదజల్లుతుంది

నేనున్నానంటూ గుర్తుచేసినప్పుడల్లా
గాఢంగా గుండెనిండా, ఆపొగను
నా అనుభూతితోకలిపి
ఆప్యాయంగా పీల్చసాగాను

కాలం గడిచింది
చేతి వేళ్ళు ఇప్పుడు మండటంలేదు
పెదవులకు కూడా పెద్దగా కాలేస్పర్శ తెలియడంలేదు
కానీ కానీ ఎక్కడో గుండెలదగ్గర
ఆ గుండెకు కొంచెం దిగువున
అప్పుడప్పుడు చిన్నమంట
నేనున్నాని గుర్తు చేస్తూ


అర్థమయిందా? సిగిరెట్ తాగేవాళ్ళలో అందరూ అనుకొనే గుండెపోటు, కాన్సర్... ఇలాంటి రోగాలకంటే చాలా చాలా ముందుగా గుండెకు దిగువభాగంలో ఓ మంట లాగా అనిపిస్తుంది. ఈరోజు ఆమంటకు కారణ మేంటో చూద్దాము. సాధారణంగా ఇది స్మోకర్స్ లో కనిపించిందంటే తరువాత రాబోయే దశ Gastroesophageal reflux disease అనుకోవాలి. కాబట్టి మీకు గుండెమంట, లేదా కడుపులో మంట ( కుడి, లేదా ఎడమ వైపు ) అనిపించినవెంటనే రెండువేళ్ళమధ్య వెలిగే సిగిరెట్ ఆర్పేయకపోతే అది మిమ్మల్ని అర్పేస్తుంది. జాగ్రత్త పడండి.

ఇక ఇది స్మోకర్స్ లో ఎందుకు వస్తుందో చూద్దాము. ముందుగా ఈ క్రింది బొమ్మలు చూడండి.






చూసారా? ఇప్పుడు ఒకటవ బొమ్మలో నోటినుంచి పొట్టదాకా ఓ గొట్టం కనిపిస్తుంది కదా. దాన్ని ఇంగ్లీషోడు ఏదో గ్రీకు పేరు పెట్టుకున్నాడు కానీ మనం సుద్దంగా తెలుగులో ఆహారనాళము అందాము.మనము ఏదైనా తిన్నప్పుడు అది ఈ గొట్టంలోగుండా కడుపులోకి వెళుతుంది. అదేలేండి జీర్ణాశయము లోకి వెళుతుంది. వెళ్ళిన తరువాత పడుకున్నప్పుడో లేదా వంగినప్పుడో మళ్ళీ పోయిన నాళం గుండానే నోట్లోకి వచ్చేయాలి కదా!!!. కానీ రాదే. దీనికి మూఖ్యకారణం అదుగో ఆ రెండవ బొమ్మలో కనిపించే LES పొర. ఇది లోపలికి పోనిస్తుంది కానీ బయటికి రానివ్వద్దు. మన జీర్ణాశయం మనము తిన్న ఆహారము జీర్ణమవడానికి రకరకాల అమ్లాలను శృష్టించే సంగతి మనందరికీ తెలిసిందేకదా. అంటే మన జీర్ణాశయంలో ఆమ్లాలు( Acids ) ఉంటాయి. ఇంతవరకూ బాగానే వుంది కదా.....

ఇప్పుడు, For example, suppose, సరదాగా ఆ LES పొర మన ఈ వ్యసనం మూలంగా సరిగా మూసుకోవడం లేదనుకోండి. ఎమైంతుంది? అవ్వడానికేముంది ఇంక సీన్ సితారే. అక్కడ ఏర్పడ్డ ఆమ్లం ఎగదన్నుకోని ఈ ఆహారనాళం గుండా పైకి రావడం మొదలవుతుంది. అదీ ఆమంట.అందుకనే ఈ మంట పడుకొన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది.

ఇక నేను చెప్పేదేముంది. అంతా మీచేతుల్లోనే వుంది.

గమనిక : రాబోయే మూడు నాలుగు రోజుల్లో వేరే వ్యాసాలు రాయాల్సివుంది కాబట్టి..ఈ సీరీస్ ఆ వ్యాసాలయ్యాక మళ్ళీ రాస్తాను. ఇంకో ఇరవై టపాలన్నా రాస్తే గానీ పుస్తకానికి సరిపడా మెటీరియల్ సమకూరేట్టులేదు.

5 కామెంట్‌లు:

  1. భాస్కర్ చక్కటి టపాలు వ్రాస్తున్నారు. నాదొక సందేహము తీరుస్తారా!!

    గుండెలో మంట పడుకున్నప్పుడు, వంగినప్పుడు ఎక్కువ అవుతుందని చెప్పేరు. ఎందువలన?

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాతా నా టపాలు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు. వీలైతే అన్నీ చదవండి. కనీసం మరో 20 symptoms గురించి అవి ఎందుకు వస్తాయో రాస్తాను.

    ఇక మీరడిగిన ప్రశ్నకు సమాధానం. ఏదైనా ఒక గొట్టాన్ని నీళ్ళలో నిలబెట్టినప్పటికంటే, ఏటవాలుగా పెట్టినప్పుడో లేదా భూమికి సమాంతరంగా పెట్టినప్పుడో అందులోకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఎక్కువకదా. ఇక్కడ కూడా అంతే, పడుకున్నప్పుడు మన జీర్ణాశయం, ఆహారనాళం భూమికి సమాంతరంగా ఉంటాయి కదా. అందువల్ల అందులోని యాసిడ్స్ ఈ ఆహారనాళంలోకి వచ్చి మంటపుట్టిస్తాయి. ఎందుకంటే ఈ ధూమపానం వల్ల ఆ LES పొర సరిగా మూసుకోవడం మానేస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. I need to make my husband read this immediately.Thanks for the post.

    రిప్లయితొలగించండి

Comment Form