31, అక్టోబర్ 2011, సోమవారం

వ్యవసాయ సంబంధమైన పదాలు.... వాటికి సరిపడ ఫొటోలు...

ఈ మధ్య బ్లాగుల్లో బాగానే అందమైన ఫోటోలు కనిపిస్తున్నాయి. అలాగే కొద్దిమంది ఈ రంగంలో మంచి ప్రొఫేషనల్స్ కూడా వున్నట్టున్నారు. వీరందరికి ఒక అభ్యర్థన.మీరు ఇదివరకు తోసిన లేదా తీయబోతున్న ఫొటోలు వ్యవసాయ సంబంధమైన ఫొటోలైతే ఆ లింకును ఇక్కడ ఇవ్వగలరేమో చూడండి.
ఫొటోలు నాణ్యమైనవి కావాలి. అంటే ఈ ఫోటొల్లో ఆ పనిముట్టుకు సంబంధించిన అన్ని భాగాలను గుర్తించడానికి అనువుగా వుండాలి. వీటిని తెలుగునిఘంటువులో చేర్చడానికి ఎటువంటి అభ్యంతరమూ లేనివై ఉండాలి.ఈ క్రింద కొన్ని ఉదాహరణ పదములనిస్తున్నాను. కానీ ఇవే అవ్వక్కరలేదు. వ్యవసాయానికి సంబంధించి ఏ పనిముట్టైనా తీసుకుంటాము.


కొన్ని ఉదాహరణ పదాలు.

౧) కొడవలి
౨) లిక్కి
౩) జడ్డిగం
౪) నాగలి
౫) గొఱ్ఱు
౬) పరము
౭) బండి
౮) పొన్ను
౯) పలుగు
౧౦) జడ్డిగం అమర్చి విత్తనాలు విత్తే పరికారాలన్ని
౧౧) గుంటక
౧౨) పలక ( అచ్చుకట్టు )
౧౩) దిండు
౧౪) గొర్రు
౧౫) ముల్లుగర్ర
౧౬) చెలకోల ( చెర్నకోల )
౧౭) దోకుడు బార
౧౮)గొడ్డలి
౧౯) గండ్రగొడ్డలి
౨౦) గడ్డపార
౨౧) తర్లుబార
౨౨) కవెల
౨౩) దున్నపోతు
౧౪) బఱ్ఱె
౨౫) ఆవు
౨౬) ఎద్దు
౨౭) గాడి
౨౮) బఱ్ఱెలకొట్టం
౨౯) తొట్టి
౩౦) తలుగు
౩౧) వామి
౩౨) రకరకాల పైర్లు ( దంటు, కంకి స్పష్టంగా కనిపించాలి )
౩౩) గాదె( గాజె )
౩౪) పాతర
౩౫) చిక్కి


ఇవే కాకుండా ఇంకా మీకు తెలిసిన పనిముట్లేవైనా సరే....

21 కామెంట్‌లు:

  1. మంచి ఆలోచన! వీటిల్లో నేను కొన్నిటి పేర్లు వినలేదు! ఇలా ఎవరయినా పెడితే తెలుసుకునే అవకాశం వస్తుంది!

    రిప్లయితొలగించండి
  2. very nice..
    deshamlo agriculture agamaipothunna e chetta governamentlu pattinchukovu..

    chala rojula tharvatha vyavasayaniki sambandinchina padalu chadivi chala hyppyga feel avuthunna.....

    రిప్లయితొలగించండి
  3. సిక్కెం
    సిలిమ్యార
    దోని
    వార్నె
    మేడతాక
    నాటు
    జొల్ల
    బండి జొల్ల
    పారుకోల
    పికాసి
    గుద్దేలి
    కాడిమాను
    పట్టెడ
    పగ్గం
    మొగదాడు
    మోకు
    దంతె
    పండ్ల దంతె
    అచ్చుపలక
    అచ్చుకట్టె దంతె
    పన్నగం
    కాడి
    రొచ్చు
    రొచ్చు గుంత

    ఇవి మచ్చుకు కొన్ని,గుర్తుకు వచ్చినప్పుడు ఇంకా కొన్ని పెడతాను.

    రిప్లయితొలగించండి
  4. ఈ సారి మా ఊరెళితే కొన్ని ఫోటోలు తీసుకువస్తాను.

    రిప్లయితొలగించండి
  5. అన్నట్టు వికీ కామన్స్ లోనుంచి కూడా మీకు కావాల్సినవి వాడుకోవచ్చు.
    ఉదాహరణకు కొడవలి http://commons.wikimedia.org/wiki/File:20.Falz.JPG
    గొడ్డలి - http://commons.wikimedia.org/wiki/File:Axes.JPG
    పార - http://commons.wikimedia.org/wiki/File:Dropped_spade.jpg

    రిప్లయితొలగించండి
  6. @Rasgna, sure,thank you

    @Ramana Reddy, thank you. If possible please post photo links too.

    @Ravi, Thanks a lot.

    @Subha, thank you

    రిప్లయితొలగించండి
  7. ఏదో అందమైన అమ్మాయిల బొమ్మలు పంపమంటే ఓకే.....
    అంతే కాని కొన్నింటి పేర్లుకూడా వినకుండా ఫోటోలా!!
    సారీ బాస్:-)

    రిప్లయితొలగించండి
  8. Good attempt. ఊరెళ్ళినప్పుడు (ఎప్పుడో మరి) కొన్ని తెస్తాను.

    రిప్లయితొలగించండి
  9. నేను వ్రాసిన చివరి పదం రమణా రెడ్డి గారు చెప్పినట్టు అది సిక్కెం లేదా చిక్కెం.
    అలాగే మరికొన్ని కొలత ప్రమాణాలు. ఇప్పుడున్నాయో లేవో మరి

    మానిక
    తవ్వ
    సోల
    అద్ద
    గిద్దెడు

    రిప్లయితొలగించండి
  10. హ హా..పద్మార్పితా... చేలో పనిచేసే అమ్మాయి బొమ్మవేసి పంపు మరి. తప్పకుండా పెడతాను.

    అంటే... తూర్పు పట్టే అమ్మాయి
    నాటు నాటే అమ్మాయి
    గడ్డి కోసే అమ్మాయి
    తట్టలో పేడ వేసుకొని నడిచే అమ్మాయి
    దిగుడు బావినుంచి నీరు మోసుకొచ్చెఅమ్మాయి
    బఱ్ఱెల కాసుకోవడానికి వెళ్ళే అమ్మాయి ఆహార్యం
    కూలీలకు ధాన్యరాశి వద్ద గింజలు కొలిసే అమ్మాయి.

    మీరివ్వాలే కానీ అంతదృష్టమా :-)

    రిప్లయితొలగించండి
  11. వరూధుని గారూ... అవును మన ఊర్ల వైపు కనిపిస్తాయి ఇవన్నీ... కానీ మెట్టప్రాంతాల్లో అయితే 100% గ్యారంటీ గా దొరుకుతాయి. ఆలస్యంలేకుండా బయలుదేరండి మరి. ఏదో మళ్ళీ ఒకసారి ఊరి గాలి పీల్చినట్టుంటుంది. అలాగే ఆ మట్టివాసనలూ, పాతజ్ఞాపకాల పందిళ్ళలో చిన్ననాటి అమాయకత్వమూ ఓ సారి అనుభవించినట్టుంటుంది.:-)

    రిప్లయితొలగించండి
  12. నా దగ్గర యెద్దుల(పందెం గిత్తలు) ఫొటొ లు వున్నయండి.కాడిమాను తొ కట్టి, యెద్దు ని పట్టుకొని ఇలా..వుపయొగపదతాయో లెదొ తెలియదు. పంపమంటారా.

    రిప్లయితొలగించండి
  13. ఓ తప్పకుండా పంపండి ప్రబంధ్. పందెం బండ కూడా వుందా? మీరు ఎక్కడైనా అప్లోడ్ చేసి లింకు పంపినా సరే లేదా ramireddy.mvb [at] gmail.com కు ఫొటో పంపినా సరే. ఫొటోలను నిఘంటువులో చేర్చడానికి కనీసం మరో నాలుగు నెలలైనా పడుతుంది.చేర్చగానే మీకు వివరాలు తెలియచేస్తాను.

    రిప్లయితొలగించండి
  14. అలాగే మరికొన్ని కొలత ప్రమాణాలు. ఇప్పుడున్నాయో లేవో మరి

    మానిక
    తవ్వ
    సోల
    అద్ద
    గిద్దెడు...

    అయ్యో భేషుగా ఉన్నాయి...మా ఇంట్లో ఇప్పటికీ వాడతాం...ఇక్కడ కూడా నేను అవే వాడేది..వీటి ఫోటోలు కావాలంటే వెంటనే పంపగలను..

    ఇంతకీ అద్ద అంటే? అర సోలనా?

    రెండు గిద్దలు = అర సోల

    రెండు సోలలు (నాలుగు గిద్దలు)= సోల

    రెండు సోలలు = తవ్వ

    రెండు తవ్వలు (నాలుగు సోలలు) = మానెడు

    రెండు మానికలు = అడ్డెడు.

    రిప్లయితొలగించండి
  15. అవునండి సిరిసిరిమువ్వ..మీరు చెప్పిన లెక్క కచ్చితంగా వుంది. కాకపోతే అడ్డెడు అనేది నాకు తెలియదు

    మేము ౨ గిద్దలు= ౧ అద్ద ( అద్దెడు )
    ౨ అద్దలు = ౧ సోల
    ౨ సోలాలు = ౧ తవ్వ
    ౨ తవ్వలు = ౧ మానిక

    ఇంతవరకే తెలుసు నాకు.

    రిప్లయితొలగించండి
  16. ఫోటోల కాలస్యమెందుకండి. మీవద్ద వుంటే వెంటనే , లేకుంటే మీకు తీరిక చిక్కినప్పుడు పంపించండి.

    రిప్లయితొలగించండి
  17. మా బాగా చెప్పారు అయ్యగారు.. అసలు మేమే మర్సిపోయం కొన్ని పదాలు ...రోజు ఎల్తా పొలం కాడికి కాని కొన్ని పదాలు అసలు వాదనే వాడను..ఐనా మీ బోటి వాళ్ళు చెప్తుంటీ బలేగుంటది అంది...అలాగే కూని మంచి కల్తి లేని మందులు ఎరువులా వివరాలు రాయండి అయ్యా !! చస్తున్నాం చీదలతోటి ... మీరు పతిది క్లాసు పీకుతర్రు గా అలాగే ...వీటి మీద ఒకాటి రాసి పడేయండి ...మాబోటి పాలేర్లు ఎరుకుంటాం పరిక....

    రిప్లయితొలగించండి

Comment Form