6, జనవరి 2012, శుక్రవారం

నూతన సంవత్సరంలో కూలు కూలుగా హాయి హాయిగా నవ్వుకోండి. బ్లాగర్లూ వాళ్ళ కలల కలాల పేర్లు -2

రెండో విడత - బ్లాగరూ వాళ్ళ కలల కలంపేర్లూ
____________________________________________________________________

జిలేబీ:
అరవగోల. ఈవిడ ఓ తెగ జిలేబీలేస్తానంటుందికానీ జిలేబీల బదులు కారప్పూసలౌతాయి. అప్పుడప్పుడు తెలుగును అ"రవం" గా వ్రాయడంలో స్పెషలిస్టు.

రాఫ్సన్ :
అరేబియన్ పాలేరు. పాలకోసం ఒక ఆవును కష్టపడికొనుక్కున్నాడు. అది తన్ని పారిపోయింది.

సుభ :
పెన్సిల్ దెయ్యం. పెన్సిల్ తో పొడిచి చంపేస్తుంది.

పద్మార్పిత:
art museum. బువ్వపెట్టమ్మా అంటే బొమ్మపెడతా నంటది.

ఉమ:
ట్రింగ్ ట్రింగ్ .. నా తెల్లని నవ్వుకు కోల్గేటే కారణం

ఉష:
తప్పిపోయిన బ్లాగరి. కానీ ప్రక్కనే వున్న అడవిలో పుట్టలు, కొమ్మలూ, పూలూ, పక్షులూ అని పాడుకుంటుందిలే.

జయ:
హిస్టరీ పుస్తకం .. అప్పుడప్పుడు చరిత్ర యుద్ధాలు గుర్తుకొచ్చి నిద్రలో తూటాలు,గుళ్ళు పేలుస్తుంటారు ( ప్రక్కనింటోళ్ళు చెవుల్లో దూదిపెట్టి). జంధ్యాలలా ఆశీర్వచనాలను ఇవ్వడంలో సాటిలేని మేటి.

ఎందుకోఏమో:
cut copy paste


అప్పారావు:
ఇరగతీస్తా బిడ్డా... ఏమి తీస్తాడో

కౌటిల్య:
Dr kitchen surgen. మనుషుల్ని రేపు కొయ్యొచ్చు. ఈరోజుకు ఈ వంకాయకు సర్జెరీ చేస్తా.

శేఖర్:
24X7 ప్రంపంచ వార్తా స్రవంతి. కానీ వీరెప్పుడూ తన కుర్చీవదిలి పక్కూరుకూడా వెళ్ళరు ( వార్తలకోసం).

సుధ :
singer in bathroom.( అదేంటో వినేవాళ్ళకు male voice వినిపిస్తుంది మరి.)

రసజ్ఞ :
ms Research ( లోపల మాత్రం ఎదవ రీసెర్చ్.... హాయిగా పెళ్ళిచేసుకోని పిల్లల్ని కనక ఏంటో నాకీతిప్పలు )


మహేశ్వరరెడ్డి :
Dr వయసుపిలిచింది. పెళ్ళీడొచ్చింది కానీ జిలేబే దొరకలేదింక.

44 కామెంట్‌లు:

  1. కొంచెం హాస్యం. బాగుంది.
    కాని కొన్ని చోట్ల చీప్ గా ఉన్నాయి బ్లాగరు గారి మాటలు.

    రిప్లయితొలగించండి
  2. "శ్యామలీయం" గారూ నేను మీతో ఏకీభవిస్తాను...
    కొందరి గురించి బహు జాగురూకతతో వ్యవహరించి మరికొందరిని గురించి బ్లాగరు గారి వాక్ప్రేలాపన మరీ హీనముగా యున్నది.
    ఉదాహరణకు

    ఎందుకోఏమో:
    cut copy paste

    రసజ్ఞ :
    హాయిగా పెళ్ళిచేసుకోని పిల్లల్ని కనక ఏంటో నాకీతిప్పలు

    సుధ :
    singer in bathroom.
    ( అదేంటో వినేవాళ్ళకు male voice వినిపిస్తుంది మరి.)

    మనలో మన మాట ఆవిడ బాత్ రూం లో పాడుతుంటే మీరెప్పుడు విన్నారు బ్లాగరు గారు??

    ఇల మాట్లాడానని నా బ్లాగ్ హారం లో రాకుండా చేసేరు అసలే ఇప్పుడిప్పుడే కొంచెం పబ్లిసిటీ వస్తుంది నాకు.

    రిప్లయితొలగించండి
  3. సందీప్ గారూ... భా.రా.రె గారు సుధ గురించి పెట్టిన వ్యాఖ్యలు చనువు కొద్ది పెట్టి ఉండొచ్చు. భా.రా.రె గారు ఈ విషయం ముందటి టపా లోనే చెప్పారు.

    రిప్లయితొలగించండి
  4. రాఫ్సన్ గారు ఉండేది సౌదీ అరేబియాలోనే. అరేబియాలో ఆవులు ఉండవు కదా. ఒంటెలు, కొన్ని జాతుల మేకలు మాత్రం ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా ఒంటె పాలు తాగుతారు.

    రిప్లయితొలగించండి
  5. మీ నిశిత పరిశీలన కడుంగడు ముదావహము!

    రిప్లయితొలగించండి
  6. శ్యామలీయం & సందీప్,

    Your comments are well taken.

    @Sandeep,May I know your Blog url?

    రిప్లయితొలగించండి
  7. నేనెవరికీ గుర్తులేనన్నమాట . హేవిటో...!?

    రిప్లయితొలగించండి
  8. ప్రవీణ్, అదేకదా ఇక్కడ హైలైట్. రాఫ్సన్ అరేబియా లో వున్నాడనే కానీ మనసంతా ఇండియా పైనే. అందుకే వెళ్ళేటప్పుడు ఆవును ఫ్లైట్ లో ఎక్కించుకోని వెళ్ళాడు.

    kastephale గారు, ధన్యవాదాలు

    జయగారూ.................. నిజమేకదండీ. ఇంకా మాట్లాడితే నడిచే హిష్టరీ అనాలేమో :D

    రిప్లయితొలగించండి
  9. లలిత గారూ, ఇప్పటికే జనాలకు నా మీద కుతికలదాకా వున్నట్టుంది :(. ఇక మిమ్మల్నికలిపితేనా :D

    కానీ ఇక్కడ ఒక్క విషయమేమిటంటే, వాళ్ళవి వాళ్ళకు తప్ప, మిగిలినవారివి చదివి ఆనందిస్తారేమో :P

    రిప్లయితొలగించండి
  10. అరే రామిరెడ్డిగారూ,
    మీరు కొన్ని బ్లోగుల గురించి రాయనే లేదు. బ్లోగు నామధేయాలు చదివితే వారు స్త్రీలో పురుషులో అర్థం కాదు. ఎక్కడుంటారో ఎవరో తెలియదు. అసలు పేరూ తెలియదు.కనుక ఎలా స్పందించాలో కూడా అర్థం అవదు.
    వాటి గురించి కూడా రాయకూడదూ? కనీసం నాలాంటి వాళ్ళకి కొంచం సౌకర్యంగా ఉంటుంది.
    క్రిష్ణవేణి

    రిప్లయితొలగించండి
  11. క్రిష్ణవేణి gaaru,

    giving a blogger url with hyperlinks is a time taking process, and moreover, you may not be able to figure out and map the above comments by just reading 1 or 2 posts.

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. ఎన్నా అన్నా,

    ఎన్నవో ఎయిదిర్కే! ఇవ్వలవు నల్లా టెల్గూ ల ఎఇదిన అరవం లో ఎయుదరే అంటారు ! నేనేమి చేతునో నా ముద్దుల మనవాడా రామి రెడ్డీ భాస్కరా !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  14. @Kri, Nope, I am asking you. బ్లాగులేకుండా ఇలా బ్లాగును ఫాలో అవడం ఎలా సాధ్యమా అని.

    @Zilebi... ???

    ఎన్నవో ఎయిదిర్కే? are you taking my comments serious? అందరికి రాసినట్టు మీకూ వ్రాసా. అంతకు మించి ఈ పోస్టుల్లో రంధ్రాన్వేషణలు లేవు

    రిప్లయితొలగించండి
  15. ప్రవీణ్ గారు
    మీకు నవరసాలకి స్పందించే గుణం లేదు అనుకుంటా
    హాస్యం అన్నాక నవ్వాలి లేకపోతె ఒక చిరునవ్వు తో సరిపెట్టాలి
    మరీ అంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎలా ?
    లాభం లేదు మిమ్మల్ని కుర్చీకి కట్టేసి Mr బీన్ సినిమాలు చూపించాలి ( నాలో నేనే కేవ్వవ్వ్వ్వ్ కేక అని అనుకుంటున్నా )


    @ kastephale గారు
    మీ కామెంట్ ప్రవీణ్ కామెంట్ క్రిందనే ఉండటం తో మీరు నిశిత పరిశీలన అన్నది భారారే గారినా లేక ఈ ప్రవీణ్ నా అన్నది తెలియక అరికాలు గోక్కోవడమైనది :))

    @ సందీప్
    ఎందుకోఏమో:
    cut copy పేస్టు మీకు నచ్చలేదా ?
    నాకు మాత్రం చాలా బాగా నచ్చింది

    అయ్యో మీ కామెంట్ నచ్చడం లేదని అగ్రిగేటర్ నుంచి పీకేస్తారని ఎలా అనుకున్నారు ??

    ఒకవేళ భారారే గారు అలా చేస్తే మన http://www.sankalini.org/ రండి ( వ్యాపార ప్రకటన కిసుక్కు )



    @ భారారే గారు
    బాగున్నాయి
    కాకపొతే మీరు బ్లాగర్ పేరులతో పాటు url ఇచ్చిఉంటే బాగుండేది

    నేను అప్పుడెప్పుడో చెప్పా మొదటి కామెంట్ మంచిగా పెట్టిన్చుకోవాలి అని
    మిగిలిన వాఖ్యాతలు మొదటి వాఖ్యాత ని ఫాలో అయిపోతారు ( సెటైర్ )


    లేదండి , ఇప్పుడు అంత ఓపిక లేదు
    మా బాస్ చేత ఇరగ తీయిన్చుక్నే పనిలో బిజీ గా ఉన్నా (వా..........)

    రిప్లయితొలగించండి
  16. @Apparao, this is cheating.ఇలా నా క్లైంట్స్ ని ఒక్కొక్కరిని లాగేసుకోని తుదకు హారానికి పంగనామాలు పెట్టేటట్టున్నారు :P

    On serious note, this is the first time I hear from Sandeep. I would like to know his blog url so that I can take a look and inform him the exact problem.

    రిప్లయితొలగించండి
  17. @ భారారే గారు
    సెటైర్ శాస్త్రి అనో
    లేకపోతె
    Mr పర్ఫెక్ట్ సాంగ్ ( ఆర్య 2 లో ) వేస్తారేమో అని అనుకున్నా :))


    "అగ్రిగేటర్ లలో వారి వారి బ్లాగ్ లని చూపించడం అనేది వ్యక్తిగత కారణాల పై ఆధారపడి ఉండదు" - అని అందరూ అనుకోవాలి - ఇది నా కోరిక
    కొంత మంది సందీప్ లానే అనుకుంటునారు ( ఆఖరికి నేను ఎక్కువగా కామెంట్స్ రాసే ఒక ప్రముఖ బ్లాగర్ కూడా )
    సర్వ జన సమ్మతం గా ఉన్నవి అగ్రిగేటర్ లలో వస్తాయి , వ్యక్తీ గత విభేదాలకి తావు ఇవ్వకుండా ( Unbiased గా ఉంటాయి )
    ఈ విషయాన్ని అందరి దృష్టికి వచ్చే ప్రయత్నం చెయ్యాలి - ఈ బాధ్యతా మీ భుజ స్ఖందాలపై ఉంది (మళ్ళి కేవ్వ్వ్వ్ keka )

    రిప్లయితొలగించండి
  18. ఇక్కడ జిలేబి లేని లోటు తెలుస్తోంది

    రిప్లయితొలగించండి
  19. హహహ! మొత్తానికి ఇలా డిసైడ్ చేసారా?

    రిప్లయితొలగించండి
  20. అందరికి నమస్కారం. కాసేపు సరదాగా నవ్వుకుందాం.ఎంతయినా వొక కుటుంబ సభ్యులం కదా! హహహహహ. నవ్వండి. ఎందుకు ఆలస్యం.

    రిప్లయితొలగించండి
  21. @Apparao, కామెంట్ల లోని జిలేబీ మనం తీసుకొనేదాన్ని బట్టి వుంటుంది.:D
    కానీ ఎందుకో నిన్నటి పోస్టులో బ్లాగర్లను, ఈ రోజుపోస్టులోని బ్లాగర్లను తీసుకుంటే ఈ రోజు టపాలో వున్న కొద్దిమందిని మినహాయిస్తే, మిగిలినవారు ఇలాంటి సందర్భాలలో, అంటే మాట పట్టింపులు వచ్చినప్పుడు ఏదైనా అవతలవారిని అనగలరే కానీ వాళ్ళు తిరిగి ఏదైనా అంటే హుందాగా తీసుకోలేరనిపిస్తుంది. ఎమోషనల్ ఇంబాలెన్స్ ఎక్కువేమో అని నా అభిప్రాయం.


    రసజ్ఞ ఎటువెళ్ళారండీ, అంతా అయ్యాక పోలీసోళ్ళు పీ పీ పీ అని విజిల్ ఊదుతూ వస్తారు చూడండి..అలా వచ్చారు :D


    కష్టేఫలేగారూ, :-) ఇప్పుడు నవ్వాలంటే అమెరికా లో గుడ్మార్నింగ్ అని కనిపించనవారికల్లా చెప్పినప్పుడు నవ్వుతాము చూడండి. అలా నవ్వాల్సొస్తుందేమో కదా :-)

    రిప్లయితొలగించండి
  22. మీరు మోసం చేశారు! నాకేమని చెప్పారు ఇవాల్టిదాకా పెట్టను అన్నారా? అందుకని నేనేమో నా పాటికి సెమినార్కి వెళితే నేను లేని టైం చూసి దొంగతనంగా పెట్టేసారు. నాకు విషయం తెలిసి వచ్చాను. అయినా నాకు ఇప్పుడు పోకిరిలో డైలాగ్ చెప్పాలనిపిస్తోంది! ఎప్పుడొచ్చామన్నది కాదు పోస్ట్ చదివి నవ్వుకున్నామా లేదా?

    రిప్లయితొలగించండి
  23. ఓయ్ భాస్కరూ,

    జిలేబి అరవ కామెంటు వెయ్యంగ అది కార 'ప్పోసగా' 'తీట' తెలుగున మారి పోయేజిలేబి ఎప్పుడు దేనిని సీరియస్ గా తీసుకొనె !

    మరీ సీరియస్సు గా చెబుతున్నండీ, ఐ ఆబ్జెక్ట్ అర ఆనర్ !

    @అరాశా (ఆపారావు 'స్మాష్' త్రీ,)

    ఈ మారు మీరు జిలేబి లేని లోటును పైన కవర్ చేసేసారు ! కావున జిలేబి కొంత ఆలస్యముగ వచ్చే!!

    @కష్టే ఫలే మాష్టారు,

    నిశిత పరిశీలనా కౌశల్యం మీ శ్రీమతీ చలవ అనుకుంటాను మీకు !

    ఇక మా సుభ గారంటారా,

    వారి పెన్సిలు షార్పు, వారి కలం పోటు వేడి జోడి! ఒక దానితో ఒకటి పోటీ పడుతుంటాయి !

    మా రసజ్ఞ గారు,

    గోదావరీ వంపులు వారి కవితల్లో సొంపులు
    మీది బ్రిడ్జి అందం వారి ఆర్టిస్టు పరిచయాలు
    ఇక గ్రంధాలం లో ప్రేమాయణం రసజ్ఞమ్!


    ఇంకా మా బులుసు వారు రాలేదేమిటి చెప్మా ఇక్కడ ?

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  24. >>బ్లాగులేకుండా ఇలా బ్లాగును ఫాలో అవడం ఎలా సాధ్యమా అని<<
    I do not get this. If I have no blog, is it not possible to follow the blogs I like?
    In any case I had posted my comments without having read your earlier post on the same subject. So I guess I must have come across and a dim wit.
    Krishnaveni

    రిప్లయితొలగించండి
  25. రామిరెడ్డి గారు, విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్ళినా ఆవులు ఎడారిలో పెరగవు కదా. అక్కడ ఒంటెలు, కొన్ని జాతుల మేకలు మాత్రమే బతుకుతాయి. మనం ఇక్కడ ఏ పండగ టైమ్‌లోనో మేక మాంసం తింటే లిబ్యా లాంటి దేశాలలో రోజూ మేక మాంసం తింటారు. ఎడారి దేశాలవాళ్ళ ఆహారమే అది. సౌదీ అరేబియాలో హెజాజ్ ప్రాంతంలోని ఒకటిరెండు చోట్ల తప్ప ఎక్కడా వ్యవసాయ భూములు లేవు. అక్కడ మనుషులు బతకడమే కష్టం, అటువంటప్పుడు ఆవులు పెరగడమనేది తరువాత సంగతి.

    రిప్లయితొలగించండి
  26. రసజ్ఞ, so sorry, actually last night I scheduled this post. కానీ ఏమైందంటే టైం మార్చాకానీ, డేట్ మార్చడం మర్చిపోయా :D

    జిలేబీ గారూ :-)

    కృష్ణవేణి గారూ, అవునా? ఎలా ఫాలో అవుతారో నాకు తెలియదండీ.

    ప్రవీణ్, విమానంలో ఆవు ఎక్కగా లేంది ఎడారిలో ఆవు బతకదా ఏంటి?

    రిప్లయితొలగించండి
  27. నా పెన్సిల్ ఎక్కడ? అసలు కామెంట్తో చంపేద్దామనుకున్నా;) మా జిలేబీ గారి కామెంట్ చూసి వదిలేస్తున్నా రెడ్డి గారూ.. హా హా హా మొత్తానికి భలే బిరుదిచ్చారు.. ఇక అలాగే చంపేస్తా అందరినీ..

    రిప్లయితొలగించండి
  28. ప్రవీణు,

    ఎడారిలో ఖర్జూరం పెరుగును. ఆవులు పెరగవు. కాని మా పాలేరు వారు, ఒంటెల మీద ఆవుల్ని మేపుట అను ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ మొదలెట్టా రక్కడ. ఎడారి లో ఇది ఒక 'కో' ఆపెరేటివ్ మిల్క్ డైరీ అవుతుందేమో చూద్దాం!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  29. ఒంటె పాలు మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి కదా, ఇక ఆవు పాలతో పనేముంది? కొంచెం నీరెక్కువ దొరికే ఈజిప్ట్ లాంటి semi-desertsలో గాడిద పాలు కూడా దొరుకుతాయి. ఆవులని అవి బతకలేని desert environmentకి తీసుకెళ్ళడం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. మూడో పార్ట్ లో నా పేరు కనపడాలి
    లేదా... భారారే!! మీకు లేదు భరోసా

    ఎం ..
    నేను బ్లాగార్లా ఆనట్లేదా..?
    బ్లాగురాయ లేదా?
    మీరు చదవలేదా?

    రిప్లయితొలగించండి
  32. అహో, భా 'రామి' రె ;) మా 'హార' మణీ!!! (చాల్లేయ్యా ఈ స్తోత్రమాల) ఫర్వాలేదే నా ఆనుపానులు తెలుసుకుంటూనే ఉన్నావన్నమాట. తిప్పతీగె తొక్కేవరకు తప్పిపోన్లే. బాగుంది నీ సరదా సరదాగా కాలక్షేపం. ఛలో ఎంజాయ్ మాడి.

    రిప్లయితొలగించండి
  33. ఓహో ఉషా.. ఇక్కడున్నావా? అనవసరంగా తప్పి పోయావని రాసానే :P

    రిప్లయితొలగించండి
  34. ఎక్కడ ఎక్కడ హారం పత్రిక ఇంకా రాలేదేమిటి ! ఎనిమిది అయిపోయే తొమ్మిది వచ్చేస్తోంది! ఇంకా హారం రాలేదేందుకు ? ఏమయ్యింది. వెంటనే ఒక కమిటీ వేసి విచారణ చెయ్యవలె

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  35. హ:-) హ:-)
    హి:-) హి;-) హి:-)
    ఓహో...హాహా...హీహీ
    హాయిగా ఈ సంవత్సరం అంతా నవ్వుతూనే ఉంటాగా!

    రిప్లయితొలగించండి
  36. సుభ గారూ అయితే మీకు బ్లేడ్ అందకుండా జాగ్రత్త పడాలైతే :-)

    జిలేబీ "కో" ఆపరేషన్ అన్నమాట భలే భలే !

    ప్రవీణ్ ..ప్చ్... ఇంతకంటే ఇప్పుడు సమాధానమిచ్చే ఓపిక లేదు.

    మౌళి, కామెంట్ డిలీట్ చేసారా? ఎందుకు? తప్పేమి వ్రాయలేదు కదా !

    రిప్లయితొలగించండి
  37. ఆత్రేయ గారూ, మీరు ఏ ఆత్రేయ ఇంతకూ? అప్పటి ఆత్రేయా లేక నవీన ఆత్రేయా? మూడో పార్టు మరోసారి.

    వనజ గారూ, మీరు మిస్సయిపోయారుపోండి :-)

    జిలేబి గారూ, ఏం పత్రిక వస్తే ఎత్తేసేద్దామనా :-). రేపటిదాకా ఇల్లే.

    పద్మార్పితా... :D

    రిప్లయితొలగించండి
  38. ఈ నవ్వుకర్థమేమిటండి మాలా కుమార్ గారూ :D

    రిప్లయితొలగించండి

Comment Form