దరిద్ర జీవుల నిద్రలేపుచు
వెలుగు రేఖల ముద్దులాడుచు
వచ్చెనదిగో నిండు స్వాతంత్యం
మూడుపూటల ముద్దనిడి
పసుపు ధూళినింట రాల్చగ
సమసమాజ స్థాపననుచు
విరియబూచిన పుష్పవాటికలు
వచ్చె నదిగో నవవసంత గణతంత్రం
చల్లగాలుల చెరిగిపోయిన
పేదవాని ఇంటి సాక్షిగా
ఎఱ్ఱకోట బుఱుజులోపల
ప్రణయమాఱగ కూసె నొక గణతంత్రకోకిల
పాడవలె సమసమాజ గీతకని
విరుల తేనెలు చిమ్మగా
వినుటకెంతో కమ్మగా
ఘనమైన స్వాగతం !
రిప్లయితొలగించండిజిలేబి.
చాలా బావుందండి
రిప్లయితొలగించండిసహజీవనము నేర్పి...
రిప్లయితొలగించండిసంఘర్షణలు ఆపి...
సౌక్యమార్గము చూపి...
సంతోషముతో మురిసి...
ఎగరాలి మువ్వన్నెల జెండా!
జైహింద్.
మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!