12, జనవరి 2012, గురువారం

ఆ.సౌమ్యా/బులుసు గారూ ఈ టపా మీకోసమే....:-)

PS: ఏమండోయ్ అసలే ఈ రోజుల్లో ఏది సక్రమంగా రాస్తున్నామో, ఏది వంకరగా రాస్తున్నామో తెలియక జనాలు తికమక పడుతున్నారంట. ఇందుమూలంగా యావన్మంది బ్లాగులోకపు ప్రజానీకానికి తెలుపుకొనేదేమంటే, నాబ్లాగులో అన్నీ Straight టపాలే. ఒకవేళ ఎప్పుడన్నా అలాంటివి వ్రాస్తే తప్పక చెప్తాను.





ఏంటబ్బా మాపేర్లతోటి టపా అనుకోని ఆశ్చర్యపోవద్దు. ముందుగా ఒక చిఱునవ్వు చివరిగా ఒక పెడనవ్వు నవ్వండి :-). ఇంతకీ మిమ్మల్నెందుకు తలుచుకున్నానంటే నవభారతి అని ఒక పత్రిక ఉండేదట. అందులో వి.సిమ్మన్న అని ఒక రచయిత బాపిరాజు నవ్వులు అని ఒక వ్యాసం వ్రాసారు. ఆ నవ్వుల రకాలు ఇక్కడ ఇస్తున్నా మీ లిస్టుకు ఇవీ యాడ్ చేసుకోండి మరి :))


చిఱునవ్వు

ఒంటిచిఱునవ్వు

వెలవెలబోయే చిఱునవ్వు

పెదవుల్ని ప్రసరించే చిరునవ్వు

అర్థపూరితమైన చిఱునవ్వు

విషాధచ్ఛాయలు ఆక్రమించిన చిరునవ్వు

పరిహాస పూరిత చిరునవ్వు

వెన్నెల లాంటి చిరునవ్వు

దివ్యమైన చిరునవ్వు

చిరుపూలుగల వెలుగుల నవ్వు

ఏడుపురంగరించిన నవ్వు

దీనమైన నవ్వు

తనలో నవ్వు

బోసినవ్వు

సిగ్గునవ్వు

ముసిముసినవ్వు

ఘొల్లుమని నవ్వు

విరగబడి నవ్వు

పకపకానవ్వు

పకాలున నవ్వు

కిలకిలా నవ్వు

కళకళానవ్వు

వరములిచ్చేటప్పటి నవ్వు

ఉషఃకాంతుల నవ్వు

ఎఱ్ఱటి నవ్వు

కన్నుల నవ్వు

పెదవుల నవ్వు

పెదవులు కదలించి నవ్వు

పెదవుల్లో మందహాసం

గుండెలు పగిలే పామునవ్వు

వంకరనవ్వు

పెడనవ్వు


ఇక నాపైత్యంకూడా

పరవశాన నవ్వు

పరువపు నవ్వు

పక్కింటోడిని చూసి నవ్వే నవ్వు

అమెరికా నవ్వు

చుట్టాల్ని చూసి నవ్వే నవ్వు

ప్రొద్దుట మన పేసు అద్దంలో చూసుకొని నవ్వే నవ్వు :))

ప్రియురాలితో ఉన్నప్పుడు పెళ్ళాంకనపడితే నవ్వేనవ్వు



అబ్బో ఇంకా చాలా వున్నాయి కానీ ముందు వీటికి సం.నా.క చెయ్యగలరేమో నని ఇక్కడ ఇలా.

14 కామెంట్‌లు:

  1. భ రా రె వారూ...వారి పేరు చెప్పి ఇన్ని నవ్వులు నవ్వుకున్న కారణమేమిటో...

    రిప్లయితొలగించండి
  2. /ఆ.సౌమ్యా/బులుసు గారూ ఈ టపా మీకోసమే....:-) /

    అంటే..మిగిలినవాళ్ళెవ్వరూ ఈ టపా చదవకూడదాండీ ?

    రిప్లయితొలగించండి
  3. రాఫ్సన్ :) ఒ.చి ( ఒంటి చిఱునవ్వు )

    మందాకిని గారూ, మీచేత నిఘంటువు టైపు చేపించిన కసి మొత్తాన్ని తీర్చేసుకున్నారు కదా ;-)

    జ్యోతి గారూ, నవ్వుకోవడానికి కారణాలు కూడానా? ఇది మరీ బాగుందండీ. నా నవ్వు నా ఇష్టం :)

    జాన్ గారూ, మిగిలిన వాళ్ళు చదివినా ఈ నవ్వుల సంక్షిప్త నామాలకు సృష్టికర్తలు వాళ్ళుకాబట్టి అలా. ఈ టపా ఇంతకు మునుపు సౌమ్య టపా చదివిన వాళ్ళకే అర్థమవుతుందనుకుంటా..

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు మమ్మలని గుర్తు చేసుకున్నందుకు.

    నవ్వులలో ఇంకా అనేక రకాలున్నాయి. కోకిల నవ్వు, కోతి నవ్వు , కొంగ నవ్వు, చిగురాకుల నవ్వు అంటూ చాలా రకాలు ( ఇప్పుడు గుర్తు లేవు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను) భమిడిపాటి కామేశ్వర రావు గారు చెప్పారు. దరహాసం నుంచి వికటాట్ట హాసం దాకా నిర్వచనాలు చెప్పారు ముళ్ళపూడి వారు. వీరందరి కన్నా ముందే ఎవరో అన్నారు. ( ఈ మధ్యనే ఎక్కడో బ్లాగుల్లోనే చూశాను ఈ పద్యం ).

    నవ్వవు జంతువులు నవ్వును నరుడు నవ్వులు చిత్తవృత్తికి
    దివ్వెలు కొన్ని నవ్వులేమో తేలవు కొన్ని విష యుక్తములే
    పువ్వులు వోలె ప్రేమ రసముల వెలికక్కు శుద్ధ మైన లే
    నవ్వులు సర్వ సుఖ దమనంబులు వ్యాధులకు
    మహౌషధముల్

    ఈ నవ్వులన్నిటిని ఒక చోట చేర్చడానికే చేసిన ప్రయత్నం మాది. ఇన్ని నవ్వులు తెలుగులో మనకుండగా, బ్రాకెట్ల లోనూ, చుక్కలలోనూ నవ్వడం ఎందుకు అన్నదే మా ప్రశ్న.
    మీరు చెప్పినవి చాలా మట్టుకు మా నిఘంటువులో ఉన్నాయి బహుశా ఇంకో పేరు తో. లేనివాటిని చేర్చుకుంటాము.
    మీకు ధన్యవాదాలు. మా బాటలోకి స్వాగతం.

    రిప్లయితొలగించండి
  5. ఓహ్ ,

    ఇక్కడ నవ్వుల పువ్వులు స్పందిస్తున్నాయే ! ఎక్కడ ఆసౌ,బులుసు వారలు ఇంకా రాలేదే !

    సరి కొత్త లిస్టు వారికి ఇది అన్న మాట ! నభాన ! (నవభారతి నవ్వులు )

    చీర్స్
    జిని(జిలేబీ నవ్వు)

    రిప్లయితొలగించండి
  6. మీ టపాలో మీరు ఇంకా బ్రాకెట్ల లోనే నవ్వుతున్నారు. నిరసన తెలుపుతున్నాను.... మహా.

    రిప్లయితొలగించండి
  7. ఓహ్ బ్రహ్మాండం...భలే నవ్వులు. ఈ పోస్టుని నా పోస్టుకి సంధానం చేస్తాను. (వెన్నెల లాంటి చిరునవ్వు)

    మమ్మల్ని తలుచుకున్నందుకు సంతోషం. (దివ్యమైన చిరునవ్వు)

    రిప్లయితొలగించండి
  8. మీ నవ్వు మీ ఇష్టమే, చెప్తే మేం కూడా నవ్వుతాంగా.....

    రిప్లయితొలగించండి
  9. మీరు చెప్పిన వెలమల సిమ్మన్నగారు తన Ph.D.పట్టా కోసం అడవి బాపిరాజుగారి మీద పరిశోధన చేసారు.ఆయన అందువలన అంత వివరంగా రాసిఉంటారు.ఇప్పుడు సిమ్మన్నగారు ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉన్నారు.మరి నవ్వుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి కదా.

    రిప్లయితొలగించండి
  10. బులుసు గారూ, పద్యం బ్రహ్మాండం.
    ఆ వ్యాసం చాలా బాగా వ్రాసారు. పూర్తిగా నవ్వులపైనే. అందులో ఇవి ఒక్క పేజీలో రాసినవి మాత్రమే. ఇంకా నవ్వుల నిఘంటువు బుఱ్ఱలోకి ఎక్కలేదు. మీరెక్కువగా వాడే దహా మాత్రం తెలుసు :))


    జిలేబి గారూ, ఇవి సిమ్మన్న బాపిరాజు గారి నవ్వులు. జిన బాగుంది :))

    సౌమ్యా ... వెలాచి ))

    జ్యోతిర్మయి గారూ... ఇప్పుడు హాయిగా నవ్వుకుంటున్నారు కదా. మళ్ళీ నానవ్వుకు అర్థాలు దేనికి?
    చిరకాలం అలాగే హాయిగా నవ్వుతూ ఉండండి.

    కమనీయం మాస్టారు, ధన్యవాదాలు. సిమ్మన్న గారి గురించి తెలుసుకోవడం ముదావహం.

    రిప్లయితొలగించండి
  11. కొంటె నవ్వు, మరచినట్లున్నారు.బాగుంది నవ్వుల పండగ. మీకు సమ్యక్+క్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  12. ఇంకా కొన్ని నవ్వులు చేర్చారన్న మాట.బావుంది.
    అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

Comment Form