రాబోయే సరాగ శివరాత్రి సంచికలో జానపదుల పదనాట్య తాండవాల ద్వారా ఆచార వ్యవహారాలను, తెలుగు భాషాతీరుతెన్నులను తెలియచెప్పే ప్రయత్నం.
ఉదాహరణగా....
యాన్దోళ్ళ పెళ్ళిళ్ళు ఎంత మంచి పెళ్ళిళ్ళు
బొట్టుతో పనిలేదు బోనాలక్కర లేదు
కొత్త చీరలొద్దు అత్త పోర్లు వద్దు
చుట్టాలు రావొద్దు చూడనైనా వద్దు
కలుసుకుంటే చాలు మురుసుకుంటుండొచ్చు
అల్లుళ్ళ పోరొద్దు ఆస్తి పాస్తులొద్దు
మేళ తాళాలొద్దు మంత్రతంత్రాలొద్దు
మంగమూరు దేముడికి మొక్కుకుంటే చాలు
గోత్రాలు మాకేల గీత్రాలు మాకేల
నేత్రాలు ఒకటైతే సూత్రాలెందుకయ్యా
మంగళ సూత్రాలెందుకయ్యా
తినడానికి తిండిలేదు కట్టడానికి బట్టలేదు
వండుకోను కుండలేదు పండుకోను పంచలేదు
ఎందుకయ్య పెండ్లి ఎందుకయ్య మాకు.
ఈ పాట రాసిన వారెవరో మీకు తెలుసా? :)
రిప్లయితొలగించండి@మాగంటి వంశీ మోహన్,
రిప్లయితొలగించండివెన్నెలకంటి రాఘవయ్య.
ఓహో! ఎక్కడ దొరికిందో తెలుసుకోవచ్చా? అంటే పుస్తకంలోదా? మీకు తెలిసినవారెవరన్నా పాడుకునేవారా? ఒకవేళ పుస్తకమైతే ఏ పుస్తకము? పుస్తక వివరాలు అవీ చెప్పగలరా? మీదగ్గర కాపీ ఏదన్నా ఉన్నదా? ఒకవేళ పాడుకునేవారైతే వారి వివరాలేమన్నా ఉన్నవా? కొద్దిగా....:)
రిప్లయితొలగించండి@మాగంటి వంశీ మోహన్,
తొలగించండిఇన్ని వివరాలడుగుతున్నారంటే మీ సైట్ లో ఆడియో గానీ ఏమైనా వుందా యేంటి.
మీకు వివరాలు కావాలంటే రాబోయే ప్రతి పూర్తి వ్యాసంలో ఈ పాట వచ్చేదాకా ఆగాల్సిందే :-)
ఇల్లె అప్పా! రొంబ తప్పుడు సమాదానముదా సెప్పితిరి! సెప్పటం కాకుంటే అడిగితిరి! ఇవరాలు అయ్యీ అక్కర్లేదు గానీ , ఇంగా ఇట్టాంటియి మీకేవన్నా గావలిస్చొచ్చే అల్లా ఆ జానపద సాహిత్యం సెక్షన్లో తిరిగేస్చి రాండి...
తొలగించండిఆడియో లేదు కానీ జులై 2007 లో ఈ పాట జానపద సాహిత్యం సెక్షన్లోకెక్కించా! ఆ తర్వాత ఎక్స్టర్నల్ హార్డు డ్రైవు క్రాషు మూలాన బోలెడు ఫైళ్ళు పోయినై....అందులో మా వెంకట్రావు విడి పుస్తకాల నుంచి స్కాన్ చేసిచ్చిన ఈ వెన్నెలకంటి గారి పుస్తకాలు కూడా కొన్నున్నై....ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ వెన్నెలకంటి ఆయన పాట చూస్తే గుర్తుకొచ్చింది...అదీ కత! ఇప్పుడు వెంకట్రావుని కదల్చాలి మళ్ళీ.... :)
హ్మ్...తప్పుడు సమాచారామా? నేను చదివిన పత్రికలో సమాచారం అలాగే వుంది. అయితే ముందుగా ఈ పాటను ఎవరు వ్రాసారో నాకు తెలియదు.
తొలగించండిమీ సైటు దరిదాపు చాలా వరకే చదివాను కానీ ఇది చదివిన గుర్తులెదు. అయితే ఇది వ్రాసింది వెంకట్రావుగారా?
భా.రా.రె గారూ...తెలుగు భాష మీద మీకున్న అభిమానానికి నేను గర్వపడుతున్నానండి... మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను...!!!
రిప్లయితొలగించండిసుబ్బు, థ్యాంక్స్
తొలగించండిమంచి సరాగాల ప్రయత్నం
రిప్లయితొలగించండిచీర్స్
జిలేబి.
Yep.. If none,I can Write or copy,paste for Saraga.
తొలగించండి"గోత్రాలు మాకేల గీత్రాలు మాకేల
రిప్లయితొలగించండినేత్రాలు ఒకటైతే సూత్రాలెందుకయ్యా
మంగళ సూత్రాలెందుకయ్యా"
ఈ లైన్లు నాకు చాలా నచ్చాయి.
నేనూ ఆ లైన్ గుర్తించాను. ధన్యవాదాలు.
తొలగించండి"చుట్టాలు రావొద్దు చూడనైనా వద్దు" :)
రిప్లయితొలగించండిరాజ్... మరి...అవసరమా?
తొలగించండి"యాందోళ్ళ" అంటే యానాది కులానికి చెందిన అనేనా మాస్టారూ?
రిప్లయితొలగించండిఫణీంద్ర గారూ, రచయిత ఉద్దేశ్యము అదే అనుకుంటాను. కానీ ఇక్కడ కులం కంటే వారి స్వేచ్ఛను చూడండి.
రిప్లయితొలగించండి