మీ అందాల నటుడు "ధీరోదాత్తుడు" అందచందాల తార "ప్రగల్భ" నటించిన నవరస భరిత చిత్రం అతి త్వరలో హృదయస్పందనల టాకీస్ లో విడుదల కాబోతుంది.
ఆనెక్కు టికెట్టు దొరకలేదని బాధపడక్కరలేకుండా ఉల్లిగడ్డ నంజుకొంటూ సద్దికూడు పొట్టనిండా తిని గతుకుల రోడ్లను లెక్కచేయకుండా ఎఱ్ఱబస్సులో మా యీ టాకీస్ కి వచ్చి ఇప్పుడే ఓ తుండుగుడ్డ, కండవ, పైపంచె సీట్లో వేసుకొని టిక్కెట్టు రిజర్వు చేసుకోండి.
ఇప్పుడు సినిమా ట్రైలర్ అన్నమాట.....
టాయ్..టట్టడాయ్..ట్టాయ్య్...ట్టట్టడ్డాయ్య్...
శృంగార వీరరసముల నుఱ్ఱుత లూగిస్తూ ఆశల సౌధంలో విహరింపచేసే చిత్రం
అందాలు ఆరబోసి రంభామేనక తిలోత్తమలకు సైతం చెమటలు పట్టించే చిత్రం
ఆంగిక ,వాచక, ఆహార్య, సాత్వికాభినయనంలో కళ్ళుచెదిరి గుడ్డి వాళ్ళను చేసే చిత్రం :))
హమ్మయ్య ట్రైలర్ సూపర్ గా వ్రాశాను కాబట్టి సినిమా ఓపనింగ్స్ బాగా వుంటాయి లెండి :)))
ఇంతకీ ఈ పోస్టు ఇప్పుడెందుకు వ్రాయల్సొచ్చింది? ఏకంగా మొత్తం వ్యాసమొక్కసారే రాయొచ్చుకదా !!! వచ్చిందా మీకా అనుమానం? అబ్బే అదేమీలేదండీ ఇదో ఐడెంటిటీ క్రైసిస్.

అబ్బాయ్,
రిప్లయితొలగించండిసినీమా 'కొట్టా' కి వచ్చి చూడడం గీడడం జాన్తా నాయ్! యు ట్యూబ్ లో ఫ్రీ గా పెడితే పోతే పోనీ అని చూస్తాం !
చీర్స్
జిలేబి.
అబ్బా ... జిలేబీ కావాలంటే రమ్మని ఫ్రీ గా చూపిస్తారా :)
తొలగించండి