16, మార్చి 2013, శనివారం

మా ఆవిడ vs మా ఆయన ?

చాలారోజులనుంచి రాయాలకున్న టపా యిది. లోకంలో ఈ రెండు పదాలు ఎలా మొదలయ్యాయో కానీ విన్నప్పుడల్లా భలే ఆశ్చర్యంగా వుంటుంది. విపరీతార్థాలు తీస్తున్నానని కాదు కానీ, నిజంగానే  పూర్వకాలంలో, అంటే బహుభార్యాత్వం వున్నప్పుడు ఆడవారు "మా ఆయన" అని అన్నారంటే అర్థముండేదేమో! ఆరోజుల్లో ఇద్దరు ముగ్గురకు కలిపి ఒకడే మొగుడు కాబట్టి "మా ఆయన" అని చెప్పుకునే వాళ్ళేమో ! కానీ ఇప్పుడు? ఏంచక్కగా "నా మొగుడు" అని చెప్పుకోకుండా "మా ఆయన", లేదా "మావారు" ( నవారు ) అన్నప్పుడల్లా ఈ సందేహం దేహమంతా వ్యాపించేస్తుంది.

సంస్కార వంతులకు "నా మొగుడు" అని అనాలంటే సంస్కార హీనంగా పల్లేటూరి వాళ్ళలాగా వుంటుందేమో? కానీ ఆలోచిస్తే నిజానికి "మా ఆయన" అనే దానికన్నా "నా మొగుడు" అన్నదే సంస్కారము కదా.

అట్లాగే మగవాళ్ళు కూడా "నా పెళ్ళాం" అని బుద్ధిగా చెప్పుకోవచ్చు కదా. అబ్బే " మా ఆవిడ" అనాల్సిందే... మరీ ఎక్కువగా వ్రాస్తే బాగోదు కానీ "ఎంతమందికి ఈవిడ ఆవిడ"? దీనర్థం అనే వాళ్ళందరూ ఇలా లాగి పీకి అర్థాలు పట్టించుకోని అంటారని కాదు. ఇవికూడా ఊతపదాల లెక్క గౌరవసూచకంగా "ఆయన" కు "ఆవిడ" కు ముందు "మా" చేర్చి మాట్లాడతారేమో కానీ మా తీసి "నా" తో కలిపి మొగుడు పెళ్ళాలని చూడండి. "మీ" ఆయన "మీ" ఆవిడ కంటే ఎంతో హాయి.

8 కామెంట్‌లు:

  1. LOL. If they had one kid only, he/she too say "maa amma" "maa naanna" instead of "naa amma" & "naa naanna" even there is no other sibling. ;)

    రిప్లయితొలగించండి
  2. భాషలలో పలుకుబడులు అని కొన్ని ఆనవాయితీగా వాడే మాటలు ఉంటాయి. వాటిని జాతీయాలు అంటాం. వాటిని ముక్క ముక్కలు చేసి అర్థాలు పీకటానికి ప్రయత్నించరాదు.

    అన్నం‌ వండటం అనే పద ప్రయోగం ఉంది. వండేది నిజానికి బియ్యాన్ని కదా? అన్నాన్ని మరింక వండేందు కేముంటుంది?
    కాని యెవరన్నా వచ్చి "బియ్యం వండారా?" అంటే వినటానికి మనకు యెలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  3. చాతకం, "Amma" concept is entirely different and people can safely use maa amma" :) Few decades ago having single kid was a very rare case.Baby surviving rate was low and even if they had only one single surviving kid there must be an attempt/chance of having second baby. so, there was no confusion. :). It was "maa amma" :-).

    BTW, not why not "naa talli"? is "talli" sounding awkward and culture less? who is the cause for such nonsense?


    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం గారూ మీరు ( నువ్వు అంటే సంస్కార లేమి అవుతుందేమో కదా :-) ) తీసుకున్న ఉదాహరణ సరిపోలేదు అనుకుంటాను.
    "అన్నం‌ వండటం" అని పల్లెటూళ్ళలో అనరు. atleast I have'nt heard. మా ఊళ్ళో "అన్నం అయిందా?" అని వినటమే గుర్తు. లేకపోతే ఈ క్రిందివి

    నాలుగు గింజలు ఉడక వెయ్యి
    సంగటి చెయ్యి
    పొయ్యి రాజెయ్యి...
    పప్పు వండు
    వంట చెయ్యి..


    ఇలా ఏవేవో అనే వాళ్ళే కానీ ఈ "అన్నం" పదము ఈ మధ్యన ఊళ్ళలోకి పాకి నైస్ పీసైంది. ఇప్పుడు ఎక్కడో కానీ "కూడు పెట్టు" వినిపించదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. koodu ane padam thappu ani antunnaaru.nijamenaa?memu koodu ane padam annam ku badulugaa vaadataamu.

      తొలగించండి
    2. Infact "annamu" is a synonym for koodu. There is nothing wrong using this word as long as you are not carried away by a so called cultural society talk.

      తొలగించండి
  5. memu naa mogudu ane antaamu,kaanee adi chaalaa mandiki thappu gaa kanipisthundi.tx andee manchi vivarana ichchaaru.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "adi chaalaa mandiki thappu gaa kanipisthundi"

      is it? Next time when someone say it's bad or wrong.... try to explain the meaning as above :). I am sure they will not bother you again :))

      తొలగించండి

Comment Form