రోమన్ సామ్రాజ్యం గ్రీస్ లో ఎందుకు పెరిగి పెద్దదైంది? Pharaohs ఈజిప్ట్ లో పెరగడానికి కారణమేంటి? హంపీ ప్రాంతంలోనే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమేమిటి?
గ్రీసు, ఈజిప్టుల సంగతి కాసేపు ప్రక్కన పెట్టి హంపీ గురించి ఆలోచిద్దాము. సామ్రాజ్యాల ఆవిర్భావం,అభివృద్ధి వాటి వ్యాప్తి సహజంగానే సహజవనరులు ఎక్కడ లభ్యమైతే అక్కడే మొదలౌతుంటాయి. ఈ సిద్ధాంతం ఎప్పుడో రామాయాణ మహాభారత కాలాలనుండి నేటి వరకూ నిజమైతూనే వస్తుంది. ఇక్కడ మనము కేవలం విజయనగర సామ్రాజ్యాన్ని దృష్టిలో వుంచుకుని చూస్తున్నాము కాబట్టి ఈ వ్యాసాన్ని ఆ రాజ్య పరిధికే లోబడి ఆలోచిద్దాము.
ఈ సామ్రాజ్య స్థాపన ఆనగొందిలోనే చేయడానికి ఓ జానపద కథ ప్రచారంలో వుంది. విద్యారణ్యుడు ఆ ప్రదేశంలో తిరగాడుతున్నప్పుడు ఓ నక్క కుక్కను తరమడం చూసినాడట. అది చూసి ఇక్కడ రాజ్యస్థాపన చేస్తే బలవంతులను కూడా తరిమివేయగలిగే ధైర్యం ఈ పరిశరప్రాంత ఆహారము వల్ల లభిస్తుందని అక్కడ రాజ్యాన్ని స్థాపించినాడట. అలాగే రాజ్య శంఖు స్థాపన తాను చెప్పిన ముహూర్తానికంటే ముందుగానే పొరపాటున చేసినారనడానికీ మరో కథా ప్రచారంలో వుంది. దానిమూలంగా రెండువేల సంవత్సరాలు పదిలంగా వుండటానికి పెట్టిన ముహూర్తము కంటే ముందుగా శంఖుస్థాపన చేసినారు కాబట్టి ఆ రాజ్యం రెండు వందల సంవత్సరాలు మాత్రమే మన్నినది. ఈ నమ్మకాలు ఎలా వున్నా రాజధాని నగరాన్ని అక్కడే స్థాపించడానికి ముఖ్యమైన కారణాలు వేరు. ఈ రోజుల్లోనే కాదు ఆరోజుల్లో కూడా మానవులు రెండు వర్గాలనుకుంటాను.
౧) రాజ్యాంగము, రాజ్యాలను తమకోసం నిర్మించుకొని తమకనుకూలంగా సాహిత్యాన్ని, ధర్మ వచనాలను వ్రాసి, వ్రాయించి ప్రచారం చేసే వారు.అలాగే ప్రజలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి చెప్పే ఏ న్యాయాన్నీ వీరు పాటించరు. ఈ వర్గం సహజంగా దేనికీ భయపడరు. నిజానికి ఏ రాజైనా ఈ నియమాన్ని పాటించకపోతే ఎక్కువకాలం రాజ్యం చేయ్యలేడు. కాదు.... అసలు రాజే కాలేడు.
౨) ధర్మా ధర్మాలను వల్లె వేస్తూ భయం భయం గా బ్రతికే మనలాంటి సామాన్య జనులు.
అంటే పాపపుణ్యాలన్నీ మానవజాతిని సక్రమంగా నడపడానికే గానీ రాజులకు రాజ్యాలకు ఇవి వర్తించవు. ఏ మనిషీ వాటిని లెక్కచేయని నాడు మానవ సమాజం అంతమైపోతుంది. భారత యుద్ధంలో లాగా...
కానీ తాను పెరిగిన వాతావరణాన్ని బట్టి ప్రతి మనిషీ నమ్మే సిద్ధాంతాలు కొన్ని వుండవచ్చు. ఆ సిద్ధాంతాలకు లోబడి నడుచుకుంటే జీవితంలో చరమాంక దశలో పశ్చాత్తాప పడడాన్ని తప్పించుకోవచ్చేమో !
పై రండు వాక్యాలు ఎంత కఠినంగా వున్నా, ఏ చరిత్ర తీసుకున్నా కనిపించేదంతే. నువ్వు రాజువు కావాలంటే ధర్మాధర్మాలను, నీతీ న్యాయాలను విడిచి పెట్టాల్సిందే. అంతగా కావాలంటే రాజువయ్యాక ప్రచారం చేసుకోవచ్చు. ప్రతి ఇతిహాసమూ దీనికి చక్కని ఉదాహరణే !!
సరే ఇక విషయంలోకి వస్తే ఆ నాటి విజయనగర సామ్రాజ్యాన్ని తీసుకున్నట్లైతే ముఖ్యంగా సామ్రాజ్య విస్తరణకు అక్కడి వనరులే మూల కారణం.
కృష్ణదేవరాయల కాలములో నైతే విజయనగర సామ్రాజ్యం ఒరిస్సా నుండి శ్రీలంక వరకూ వ్యాప్తి చెందింది. హిందూ ధర్మ ప్రచారానికి ఏర్పడిన సామ్రాజ్యం సైనికావసరాల దృష్ట్యా అరబ్బులతో గుఱ్ఱాల వ్యాపారాన్ని యధేచ్చగా సాగించింది. ఆ రోజుల్లో గుఱ్ఱాలు, మందుగుండు ఎవరు సాధించగలరో వారిదే పైచేయి. నమ్మిన విజయనగర రాజులకు గుఱ్ఱాల తోకలను చూపించి కూడా ఎర్రచందనం, వజ్రాలు మొదలైన వాటిని అరబ్బులు గుంజారంటే ఆనాటి రాజులకు గుఱ్ఱాల అవసరమెంత వుండేదో తెలుస్తుంది. మోటారు వాహనాలొచ్చాక గుఱ్ఱాల ప్రాబల్యం తగ్గింది.
పోర్చుగీసు వాళ్ళు వ్యాపారనిమిత్తం భారతదేశానికొచ్చాక గుఱ్ఱాల వ్యాపారంలో అరబ్బుల హవా తగ్గింది. పోర్చుగీసు వర్తకుడు ఈ విధంగా ఓ ఉత్తరం వ్రాసాడంటేనే గుఱ్ఱాలకు ఆ నాడున్న విలువను తెలుసుకోవచ్చు.
Sewell writes ...
Krishna Deva’s anxiety was to secure horses. …what he wanted (from them) was horses and again horses, for perpetual wars against Adil Shah. Albuquerque… declared that he would prefer to send cavalry mounts to him (Krishnadevaraya) rather to supply them to the Sultan of Bijapur...’ Sewell goes on ‘It appears that, in 1544 AD, Krishnadevaraya offered Albuquerque exclusive right to trade in horses…’, which though he refused in the beginning agreed to later. Heras5 cites an anonymous letter of a traveller, written in Venice to ser Zuane di Santi, dated 10 November 1511, and kept in Biblioteca Magliabecchina of Florence, ‘the King Narasinga (Vijayanagara) has sent ambassadors … in order to establish a perpetual friendship with the king of Portugal… to establish alliance’. Heras goes on to write: ‘Krishnadevaraya proposed… his desire of getting horses … He (king of Vijayanagara) sent another Legation…. This friendship between both powers still subsisted in the year 1526’ Consequently horses became relatively cheaper for the Indian rulers.
To be contd....
వ్యాస భాగాలన్నీ రాయడం పూర్తయ్యాక అన్నీ భాగాలను కలిపి కుట్టి అప్పుడు రిఫరెన్సు పుస్తకాలనిస్తా.

roman samrajyamu rome lo putti perigindi anukunta .....greece lo kadanulunta
రిప్లయితొలగించండిroman samrajyamu rome lo putti perigindi anukunta .....greece lo kadanulunta
రిప్లయితొలగించండిVasu, It is born in Roma(Rome), but most of its existence and growth is tightly coupled with Greece.
రిప్లయితొలగించండి