18, మార్చి 2013, సోమవారం

తెలుగు వార్తా పత్రికల మాయాజాలం... పాఠకులారా జర భద్రం

ఈ మధ్య కొన్ని వారాలుగా *కొన్ని* తెలుగు వార్తా పత్రికలను చదువుదామని  వాటికి వెళతానా! దొంగతనంగా నా కంప్యూటర్ లోకి Fake Anti Virus software ని Install చెయ్యాలని ప్రయత్నించడమో లేదా వెబ్ సైట్ లో వున్న ప్లగిన్ సాఫ్ట్వేర్ల ద్వారా system లోని Data ని Read చెయ్యాలని ప్రయత్నించడమో జరుగుతుంది. పాఠకలోకానికి ఎలాంటి అనుమానాలు రాకుండా వీటిని రోజూ అన్ని వేళలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే Activate చేస్తున్నట్లుగా అనుమానించవలసి వస్తుంది. మీ సైట్లకు అభిమానంతో  చదవడానికి వచ్చే పాఠకుల ఆదరణను ఇలాంటి టెక్నిక్ ల ద్వారా పాడుచేసుకోవద్దు.

ఆ ఇవి ఎవడికి తెలుస్తాయిలే అనుకోవడం మన పొరపాటు. లోకంలో మనమెంత తెలివిగల వారమైనా మనకన్నా ఓ మెట్టు ఎక్కువ తెలిసినవారు ఎక్కడో ఒకచోట ఎల్లవేళలా వుంటారని గుర్తుంచుకుంటే మంచిది.  మీలాంటి వార్తా సంస్థలకు నమ్మకం ఎంత ముఖ్యమో మాలాంటి సాధారణ పాఠకులు చెప్పవలసిన పనిలేదు. These Techniques are very easy to Identify if some one tracks the network traffic or using antivirus softwares. People can easily instrument such attacks using javascript. So, let readres sustain faith in your respective news papers.


4 కామెంట్‌లు:

  1. గురువు గారు నమస్కారం .. ఈ ఐటెం ని మరికొంత క్లారిటీ తోను,,,అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరించి వుంటే బాగుండేది

    రిప్లయితొలగించండి
  2. పేపర్ల పేర్లు వ్రాయడంలో మొహమాటాలు పడక్కర్లేదనుకుంటాను.
    నా అనుభవంలే అయితే, ఇటువంటివి వాళ్ళు కావాలని చెయ్యరనుకుంటాను. మన వాళ్ళు అదేదో యాడ్ కంపెనీ స్క్రిప్టు పెట్టుకుంటారు వాడు కుసిని డబ్బులు ఇస్తాడు కదా అని, వాడు ఇహ కుమ్మేస్తాడు.

    రిప్లయితొలగించండి
  3. kn murthy garu,

    ముందుగా నమ్మకమైన Anti Virus Software ను మీ కంప్యూటర్ లో Install చేసుకోండి. చాలా వరకూ Anti Virus Software ఇలాంటి script attacks ని పసిగట్టగలవు.

    ఒకవేళ మీ Anti Virus Software ఆ సైట్లకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక message ఇస్తున్నట్లైతే అనుమానించడం మొదలు పెట్టండి. ఆ Message గూర్చి Online లో వివరాలేమైనా దొరుకుతాయేమో చూడండి. కారణం అన్ని వేళలా ఈ Anti virus కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోవచ్చు.

    As a second step, ఆ యా సైట్లకు వెళ్ళడం మానండి.

    ఈ వైరస్ లు ఎంత ప్రమాదకరంగా వుండగలవో చెప్పటానికి ఓ మూడేళ్ళ క్రితం ఒక వ్యాసం వ్రాసాను. వీలైతే చదవండి.

    http://chiruspandana.blogspot.com/2010/03/2-trojan-horse.html

    ఇవి కాకుండా root kit virus లు ఐతే గుర్తించడానికి చాలానే సమయం పడుతుంది. ఈ లోపు జరుగవలసిన నష్టం జరిగి పోతుంది.

    రిప్లయితొలగించండి
  4. oremuna గారూ, బహుశా మీ Analysis నిజమై వుండవచ్చు. కానీ Adds Display చెయ్యటానికి Images చాలు కదా ! scripts అవసరమా? అదీ వేరే వెబ్సైట్ లో execute అయ్యే scripts Adds కు ఏరకంగా వుపయోగం?

    ఇక వివిధకారణాల రీత్యా వార్తాపత్రికల పేర్లు నేను చెప్పదలచుకోలేదు. ఒక కారణం మీరన్నట్లు వాళ్ళకు తెలియకుండానే ఇలాంటివి జరుగుతుండవచ్చు.

    రిప్లయితొలగించండి

Comment Form