24, డిసెంబర్ 2017, ఆదివారం

మహా భారతకాలం నాటి పెండ్లీ కట్టుబాట్లు


భారతంలో కుంతీ,పాండురాజుల సంవాదం వలన మనకు ఆనాటి అనగా భారతకాలం నాటి సమాజ వ్యవస్థ, పెండ్లి అనే కట్టుబాటు, మాతృస్వామ్య వ్యవస్థ అప్పటి ప్రజల్లో వీటిపైన నెలకొన్న భావాలు స్థూలంగా అర్థమవుతాయి. పాండురాజు యుద్ధాలతో కురురాజ్యానికి దగ్గర దగ్గర రాజ్యాలన్నింటిని జయించి సామంతరాజులుగా చేసుకొని కప్పం కట్టించుకుంటూ ఇద్దరు భార్యలతో సంసారం చేసినప్పటికీ పిల్లలు కలుగరు. బహుశా ఆబాధతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వుంటాడు. ఇక్కడ మనకు పాండురాజుకు మునిరూపంలో సంగమిస్తున్న జింకలను చంపటం వల్ల శాపగ్రస్థుడై వానప్రస్థానికి వెళ్ళాడని కథ ద్వారా తెలుస్తున్నా బహుశా పాండురాజు దగ్గర విషయం లేకపోవటం  వల్ల అతనికి పిల్లలు పుట్టకపోవడంవల్లనే దుఃఖంతో వానప్రస్థానికి వెళ్ళి వుంటాడు. నాటి సమాజంలో కొడుకును కనకపోతే అతనికి పితృ ఋణం తీర్చుకొనే అవకాశం లేనట్లు చెప్పబడింది. సంతానానికి అధిక ప్రాధాన్యతనీయబడింది.
భారతకాలం బహుశా మాతృస్వామ్య వ్యవస్థకు, పితృ స్వామ్య వ్యవస్థకు సంధికాలమై వుండవచ్చు. అనగా అంతకు పూర్వం పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థ నడచి దానిలోని లోపాల వలన సమాజం క్రమంగా పితృస్వామ్య వ్యవస్థవైపు మళ్ళింది. స్త్రీలు ఋతుమతులైన తరువాత పురుషునితో సంగమానికి కట్టుబాట్లు లేని కాలం. యధేచ్ఛగా వారిష్టమొచ్చిన వారితో గడిపిన కాలం. పురుషులు కూడా తమకు కొడుకులు కావాలనుకొన్నప్పుడు  స్త్రీ తో సంగమించడం కొడుకో కూతురో కలిగిన తరువాత యెవరి దారి వారు చూసుకుంటున్న కాలం. 

 అలాగే భారతకాలనికి పూర్వం, భారతకాలంలో  కన్యగా వుండి అనగా పెళ్ళి కాకుండా పిల్లలను కనడం కూడా దోషము కాలేదు. పెండ్లి అనే వ్యవస్థ పూర్తిగా స్థిరపడని కాలమది.క్రమంగా పితృస్వామ్యవ్యవస్థవైపు అడుగులేస్తున్నకాలం. పెండ్లిల్లు జరుగుతున్నప్పటికి పెండ్లికి ముందే కొడుకో కూతురో వున్నప్పటికీ భార్యగా చేసుకోవడంలో ఆనాటి సమాజానికి పెద్దగా పట్టింపులు లేవు. కానీ ఆ వ్యవస్థ భారతకాలంలో అంత్యదశలో వున్నదనుకోవచ్చు. అందుకే సత్యవతికి, కుంతీకి పెళ్ళికి ముందే పిల్లలు కలిగినప్పటికి  రాజులు పెళ్ళి చేసుకొన్నారు. నాటికాలంలో ఇప్పుడు మనము భారతదేశంగా పిలుచుకుంటున్న పేరు అస్తిత్వంలో లేదు.నాడు, నేడు మనం భారతదేశంగా పిలుచుకుంటున్న దేశం అనేక చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందులో కురు దేశం ఒకటి. కురుదేశానికి ఉత్తర భాగంలో భారతకాలం నాటికి కూడా మాతృస్వామ్య వ్యవస్థే నడుస్తుండేది. కామమనేది జీవుల్లో సహజమైనప్పటికీ పిల్లలను కనటమనేది వాళ్ళొక పవిత్రమైన కార్యంగా భావించారు. బహుశా ఇలాంటి మాతృస్వామ్య వ్యవస్థ కురుదేశానికుత్తరంగా వుండటం మూలానే కావచ్చు పాండు రాజు భార్యలతో సహా వానప్రస్థాశ్రమం లో తిరుగుతూ అక్కడ స్థిరపడ్డాడు.

కథలో మనకు కుంతీ,పాండురాజులు పడిన అంతర్మధనం కనిపిస్తుంది. పిల్లలను కనటానికి సంగమమే మార్గమైనా ఆ సంగమానికి రకరకాలైన పద్ధతులనవలింభించారు. సమాజ పరిస్థితులను బట్టి ఆయా పద్ధతులు నాడు సమాజంలో వుండి వుండవచ్చు. కవిత్రయ భారతంలో మనకు పన్నెండు రకాలుగా పిల్లలను స్వీకరించవచ్చని చెప్పారు. ఈ పన్నెండు మంది

౧) వివిహం చేసుకొన్న భార్యయందు తనకు పుట్టిన వాడు ( ఔరసుడు)
౨) నియోగం చేత తనభార్య యందు ఇతరులకు పుట్టినవాడు ( క్షేత్రజడు)
౩) తనకు కుమారుడుగా ఇవ్వబడిన యితరుల కుమారుడు( దత్తకడు)
౪) అభిమానంతో కుమారునిగా పెంచుకొనబడినవాడు (కృత్రిమడు)
౫) తనభార్యయందు తనకు తెలియకుండా యితరుల వలన జన్మించినవాడు(గూఢడు)
౬) తల్లిదండ్రులచేత విడిచిపెట్టబడి తనదగ్గర చేరినవాడు (అపవిద్ధుడు)

పైన చెప్పబడిన ఆరుగురు పుత్త్రులు బంధువులే కాక, తమ ఆస్తిలో భాగానికి కూడా అర్హులు

౧) పెళ్ళికాకముందు తనభార్య కన్యగా వున్నప్పుడు పుట్టిన వాడు ( కానీనుడు)
౨) వివాహసమయానికే గర్భిణిగా వున్న తనభార్యకు వివాహం తరువాత పుట్టినవాడు ( సహోఢడు)
౩) తల్లిదండ్రులకు ధనమిచ్చి కొనబడినవాడు ( క్రీత )
౪) భర్తచే విడువబడిన స్త్రీకి లేదా విధవకు తనవలన కలిగిన కుమారుడు ( పౌనర్భవ)
౫) నీకు పుత్రుడనవుతానని తనంత తానొచ్చినవాడు ( స్వయందత్త)
౬) తనగోత్రం వాడు 

పైన చెప్పబడిన ఆరుగురు బంధువులౌతారు కానీ ఆస్తిలో వాటాకు అనర్హులు

అనగా నాటికాలంలో అంతకు కొంచెం పూర్వం పైన చెప్పిన పన్నెండు రకాలుగా కొడుకులు  లేని వారు కొడుకులగా స్వీకరిస్తుండవచ్చు.

ఇక పాండురాజు కుంతీల విషయానికొస్తే వాళ్ళ అంతర్మధన సంభాషణలలో కొడుకులను ఎన్ని రకాలుగా పొందవచ్చో అది అధర్మమెలా కాదో విపులంగా చర్చించుకుంటారు. యే ముని శాపం వల్ల స్త్రీలకు రతీ నియమాలు కట్టుబాట్లు వచ్చాయో చెప్పుకుంటారు. ఇక్కడ ముని శాపం అనుకొనే కంటే సమాజం పరిణామస్థితి చెంది కొన్నిచోట్ల అలా మరికొన్ని చోట్ల యింకా స్త్రీ యే మగవానితోనైనా సంగమించవచ్చనే నియమాలున్నట్లు కనపడుతాయి. తుదకు పాండు రాజు కుంతీకి చేతులెత్తి  భర్తచేత నియోగింపబడిన వాని (పరపురుషుని సంగమం) ద్వారా పుత్రులను కనమని నమస్కరిస్తాడు.

23, డిసెంబర్ 2017, శనివారం

గిరిక, సత్యవతుల అందాల వర్ణన. పరాశరుని గోకుడు :)

సందర్భం: చేది దేశ రాజైన ఉపరిచరమహారాజుకు ( వసువు )  శుక్తిమతీ నది కోలాహలం అనే పర్వతం వల్ల కలిగిన కొడుకూ,కూతురినీ యిస్తుంది.కూతురు పేరు గిరిక, కొడుకు పేరు వసుపదుడు. గిరికను ఉపరిచరమహారాజు పెండ్లి చేసుకొని వసుపదుని తనసేనాపతిగా చేసుకుంటాడు.కొంతకాలానికి గిరిక సమర్త అవుతుంది. అప్పుడామెకు మృగ మాంసం తెచ్చిపెట్టమని తల్లిదండ్రులు చెప్పటం వల్ల వసురాజు అడవికి వెళ్తాడు. ఈ సందర్భంలో గిరికను మనసులో తలచుకొనే సన్నివేశంలో సాగిన శృంగార వర్ణన యిది.

బహుశా ఆకాలంలో ఇలా రాజులకు భార్యలయ్యే వారి విషయంలో రాజుల విషయంలో వారి జన్మలకు యేవో ఇలాంటి అద్భుతాలనాపాదించారనుకోవాలి. ఇక్కడ గిరిక విషయంలోనూ, మత్స్యగంధి/యోజనగంధి ( సత్యవతి )  విషయంలోనూ యిలాంటి కథలే కనిపిస్తాయి. 

యిక ఈ పద్యాన్నాశ్వాదించండి. మూలనున్న ముసలోడు కూడా లేచి కూర్చుంటాడు :)

సీ||పలుకులముద్దును, గలికిక్రాల్గన్నుల తెలివును, వలుఁదచన్నుల బెడంగు
నలఘకాంచీపదస్థలములయొప్పును, లలితాననేందుమండలము రుచియు
నళినీలకుటిలకుంతలములకాంతియు, నెలజవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును, మెలుపును, గలుగు నగ్గిరికను దలఁచి తలచి

ఆ.వె||ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ
జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్కంద
మయ్యె నవనిపతికి నెయ్య మొనర

తాత్పర్యం: ఆ గిరికముద్దుపలుకులను, మనోజ్ఞంగా చలించే కన్నులను, స్థూలమైన చన్నుల సోయగాన్ని, పిఱ్ఱల ఒప్పును, మృదువైన ముఖ చంద్రబింబ కాంతిని,తుమ్మెదలవలె నల్లగా రింగులు తిరిగిన శిరోజాల వన్నెనూ, లేతయౌవనంలో ప్రకాశాన్ని, అలస విలాసాల అందచందాలను  తలచుకొని తలచుకొని గిరికాలగ్నమనస్కుడై ఆ వనము మధ్యలో రేతస్ఖలన మైంది.


ఇలాంటి దే మరో పద్యం. కాకపోతే ఇది పరాశరుడు మత్స్యగంధిని గోకడానికి తయారయ్యే సందర్భంలోది. వ్యాసుని జననానికి కారణమైన పద్యము.

సీ|| చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ, జిక్కనిచనుగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి
యభిలాష మేర్పడ నట్లుండగాఁ బల్కు, వేడ్కతో మఱుమాట వినగఁ దివురు
నతిఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడుఁగు

ఆ.వె|| నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు
లయ్యు గడువివక్త మయినచోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదురెండుఁ 
గాము శక్తి నోర్వఁగలరె జనులు

తాత్పర్యం: పరాశరుడు మత్స్యగంధినేత్ర సౌందర్యాన్ని చూచి మనసులో మెచ్చుకున్నాడు. ఆమె చన్నులను గోళ్ళతో రక్కాలనుకొన్నాడు.ఆమె సన్నటి నడుము సొగసును మనస్సులో నిలుపుకున్నాడు. ఆమె జఘనప్రదేశమందే దృష్టి నిలుపుకొన్నాడు.తనకోరిక వెల్లడి అయ్యేటట్లుగా మాట్లాడాడు.ఆమె ప్రత్యుత్తరాన్ని వినేందుకు ఉవ్విళ్ళూరాడు. అతి సిగ్గుతో నున్న ఆ కన్యమీదపడి ఆమె సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.
ఎంతశాంతులైనా.ఎంతజితేంద్రియులైనా, ఏకాంతస్థలంలో స్త్రీలకూటమి తటస్థిస్తే చిత్తచాంచల్యానికి లోనవుతారు.మన్మథుని బలాన్ని ఓర్వగల జనులున్నారా?

అదన్నమాట నన్నయ గంటంనుంచి జాలువారిన శృంగార వర్ణన. చివరి ఆటవెలది పద్యంలో మన్మథ తాపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదని కూడా తేల్చేసాడు.

22, డిసెంబర్ 2017, శుక్రవారం

పిచ్చాపాటి కబుర్లు కొన్ని.....

ఈ రోజుతో కవిత్రయ మహాభారతం టి.టి.డి వారు ప్రచురించిన పదిహేను పుస్తకాలలో మొదటి పుస్తకం చదవడం పూర్తయింది.అంటే ఆదిపర్వములోని మొదటి నాలుగు ఆశ్వాసాలను ప్రతిపదార్థంతో సహా చదివాను. మొదలు పెట్టి నప్పుడు ఇలాంటి తెలుగు చదివి దశాబ్దాలు దాటింది కాబట్టి వాక్యం చదవడానికి కూడా నోరు తిరగని పరిస్థితి. కూడబలుక్కొని చదవగా చదవగా అలావాటై నాల్గవ ఆశ్వాసానికొచ్చేటప్పటికి ప్రతిపదార్థం, తాత్పర్యం చూడకుండానే పద్యము చదివి షుమారు అర్థాన్ని గ్రహించ గలుగుతున్నాను :) ..శభాసో :)))

పద్యం ప్రతిపదార్థం తో చదవడం మూలంగా చదవడమాలస్యమైనా ఇలా ఒక కావ్యాన్ని / ఇతిహాసాన్ని పూర్తిగా చదవగల్గితే చాలామటుకు అర్థాలు తెలిసి వేరే కావ్యాలు చదవడం కూడా కొంత సులభమవుతుందనుకొంటాను. కానీ నాకు మొదటి సంపుటం దరిదాపు 450 పేజీలు చదవడానికి నెల రోజులు పట్టింది. అదీ గత పదిరోజులుగా సెలవులో వుండటం మూలానా రోజుకు సరాసరి మూడు నాలుగు గంటలు కేటాయించడం మూలానా తృతీయ,చతుర్థాశ్వాశాలు పదిరోజుల్లో పూర్తయ్యాయి కానీ మొదటి రెండు ఆశ్వాసాలు పూర్తి చెయ్యడానికి ఇరవై రోజులు పట్టింది.

చదువుతూ పద్యరసాన్ని గ్రోలుతూ నన్నయ్య కాలంనాటి తెలుగును రుచి చూస్తూ నాటి భాషావిభక్తులను పరికించుతూ మొత్తంగా భారతకథనాస్వాదిస్తూ ప్రయాణం సాగుతుంది. చదివేటప్పుడు ముందు ప్రతి ఆశ్వాసానికి నాదైన వివరణ వ్రాయాలనుకున్నాను కానీ దానికి సమయమెక్కువపడుతుండటం ఒక కారణమైతే మరో కారణం ప్రతి కథనూ విశ్లేషించాలంటే మరో మహాభారతమవుతుంది కదా :))

ఐనా అప్పుడప్పుడు కొన్ని విశేషాలను నోట్ చేసుకుంటూ వున్నాను. అందులో కొన్ని ఇక్కడ.

కుల పర్వతాలు ఏడు. అవి ౧) మహేంద్రం ౨) మలయం ౩)సహ్యం ౪)శుక్తిమంతం ౫)గంధమాదనం ౬) వింధ్యం ౭) పారియాత్రం

అష్ట సిద్ధులు ఎనిమిది అవి ౧) అణిమ  ౨) మహిమ ౩) గరిమ ౪) లఘిమ ౫) ప్రాప్తి ౬) ప్రాకామ్యం ౭) ఈశిత్వం  ౬) వశిత్వం

వేదాంగాలు ఆరు ౧) శిక్ష ౨) వ్యాకరణం ౩) ఛందస్సు ౪) నిరుక్తం ౫) జ్యోతిషం ౫) కల్పం

వ్యసనాలు ఏడు ౧) వెలది ౨) జూదం ౩) పానం ౪) వేట ౫) వాక్పారుష్యం ౬) దండపారుష్యం  ౭) సొమ్ము అనవసరంగా వ్యయం చేయటం

ఋత్విజులు పదహారు మంది  ౧) బ్రహ్మ ౨) ఉద్గాత ౩)హోత ౪) ప్రతిప్రస్థాత ౫) పోత ౬) ప్రతిహర్త ౭) అచ్చావాకుడు ౮) నేష్ట ౯) అగ్నీధ్రుడు ౧౦) సుబ్రహ్మణ్యుడు ౧౧) గ్రావస్తుతుడు ౧౨) ఉన్నేత ౧౩) అధ్వరుడు ౧౪) బ్రాహ్మణాచ్చంసి ౧౫) ప్రస్తోత ౧౬) మైత్రావరుణుడు

పంచాగ్నులు  దక్షిణాగ్ని, గార్హపత్యము , ఆహవనీయము, సభ్యము, అవసథ్యము అను నయిదు అగ్నులు

ఉంటానేం... కవిత్రయ భారతం నన్ను పిలుస్తుందక్కడ :)

14, డిసెంబర్ 2017, గురువారం

మహాభారత ఆదిపర్వము లోని ద్వితీయాశ్వాస కథా విశ్లేషణ

ఆదిపర్వం ద్వితీయాశ్వాసం చదివాక నాకొకటి అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ సామాన్య జనాల్లో ఈ నాడున్నట్టి హింశా ప్రవృత్తులు లేకుండా జీవించారంటే వారు రామాయణ భారతాది కథల్లోని సారాంశాన్ని గ్రహించి ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించి నడుచుకోవడమే నాటి సమాజ విజయానికి కారణమనిపిస్తుంది. ఈ ఆశ్వాసంలో (నాటి) సమాజానికి ఉపయోగపడే నీతులను అంతర్గతంగా చెప్పేటువంటి కథలు మనకు తారసపడుతాయి. ఇందులో ౧) పాములు, అనూరుడు,గరుత్మంతుడి పుట్టుక ౨) సముద్ర మథనం ౩) ఏనుగు,తాబేలు కథ (గజ కచ్చపముల కథ)  ౪) గరుత్మంతుడు  స్వర్గానికెళ్ళి అమృతం తేవడం ౫) వాలఖిల్యుల కథ  ౬) జరత్కారుని కథ  ౭) పరీక్షుత్తు ఎలా చనిపోయాడనే కథ  ౮)సర్పయాగము ౯) ఆస్తీకుడు సర్పయాగాన్ని మాన్పించే కథ  లున్నాయి.

బహుశా భారతకాలంనాటికే  ఆనాటి పూర్వ కథలను అంటే కృత,త్రేతా యుగకాలపు కథలను చెప్పటంలో కొంత అతిశయోక్తి కనపడుతుంది. యెప్పటిలాగే నాటి చదువుకున్న సమాజం మునులు కాబట్టి వారి వారి ఆధిపత్యాలను నిలబెట్టుకోవడానికల్లిన కథలు వారే కేంద్రంగా మనకు కనిపిస్తాయి.కథల్లో కేంద్రబిందువు వారే యై వారికొరకు వాళ్ళు కొన్ని అతీంద్రయ శక్తులనాపాదించుకొన్నా కథా సారాంశానికొచ్చేటప్పటికి మంచిని ప్రోత్సహించడమే కనిపిస్తుంది. రాజుల వద్ద లేదా కార్యార్థము మనమెవ్వరిదగ్గరకైనా పనికి వెళ్ళినప్పుడాపనిని ఎలా సాధించుకోవాలో కూడా ఈ ఆశ్వాస చివరిలో ఆస్తీకుడు జనమేజయ సర్పయాగాన్ని మాన్పించడం ద్వారా తెలుస్తుంది.

శ్రమ చేయడంతోనే ఫలితం దక్కదని దానికి కావలసిన తెలివి కూడా అవసరమని సముద్రమథనం కథలో తెలుస్తుంది. ఇది కచ్చితంగా రాక్షసులకు దేవతలు చేసిన మోసమే.ఇక్కడ దేవతలకు రాక్షసులకు విభేధాలేమిటో మనకు స్పష్టంగా తెలియదు కానీ సముద్రాన్ని చిలికేటప్పుడు వాసుకి ని మంథర పర్వాతానికి కవ్వపు తాడుగా చేసుకొన్నప్పుడు రాక్షసులు పాము తలవైపు వుండేటట్లు,దేవతలు పాము తోక ను పట్టుకొని చిలుకుతారు. విషము తలవైపు వుంటుంది కాబట్టి పోతే రాక్షసులే పోతారు. అదే గాక ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిన విష్ణువు (బ్రహ్మ కూడా ) సముద్రమథనంలో వచ్చిన యే ఒక్క దానిని కూడా రాక్షసులకు చెందకుండా అన్నీ దేవతలకే చెందేటట్లు చేస్తాడు.అమృతంతో సహా !. చివరికి విషయాన్ని గ్రహించిన రాక్షసులు యుద్ధంచేసి ఓడిపోతారు. ఈ కథలో నిజానికి రాక్షసులు దేవతలకు దక్కిన ప్రతిదానిలో అర్హులు, కానీ తగిన సమయస్ఫూర్తీ, సౌర్యము లేక పోవడం వల్ల కష్టపడినా ఫలితం దక్కదు. నేటికి కూడా ఇదే పరిస్థతి కదా !!

ఇక్కడ మనం మరో ముఖ్య విషయాన్ని గూర్చి చెప్పుకోవాలి. గరుడుడు అమృతం తేవడానికి స్వర్గానికెళుతూ నాకు బలం రావడంకోసం ఆహారాన్నిమ్మని తల్లియైన వినతను అడుగుతాడు. అప్పుడు వినత సముద్రగర్భంలో నున్న బోయవాళ్ళను (నిషాదులను) తినమని చెప్తూ బ్రాహ్మణులను మాత్రం తినొద్దని చెప్తుంది. బ్రాహ్మణులను ఎలా గుర్తించాలంటే ఎవడైతే గొంతులోనుండి క్రిందకు జారకుండా అగ్నివలె కాలుస్తాడో వాడిని బ్రాహ్మణుడని చెప్తుంది. ఇక్కడ బ్రాహ్మణులను చంపరాదని వారు ఉన్నతులని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గరుడుడు నిషాదులను తినేటప్పుడు ఒక బ్రాహ్మణుడు గరుడుని గొంతులోకి పోయి అడ్డుపడతాడు. ఇక్కడ కొంత సంవాదం జరిగిన తరువాత చివరికి బ్రాహ్మణుడు పెళ్ళి చేసుకోవడం ద్వారా  అపవిత్రు రాలైన బోయవనిత కూడా పవిత్రురాలైనట్టు చెప్పడం ద్వారా బ్రాహ్మణాధిక్యతను కథలో చొప్పించారు.

ఇక విష్ణువు సౌర్యపరాక్రమాలను గలవానిని గుర్తించి దగ్గరకు తీయటంలో నేర్పరని మనకు గరుత్మంతుడు అమృతం తేవడానికి స్వర్గానికి వెళ్ళిన సందర్భంలో కనిపిస్తుంది. అమృతానికి కాపలాగా వున్న దేవతలందరిని చిత్తు చేసి అమృతాన్ని తీసుకొని పోతుంటే విష్ణువు ప్రత్యక్షమై వరమివ్వడం లాంటి సన్నివేశాలు కార్యశూరులను గుర్తించి తనవైపు తిప్పుకోవడంలో నేర్పరితనం విష్ణువుకు ఎంతగానుందో తెలియచేస్తుంది. అలాగే ఓడిపోయిన ఇంద్రుడుకూడా శత్రువు బలవంతుడైనప్పుడు లొంగిపోయి అతనితో స్నేహాన్ని కోరుకోవడం ద్వారా మరింత నష్టాన్ని నివారించుకోగలుగుతాడు.

వినత, కద్రువ కథలో తల్లే తన మాట నెగ్గడంకోసం మోసం చేయమని చెప్పడం,తిరస్కరిస్తే శాపమివ్వటం పాములు ధర్మాధర్మాల మధ్య నలిగి పోవడం తుదకు శేషుడు నేను అధర్మాత్ముల దగ్గరుండనని వెళ్ళిపోవటం ద్వారా దుష్టులకు దూరంగా వుండమనే సారాంశాన్ని ఆ కథలో అంతరార్థం. అంతేకాకుండా వాసుకి తన ప్రమేయంలేకుండానే శాపానికి అర్హమై సర్పయాగంలో ప్రాణాలు కోల్పాతారని తెలిసినప్పుడు కుటుంబపెద్దగా బాధ్యత తీసుకొని దానికి పరిష్కారాన్ని కనుగొనడం ద్వారా తనకుటుంబాన్ని ఎలా రక్షించుకొన్నదో కూడా తెలుస్తుంది. 

వాలఖిల్యుల కథ ద్వారా మునులు లేదా నిర్బలులను చూసి వెటకారంచేస్తే యేమి జరుగుతుందో  గరుత్మంతుని ద్వారా ఇంద్రునకు తెలియచేసినట్లయింది. ఇక్కడ ప్రధానంగా ఇంద్రుని గర్వానికి ప్రతిగా వినత కడుపున కశ్యపునికి గరుత్మంతుడు పుట్టి స్వర్గాధిపతైన ఇంద్రుని గర్వాన్ని అణచడమనేది ప్రధానం.

జరత్కారుని కథ ద్వారా ఎంతటి తపస్సంపన్నులైనా  బిడ్డలు  లేకపోతే  ఉత్తమలోకాలు ప్రాప్తించవని చెప్పిస్తాడు. బహుశా ఆకాలంలో ఎంతమంది పుత్రులుంటే వారికి సమాజంలో అంత బలమేమో. 

పరీక్షుత్తు తక్షకుడి కాటుద్వారా చనిపోవటానికి కారణం తపస్సులో నున్న ముని మెడలో పామును అకారణంగా వేయటం.దానికి ఫలితము పరీక్షిత్తు చావు. ఇందులో నీతి విదితమే కదా.

ఇక చివరిగా జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తున్నప్పుడు ఆస్తీకుడొచ్చి దానిని మాన్పించడానికి చేసిన ప్రయత్నం నిజంగా ప్రతిఒక్కరు భారతాన్ని చదివి ఆస్వాదించవలసిందే. ఇక్కడ మనకు అధికారమున్న వారి దగ్గర యెలా మాట్లాడాలో తెలుస్తుంది. సన్నివేశాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. 

10, డిసెంబర్ 2017, ఆదివారం

మహాభారతం ఆదిపర్వము - ప్రధమాశ్వాసము - నా కల్పనలు - 2

మొదటిభాగం -  https://chiruspandana.blogspot.com/2017/12/1.html

కుండలాలు తెచ్చిచ్చిన ఉదంకుని గురుదక్షిణ పూర్తయిందని చెప్పి పైలుడు ఉదంకుని తో " ఇక నీ చదువు పూర్తయింది నీకిష్టమైన చోటికెళ్ళి సుఖంగా జీవించమని" దీవించి పంపించి వేశాడు. ఉదంకుడు కూడా చాలాకాలం తపస్సు చేసి తనను కష్టపెట్టిన తక్షకుని పై ప్రతీకారం తీర్చుకోవడానికి జనమేజయ మహారాజు వద్దకెళ్తాడు. తపస్సు తపస్సే కోపతాపాలు కోపతాపాలే మరి :)

రాజు కాబట్టి జనమేజయుని కాసేపు పొగిడి తక్షకుడనేవాడు నా అంతటి మునికి కష్టం తెచ్చిపెట్టాడు కాబట్టి నువ్వెలాగైనా వాడి పని పట్టాలంటాడు. అంతే కాదు అసలు నీ తండ్రి పరీక్షుత్తు మరణానికి కారణమెవరనుకుంటున్నావు? ఈ తక్షకుడే !! అని ఇంకాస్త ఎక్కదోసి దానికి ప్రతీకారంగా సర్పయాగం చెయ్యమని పురికొల్పుతాడు. సర్పయాగం చేస్తే పాములన్నీ వచ్చి అగ్నిలో పడి చచ్చిపోతాయి. కులంలో ఒక్కడు చెడ్డవాడుంటే ఆకులమంతా చెడుతుంది గాబట్టి పాములన్నింటిని చంపెయ్యమని పుల్లపెడతాడు :)

ఈ కథ ఉగ్రశ్రవనుడు చెప్తుంటే వింటున్న  మునులకు ఒక డౌటొచ్చింది. అసలు ఈ పాములన్నీ అగ్నికాహుతవ్వడానికి కారణమేంటి అని ఉగ్రశ్రవనుని అడుగుతారు. మళ్ళీ ఇంకొక పిట్టకథ మొదలు.

పూర్వం పాముల తల్లయిన కద్రువ శాపమియ్యడం వలన పాములన్నీ అట్లాఅగ్నిలో పడ్డాయి ఆ కథ ఇప్పుడు చెప్తానని ఇట్లా చెప్పాడు.

పూర్వం భృగువు అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన భార్య పులోమ. ఆమె కడుపోతో వున్నది. ఒకరోజు యాగం చేస్తూ ఏటికి స్నానానికని వెళ్తూ భార్యని అగ్నికార్యాన్ని చూడమని చెప్పి వెళ్తాడు. అప్పుడు పులోముడనే రాక్షసుడొచ్చి ఆమె అందానికి గులామై అగ్ని ని ఈమె ఎవరిభార్యని అడుగుతాడు. అగ్ని నిజం చెప్తే భృగువు శాపమిస్తాడని తెలిసినా "ఈమె భృగువు భార్య" అని చెప్తాడు. అప్పుడారాక్షసుడు ఈమె పూర్వం నాకోసం ఎన్నబడిన భార్య. తరువాత భృగువు పెండ్లి చేసుకొన్నాడని పందిరూపంతో పులోమని ఎత్తుకొని పరుగులంకించుకొన్నాడు. అలా పరిగెత్తుతుంటే పులోమ పొట్టలో వున్న బిడ్డకు కోపమొచ్చి పొట్టలోనుంచి జారిపడి పులోముడిని భస్మం చేస్తాడు. గర్భంనుంచి జారి పడ్డాడుకనక ఆ బిడ్డ చ్యవనుడయ్యాడు. పులోమ చ్యవనునెత్తుకొని తిరిగి భృగువు దగ్గరకి వస్తుంది.

ఇక్కడ నాకనిపించేది యేమిటంటే పులోముడు, భృగువు భార్యను అపహరించుకోని పోతుంటే బిడ్డపుట్టాడు.వాడికి చ్యవనుడని పేరుపెట్టారు. కొంత కాలానికి వాడు చచ్చినాక పులోమ మళ్ళీ భృగువు దగ్గరకొస్తుంది. పులోమ ముందు పులోమని భార్యగా వుండి తరువాత భృగువుని పెండ్లి చేసికొని కూడా వుండవచ్చు.బహుశా ఆ కాలంలో అందంగా వుంటే ఒకరి భార్యను మరొకరు పరాక్రమము చేత పెళ్ళి చేసుకోవడం పెద్దనేరము కాదేమో!

పులోమనెత్తుకొని పులోముడు పరిగెత్తినప్పుడు ఆమె భయంతో ఏడిస్తే ఆ కన్నీటితో ఆ ఆశ్రమం దగ్గర ఒక నది యేర్పడితే బ్రహ్మ దానికి  "వధూసర" అని పేరు పెట్టాడు. స్నానం చేసి వచ్చిన భృగువు కొడుకునెత్తుకొని వున్న పులోమను చూసి "ఆ రాక్షసుడు నిన్నెలా తెలిసికొన్నాడు? నీజాడ ఎవరు చెప్పారని " అడిగితే ఇదిగో ఈ అగ్ని నన్నుగూర్చి చెప్పాడని చెప్పింది. అంతే భృగువుకు కోపమొచ్చి అగ్నికి శాపమిస్తాడు. నువ్వు సర్వభక్షకుడవు కమ్మని. ఇక్కడ మళ్ళీ అగ్నికి భృగువుకి కొంత సత్యం గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి అగ్నిచేత వ్యాసుడు కొంత చెప్పిస్తాడు. అగ్ని తనకిచ్చిన శాపానికి ప్రతిగా తన కాంతిమయమైన రూపాన్ని లేకుండా చేసేస్తాడు. ఇది చూచి యజ్ఞ యాగాదులు, పితృ కర్మలు చేసే మానవులు అవిచేయలేక మునులదగ్గరకు వెళ్ళారు.మునులు దేవతలదగ్గరకి వెళ్ళారు.మునులూ దేవతలూ కలసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకొంటే బ్రహ్మ అగ్ని ని పిలిచి  ఆ ముని వాక్యం వ్యర్థం కాదు కానీ నీవు అన్నీ తినేవాడవయినప్పటికి మొదటపూజనీయమైన వాడవవుతావని శాంతింప చేస్తారు.

బహుశా ఆ కాలంలో అగ్ని ప్రతిదాన్ని దహించివేయడం చూసి ఈ శాపాన్ని ఒక కారణంగా చూపి సంతృప్తి పడివుండేవారేమో! అలాగే ప్రతివొక్కరు బహుశా అగ్ని కార్యాలు చేసే వారేమో. ఆరోజుల్లో ఇప్పటిలాగా అగ్గి తయారు చేయడం కుదరక అవసరమైనప్పుడు అగ్ని అందుబాటులో వుండడానికి ఇదొక ప్రక్రియగా మొదలైందేమో. మునుల వాక్కులకు తిరుగులేదనే వ్యవస్థను సూత్రీకరించే కథల్లో ఇదొక కథయి వుండవచ్చు.

అలా అగ్ని శాంతించినపిదప భృగువు కొడుకు చ్యవనునికి సుకన్య కు ప్రమతి అనేవాడు పుడుతాడు. ప్రమతికి ఘృతాచి అనే అప్సరసకూ రురుడు జన్మిస్తాడు. రురుడు ప్రమద్వర అనే ముని కన్యకను ప్రేమిస్తాడు. ప్రమద్వర విశ్వావసుడనే గంధర్వ రాజుకు, మేనకలకు పుట్టి స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరుగుతుంటుంది. ఒకరోజు ప్రమద్వర స్నేహితురాళ్ళతో ఆడుకుంటుంటే పాము కరిచి చచ్చిపోతుంది. అప్పుడు ప్రమద్వరను చూడటానికి గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు ( విశ్వామిత్రుడు), శంఖుడు, మేఖలుడు,భరద్వాజుడు,వాలఖిల్యుడు,ఉద్ధాలకుడు,శ్వేతకేతుడు,మైత్రేయుడు మొదలైన ఋషులతోటి ప్రమతి, రురువుడు కూడా స్థూలకేశునాశ్రమానికి వస్తారు. రురుడు అక్కడ వుండలేక అడవికి వెళ్ళి దేవతలను ప్రమద్వరను బ్రతికించమని ప్రార్ధిస్తాడు. ఇక్కడ ప్రార్థించడంలో ఒక విశేషముంది మంత్రము తో కానీ, విషతత్త్వాన్ని తెలిసిన వ్యక్తుల చేతకానీ బ్రతికించమని వేడుకుంటాడు. బహుశా పాముకాటు అప్పట్లో సర్వసాధారణం కాబట్టి ఋషులకు పాము విషాన్ని హరించే వైద్యం తెలిసుండాలి.

ఆ ప్రార్థన విన్న ఒక దేవదూత నీ ఆయుష్షులో సగం ప్రమద్వరకిస్తే ఆ అమ్మాయి బ్రతుకుతుందని చెప్తే రురుడు అలాగే ననటంతో ఆమె బ్రతుకుతుంది.ఇక అప్పటినుంచి తన భార్యకు అపకారాన్ని చేసిన పాములపై కక్షగట్టి రురుడు ఒక పెద్ద దుడ్డుకర్ర తీసుకొని అడవుల్లో తిరుగుతూ కనిపించిన పామునల్లా చావబాదుతుంటాడు. ఒకరోజు విషంలేనటువంటి డుండుభమనే పామును అలాగే కొట్టడానికి కర్రెత్తితే అది బ్రాహ్మణులకుండవలసిన లక్షణాలు గురించి చెప్పి యింత క్రోధానికి కారణమేమిటని అడుగుతుంది. రురుడు విషయం చెప్పి పామును చంపడానికి కర్రెత్తగానే ఆ పాము ముని రూపంలో ప్రత్యక్షమౌతాడు. అదిచూసి రురుడు నీవెవ్వరవు పామవతారంలో ఎందుకున్నావని అడిగితే ఆ ముని ఇలా చెప్తాడు.

నేను సహస్రపాదుడనే మునిని. నా సహపాఠి ఖగముడు. వాడొకరోజు అగ్ని గృహంలో వుండగా తమాషాకు గడ్డితో చేసిన పామును వాడిపై వేశాను. వాడు భయపడి కోపంతే నువ్వు విషంలేని పాముగ అవ్వమని శపించాడు. దానికి నేను తమాషాకోసం చేశానని శాపవిముక్తి కలిగించమని వేడుకోగా రురుని చూసిన తరువాత శాపవిముక్తుడవవుతావన్నాడు కాబట్టి నేను శాపవుముక్తడయ్యానని బ్రాహ్మణులకుండవలసి లక్షణాలను రురువుకి చెప్పి పాములపై కోపాన్ని పోగొడతాడు. 

పై కథంతా ఎవరు ఎవరికి చెప్తున్నారు?ఉగ్రశ్రవణుడు మునులకు చెప్తున్నాడు కదా! ఇప్పుడు మునులు మరో క్వొశ్చెన్ వేశారు.

ఉగ్రశ్రవణా "తల్లి బిడ్డలను ప్రేమతో లాలించి చూస్తుంది కాదా? అలాంటి తల్లే పాములకు శాపమెలా యిచ్చిందని" అడుగుతారు.

ఈ ప్రశ్నతో ప్రధమాశ్వాస కథ  పూర్తవుతుంది. 

మహాభారతం ఆదిపర్వము - ప్రధమాశ్వాసము - నా కల్పనలు - 1

చాలా సంవత్సరాలక్రితం హైదరాబాదు వెళ్ళినప్పుడు కోఠి లోని విశాలాంధ్ర బుక్ హౌస్ కు వెళ్ళినప్పుడు తిరుమలతిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన మహాభారత పుస్తకాల కట్ట అన్ని వాల్యూములు నా కంటబడ్డాయి.అవి ప్రతిపదార్థ వ్యాఖ్యాన సహితమై ఈరోజే కొనేసెయ్ అని నన్ను టెంప్ట్ చేశాయి :). కానీ వాటి బరువు అప్పటికే నేను తీసుకెళ్ళవలసిన లగేజీ తలచుకొని వీటినెలా తీసుకొనిపోవాలనే ఆలోచనతో వాటిని కొనడం అప్పటికి వాయిదా వేశాను. ఆ తరువాత కొన్నేండ్లు దాని గురించి మరిచిపోయాను.

మళ్ళీ ఒకటి,రెండు సంవత్సరాలక్రితం దేనికోసమో వెదుకొతుంటే టి.టి.డి వారి వెబ్సైట్ నాకంట పడటం అందులో ఉచితంగా భారత బాగవత పుస్తకాలుండడం చూసి ఆలసించిన ఆశాభంగమని భారతము, భాగవత పుస్తకాలను నా కంప్యూటర్ లోకి దిగుమతి చేసుకున్నాను. ఆపుస్తకాలు నాకంటికి కనిపిస్తూ చదవనిదానికీపుస్తకాలు నీకెందుకన్నట్టు కన్నుగీటుతుండేవి.

పోయిన నెల ఇరవైనాల్గవతేదీ ( నవంబరు ఇరవైనాలుగు ) నుంచి వీలున్నప్పుడు ఆంధ్ర మహాభారతం చదువుదామని నిర్ణయించుకొని చదవడం మొదలుపెడితే నేటికి ఆదిపర్వంలోని ప్రధమాశ్వాసము పూర్తయింది.నేను చదివిన దాన్ని క్లుప్తంగా వ్రాద్దామని ఈ టపా.

నన్నయ్య భారతాన్ని ఒక సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టాడు. "శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు..."  అని భారతం మొదలు పెట్టాడు. భారతం మొదట  విష్ణువు,శివుడు, బ్రహ్మలు రాజరాజనరేంద్రునికి శ్రేయస్సు చేకూర్చాలని మొదలు పెడతాడు. ఆ తరువాత రాజులకు ప్రీతికరమైన ముఖ స్తుతి మొదలౌతుంది. అతని పరాక్రమాన్ని,అందచందాలను, వంశాన్ని ఇతోధికంగా పొగిడేపద్యాలున్నాయి. ఐతే ఈ పద్యాలలో మనకు కొంత చరిత్ర తెలిసే అవకాశమున్నది.

రాజరాజనరేండ్రుడి తండ్రిపేరు విమలాదితుడని తెలుస్తుంది.వీరిది చాళుక్య వంశమనీ తెలుస్తుంది.రాజరాజనరేంద్రుడు ఆగమశాస్త్రాలు తెలిసినవాడని తెలుస్తుంది.ఆ కాలంలో రాజు విధి వర్ణాశ్రమ ధర్మాలు పాటింపచేయడమే నని నమ్మడం విశేషం. బ్రాహ్మణులు సమాజంలో అగ్రగణ్యులుగా వుంటూ రాజుల ప్రాపకంతో దానధర్మాలు స్వీకరిస్తూ సుఖమయజీవనం గడిపేవారనుకుంటాను. బ్రాహ్మణులకు దానం చేయడం పుణ్యమనే నమ్మకం లోకంలో బలంగా వుండేదనుకుంటాను. దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు లోటులేకుండా చూసుకోవడంకూడా రాజు లక్షణం అని తెలుస్తుంది.

నాడు రాజసభల్లో వ్యాకరణ పండితులూ, పురాణ ప్రవచనాలు చెప్పేవారూ, కవులు, తర్కశాస్త్రము క్షుణ్ణంగా తెలిసినవారూ వుండేవారని తెలుస్తుంది. అంటే అక్షర జ్ఞానమున్న వారికి గౌరవమర్యాదలెప్పటినుంచో వున్నాయని తలంచవచ్చు. అలాగే కులవృత్తులు వంశపారంపర్యమని, కొన్ని పదవులు తండ్రి తరువాత తనయునికి దక్కుతాయని కూడా తెలుస్తుంది. నన్నయ్య రాజరాజనరేంద్రునికి ఈ విధంగా కులబ్రాహ్మణుడయ్యాడు. రాజరాజనరేంద్రుడు శివభక్తుడని తెలుస్తుంది.

తరువాత భారతాన్ని వినడం వలన కలిగే ఫలాలు చెప్పబడినాయి. ఆ కాలంలో విద్య శ్రవణ ప్రధానం కాబట్టి "వినడం" వలన అని వాడి వుంటారు. ఇక్కడ కూడా బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్యమని చెప్పడంద్వారా నాకొకటి అనిపిస్తుంది. ఆకాలంలో మిగిలిన కులాల వారందరూ స్వయంపోషకులు అనుకుంటాను. అంటే వ్యవసాయమో లేదా తదనుకూలమైన వృత్తో చేయడంవలన వారి పోషణ వారు చూసుకొనేవారనుకుంటాను. కానీ బ్రాహ్మణుల వృత్తి పురాణాలను,వంశ గత చరిత్రలు, యజ్ఞ యాగాదులు, మంత్ర తంత్రాలను,చరిత్రను పరిరక్షించడం మొదలైన వృత్తి కాబట్టి వీరికి ఎవరైనా ఏదైనా పెడితే గానీ కుటుంబం గడవని పరిస్థితి కాబట్టి బ్రాహ్మణులకు దానాలు చేయడం పుణ్యమని పురాణాలద్వారా సామాన్యప్రజల మనస్సులలో చొప్పించి వుంటారు.

మొత్తానికి భారతాన్ని వ్రాయమని రాజరాజనరేంద్రుడు నన్నయను కోరడం నన్నయ్య దానికొప్పుకొని తాను భారతాన్ని యెలా రచించదలచుకున్నాడో చెప్పుకొని భారత కథను  నైమిశారణ్యంలో  శౌనకుడనే కులపతి సత్త్రమనే యాగం చేస్తూ వుండగా ఊగ్రశ్రవనుడునే కథకుడు( రోమహర్షుని కుమారుడు)  అక్కడకు వచ్చి మునుల కోరికమేరకు భారతం చెప్పడం మొదలుపెట్టాడని భారతకథనెత్తుకుంటాడు. సంస్కృతభారతంలో వున్న పర్వాలను తెలుగులో ఏఏ పర్వవములో వ్రాయనున్నాడో ఆ పర్వాలలో వున్న శ్లోకాలసంఖ్యను మొదలైన వాటిని విషయసూచికలలాగా వివరిస్తూ భారతయుద్ధం శమంతపంచకమనే ప్రదేశంలో జరిగిందని చెప్తాడు. వింటున్న మునులూ శమంతపంచకము కాపేరు ఎలా వచ్చిందని, అక్షౌహిణి అంటే పరిమాణంలో ఎంత చెప్పమని అడుగుతారు.

త్రేతా ద్వాపరయుగాల మధ్యకాలంలో పరుశురాముడు యుద్ధప్రీతి పరుడై శత్రురాజులనందరిని చంపి ఆ రక్తంతో ఐదు మడుగుల నింపి పితృదేవతలకు తర్పణమిచ్చాడు. అలా ఆ ప్రదేశానికి దగ్గరలోనున్న స్థలం శమంతపంచకమని పిలుస్తున్నారని చెప్పి అక్షౌహిణి అంటే ఏమిటో యిలా చెప్పాడు.

ఒకరథం+ఒక ఏనుగు+మూడు గుర్రాలు+ఐదుగురు కాలిబంట్లు = పత్తి
పత్తికి మూడురెట్లు=సేనాముఖం
సేనాముఖానికి మూడురెట్లు = గుల్మం
గుల్మానికి మూడురెట్లు = గణం
గణానికి మూడురెట్లు = వాహిని
వాహినికి మూడురెట్లు = పృతన
పృతనకు మూడురెట్లు = చమువు
చమువుకు మూడురెట్లు = అనీకిని
అనీకినికి పదిరెట్లు = అక్షౌహిణి

ఒక్కొక్క దానిలో ఎన్ని ఏనుగులు ఎన్ని గుర్రాలు ఎన్ని రథాలు ఎంతమంది కాల్బలమో మీరే లెక్క వేసుకోండి.
మొత్తంగా చూస్తే 21870 రథాలు, 21870 ఏనుగులు,65610 గుర్రాలు, 109350 కాల్బలం కలిపి ఒక అక్షౌహిణి. ఇటువంటివి ఏడక్షౌహిణులు పాండవుల పక్షాన, పదకొండక్షౌహిణులు కౌరవపక్షాన తలపడ్డాయి.

శమంతపంచకమనే ప్రదేశంలో కురుపాండవుల యుద్ధం జరగడంచేత ఆప్రదేశానికి కురుక్షేత్రం అనికూడా పేరొచ్చింది.

యజ్ఞయాగాదులు రాజులయొక్క కర్తవ్యమనుకుంటాను. భారత యుద్ధానంతరం జనమేజయుడు దీర్ఘకాలం యజ్ఞాన్ని చేశాడు.అక్కడకు దేవతల కుక్కయైన సరమ కొడుకు సారమేయుడు ఆడుకొనడానికి వస్తాడు.దాన్ని జనమేజయ తమ్ముళ్ళు శ్రుతసేనుడు,భీమసేనుడు,ఉగ్రసేనుడు అనే వాళ్ళు కొడతారు.ఆ కుక్క ఏడుస్తూ వెళ్ళి తనతల్లికి చెప్తుంది. సరమ వచ్చి జనమేజయుడిని కడిగిపారేస్తుంది. అన్యాయంగా నా కొడుకుని కొట్టావు నీకు ఆపదలొస్తాయని చెప్పి అదృశ్యమైపోతుంది.

జనమేజయునికి సరమగిలి పట్టుకోని దాన్ని శాంతింపచేయటానికొక పురోహితుని వెతుకుతూ అడవులు పట్టుకు పోయి ఆ అడవుల్లో శ్రుతశ్రవసుడనే మునిని చూస్తాడు.ఈ శ్రుతశ్రవసునికి సోమశ్రవసుడని ఒక కొడుకు. ఆ సోమశ్రవసుని పురోహితునిగా పంపమని కోరుతాడు.ఆ సోమశ్రవసుని మంచి మాటలతో శాంతిపొంది రాజ్యాన్ని సుఖంగా అనుభవిస్తూ వుండగా

జనమేజయుడు రాజ్యంలోనే ఒకానొక అరణ్యంలో పైలుడు పాఠాలు చెప్పుకుంటు జీవిస్తుంటాడు.పైలుని గురుకులంలో ఉదంకుడనేవాడు విద్యనభ్యసిస్తుంటాడు.ఇతను గురువుకు ప్రియ శిష్యుడై ఎనిమిది సిద్ధులను సంపాదిస్తాడు. ఉదంకుడు గురువుగారి భార్య చెప్పటంతో పౌష్యుడనే రాజు భార్యయొక్క కుండలాలు తీసుకురావడానికి బయలు దేరుతాడు. దారిలో తనకొక మహానుభావుడుకనపడి ఎద్దుపేడ తినమంటే తిని పౌష్యుని దగ్గరకెళ్ళి వచ్చిన పని చెప్తాడు. రాజు దానికి సంతోషపడి రాణి దగ్గరకెళ్ళి తెచ్చుకోమంటాడు. ఉదంకుడంతఃపురానికెళితే రాణి కనిపించదు. ఏడుపుమొఖంతో రాజుదగ్గరికొచ్చి రాణి కనపడలేదంటే నువ్వు అపవిత్రుడవు కాబట్టి కనపడలేదంటాడు. అప్పుడు ఎద్దుపేడతిన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ అన్నీ కడుక్కొని రాణిదగ్గరకెళ్ళి కుండలాలు తీసుకొని రాజువద్దకొచ్చి వెళతానంటాడు. పౌష్యుడు అన్నంతిని పొమ్మంటాడు.అన్నంలో వెంట్రుకొచ్చిందని ఈ సద్బ్రాహ్మణుడు రాజును గుడ్డివాడివి కమ్మని శపిస్తాడు. రాజు మాత్రం తక్కువ తిన్నాడా..నీకు పిల్లలు లేకపోవుగాకని శపిస్తాడు.

ఈ శాపనార్థాలను చూస్తే నాకొకటనిపిస్తుంది. ఆ కాలంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఏదైనా నోటితో అంటే అది జరుగుతుందనే నమ్మకం ప్రబలంగా ప్రజల మనసుల్లో నెలకొని వుండాలి. ఒక్కొక్కచో విధి వశాన ఏమైనా కీడు జరిగితే అది తప్పకుండా శాపం వల్లే జరిగిందని భయపడేవారనుకుంటాను. ఇన్ని యజ్ఞాలు మనిషిని శాంతితో సంతోషంతో జీవించడానికి ఏర్పరచుకున్నట్టి వైనా కోపతాపాలు ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళలో పరిపూర్ణంగా వుండేవని దెబ్బకు దెబ్బ తీయాలని వుండే మానవ సహజ ప్రవృత్తి ఎక్కడికీ పోలేదని భారతంలో వచ్చే అనేక కథలద్వారా మనకు కనిపిస్తుంది.

ఉదంకుడు కుండలాలు తీసుకొని వస్తూ వుంటే  ఒక సెలయేరు కనిపిస్తే ఈ కుండలాలొడ్డున పెట్టి ఆచమనానికి దిగుతాడు. తక్షకుడనే పాము అదే అదనుగా చూసుకొని ఆ కుండలాలను దొంగలించుకొని నాగలోకానికి వెళతాడు. ఉదంకుడు కూడా సిద్ధులు తెలిసిన మూలంగా పుట్టలో దూరి నాగలోకానికి వెళతాడు. ఇక్కడ నన్నయ్య పాములను స్తుతించే పద్యాలు అద్భుతం.ఇక్కడ ఉదంకునికి తెల్లని నల్లని దారాలతో నేతనేస్తున్న ఒక స్త్రీ, పన్నెండాకుల చక్రాన్ని తిప్పుతూ ఆరుగురు యువకులు, గుర్రాన్నెక్కి వున్న ఒక దివ్యపురుషుని చూస్తాడు. దివ్యపురుషుడు అనుజ్ఞతో గుర్రము చెవిలో ఊదితే పాతాళమంతా ప్రళయకాల బడబాగ్ని జ్వాలలు వ్యాపిస్తాయి.అవి తట్టుకోలేక తక్షకుడు కుండలాలు తెచ్చి ఇస్తే దివ్యపురుషుడు తనగుర్రానెక్కి మీ గురవాశ్రమానికెళ్ళమంటాడు. ఉదంకుడు గురువు దగ్గరకొచ్చి జరిగిన విషయం చెప్పి తనకు పాతాళంలో కనిపించిన వాటికి అర్థాలడుగుతాడు. తెలుపు నలుపు పగలు రాత్రికి సంకేతాలని, దానిని నేస్తున్నవారు ధాత విధాత అని, పన్నెండాకుల చక్రం నెలలరూపమైన సంవత్సరమని,దానిని తిప్పేవాళ్ళు ఋతువులని ఆ దివ్యపురుషుడు ఇంద్రుని మిత్రుడైన వర్జన్యుడని చెప్తాడు. అలాగే నీకు ఎద్దుపేడ తినిపించిన పురుషుడు ఇంద్రుడని ఆ యెద్దు ఐరావతమని చెప్తాడు.

ఇక్కడ నాకొకటనిపిస్తుంది. గురువులు శిష్యులదగ్గర చులకనకాకుండా తనకు తోచినది జరిగిన సంఘటనలకు అన్వయించి ఏదో ఒకటి చెప్పి సంతృప్తి పరిచేవారనుకుంటాను.



సశేషం

4, డిసెంబర్ 2017, సోమవారం

జగన్ ఇరవై ఐదవరోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా ఈరోజు జగన్ డైరీ లోనుంచి కొంతభాగం, ఆ తరువాత నా పద్యం

"ఈ రోజు పత్తికొండ నియోజకవర్గం ఎర్రగుడిలో రైతు సదస్సు జరిగింది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆలోచనలను మరింత విస్తృతం చేసుకోవడానికి రైతులు ఈ సదస్సు నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా రైతు సమస్యలపై పనిచేస్తూ, వివిధ రైతు సంఘాల నాయకులుగా ఉన్న ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విత్తనం నాటే దగ్గర్నుంచి, తన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మే వరకూ.. వివిధ దశల్లో రైతు ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వ్యవసాయ రంగంపై ఆలోచనలను సుసంపన్నం చేసే అనేక సలహాలు, సూచనలు ఈ సదస్సులో చర్చకు వచ్చాయి. అందుకుగాను వారికి ధన్యవాదాలు.

ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం వల్ల రైతులు విపరీతమైన ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు నా దగ్గర స్పష్టమైన ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికా ఉన్నాయి.. రైతుల సమస్యలు భూమి టైటిల్‌ నుంచే మొదలవుతాయి. అందువల్ల మన వ్యవసాయ భూములకు టైటిల్‌ సమస్యలు రాకుండా చేసేందుకు, రైతుల భూములన్నిటికీ స్పష్టమైన టైటిల్స్‌ ఇస్తాము. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తు, సాగునీరు, సకాలంలో వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయానికి అయ్యే ఖర్చు తగ్గించడం కోసం రైతు భరోసా పథకం, వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సకాలంలో తగు సూచనలు, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు, పంటను నిల్వ చేయడానికి గిడ్డంగి సౌకర్యాలు, దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, చివరిగా పండిన పంటకూ గిట్టుబాటు ధర, అనువైన చోట వ్యవసాయానుబంధ పరిశ్రమలు స్థాపించి రైతుకు మరింత లబ్ధి చేకూర్చడం. మన ప్రభుత్వం తీసుకునే ఈ చర్యల వల్ల రైతుల జీవితాలు బాగుపడతాయి. పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. రాష్ట్రానికి ఆహార భద్రత లభిస్తుంది.


ఈ రోజు రైతు గర్వంగా నేను రైతునని చెప్పుకునే పరిస్థితి లేదు. రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఒక వేళ ఉద్యోగం రాకపోయినా, అదొక ఉపద్రవంలా భావించకుండా నేను వ్యవసాయం చేయగలను.. పది మందికి ఉపాధి కల్పించగలనని ఆలోచించే స్థాయికి వ్యవసాయాన్ని తీసుకురావాలి. ఇంకా చెప్పాలంటే ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, బ్యాంకర్, డాక్టర్‌లు తమ వృత్తుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. రైతు కూడా తన వృత్తి గురించి అంతే గొప్పగా చెప్పుకునే రోజులు రావాలి. ఉన్నత విద్యావంతులు వ్యవసాయాన్ని ఒక పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టే స్థాయికి వ్యవసాయాభివృద్ధి జరగాలి."


సీ|| ఆకొన్నవాని నాదరణజూపి కడుపునిండ కూడుకుడిపి నిమురు వాడు
కష్టనష్టంబు లొక్కపరిచుట్టుకొనినగూడ విశ్వాస సాగొదల డతడు
కండువా తలచ్రుట్టి కరకర టెండల భక్తితో పొలమున బ్రతుకు వాడు
నేడుప్రభుత్వాధినేత లాదరణలే కాత్మహత్యలపాలు! కనరె వింత?

ఆ.వె|| అట్టి రైతు వృత్తి కండగ నిలబడి
మేలు వృత్తి యిదని మెచ్చు నట్లు
సాగు నీటి నిచ్చి సాధ్యముచిత వ్యవ
సాయ ఋణము లిచ్చి సాయ పడుదు

3, డిసెంబర్ 2017, ఆదివారం

జగన్ ఇరవైనాల్గవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా ఈ రోజు జగన్ డైరీ లో నుంచి కొంత బాగం ఆపైన నా పద్యము

"ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలోంచి సాగింది. ఈ గ్రామానికి చాలా చారిత్రక ప్రాధాన్యం ఉందట. గ్రామంలోని చెరువు శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినదట. ఆ చెరువు గురించి తెలుసుకున్నప్పుడు నేను ఎంతో సంభ్ర మాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ రోజుల్లోనే రాజులు ఎంతో దార్శనికతతో భావి తరాల గురించి ఆలోచించి, ఆ ప్రాంత భౌగోళిక స్వరూప, స్వభావాలను దృష్టిలో పెట్టుకుని వర్షపాతం, భూగర్భ జల వనరులు తక్కు వగా ఉన్న ప్రాంతాల్లో చెరువులు తవ్వించా రు. అప్పటి పాలకులు ప్రజాసంక్షేమం గురించి ఆలోచించారు కాబట్టే ఇటువంటి మహత్కార్యాలు చేయగలిగారు. అదే బాటలో నడిచిన నాన్నగారు ఈ ప్రాంతానికి జలకళ తీసుకురావాలని సంకల్పించి, ఇక్కడి ప్రాజెక్టులను దాదాపు 80 శాతం పూర్తిచేశారు. కానీ ప్రజాసంక్షేమం పట్టని నేటి పాలకులు ఆ మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తిచెయ్యడం లేదు.

ఈ ప్రాంతంలో వర్షాలు పడితే ప్రజలు పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతారని నా దృష్టికి వచ్చింది. రాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్లని చదివిన చరిత్ర గుర్తుకు వచ్చింది. అంతటి సిరిసంపదలతో తులతూగిన ఈ ప్రాంతం నేడు కడు పేదరికంలో మగ్గుతోంది. ఈ ప్రాంతం, ఈ ప్రజల భవిష్యత్తు మార్చడం మనం సంకల్పించిన నవరత్నాలతోనే సాధ్యమని భావిస్తున్నాను. అందుకే నైరాశ్యంలో ఉన్న ప్రజలకు నవరత్నాలను విపులంగా వివరిస్తూ.. భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నాను.

పత్తికొండ నియోజకవర్గం బాగా వెను కబడిన ప్రాంతం. ఇక్కడి ప్రజలకు పెద్దగా ఆదాయ వనరులేమీ లేవు. భార్యాభర్తలు కూలి పనులు చేసుకోగా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకుని, బ్యాంకుల నుంచి నాన్నగారు ప్రారంభించిన పావలా వడ్డీ, సున్నా వడ్డీలకు రుణాలు తీసుకుని పిల్లల్ని చదివించుకున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించారు. ఇలా అప్పుడప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న మహిళలు, అధికారంలోకి వస్తే బేషరతుగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి అప్పులు తీర్చకపోవడంతో పూర్తిగా నష్టపోయారు. చంద్రబాబు తన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఈ రోజు వారందరూ డిఫాల్టర్లుగా మారారు. వాళ్ల రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. పైగా వీళ్లకి రుణమాఫీ పేరుతో ఇచ్చిన కొద్ది మొత్తాన్ని కూడా సీడ్‌ క్యాపిటల్‌గా చూపించి, మహిళల దగ్గర నుంచి మళ్లీ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో డ్వాక్రా ఉద్యమం పూర్తిగా బలహీనపడింది. ఈ ప్రభావం బాగా వెనుకబడిన ప్రాంతమైన పత్తికొండపై మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడి మహిళలు వారికున్న కొద్దిపాటి ఆదాయ వనరుని కూడా కోల్పోయారు."



సీ|| రాయలేలినయట్టి రాజ్యమ్మిది దొరువు చెరువుల ఖ్యాతిని జెంది నూరు
రతనాల రాశులు రహదారులందు వీసెలలెక్కనమ్మి ప్రసిద్ధి నొందె
కాలగతిన నేడు కడుపేదలమయి గతించిన సౌఖ్యమ్ము తిరిగి బడయ
మీచెంత కొచ్చితిమి జగనన్నా మావెతలు బాపు నాయకా దయన నీవు!

ఆ.వె|| కరువు కాటకముల కలతచెందెడిమిమ్ము
నాదు కొందు నేను నవరతనము
ల, యిదె మాట నాది లయకారుసాక్షిగ
పత్తి కొండ వాస పౌరు లార

2, డిసెంబర్ 2017, శనివారం

1, డిసెంబర్ 2017, శుక్రవారం

జగన్ ఇరవై రెండవరోజు పాదయాత్ర డైరీ- నా పద్యము

ముందుగా ఈ రోజు డైరీ లోని కొంత భాగము ఆ తరువాత నాపద్యము

"కారుమంచి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు వచ్చి కలిశారు. ఆ స్కూల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేనందున బహిరంగ ప్రదేశాన్నే వాడాల్సిరావడం వారికి నరకయాతనగా మారింది. తాగే నీళ్లలో పురుగులు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనంలో కూడా పురుగుల బాధ తప్పడం లేదు. స్కూల్‌ మొత్తం కంప చెట్లు పెరిగి, తరగతి గదుల్లోకి పాములు వస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న తరగతి గది గోడ ఇటీవల కూలిపోవడంతో ఒక విద్యార్థికి గాయం కూడా అయ్యిందట. స్కూల్‌కి వెళ్లాలంటేనే భయమేస్తోందని వాళ్లు నాతో చెప్పారు. స్కూల్‌ ఇంతటి దారుణ స్థితిలో ఉండటంతో స్కూలు హాజరు సగానికి సగం పడిపోయింది. తర్వాత గ్రామమైన కైరుప్పలలో కూడా విద్యార్థినులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. "



సీ|| చక్కని గంధముల్ చల్లు చిన్నారుల సత్ప్రవ ర్తననద్ది  చక్క నైన
భాషణముల నేర్పి భావిభారత పౌరులగ దీర్చిదిద్ది కలకలు బాపు
పల్లె బడులునేడు పట్టించు కొనునాథుడోపక  చిన్నారులోజము నశి
యించి యేడ్చుచునుంటి రీవేళ ఓంకార రాగముల్ వ్యాపించ రాజ్య మందు


ఆ.వె|| మరుగుదొడ్లు లేవు మరుగుయును గనము
ముట్ట మంచి నీళ్ళు పురుగు లొచ్చు
పాము లొచ్చి తిరుగు పాఠశాలల్లోన
కనరె మాదు బాధ కరుణ జూపి

30, నవంబర్ 2017, గురువారం

జగన్ ఇరవై ఒకటవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ఈ రోజు పాదయాత్ర డైరీ నుంచి కొంత భాగము ... ఆపైన నా పద్యము

"ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర బి.అగ్రహారం దాటాక 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేను ఇక్కడ వేప, కానుగ మొక్కలు నాటాను. ఈ ప్రయాణంలో నాకు శ్రమ గానీ, దూరం గానీ తెలియడం లేదు. ప్రజల్లో ఉండి, వారితో నేరుగా మాట్లాడుతూ.. వారి సమస్యలను తెలుసుకోవడం ఒక అపూర్వమైన అనుభవం. నాన్నగారు ప్రజల నుంచి ఏ డిమాండూ లేకుండానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దానికి ప్రధాన కారణం 2003 పాదయాత్ర సమయంలో ప్రజల కష్టనష్టాలను ఆయన పూర్తిగా అర్థం చేసుకోవడమే. వారికున్న సమస్యలు తీరాలంటే ఏం చెయ్యాలో కూడా ఆయనకి బాగా అర్థమైంది. బహుశా ప్రజాజీవితంలో ఉండే ప్రతి నాయకుడు చెయ్యాల్సిన పని ఇది. ఈ ప్రత్యక్ష అనుభవానికి ప్రత్యామ్నాయం ఉండదు."

ఆ.వె|| పాద యాత్ర చేయ ఫలమేమి యన్న ప్ర
జలగచాట్లు చూసి సరిగ పథక
ములను దిద్ద వచ్చు మూల సమస్యల
పార ద్రోల వచ్చు నాంధ్ర స్థలిన

29, నవంబర్ 2017, బుధవారం

జగన్ ఇరవైరోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా పాదయాత్ర డైరీ లో కొంత భాగము ఆపై నా పద్యము

"జనం బాధలు తీర్చిన వాడు భగవంతునితో సమానం. ఈ రోజు అనంతపురానికి చెందిన రమేష్, పద్మ అనే బ్రాహ్మణ దంపతులు కలిశారు. వాళ్లు కేవలం నాన్నగారి వల్లే ఈ రోజు సంతోషంగా ఉన్నామని చెప్పారు. రమేష్‌గారు అనంతపురం డెయిరీలో పనిచేసి, 2014లో పదవీవిరమణ చేశారు. అనంతపురం డెయిరీని మూసివేయాలని చంద్రబాబునాయుడుగారు ప్రయత్నిం చారని, కానీ అదృష్టవశాత్తు నాన్నగారు 2004లో గెలవడం వల్లనే తమ డెయిరీ మూతపడకుండా ఆగిం దని, దాంతో పిల్లలను చదివించుకుని, వారికి పెళ్లిళ్లు చేసి, పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవించ గలుగుతున్నామని.. ఇదంతా నాన్నగారి చలవేనని వాళ్లు చెప్పడంతో నా హృదయం సంతోషంతో బరువెక్కింది. కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉండటం కన్నా అదృష్టం ఏముంటుంది? అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. ఈ అదృష్టమే ప్రజల పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. గతంలో చేసినట్లుగానే చంద్రబాబునాయుడుగారు అనంతపు రం డెయిరీతో సహా రాష్ట్రంలోని పలు సహకార డెయిరీలను మూసివేయించడానికి ప్రయత్నిస్తున్నా రు. దీంతో వేలాది మంది డెయిరీ ఉద్యోగులు, వారి కుటుంబాలు, ఈ డెయిరీలపై ఆధార పడి ఉన్న లక్షలాది మంది పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ రోజు పాదయాత్ర సాగిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సుమారు 60 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. నాన్నగారు ఎమ్మిగనూరు చేనేత సొసైటీకి ఉన్న మూడున్నర కోట్ల రూపాయల రుణాన్ని రద్దుచేశారు. ఆయన హయాంలో ఎమ్మిగనూరులో అపెరల్‌ పార్క్, చేనేత క్లస్టర్ల కోసం 97 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఆయనే గనుక ఉండిఉంటే ఈ పాటికి అవి పూర్తయి ఉండేవి. దాని అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది.. దాదాపు 6,000 మందికి ఉపాధి దొరికేది.. నేతన్నల జీవితాలు బాగుపడేవి. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతన్నల మీద వరాల వర్షం కురిపించారు. జిల్లాకో చేనేత క్లస్టరు, లక్ష రూపాయల వడ్డీ లేని రుణం, సబ్సిడీపై ముడిసరుకు పంపిణీ, ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి లక్షన్నర రూపాయలతో వర్క్‌ షెడ్డుతో కూడిన పక్కా ఇల్లు.. ఇలా ఆయన అరచేతిలో స్వర్గం చూపించారు. తీరా గెలిచాక వీళ్లెవరో కూడా ఆయనకు గుర్తులేరు. ఎమ్మిగనూరు చేనేత సొసైటీకి గతంలో రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలుండేవి. అవన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. ఆ బ్రాంచీలను తెరిపించే ప్రయత్నం చేస్తాను.


ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు.. రెంటికీ కటకటే. తుంగభద్ర లోలెవల్‌ కెనాల్‌ నుంచి నీటి లభ్యత తక్కువ అవుతున్న తరుణంలో రాజశేఖరరెడ్డిగారు దార్శనికతతో ఎల్‌ఎల్‌సీ ఆయకట్టును స్థిరీకరించడంలో భాగంగా పులికనుమ ప్రాజెక్టు చేపట్టారు. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పదిశాతం పనులు పూర్తి చెయ్యడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ పనులుæ పూర్తయితే ఇక్కడ 26 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాన్నగారు ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ఇలాంటి ప్రాజెక్టులన్ని ంటినీ మన ప్రజాప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందిస్తాము. "



సీ|| సహకార డైరీల సాకి యుద్యోగుల కడగండ్లు కడగంట కడిగి వేసి
చేనేత నేతన్న చితికిపోకుండగన్  చేయూత నిచ్చె నా శివుడు మెచ్చ
నీటి కటకట కన్నీటి రైతులగని కట్టె సుజలముల కాన కట్ట
వరములిచ్చి ప్రజల బాధలు తీర్చ నవతరించె నాంధ్ర యవనిక పైన

ఆ.వె|| అట్టి రాజ శేఖ రాధిపు తండ్రియై
చనుట నాదు పూర్వ జన్మ ఫలము
కాదె? వాడ వాడ గనుచుంటి నపరిమి
తాదరణను, జన్మ ధన్య మయ్యె

28, నవంబర్ 2017, మంగళవారం

జగన్ పందొమ్మిదవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యం

ఈ రోజు పాదయాత్ర డైరీ లోని కొంత భాగం... ఆపైన నా పద్యం

"ఈ రోజు పాదయాత్రలో దారి పొడవునా ఎక్కడ చూసినా పత్తి చేలే. రైతుల ముఖాల్లో మాత్రం సంతోషం కనిపించలేదు. ఆ పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడాను. వీరిలో చాలా మంది కౌలు రైతులు. రాజు అనే రైతు ఐదెకరాలు కౌలుకి తీసుకొని పత్తి వేశాడు. ఎకరాకు దాదాపు రూ.35,000 పెట్టుబడి పెట్టాడు. గులాబీరంగు పురుగు ఆశించడంతో పంట మొత్తం నాశనమైంది. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. వచ్చిన ఆ కొద్ది పత్తిని మార్కెట్‌కి తీసుకెళ్తే, రూ.1,500 నుంచి రూ.2,000 రూపాయలకు మించి ధర పలకడం లేదు. ఈ ప్రాంతంలో పత్తి రైతులందరిదీ ఇదే వ్యథ. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేదు.

ఈ ఏడాది సబ్సిడీ మీద ఇవ్వాల్సిన లింగాకర్షక బుట్టలను కూడా ఇవ్వలేదు. కోడుమూరులో జరిగిన రైతు సమావేశంలోనూ ఇటువంటి సమస్యలే నా దృష్టికి వచ్చాయి. కేవలం పత్తే కాదు, మిగతా అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. రైతులను రుణమాఫీ చేశారా అని అడిగాను. రుణమాఫీ కాలేదు, నోటీసులు వస్తున్నాయి, చేసిన కాస్త మాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. బ్యాంకుల గడప కూడా ఎక్కలేకపోతున్నామని వాళ్లు బాధ పడ్డారు. గిట్టుబాటు ధరల విషయమై రైతుల ఆవేదన అంతా, ఇంతా కాదు. నాన్న ఉన్నప్పుడు గరిష్ట ధరలు పొందిన రైతులు ఈ రోజు గిట్టుబాటు ధరల కోసం కూడా అల్లాడుతున్నారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే రైతుల ప్రయోజనాలను దళారులకు తాకట్టు పెట్టి, రైతుల దగ్గరి నుంచి తక్కువ ధర లకు కొని, తన హెరిటేజ్‌ దుకాణాల్లో అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. వ్యవసా యం సంక్షోభంలో ఉంటేనే ఆయన కు లాభం. అందుకే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఈ పాలకుల నిర్లక్ష్యం, రైతు వ్యతిరేక విధానాలు రైతుకి వ్యవసాయాన్ని భారం చేశాయి. వ్యవసాయం దండగని భావించే పాలకులు ఉన్నంత కాలం రైతుల పరిస్థితి ఇంతే.

నాకొక స్వప్నం ఉంది. వ్యవసాయ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండటం, నిరంతర విద్యుత్, సకాలంలో వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, క్రిమిసంహారక మందులు, సాగునీటి సౌకర్యం, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు తగిన సూచనలు, సలహాలు, పంటకు గిట్టుబాటు ధర, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పంట నష్ట పరిహారం అందించడం ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేయాలి. ఒక్క ఆత్మహత్య కూడా జరగకూడదు. రైతు ముఖంలో ఆనందం, వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని రైతులు భావించాలి. రాబోయే మన ప్రజా ప్రభుత్వంలో ఈ స్వప్నం తప్పక సాకారమౌతుంది."


సీ|| దారి పొడవున ముదముజేయు పత్తిచేలాదరముగ స్వాగ తమ్ము పల్కె
కాని, పోషకుడైన కామందు మోమున గననైతి చిర్నవ్వొ క్కటియు గూడ
పంట పండించ ముప్పదియైదు వేలు విక్రయముచేయ కనరు కాసు నైన
ఎటులజీవింతు రిచటిరైతులు ప్రభుత్వ కరుణాకటాక్షంబు గనక నిచట

ఆ|| ఆదుకొందు నేను ప్రభుతనే ర్పడజేసి
మేలగు సలహాల మెప్పు తోడ
ఎన్ను కొనుడు నన్ను మీఓటు వేసి యె
లమిగ మిమ్ము ధాన్య లక్ష్మి కూడు

27, నవంబర్ 2017, సోమవారం

జగన్ పద్దెనిమిదవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ఈ రోజు జగన్ పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగము..ఆపై నా పద్యము

"ఈ రోజు గోరంట్లలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సమావేశంలో చర్చించాం. బలహీన వర్గాలు అన్న పదం వింటేనే నాకు బాధగా ఉంటుంది. అందరూ సమానంగా ఉండాల్సిన సమాజంలో ఈ అంతరాలెందుకు? బలహీన వర్గాలంటే తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కబడిన వర్గాలే గానీ మేధస్సులో, శ్రమలో ఎవరికీ తీసిపోయేవాళ్లు కారు. అయితే తప్పుడు హామీలతో, తాత్కాలిక ప్రలోభాలతో నేతలు వీరిని కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నందు వల్లే ఈ ప్రజలు ఇంతకాలం వెనుకబడిన వర్గాలుగానే ఉన్నారు."

గుణము నందరయగ కోరికష్టము చేయు
టందు సాటిగాదె యగ్రజులకు
తరతరముల తగని తమయధి కారమె
శాప మయ్యె మాకు జలజ నేత్ర

చిన్న వివరణ: ఇక్కడ మూడవపాదంలో "తరతరముల తగని తమయధి కారమె" అన్నప్పుడు "తమ" అంటే అగ్రకులజుల అని అర్థం. జగన్ కూడా అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా... కాబట్టి వాళ్ళ బాధనుఅలా వ్యక్తపరిచారు.

ఇది ఒక వెనుకబడిన తరగతి వాని ఆవేదన గా వ్రాయడమైనది.

26, నవంబర్ 2017, ఆదివారం

జగన్ పదిహేడవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా జగన్ డైరీ లో నుంచి కొంతభాగము

పత్తికొండ నియోజకవర్గంలో గత 24 సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీయే అధికారంలో ఉంది. కానీ, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దారిద్య్రం తాండవిస్తోంది. రోడ్డు, రవాణా, ప్రజారోగ్యం, గృహ కల్పన, తాగునీటి సౌకర్యం.. అన్నీ దీనావస్థలో ఉన్నాయి. ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ స్థితికి మోక్షం ఎప్పుడో?

చెరుకులపాడు గ్రామంలోకి  ప్రవేశించగానే కొద్ది నెలల క్రితం జరిగిన దారుణ మారణకాండ గుర్తుకు వచ్చి మనసు కలత చెందింది. అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలను ప్రశ్నించాడని, వారి రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డంకిగా మారతాడోనని భయపడి నారాయణరెడ్డిగారిని దారుణంగా హత్య చేయించారు. ఇది ఏ సంస్కృతికి నిదర్శనం? మనం ఎటువైపు పయనిస్తున్నాం? ఈ రాక్షస పాలన అంతం కావాలి. ఈ ఆటవిక సంస్కృతికి చరమగీతం పాడాలి. అధికార పార్టీ ఎంతటి దౌర్జన్యాలకు, అణచివేతకు పాల్పడుతున్నా, మన వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు మనోధైర్యాన్నివ్వాలని, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నా.. నమ్ముకున్న జనం కోసం, పార్టీ కోసం పోరాడుతున్న శ్రీదేవమ్మ గారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. అందుకే రాష్ట్రంలోనే మొట్టమొదటగా శ్రీదేవమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాను. 


ఈ రోజు నాగరాజు అనే ఆర్టీసీ డ్రైవర్‌ కలిశాడు. 1974లో ఆర్టీసీలో చేరిన ఆయన 35 సంవత్సరాలు సంస్థకే జీవితాన్ని అంకితం చేసి, ఆరోగ్యాన్ని సైతం కోల్పోయి, 2008లో పదవీ విరమణ చేశాడు. ఆయన అందుకున్న చివరి జీతం 18,000 రూపాయలు. ఇప్పుడు వస్తున్న పింఛన్‌ 1,650 రూపాయలు! గుండె బరువెక్కింది. అంత చిన్న మొత్తంతో వృద్ధాప్యంలో బతుకు బండిని ఎలా లాగగలడు? జీవితానికి కనీస భద్రత కూడా ఉండనవసరం లేదా? పదవీ విరమణ తర్వాత ఏ ఉద్యోగికైనా అభద్రత లేకుండా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన భరోసా కల్పించాలి. 

స్కూల్లో మధ్యాహ్న భోజనం వండే మహిళలు కలిశారు. గత ఆరు నెలలుగా తమకు రావాల్సిన చెల్లింపులు రాలేదని వాపోయారు. అలాగే మోడల్‌ స్కూల్‌ సిబ్బంది కలిశారు. వారికి ఐదు నెలలుగా వేతనాలివ్వడం లేదట. పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి, వారి హాజరును మెరుగుపరిచి, అక్షరాస్యతను పెంపొందించడానికి ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధో! 

ప్రభుత్వ హాస్టళ్లను, స్కూళ్లను మూసివేయించడం, ప్రతిష్టాత్మకమైన మోడల్‌ స్కూళ్లలో పని చేసే అధ్యాపకులకు కూడా వేతనాలు ఇవ్వకపోవడం, ఆ స్కూళ్లలో తగిన సౌకర్యాలు కల్పించకపోవడం.. ఈ చర్యలన్నీ మీ బినామీలైన కార్పొరేట్‌ విద్యా మాఫియాకు లబ్ధి చేకూర్చడం కాదా? మీ పాలనలో, మీ అండదండలతో ఇప్పటి వరకు అనేక రాజకీయ హత్యలు జరగడం వాస్తవం కాదా? హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరీ ప్రోత్సహించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?   


సీ|| ఇంటింట లేచి నర్తించు దరిద్ర దేవతలకావాసమై ఁబఱగు నూళ్ళు
మౌలిక వసతులు మాటవరుసకైన కనమిచటరయగ  కక్ష లూళ్ళు / కఱకు టూళ్ళు
జీతము గ్రాసము జీవించ నీటికి వగచు నిరాధార పల్లె సీమ
బ్రతుకు చిందరబందర మము సేవించు ప్రజానాయకమణులె జలగ లిచట 

గీ|| కలిసె డ్రైవరు, కలిసెను కాంత లంద
రు తమ బాధల, కనుల నీరుబికె వారి
కష్టముల్గని, వీరిపై కరుణ జూపి
నాదు కొనునాధు డెవ్వడీ ధరణి లోన

25, నవంబర్ 2017, శనివారం

రక్త సంబంధ బాంధవ్యాలు....అంత తేలికగా పోయేవి కావు



నవంబరు పద్దెనిమిదిన ఉదయం ఆరుగంటలు. మంచి నిద్రలో వున్నాను.మంచం ప్రక్కనే వున్న ఫోన్ ట్రింగ్ గ్.... ట్రింగ్ గ్ ... అంటూ మోగడం మొదలైంది.ఇంత పొద్దునే ఎవరబ్బా అని చూస్తే ప్రైవేట్ నంబరు అని చూపిస్తుంది. సరే నని ఫోన్ ఎత్తాను. అవతలి నుంచి తెలుగులో అపరిచిత కంఠము. నేను ఫలానా అని పరిచయము చేసుకొని "మీ మేనత్త కొడుకు నిన్నొకసారి ఫోను చెయ్యమన్నాడని" చెప్పాడు. 
"సరే ఈ వారంలో చేస్తాను" అన్నాను. వెంటనే వారమంటే ఆలశ్యమవుతుందేమో అని అసలు విషయం చెప్పాడు. పనిచేసే దగ్గర తననెవరో కొట్టారని కాలికి ఫ్రాక్చర్స్ అయ్యాయని ఇంటెన్సివ్ కేర్ లో వున్నాడని హాస్పిటల్ ఖర్చు రెండున్నర లక్షలవుతుందని చెప్పాడు. ఆ ఫోను చేసినబ్బాయితో కొంచెంసేపు క్షేమ సమాచారాలు మాట్లాడి ఫోను పెట్టేశాను. ఫోను పెట్టేస్తూ మా అత్తకొడుకు ఫోను నంబరు కూడా తీసుకొన్నాను.

మా అత్తకొడుకుకు నాకు వయస్సులో తొమ్మిదినెలల తేడా. అంటే నేను తొమ్మిదినెలల పెద్ద. మా ఊర్లో వున్నప్పుడు మా యింటి వెనకాలే మా మేనత్త వాళ్ళిల్లు. మాకూ వాళ్ళకూ ఏవో తోటలకు  సంబంధించిన చిన్న చిన్న గొడవలుండేవి కాబట్టి వాళ్ళింటికి మేము మా యింటికి వాళ్ళు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు కానీ పిల్లలం పొలానికెళ్ళినప్పుడు, తోటలకెళ్ళినప్పుడు కలిసి ఆడుకొనేవాళ్ళం. నా ఐదవతరగతి దాకా విద్యాభ్యాసం మా చిన్నాయన వాళ్ళ దగ్గర వేరే ఊళ్ళో జరిగింది కాబట్టి మా మేనత్త కొడుక్కి నాకు పెద్ద స్నేహం వుండేది కాదు. అన్నట్టు మా మేనత్తకొడుకు పేరు కూడా రామిరెడ్డే. అయితే ఊర్లో అందరం రామయ్య అని పిలిచేవారు.

మా కుటుంబం వేరు పడటంతో నా ఆరవతరగతినుంచి పదవతరగతి దాకా మా ఊరికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న  వెలిగండ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదవాల్సి వచ్చింది. అప్పుడు పిల్లలమందరమూ కలిసి స్కూలుకు వెళుతూ సరదాగా ఆడుకుంటూ మధ్యలో వాగులో మునుగుతూ అప్పుడప్పుడూ చదువుకుంటూ పదవతరగతి పూర్తిచేశాము. రామయ్య నాకంటే ఒక తర్గతి చిన్న. నేను ఇంటర్మీడియెట్ లో వుండగా తను పదవతరగతి తప్పడమూ అప్పడికే మా ఊరి జనాలు ఇక్కడపొలాలనమ్మివేసుకొని బ్రతుకు దెరువు కోసం వలసలు పోవడం వుధృతంగా జరుగుతున్న రోజులు. వీళ్ళు కూడా మా ఊరొదిలి గుంటూరు జిల్లా వినుకొండ తాలూకాకు వలస వెళ్ళారు. ఆ ఊరికి వలసవెళ్ళగానే మా కుటుంబాల మధ్య వున్న పొలం తగాదాలు కూడా సమసి పొయ్యాయి.

మేము కూడా నా ఇంజనీరింగ్ మూడవసంవత్సరంలో మా ఊరొదిలి ఆ ఊరికి వలసవెళ్ళాము. రామయ్య చదువు వలసతోటి ఆగిపోయింది. అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఒక అక్కకు ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశారు. రామయ్య పొలం పనులతోపాటు బేల్దారి పని కూడా బాగా నేర్చుకొని ఊర్లో ఇల్లుకట్టే పనులకు వెళ్ళి సంపాదిచేవాడు. నేను సెలవులకు ఇంటికొచ్చినప్పుడు ఇద్దరం కలిసి అలా నాగార్జున సాగర్ కాలువపై నడుచుకుంటూ రవ్వారం, తిమ్మాపురం,నూజెండ్ల మొదలైన ఊర్లు చుట్టి వచ్చేవాళ్ళం. మంచి ఎండాకాలమైతే తిమ్మాపురం పుచ్చకాయ తోటలోకి వెళ్ళి కడుపు పట్టిన కాడికి పుచ్చకాయలు తిని వచ్చేవాళ్ళం.

ఉద్యోగరీత్యా నేను ఊరిలో వుండటం తక్కువ. కాలచక్రం ఎవరికోసం ఆగదుకదా. ఆ పయనంలో మేము ఆ ఊర్లో ఇల్లమ్మేసి హైదరాబాదుకు వెళ్ళిపోవటం రామయ్య ఊర్లో పంట మీద వచ్చేఆదాయం సరిపోక పిల్లల చదువుకోసం గుంటూరులో బేల్దారి పనులు చేసుకుంటూ ఇంటిదగ్గరున్న తనభార్యకు డబ్బులు పంపడం చేస్తుండేవాడు. నేను సంవత్సరమున్నర క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు పరిస్థితి అది. ఆ తరువాత మా మధ్య ఫోను సంభాషణలు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ లేవు.

ఇదిగో మళ్ళీ ఈ రోజు ప్రొద్దున నేను రామయ్యకు ఫోను చేసే వరకు. నేను మొదటి సారి ఫోను చేసినప్పుడు ఫోను ఎత్తలేదు. ఒక అరగంటాగి ఫోను చేస్తే రామయ్య కొడుకు ఫోను యెత్తి వాళ్ళనాన్నకిచ్చాడు. ఐ.సి.యు లో వున్నానని ఇక్కడ నాకెవరితో చెప్పుకోవాలో తెలియక రాత్రి నీకు ఫోను చెయ్యమన్నానని చిన్న చిన్న విషయాలకు మీదాకా రాము కానీ ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించమని చెబ్తుండగా నర్సో,డాక్టరో మాట్లాడొద్దని చెప్పారేమో ఫోను మళ్ళీ వాళ్ళకొడుక్కి ఇచ్చాడు. కొడుకు బి.బి.యె చేశాడు కానీ ఉద్యోగం లేదనుకుంటా. ఆ అబ్బాయిని నేను నాకు ఫోను చేసిన అబ్బాయి ఫోను నంబరు ఇవ్వమని అడిగితే వాడికేమి అర్థమయిందో కానీ మా అక్క కొడుకు ఫోను నెంబరు ఇచ్చాడు.

విషయం మా అక్కకొడుక్కి కూడా తెలిసి వుంటుందేమో నని వాడికి మెసేజ్ పెట్టాను. మాట్లాడుతుండగా ఫోను కట్ అయింది.ఈ లోగా మరో రోజు గడిచింది. మళ్ళీ రామయ్యకు ఫోను చేస్తే ఈ సారి క్షుణ్ణంగా మాట్లాడడానికి వీలు పడింది. 

ఇప్పుడు తాను కామారెడ్డి దగ్గర పనులు చేస్తున్నట్లు ఆపనుల్లో భాగంగా ఒక అపార్ట్మెంట్ కన్ష్ట్రక్షన్ విషయంలో వీళ్ళకు వేరే గ్రూపు కు మధ్య పోటీ ఏర్పడి వీళ్ళా అపార్ట్మెంట్ కడుతున్నారనే దుగ్ధతో నమ్మించి ఒక్కడిని మాట్లాడదాము రమ్మని ఊరు బయటకు తీసుకెళ్ళి పెద్దబండరాయి తీసుకొని కాళ్ళపై ఎత్తెత్తి వేశారని చెప్పాడు. అలాగే ఇప్పటిదాకా ఆపరేషన్ కోసం లక్ష ఇరవైవేలదాకా వేరే వాళ్ళ దగ్గర సేకరించానని చెప్పాడు.సరే నాకు చేతనైన సహాయం నేను చేస్తానని ఫోను పెట్టేసి మా అక్కకొడుక్కి ఫోను చేశాను. ఇంతకు ముందే వాళ్ళు మా అక్కదగ్గరకెళ్ళి మందులు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగారట. కానీ మా బావ అయ్యప్పమాల వేసుకొని కేరళ కు వెళ్ళి వుండటంతో డబ్బులు లేవని  చెప్పారట. 

విషయ తీవ్రత అర్థమై నేను మా అక్కకు ఫోను చేశాను. "అబ్బయ్యా డబ్బులు ఇవ్వొచ్చు కానీ వాళ్ళదగ్గరకెళ్తే ఇంక తిరిగిరావని" చెప్పింది. నేనందుకు అక్కా పాపం బాధల్లో వున్నాడు మన్మిచ్చేడబ్బులు తిరిగొస్తాయని కాదు కానీ సాటి మనిషికి సాయం అనుకొని ఇద్దామని ఒప్పించి మా చేతనైన సహాయం చేశాము. అప్పుడనిపించింది ఎంతైనా రక్త సంబధం రక్తసంబంధమేనని. మా మేనత్తలేదు, మా అమ్మ నాన్న లేరు కాని వాళ్ళ రక్తసంబంధం ఇంకా బ్రతికే వుంది.

ఇప్పుడు రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఐ కోలుకుంటున్నాడు.

24, నవంబర్ 2017, శుక్రవారం

జగన్ పదహారవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యము

ముందుగా జగన్ డైరీలోనుంచి కొంత భాగము

"పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభం అయిన ప్పుడు అశేష జనవాహిని నాతో కలిసి అడుగులు వేసింది. సమస్యల్ని నివేదించింది.   మధ్యాహ్నం పాదయాత్రలో ఉండగా విజయవాడలో రైతులు ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి హతాశుడిని అయ్యాను. నేరుగా వారితో ఫోన్‌లో మాట్లాడాను. మన ప్రభుత్వం వచ్చిన తక్షణం రైతులకు సహాయం అందిస్తుం దని, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపవద్దని వారికి విజ్ఞప్తి చేశాను.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ క్రిమిసంహారక మందులు.. ఇలా ప్రతి అవి నీతిలోనూ, ప్రతి అక్రమంలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండటం, వారికి ముఖ్యనేత అండదండలు పుష్కలంగా ఉండటంతో, రైతులలో ఆత్మ విశ్వాసం మరింత సన్నగిల్లుతోంది. ఆత్మ హత్యల వైపు వారిని ప్రేరేపిస్తోంది. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని మార్చాలి. రైతన్నను మారాజులా చూసు కోవాలి"


కం|| సకల జనావళి క్షుద్బా
ధ కరుణ దీర్చు మనరైతు దారిగనకనే
డు కొలిమిన కాలి నిర్జీ
వ కనులలమటించు చుండె వాని/భరత పొలములన్

23, నవంబర్ 2017, గురువారం

జగన్ పదిహేనవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యము

ఈ రోజు డైరీ లోనుంచి కొంత భాగము

"ఈ రోజు నడిచినదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం. రోడ్డు మార్గం, సమాచార సౌకర్యం, రక్షిత మంచినీరు కూడా సరిగాలేని గ్రామాలు! ఈ ప్రాంతంలో ఆకస్మికంగా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా వాళ్ల పరిస్థితేంటి.. అన్న ఆలోచన రాగానే మనసు బరువెక్కింది.

ముద్దవరం, వెంకటగిరి, పెండేకల్లు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, బతుకు భారంగా గడుపుతున్న దాదాపు 20 మంది నిరుపేదలు వచ్చి కలిశారు. కిడ్నీ వ్యాధులు, హృద్రోగాలు, వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులతో వాళ్లు బాధపడుతూ, ఆరోగ్యశ్రీ సేవలు అందక, ఆదుకునే నాథుడులేక అల్లాడిపోతున్నారు. గుండె తరుక్కుపోయింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పేదవాడు ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేయగలడు?

కొలుముల్లపల్లెకి చెందిన ఓబులమ్మ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఉన్న ఆ ఒక్క కొడుకు కండరాలు, నరాలకు సంబంధించిన వ్యాధితో మంచం పట్టాడు. ఇటీవలే వెన్నెముక కూడా విరిగింది. కదలలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకుందామంటే ఆంధ్రప్రదేశ్‌లో సౌకర్యాలు లేవు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ లాంటి ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. దాంతో వైద్యం చేయించలేక.. కొడుకుని ఆ పరిస్థితుల్లో చూడలేక.. ఆ కన్నతల్లి తల్లడిల్లుతోంది. వెంకటగిరికి చెందిన కిరణ్‌కుమార్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఉన్న ఒకే ఒక కొడుక్కి కిడ్నీల వ్యాధి. మందులకే నెలకు దాదాపు 4,000 వరకూ ఖర్చవుతోంది. కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు పెరిగిపోయి అతను ఆర్థికంగా చితికిపోతున్నాడు. ‘అప్పు పుట్టడం కూడా కష్టమవుతోందన్నా..’ అని అతను ఒక్కసారిగా భోరుమనగానే నా మనసు కదిలిపోయింది. ప్రాణాంతకంగా పరిణమించే డెంగీ, తలసీమియా వంటి వ్యాధులను కూడా ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. దీంతో వేలాది కుటుంబాలు గుండెకోతను అనుభవించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి సామాన్యుల క్షోభ అర్థమయ్యేట్లుగా కనిపించడం లేదు.
చంద్రబాబుగారూ.. ఆంధ్రాలో తగిన వైద్య సదుపాయాలు లేవు. అన్ని సదుపాయాలూ ఉన్న హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో మీరు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. పేదవారెవరైనా వైద్య సహాయం అందక మరణిస్తే బాధ్యత మీది కాదా? హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తే మీకొచ్చే నష్టమేంటి? అంటే పేదల ప్రాణాలకు విలువే లేదా?"


సీ|| కొండల గుట్టల కూడి నడచుట కసాధ్యమైనట్టి దేశమిది, చూడ
రక్షణ నొసగు నీరము సమాచార సౌకర్యముల్ లేనట్టి గ్రామములివి
రోగము రొష్టుల రోదించు బడుగుజీవులకు సాక్షమ్ములీ వూళ్ళు, కనగ
నింటికొక రకమైనట్టి రోగముల బ్రతుకునీడ్చభాగ్యవంతులయ వీరు

తే.గీ|| రోగము నయము చేయగ రూకలేవి?
ఉన్న ఆరోగ్య శ్రీ చెల్లదుకద తెలుగు
దేశమున, మాకికను మీరె దిక్కనుచు ప్ర
జలు నడచిరి జగన్ తోడ జతగ నేడు

22, నవంబర్ 2017, బుధవారం

జగన్ పద్నాలుగవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యం.

పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగం. ఆ తరువాత నా పద్యం

"ఈ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు లేదు. సాగునీరూ లేదు! అనేక చెరువులున్నా గొంతుకు గుక్క నీరు, చేనుకు చుక్క నీరు లేదంటే ప్రభుత్వ చేయూత ఏమాత్రం ఉందో తెలుస్తోంది. ఇక్కడి నాపరాళ్ల పరిశ్రమ పైన కూడా నారా వారి దయలేక వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ ప్రాంతం పాలిషింగ్‌ యూనిట్లకు ప్రసిద్ధి.. వేలాది కుటుంబాలు ఈ యూనిట్ల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, నిర్దయాపూరిత చర్యల కారణంగా ఈ పాలిషింగ్‌ యూనిట్లు ఇబ్బందుల్లో పడ్డాయి. చెల్లించాల్సిన రాయల్టీలు, విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని మూతపడ్డాయి, మరికొన్ని మూతపడే స్థితిలో ఉన్నాయి. 

కర్నూలు జిల్లా మొత్తంమీద ఒక్క ఎకరాకు కూడా నీటిపారుదల సౌకర్యంలేని నియోజకవర్గం ఇదొక్కటే. తాగునీటికి కూడా ఇక్కడ కటకటగా ఉంది. జీవనాధారమైన పాలిషింగ్‌ యూనిట్లు, వ్యవసాయం.. రెండూ లేకపోవడంతో వేలాది పేద కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్నాయి. పుట్టిపెరిగిన చోటే బతికి బట్టకట్టలేకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి! మనిషి జీవించే హక్కునే కాలరాసేలా.. కనీస వసతులు, ఉపాధి కల్పించలేని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా? ఈ పరిస్థితిని మార్చాలి. మైనింగ్‌కు పుష్కలంగా వనరులు ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలను తిరిగి బతికించాలి.. వలసలను ఆపాలి. "


సీ|| గొంతు తడుపుకొన గుక్కెడు నీరు లేదిక పంట పండించ దిక్కు లేదు
నాపరాళ్ళ పరిశ్రమ పతనమయ్యె బాబు దయలేక బ్రతుకు బుగ్గిపాలె
పోవుచుంటిమి చేత పొట్టపట్టుకొని యా పట్టణ వాసపు బానిసలుగ
జన్మస్థలమునందు చచ్చు భాగ్యంబు నోచుకొనమే పాపము చుట్టు కొనియొ

గీ|| మనిషి జీవించు హక్కును మసిని జేసి
పెద్ద పెద్ద మాటలు జెప్పు పద్ధతేల
కూడు గూడు గుడ్డలుకోరి కోరి ఓటు
వేసి మోసపోయితిమిపు డేడ్చి ఫలమె?

సూచన: తేటగీతి చివరి పాదంలో  "వేసి" లో "సి" కి "ఏడ్చిన" లో "చి" కి  ప్రాసయతి చెల్లుతుందనుకుంటాను. అలా కుదరదనుకుంటే ఆ పాదాన్ని యిలా చదువుకోండి


వేసి మోసపోయితిమిరో వెక్కి ఫలమె?

21, నవంబర్ 2017, మంగళవారం

జగన్ పదమూడవ రోజు పాద యాత్ర - నా పద్యము

పాదయాత్ర డైరీ నుంచి కొంతభాగం

"చంద్రబాబు పాలనపై, రాష్ట్ర ప్రజలే కాదు.. సూర్య భగవానుడు కూడా ఆగ్రహంగా ఉన్నట్లున్నాడు! బనగానపల్లెలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన పాదయాత్ర హుస్సేనాపురం చేరుకునే సమయానికి బాలభానుడు భగభగల భానుడయ్యాడు. పోలీసులు సృష్టించిన అడ్డంకులను, పెళపెళ కాస్తున్న ఎండనీ లెక్క చెయ్యకుండా ‘మహిళా సదస్సు’కు చేరుకున్న చుట్టుపక్కల గ్రామాల అక్కాచెల్లెమ్మలతో హుస్సేనాపురం నడుం బిగించిన ఉద్యమనారిలా గర్జించింది. ఏకదీక్షతో వింటిని సారించి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహ శరాలను సంధించింది. 

వేదిక స్థలం పరిధిని కూడా మించి వేలాది మంది తరలి రావడంతో చాలామంది అక్కాచెల్లెమ్మలు కుర్చీలు లేక నిలుచోవాల్సి వచ్చింది. వేదికపై నుంచి లేచి నిలబడి వారికి నా క్షమాపణలు చెప్పాను. ‘నిలుచున్నామా, కూర్చున్నామా అని కాదు.. ఈ సదస్సు సాక్షిగా చంద్రబాబును నిలదీయడానికి, ఆయన అబద్ధాల కట్టుబట్టల్ని తీయించి, నిలబెట్టడానికి వచ్చాం’ అనే దృఢసంకల్పం వారి మాటల్లో ధ్వనించింది. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని ప్రభుత్వం.. ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడానికి సదస్సుకు వస్తున్న మహిళల గొంతును నొక్కేయడం, పోలీసులను పెట్టించి మార్గమధ్యంలోనే వారిని అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా? అనే సందేహం కలుగుతోంది"

కం|| మహిళా సదస్సు జరుగగ
మహిళా మణులెల్ల బాబు మాటలు నిలదీ
సి హవనము జేయ కదిలిరి
సహనము క్షీణించి జగను సభకు సబలలై


20, నవంబర్ 2017, సోమవారం

జగన్ పన్నెండవ రోజు పాద యాత్ర - నా పద్యము

ఈ రోజు పాదయాత్ర డైరీలోని కొంత భాగం

"పాదయాత్రలో ఆదివారం వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వచ్చి కలిశారు. విద్యార్థులు, అవ్వాతాతలు, రైతులు, విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, అక్కాచెల్లెమ్మలు అందరూ వచ్చారు. వారంతా బాధల్లో ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అవ్వాతాతలకు పింఛన్‌లు ఇవ్వడం లేదు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేదు. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్‌ అయ్యే సూచనలు లేవు. అక్కాచెల్లెమ్మల డ్వాక్రా రుణాలు రద్దు కాలేదు. వారికి సున్నా వడ్డీ రుణాలు పుట్టడం లేదు. బోయలను ఎస్టీలలో, రజకులను ఎస్సీలలో చేరుస్తామని, కాపు, బలిజలను బీసీలలో చేరుస్తామని, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా చంద్రబాబు ఎడాపెడా హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి, ఆశతో ఓటేసిన ప్రజలను అధికారంలోకి వచ్చాక మరిచిపోయే నాయకులకు శిక్షలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ఎన్నికల వాగ్దానాలకు చట్టబద్ధత ఉండాలి. అలా ఉంటే.. ఎన్నికల హామీలు నెరవేరని పక్షంలో నిస్సహాయంగా ఉండాల్సిన అవసరం ప్రజలకు ఉండదు.. వాళ్ల స్థితిని చూసి వెటకారం చేసే అవకాశం పాలకులకు రాదు."

ఆ.వె || బాస లెన్నొ చేసె బాబెన్నికలవేళ
ముఖ్య మంత్రి గాగ మొక్కు తీర్చ
డయ్యె, మోస పోయి డగ్గుత్తికన విల
పించు ప్రజల బాధ త్రెంచు నెవడు?

19, నవంబర్ 2017, ఆదివారం

జగన్ పదకొండవరోజు పాదయాత్ర - నా పద్యము

పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగం - ఆ తరువాత నా పద్యం
 "మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంపై కూడా మహిళల్లో తీవ్రమైన బాధ వ్యక్తం అయింది. కిష్టపాడు నుంచి వచ్చిన కల్లె సుబ్బమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. మద్యానికి బానిసైన భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆమెను చూసుకోడానికి కూడా ఎవరూ లేరు. ‘‘నాకు బతకాలని లేదన్నా..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమె పరిస్థితిని చూశాక నాకు తీవ్ర ఆవేదన కలిగింది. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయమంటే ప్రజల రక్త, మాంసాలతో వ్యాపారం చెయ్యడమే. మద్యపానం వల్ల నాశనమవుతున్న జీవితాలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. బతుకులను బుగ్గిపాలు చేసి, మహిళల కంట నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవరికీ మేలు జరగదు సరికదా, అన్ని విధాలా సమాజాన్ని నష్టపరుస్తుంది. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నదేమో కానీ, ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు. ‘‘రేపటి మన ప్రజా ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తుంది, నీ కష్టాన్ని తీరుస్తుందమ్మా..’’ అని సుబ్బమ్మకు భరోసా ఇచ్చాను. మద్య నిషేధం చారిత్రక అవసరం" 

ఆ|| మధ్య తరగతి ధన మానముల హరించి
రక్త మాంసములతొ రాష్ట్ర బొక్క
సమ్ము నింపి యేమి సాధింప ఁజూతురో
ఆంధ్ర పాలకులు స్మశాన స్థలిన

పదవరోజు జగన్ పాదయాత్ర. జిలేబికి కంద గడ్డలతో సవాల్ :)

జగన్ పదవరోజు పాదయాత్ర చేస్తుండగా కోవెలకుంట్లకు చెందిన ఓబులేసు వచ్చి తనకుమారునికి "మాట" సాయంచేయమని అర్థించాడు. దాని తాలూకూ సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ యిది.  దాని క్రింద ఆ వార్తకు నా పద్య రూపం. జిలేబీ కి  కందాల సవాల్ తో :)




ప్రాయము జూడారేండ్లు స
హాయము గోరొచ్చితిమి మహాత్మ పలుకులే
దాయె కుమారునికి ప్రజా
నాయక పలు చోట్ల తిరిగినామిఫలురమై

ఆరోగ్యశ్రీ  చెల్లదు
నోరార పిలిచిన పల్క నోపడె మాఱే
డారున్నొక్క లకారము
గోరెన్వైద్యులు చికిత్స కోసమె ఘనుడా


అదివినిన జగన్ విచలిత
వదనమున చికిత్స చేయు ప్రక్రియ సాగిం
ప దయన సోదరుని పిలిచి
కొదకొని యీ పని వదలకు కొండా యనియెన్

16, అక్టోబర్ 2017, సోమవారం

1994 లో నాకు ఒక ఉద్యోగం రానందువల్ల అప్పటి నా మనఃస్థితి :)



M.Tech  కెమికల్ ఇంజనీరింగ్ లో నా స్పెషలైజేషన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ కెమికల్స్. రెండు సెమిస్టర్లయిపోయి మూడవసెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేవి. అందులో భాగంగా రిలయన్స్ మా కాలేజీకి క్యాంపస్ ఇంటర్వ్యూ కు వచ్చింది. టెస్ట్ పెట్టారు. వ్రాశాను కానీ సెలక్ట్ కాలేదు. ఆ సందర్భంగా అప్పుడు నా డైరీ లో వ్రాసుకున్న ఆనాటి నా భావాలు :)  ఇప్పుడు చదువుతుంటే నిజంగా ఆరోజుల్లో ఉద్యోగం కోసం ఎంత మధనపడ్డానో అని అనిపిస్తుంది :) . డైరీలో ఇంగ్లీష్ లో వున్నదాన్ని తెలుగులో వ్రాస్తున్నాను. 

ఉద్యోగాలొచ్చేవాళ్ళందరూ నాకంటే మెరుగైన వాళ్ళా? కాదని కచ్చితంగా చెప్పగలను. మరి దేవుడెక్కడున్నాడు? అసలు నిజంగా వున్నాడా?లేక అదృష్టమే దేవుడా? మరప్పుడు పాపానికి పుణ్యానికి గీత ఎక్కడ? అదృష్టమనేది పుణ్యాత్ములనే వరిస్తుందనుకొంటే మరి నేనంత పాపాత్ముడనా? తప్పకుండా కాదు. మరప్పుడు నాకు ఉద్యోగమెందుకు రాలేదు? నా గతానుభావాల దృష్ట్యా నేనంత అదృష్టవంతుడిని కాదు. తప్పకుండా కాదు. కాబట్టి దేవుడు నావైపు లేడు. కాబట్టి నేను మరింతకష్టపడి ఈ అదృష్టవంతులనెదుర్కోవాలి. ఇది నేను చెయ్యగలనా? చెయ్యాలి.తప్పకుండా చెయ్యాలి.

ఇది నాచెతుల్లో వుందా? ఏమో? లేదు నాచేతుల్లో లేదు.ఈ లోకంలో నేనే దురదృష్టవంతుడినా?దేవుని దృష్టిలో అసలు నాకు స్థానమేలేదా?నేనంత నైపుణ్యములేని వాడనా?లేక మరేదైనానా?

నా జీవితమెటుపోతుంది? అసలు నేనెక్కడవున్నాను.నాకు సక్సస్ అనేది వస్తుందా? నా గమ్యాన్ని నేను చేరుకోగలనా? ఏమిటినాగమ్యం? నాకసలు గమ్యమంటూ వుందా? అసలు అందరిగురించి నాకెందుకు? వదిలేయి. నా గమ్యాన్ని చేరుకోవడానికి నేనేంచెయ్యాలి? అదేమైనా కానీ ఇప్పుడు సమయమాసన్నమైంది. ఏమి చేయాలో విశ్లేషించుకోవాలి.జాగ్రత్తగా గమనించాలి.లోతులకెళ్ళి ఆలోచించాలి. ఇప్పుడు నాముందున్న మార్గాలు రెండు
౧) నాపై చల్లని చూపు చూడమని దేవుని ప్రార్థించడం
౨) గమ్యం చేరడానికి పనిచెయ్యి..పనిచెయ్యి......పనిచెయ్యి

ఈ రెండింటిలో ఏది మంచిది? అసలు నావైపు లేని దేవుడిని ప్రార్థించడమెందుకు? 

work.....work..............work


అదండీ సంగతి.అప్పటి డైరీని తిరగేస్తుంటే అనుకోకుండా కళ్ళబడి మోముపై చిరునవ్వు తెప్పించిన పేజీ ఇది. ఇది 1994 నవంబరు 9 వతేదీనాటి నా మనఃస్థితి :) 

13, అక్టోబర్ 2017, శుక్రవారం

జీవన పయనం - 1 (1970 వ దశకం. ఊరి సాంఘిక భౌగోళిక పరిస్థితులు)

జిల్లెళ్ళపాడు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా లోని ఒక కుగ్రామం. కనిగిరికి దరిదాపు 22 కి.మీ దూరంలో పట్టణవాతావరణం మచ్చుకైనా లేని గ్రామం. ఊరు రెండు భాగాలుగా విడిపోయి వుంటుంది. "పాతూరు", "కొత్తూరు" అని. పాతూరికి కొత్తూరికి మధ్యన కొంతపొలం వుంటుంది. నడిచి వెళితే ఓ పదినిమిషాలు పడుతుంది. పాతూరికి ఓ ప్రక్కగా మాల,మాదిగ పల్లెలుండేవి. అన్నింటిని కలిపి జిల్లెళ్ళపాడు అని అంటారు.  అన్నీ కలిపినా కూడా ఊర్లో దరిదాపు వంద ఇళ్ళకు లోపే. ఈ ఊరు గ్రామ పంచాయితీ కూడా కాదు.ఊరికి రెండు కి.మీ దూరంలో నున్న గోకులం పంచాయితీలో భాగమీ ఊరు. ఊరి భౌగోళిక పరిస్థితులు తెలియడానికి ఈ క్రింది గూగుల్ ఎర్త్ మ్యాప్ సహాయ పడగలదు.




ఊర్లో రెడ్లెక్కువ. రెడ్లతోపాటి కోమటి,చాకలి,కంసాలి,గొల్ల,మాల,మాదిగ కులస్థులు వుండేవారు. ఊరికి బ్రాహ్మణుడు ప్రక్కఊరైన కంకణంపాటినుంచి వచ్చేవాడు.మంగలి కూడా కంకణంపాటివాడే. వంట కోసం కుండల కోసం మరో ప్రక్క ఊరైన గోకులం కు వెళ్ళి తెచ్చుకొనేవారు. ఊర్లో పొలాలన్నీ రెడ్ల అధీనంలో వుండేవి. పొలాల్లో పని చేయటానికి  ఊర్లోనే వున్న మాల,మాదిగ,ముత్తరాచ కులస్థులు వచ్చేవారు. ఇక వ్యవసాయ పనిముట్లకోసం కొత్తూరులో ఎప్పుడూ కొలిమి వెలుగుతుండేది. కొంతకాలం కంసాలి మావూర్లోనే వుండేవాడు.అతను వలస వెళ్ళిపోవడంతో కంకణంపాటి నుంచి పాచ్యో అనే కంసాలి వచ్చి ఊరికి కావలసిన వ్యవసాయ పనిముట్లను తయారు చేసి ఇచ్చేవాడు. 

ఊరు ప్రధానంగా వ్యవసాయాధారితం. పొలాలలో పండే పంటతోపాటి వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు,దున్నలు రైతులకాధారం. వీటితోపాటి గొఱ్ఱెలు, కోళ్ళు కూడా పెంచేవారు. ఊర్లో చాలావరకు పూరిళ్ళు. మిద్దెలుగా పిలవబడేవి రెండో మూడో వుండేవి. ఊరికంతటికి ఒక్కటే దిగుడుబావి. ఊరినానుకొని పాలేరనే వాగు పారుతుండేది.ఊరికి బస్సు సౌకర్యంగాని, విద్యుత్ సౌకర్యంగాని లేవు. దగ్గరలోని పట్టణమైన కనిగిరికి వెళ్ళాలంటే ఊరికి రెండు కి.మీ.దూరం నడిచి వెళ్ళి బస్సెక్కాల్సిందే. ఆ బస్సులు కూడా ఉదయమొకటి సాయత్రమొకటి వుండేది.

మా ఊరు సస్యశ్యామలమని చెప్పను కానీ సంవత్సరానికొకపంట తప్పకపండేది. ఎక్కువగా రాగి,సజ్జ,జొన్న,ఆరిక,కంది,పిల్లిపిసర,ఆముదాలు మొదలైన పంటలు వేసేవారు.పాడి సమృద్ధిగా వుండేది.అప్పట్లో పాలకేంద్రాలు లేవు కాబట్టి ఊరి పాడినంతా ఊర్లోనే వుపయోగించేవారు. రైతులకు వినోదమంటే పిచ్చిగుంట వాళ్ళ బుఱ్ఱకథలు. ఊర్లోకి అప్పుడప్పుడు వచ్చి ఆడే తోలుబొమ్మలాటలు. చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు కలిసాడె నాటకాలు మొదలైనవి. ఊర్లో చదువుకున్న కుటుంబాలను వేళ్ళమీదలెక్కపెట్టవచ్చు.

ఊర్లోని బఱ్ఱెలన్నింటిని కాయడానికి  ఒక కుటుంబం వుండేది. ఇలా ఊరి బఱ్ఱెలన్నింటిని కలిపి జంగిడిగొడ్లు అనేవారు.ప్రొద్దున పదిగంటలకు తోలుకొని వెళ్ళి సాయంత్రం మూడు,నాలుగుగంటలకు తోలుకొని వచ్చేవారు. ఇప్పుడంటే రవాణా సాధనాలు పెరిగి ఊరికి ఊరికి మధ్య రాకపోకలెక్కువై బంధుత్వాలు దూరప్రాంతాల్లో కూడా ఏర్పడుతున్నాయి కానీ ఆరోజుల్లో పెళ్ళిళ్ళు చాలా వరకు ఊర్లోనో లేక ప్రక్కప్రక్క ఊర్లోనో జరుగుతుండేవి. ఈ కారణంగా ఊర్లోను,ప్రక్కఊళ్ళలోనూ  అందరూ ఒకరికొకరు బంధువులే.

9, అక్టోబర్ 2017, సోమవారం

నన్నయ్య కు ముందు తెలుగెలా వుండేది?

మనిషి  మనిషిగా రూపాంతరం చెందినప్పటినుండి బ్రతుకు కోసం పోరాటంలో తెగలు తెగలు గా సంచరించుచూ ఆ తెగలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటు సాటి మనిషితో సంభాషిస్తూ తన మనసులోని భావాల్ని రకరకాల శబ్దాలతో తెలియచేస్తూ సహాయాన్ని పొందుతూ సహాయపడుతూ వేల ఏళ్ళుగా సాగే పరిణామ క్రమంలో కొన్ని వేల భాషలు ఏర్పడుంటాయి. జన బాహుళ్యం నుంచి పుట్టే ఏ భాషకైనా మొట్టమొదట లిఖిత రూపముండదు.  అది జానపదమై చెప్పుకోదగ్గ పరిమాణంలో ఆ భాషను ప్రజలు మాట్లాడుతున్నప్పుడు రక రకాల అవసర రీత్యా దానికి లిఖిత రూపమివ్వబడుతుంది. దీనికి ప్రపంచంలో ఏభాషా అతీతంకాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు కూడా వందల సంవత్సరాలుగా అనేక రూపాంతరాలు చెంది లిఖిత రూపాక్షరాలు ప్రింట్ మీడియా వృద్ధిలోనికి వచ్చినాక స్థిరపడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ టపా ముఖ్యోద్దేశము తెలుగులో జరిగిన ఈ దశలను కొద్ది మాత్రంగా నైనా విశ్లేషించడమే.

తెలుగును ప్రజలు ఎప్పటినుండి ఏరూపంలో మాట్లాడేవారో చెప్పడం కష్టం. అసలు మూలద్రావిడ భాష నుండి తెలుగు రూపంగా ఎప్పుడు రూపాంతరం చెందిందో కూడా చెప్పడం కష్టం. మనకు లభిస్తున్న శాసనాలను బట్టి భట్టిప్రోలు, ఎఱ్ఱగుడి శాసనాలు తెలుగు దేశాల్లో లభిస్తున్న మొదటి శాసనాలుగా చెప్తారు. ఇది బ్రహ్మీ లిపి లో వున్న ఒక విధమైన ప్రాకృత మని చరిత్రకారులు చెప్తారు. ఇక  లభిస్తున్న తెలుగు శాసనాల ప్రకారం లిఖిత రూపంగా తెలుగు క్రీ.శ  500  ప్రాంతానికి రాజభాషల్లో కూడా చేరిందని చెప్పవచ్చు. దీనర్థము అంతకు ముందు తెలుగు కు లిపి లేదా అని కాదు. వున్నది. కానీ రాజ శాసనాల వరకూ రాలేదు.  కానీ నాటి మానవులు మాట్లాడుకొనే భాషారూపం ఎలా వుండేదో చెప్పడం కష్టం. అప్పటివరకు మనకు మనకు లభించిన శాసనాధారాల్లో అక్కడక్కడ తెలుగు పదాలు తప్పించి వాక్య రూపమైన తెలుగు లభించలేదు. వాక్యరూపమైన తెలుగు మొట్టమొదటగా ఆరవశతాబ్దిలో కడపమండలాల్లో ( కమలాపురం శాసనము )  కనిపించాయి. ఇది అప్పటివరకూ వున్న బ్రహ్మీ లిపినే కొద్ది మార్పులతో నున్న శాసనమట.

ఆనాటి శాసనాలలో తెలుగు లో అచ్చులు ఎనిమిది మాత్రమే కనిపించాయి. 

అ, ఆ, ఇ, ఈ , ఉ, ఊ , ఎ, ఒ  అనునవి మాత్రమే మొదట్లో వుండేవి. ఐ కి బదులు అయి, ఔ కు బదులు అవు అని వాడేవారు. అంటే లిఖితాక్షరాలు ఇంకా పూర్తిగా ఓ రూపు సంతరించుకోలేదు. క్రీ.శ 898 నాటికి  "ఐ" అనే అక్షరం వచ్చి చేరింది. ( అనిమల శాసనము ). "ఔ" అన్న అక్షర ప్రయోగం కనిపించలేదు.

హల్లులలో వర్గాక్షరాల అల్పప్రాణములు ( ఒత్తులు లేనివి ), అనునాశికాలు ఙ,ఞ,ణ,న,మ లు విరివిగా వాడేవారు. య,ర, ఱ, ల,వ,శ,స,హ,ళ వర్ణములు వాడుకలో వుండేవి. వలపల గిలక కూడా విస్త్రుతంగా వాడేవారు. ఇది డెభ్భై వ దశకం వరకూ కూడా వాడేవారు. కానీ ఇప్పుడు వాడుకలో కనిపించడంలేదు.

వీటితో పాటు మరో రెండు వర్ణాలు నన్నయ్యకు ముందు వాడుకలో వుండేవి. అవి 



" అడ్డు గీత లేని ఱ" అనే అక్షరాన్ని ఎలా పలికేవారో మనకు తెలియదు కానీ  సందర్భాన్ని బట్టి ఈ అక్షరం నన్నయ కాలం నాటికి కొన్ని చోట్ల "ళ" గానూ మరికొన్ని చోట్ల "ద" గాను , ఇంకొన్ని చోట్ల "డ" గానూ రూపాంతరం చెంది అదృశ్యమై పోయింది.

ఉదాహరణలు ( కంప్యూటర్ లో ఈ అడ్డగీతలేని ఱ అక్షరం లేదు కనుక ఱ నే టైపు చేస్తున్నాను. మీరు దానిని అడ్డగీతలేని ఱ అక్షరంగా ఊహించుకొని చదువుకొన మనవి. అంటే ఈ అక్షరం సందర్భాన్ని బట్టి పలికేవారేమో!

చోఱ = చోడ లేక చోళ
నోఱంబ = నోళంబ
ఱెందులూరు = దెందులూరు
క్ఱిన్ద = క్రింద
క్ఱొచె = క్రొచ్చె 
వ్ఱచె = వ్రచ్చె


ఈ పదాలను కంప్యూటర్ లో తెలుగించడం కష్టము గాబట్టి నేను చదువుతున్న పుస్తకములోని పేజీలను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకము అంతర్జాలంలో ఉచితంగా దొరుకుతుంది. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకొని చదవ వచ్చు. 

పుస్తకము పేరు : తెలుగు శాసనాలు.  1975 వ సంవత్సరంలో ప్రంపచ తెలుగు మహాసభల ప్రచురణ 
రచయిత : శ్రీ జి.పరబ్రహ్మ శాస్త్రి.













9, జులై 2017, ఆదివారం

సమస్యాపూరణములు


1) విరసపుఁగావ్యమొప్పినది వీనులవిందయి మెచ్చిరెల్లరున్

చం||  ధరణియె విశ్వమూలమని ధారుణిమానవులెల్ల రూఢిగన్
         విరచితిరాపురాణకథ వీనులవిందుగ బైబులందుఁగా
        ని రుసి గెలీలియో యిల దినేంద్రునిఁజూప వధించె నాడు, నా
        విరసపుఁగావ్యమొప్పినది వీనులవిందయి మెచ్చిరెల్లరున్

2) మద్యమె మానవాళికి సమంచిత బుద్ధి బలమ్ము లిచ్చురా

ఉ|| చోద్యమె చూడగన్ తెలుగు చోరశిఖామణి ఁజెప్పె మైకులన్
        మద్యమె మానవాళికి సమంచిత బుద్ధి బలమ్ము లిచ్చురా
        పద్యుడ ఁజేయి పానమన భామిని లెల్ల బిగించి క్రొంగులన్
        మద్యము రూపుమాప ఁజని మానము దీసిరి వాడవాడలన్